Organic Vegetable Farming || Venkateshwarlu || Contact - 7702710588
ฝัง
- เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
- #Rythunestham #OrganicFarming #Naturalfarming
☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
☛ For latest updates on Agriculture -
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham1
**********************************************************
పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీలేదు. నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు ఆచరణలో పెడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఈ సిద్ధాంతాన్నే విశ్వసించిన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కూరగాయలు, పళ్లు, వరి సాగుచేస్తున్నారు. ముఖ్యంగా నిలువు పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వంకాయ, టమాట, బెండతోపాటు ఆకుకూరలను సైతం సాగుచేస్తున్నారు. రెండురకాల పుచ్చకాయలను పండిస్తున్న వెంకటేశ్వర్లు... బొప్పాయి, బంతి, దొండ నారును కూడా సాగుచేస్తున్నారు. ఎరపంటగా బంతి, సరిహద్దు పంటగా కందిని వేశారు. కీటకాల నివారణకు గమ్ స్టికర్స్, లైట్ ట్రాప్స్‌ను వినియోగిస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో బీపీటీ-సాంబ, ఆర్‌ఎన్‌ఆర్ రకం వరిని సాగుచేస్తున్నారు. మంచి పోషక విలువలుండే స్వీట్ కార్న్ కూడా పండిస్తున్నారు.సాగునీటి అవసరాలకోసం పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకున్న వెంకటేశ్వర్లు.... అన్ని పంటలకు ఈ నీటినే డ్రిప్ ద్వారా వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కీలకమైన జీవామృతం, ఇంగువ ద్రావణం, వేస్ట్ డీ కంపోజర్, వేప కషాయాన్ని సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను సూర్యాపేటలోని రైతుబజార్‌లో వెంకటేశ్వర్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని వేంకటేశ్వర్లు చెబుతున్నారు.
**************************************************************************
Farmer Venkateshwarlu is a native of narsimhulagudem village, munagala mandal, suryapet district. For the last 4 years he is into organic farming. In his 11 acres of agriculture land he cultivates vegetables, fruits, paddy crops. To control pests and insects he uses biofertilizers and biopesticides. To overcome the shortage of water he constructed farm pond and supplies water through drip. He sells his vegetables at suryapet rythubazar.