మంచి కవి చెడ్డ కవి ఇద్దరు ఒకటే.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024
  • #చాటువులు
    #chatuvulu
    #chatupadyalu
    #సమలంకరోతి కావ్యం సుకవిః కుకవిశ్చ తదుభయం కావ్యమ్|
    అనలం తనోతి చిత్తే సహృదయహృదయం ప్రవిష్టమాత్రం చేత్||
    సహితయోః శబ్దార్థయోః భావః సాహిత్యం అని సాహిత్యానికి నిర్వచనం . హితమును చేకూర్చే అనగా మంచిని కలుగజేసే శబ్దార్థాల కలయికే #సాహిత్యం. ఎవరికి హితాన్ని కలిగిస్తుంది అంటే సమాజానికి హితాన్ని కలిగిస్తుంది. సమాజం అంటే మనమే. మనిషి జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసిన నైతిక విలువలను, సూచనలను, స్ఫూర్తిని, ధైర్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని సాహిత్యం అందిస్తుంది.
    కౌముది అంటే వెన్నెల. ప్రకాశాన్ని, ఆహ్లాదాన్ని కలిగించడం కౌముది లక్షణం. ప్రకాశం అంటే వెలుగు. వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆహ్లాదం అంటే ఆనందం. సాహిత్యం జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేది కాబట్టి మన ఛానల్ కు సాహితీ కౌముది అనే పేరును నిర్ణయించాము.
    #ప్రాచీనం నుండి #ఆధునికం వరకు మహాకవుల కలాల నుండి జాలువారిన సాహిత్యగంగ సహృదయుల హృదయాలలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ఉన్న అనేక అనేకానేక అంశాలను, #ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావిస్తూ బాలలనుండి పెద్దల వరకు అందరికీ ఆనందాన్ని కలిగించేలా ఈ ఛానల్ ని రూపుదిద్దాలనే నిబద్ధతతో ఉన్నాము.
    దీనికి అమూల్యమైన మీ సహకారాన్ని అందించి ఛానల్ ను ముందుకు నడిపిస్తారని ,నన్ను ప్రోత్సహిస్తారని అభిలాషిస్తూ...
    మీ
    ద్విశతావధాని బులుసు అపర్ణ
    • బిచ్చగాళ్ళు కూడా మనకి ...
    Facebook page link
    www.facebook.c...
    Instagram
    www.instagram....

ความคิดเห็น • 30

  • @sitan6056
    @sitan6056 วันที่ผ่านมา +2

    అమోఘం అపూర్వం
    మీ విశ్లేషణ , వివరణ.
    వాక్ధాటి , స్వర మాధుర్యం కూడా ఎంతో గొప్పగా ఉంది.
    అభినందనలు ఆశీస్సులు

  • @hemanthkumarnalli7928
    @hemanthkumarnalli7928 วันที่ผ่านมา

    తెలుగు సొగసు ఎంత అందమైనదో ఈవివరణ ద్వారా తెలిసింది. కమలము, విమలము రెండింటిని విడదీసి చదివితే చెడు అదే కలబోసి చదివితే మంచి ఏమంటారు అపర్ణ గారు 👌👌👌👌

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 วันที่ผ่านมา

    మీ వివరణలు మహాద్భుతమైనవండీ. అభినంద శతమండీ బులుసు.అపర్ణ గారూ.వందనములు.

    • @sahithikoumudi
      @sahithikoumudi  วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ
      🙏🙏🙏

  • @DgdGgii
    @DgdGgii 2 วันที่ผ่านมา +1

    తల్లి సాక్రాత్ మీరు సరస్వతి దేవి దన్యవాదములు

  • @పురుషోత్తంభువనగిరి
    @పురుషోత్తంభువనగిరి 2 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉 అపర్ణ గారూ! శ్లోకం
    ఎంతో స్పష్టంగా ఆలపించారు.ఉచ్చారణ,వివరణ బాగా ఉంది. .. శుభాకాంక్షలు అభినందనలు ఆశీస్సులు...

  • @chandramouly311
    @chandramouly311 13 ชั่วโมงที่ผ่านมา

    మంచి గా వివరించారు అమ్మ

  • @srinuvasaraoparnandi4865
    @srinuvasaraoparnandi4865 วันที่ผ่านมา

    Thanks!

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 2 วันที่ผ่านมา +1

    అపర్ణ గారు,శ్లోకం వివరణ చాలా బాగా చెప్పారు.👏

  • @venkatalakshmidevarakonda3464
    @venkatalakshmidevarakonda3464 วันที่ผ่านมา

    వివరణ చక్కదనం 👌👌👌👌👌

  • @nageswararaonandula6260
    @nageswararaonandula6260 วันที่ผ่านมา

    మీరు సుకవులు 🙏🙏

  • @acharyasrisukthi
    @acharyasrisukthi 2 วันที่ผ่านมา +1

    సంగీతసాహిత్య సమలంకృతే!
    పదాల అర్ధాల పునాదులపై సాధించిన అర్ధచమత్కారం!కవి అజ్ఞాతం!
    వెలుగులోకి తెచ్చిన పదాలు ఎక్కడ ఎప్పుడు ఎలా విరవాలో అలావిరిచి కవిత్వపరంగా సుమండి (ఇదీ మీరే సెలవిచ్చాలు😊)సు-కు కవుల రచనా వైభవాన్నిరూపుకట్టించినట్టు వివరించి వైభవలక్ష్మీ సరస్వతుల రూపుకట్టారు!😊
    ధన్యవాదద్విశతాలు😊

  • @pvnrao8342
    @pvnrao8342 วันที่ผ่านมา

    Namaste Matrusree ji. Your explanation is good. Please explain some more in detail. Many other Slokas also. Please narrate what are the absurd things done by Kalidasa in his Dandakam as sveda binduvu shine as pearls. The Gods shall not have movement in yey lashes, don't touch their foot to the ground and no sweat to their bodies at whatever the suffocation may be. Please kindly narrate for the public sake.

  • @kuchibhotlasrinivasasarma1046
    @kuchibhotlasrinivasasarma1046 วันที่ผ่านมา

    అభినందనలండీ
    ఈ శ్లోకం రచయిత ఎవరో తెలిసి ఉంటే బాగుండేది
    మీ పరిశ్రమ అభినందనీయం

  • @manasaangara7943
    @manasaangara7943 2 วันที่ผ่านมา

    👏👏👏

  • @RamaseshuKomonduri-yo8ud
    @RamaseshuKomonduri-yo8ud 2 วันที่ผ่านมา +1

    వర్ణమాల తెలిసినవారు కాబట్టి కవుల శైలిలో తేడాలు ప్రస్పుటం చేశారు....శుభాకాంక్షలు...

    • @sahithikoumudi
      @sahithikoumudi  วันที่ผ่านมา

      🙏🙏🙏

    • @kottelaxman111
      @kottelaxman111 วันที่ผ่านมา

      ​@@sahithikoumudimadam
      "మనసు ఉంటే మార్గం ఉంటుంది"
      ఇది సామెతా?
      జాతీయమా?
      Madam

    • @kottelaxman111
      @kottelaxman111 วันที่ผ่านมา

      ?

  • @పురుషోత్తంభువనగిరి
    @పురుషోత్తంభువనగిరి 2 วันที่ผ่านมา

    ఇలాగే.. వీలయినంత వరకు సమయం వెచ్చించి ,మన సాహిత్యంలో కవులు చెప్పిన...
    మంచి లోతైన భావాలు గల శ్లోకాలను ఎంపిక చేసి భాషాభిమానులు అందరికీ వివరించండి.

    • @sahithikoumudi
      @sahithikoumudi  วันที่ผ่านมา

      తప్పకుండా అండి
      ధన్యవాదాలు
      🙏🙏🙏

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉
    ఒక అక్షరం తో ఉన్న పద్యం ఉంటే తెలుపగలరు.
    ఇంతకు ముందు వాట్సాప్ లో ఉండేది.
    ళ, ణ, వంటి ఏక అక్షరాలు మాత్రమే ఉండేవి. అంటే గుణింతాలు కూడా.
    దయచేసి తెలుపగలరు.
    పిల్లలకు మాట సుద్ది వస్తుంది అని అంటారు.
    🙏🙏🙏

  • @padmamandadi8864
    @padmamandadi8864 2 วันที่ผ่านมา

    ప్రస్తుత సమాజంలో సుకవుల కన్నా అన్యమైన కవులదే పైచేయి కదమ్మా😢