ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేది నిజము దీనిని నమ్ము ఇది భువియందించలేనిది.అద్భుతమైన పాట!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • పాట లిరిక్:
    పల్లవి: ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
    1.తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
    2.భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
    3.బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
    నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
    4.ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

ความคิดเห็น • 1