Nee Thraitha Bodhallo ... (నీ త్రైత బోధల్లో...) Video & Lyrical Song - 48

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024
  • నీ త్రైత బోధల్లో...
    SP Balasubrahmanyam పాడిన పాట
    ప్రతి జీవ దేహంలోని శిరమునందుగల బ్రహ్మనాడిలో దైవశక్తితో కూడిన "దేవుని చిహ్నము" ప్రకాశమవుచున్నది. ఆ దేవుని చిహ్నమందు జీవాత్మకు తండ్రియైన "ఆత్మ" భాషించుచున్నాడు. అతడే సర్వ జీవులకు "ఏకైక గురువు".
    గురువు ఎప్పటికీ గుర్తింపబడడు.... భగవంతుడు ఎప్పటికీ తెలియబడడు !!!
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    TEAM :
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - SP Balasubrahmanyam
    Music - N Ram chaitanya kumar Hyd.
    Editing - Varanasi Krishna Kiran
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    Lyrics :
    పల్లవి:
    నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలే
    నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అణిగేలే //2
    మనసేమో మారి నీ దరికే చేరేను
    అహమేమో జారి నీ కొరకే పారేను
    గుణమాయ కూడా గురు జాడె చూపేను
    గుణమాయ కూడా గురు జాడె చూపేను
    ఏ మాయ చేశావొ భగవంతుడా ….
    నీ త్రైత బోధల్లో నాదు మనసే మునిగేలే
    నిజ దైవ జ్ఞానంతో నాదు అహమే అణిగేలే
    చరణము 1:
    త్రైతా యోగమునందు ఆ బ్రహ్మే వెలిశాడు
    త్రైతాన్నే బోధించి రావణ బ్రహ్మైనాడు
    ఆ బ్రహ్మ చరితాన్ని నీ బోధల్లో విన్నాను
    ఆ దివ్య రూపాన్ని నీరూపంలో కన్నాను
    ఆ త్రిపురత్వం నీదేనూ
    నీ త్రైత బోధల్లో పాత చరితే తెలిసేలే
    నీ దివ్య జ్ఞానంతో మాయ రాతే ముగిసేలే
    చరణము 2:
    ద్వాపర యోగమందు పరమాత్మే వెలిశాడు
    శ్రీ క్రిష్ణ రూపుదాల్చి ఆ గీతే తెలిపాడు
    నీ త్రైతమందే ఆ గీతనెరిగాను
    ఆ క్రిష్ణ భావం నీలోనె చూశాను
    ఆ గురు రూపం నీవేనూ
    నీ త్రైత బోధల్లో గీత మర్మం తెలిసేను
    ఆ ఆత్మ జ్ఞానంలో నాదు కర్మం తొలగేను
    చరణము 3:
    కలియోగమందు ప్రభుఏసు వెలిశాడు
    తన తండ్రి జ్ఞానమంటూ సువార్తనే చాటాడు
    ఆ ఏసు వాక్యం నీనోట విన్నాను
    నీ బాటలోనూ ఆ ప్రభుని కన్నాను
    ఆ ప్రభు దేహం నీదేనూ
    నీ త్రైత బోధల్లో ఏసు భావం తెలిసేను
    పరిశుద్ధ జ్ఞానంలో నాదు జన్మే మురిసేను
    చరణము 4:
    ఆ క్రీస్తే మరలా వేమనగా మారాడు
    తన తత్వ జ్ఞానాన్ని నిగూఢంగ దాచాడు
    ఆ పద్య భావాలు నీ పదముల్లో ఎరిగాను
    ఆ యోగిపథమే నీ త్రైతమంటాను
    యోగీశ్వరుడవు నీవేను
    నీ త్రైత బోధల్లో యోగి వేమన మెరిసేను
    ఆరాధన దారుల్లో నాదు జీవం కరిగేను
    చరణము 5:
    అనాదైన నాకు తలిదండ్రిని చూపావు
    ఆ తండ్రి జ్ఞానం పరిచయమే చేశావు
    నా తండ్రి స్వరాన్ని నీలోనె విన్నాను
    నా తండ్రి రూపాన్ని నీవంటు నమ్మాను
    ఆ ఆత్మ తేజం నీదేను
    నీ త్రైత బోధల్లో ఆత్మ జ్ఞానం తెలిసేను
    మధ్యాత్మ యోగంలో నాదు జీవం కలిసేను
    చరణము 6:
    నా దేహమందు నేనెవరో తెలిపావు
    నీ దేహమునందు నీవెవరో ఎరిగాను
    పరలోకమే వీడి నాకోసమొచ్చావు
    ఇహలోకమే వీడి నీవెంటవస్తాను
    నీతో నన్ను రానివ్వు
    నీ త్రైత బోధల్లో భక్తియోగం దొరికేలే
    ఆ భక్తియోగంలో ముక్తి మార్గం సులువేలే
    నీ త్రైత బోధల్లో భక్తియోగం దొరికేలే
    ఆ భక్తియోగంలో ముక్తి మార్గం సులువేలే

ความคิดเห็น •