CHANDAMAMA RAVE -MANORAMA-P SUSHEELA-చందామామ రావే- Pసుశీల -మనోరమ ( VIDEO CREATED, NOT ORIGINAL)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • చందామామ రావే,జాబిల్లి రావే ( NOT ORIGINAL VIDEO,JUST CREATED)
    గానం:శ్రీమతి Pసుశీల ( AUDIO COURTESY : sri.J.Madhusudana sharma)
    చిత్రం: మనోరమ
    సంగీతం :రమేష్ నాయుడు
    రచన:సముద్రాల Sr
    VIDEO MADE USING CLIPPINGS OF THE SONG "CHANDA RE" FROM HINDI FILM "LAJWANTHI" VERY NICELY PICTURIZED ON LATE NARGIS DUT

ความคิดเห็น • 180

  • @Lobster16763
    @Lobster16763 11 วันที่ผ่านมา +1

    పై లోకాలనుండి మా అమ్మ నాకోసం పాడుతున్నట్టుంది. నాకు ఆరు పదులు దాటినా ఈ పాట విన్నప్పుడల్లా అమ్మకోసం ఆకాశం కేసి చూస్తా. ఎందుకో చందమామ మసకబారుతుంది. అమ్మా......🌿

  • @vijayakumaryella
    @vijayakumaryella 9 หลายเดือนก่อน +16

    ఈపాట విని, చూసి ఎన్నాళ్ళయిందో. చాల సంతోషం . పాట ని పెట్టిన వాళ్లకు కృతజ్ఞతలు.

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 8 หลายเดือนก่อน +7

    నేను 1965 లో పుట్టాను. మా అమ్మ నన్నెత్తుకుని మా ఇంట్లో ఉన్న వెండి గిన్నె లో , చందమామ ను చూపిస్తూ అన్నం తినిపించడం, నాకు చూచాయగా గుర్తు ఉంది.

  • @kanyakumaribayana1381
    @kanyakumaribayana1381 4 หลายเดือนก่อน +4

    ఎప్పుడు విన్నా మైమరుపు కలిగిస్తుందీపాట. సుశీలమ్మ కి కోటి ధన్యవాదాలు, తేనెలొలికే గొంతుతో ఈ పాటని మనకందించినందుకు❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @siramnarayanaswamy2623
    @siramnarayanaswamy2623 10 หลายเดือนก่อน +16

    ఈ పాట మనోరమ అనే చిత్రం లోనిది.1960 ప్రాంతాలలో వచ్చింది. నా కప్పుడు 13 ఏళ్లు..గతం ఎంత మధురం !!

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 2 ปีที่แล้ว +31

    మనం మన భాష మర్చిపోతున్నాము,దాని భవిష్యత్ తరాలకు ఇవ్వగలమా?

  • @indirapratapa7791
    @indirapratapa7791 5 หลายเดือนก่อน +4

    ఈ రోజుల్లో ఇంత చక్కని పాట వింటుంటే
    మనసుకు ప్రశాంతత, పిల్లల కే కాదు పెద్ద
    లకు చక్కగ నిద్ర వస్తుంది

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 9 หลายเดือนก่อน +10

    ఈ అద్భుతమైన సాహిత్యం, గానం, నిబద్దత, స్వర్ణ యుగంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ధన్యమైనవి. బాల్య స్మృతులు ఒక్క సారిగా నన్ను చుట్టు ముట్టాయి. కంటి చెమ్మ ఆరడం లేదు.

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 2 ปีที่แล้ว +23

    శ్రీమతి పి.సుశీల గారి గాత్రం శ్రావ్యంగానూ అద్భుతంగానూ ఉంది

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 หลายเดือนก่อน +28

    మా అమ్మ కోటి పూలు అని నేర్పించింది, మా చెల్లెళ్ళకు పాడేప్పుడు, అప్పటికి ఈ పాట గురించి నాకు తెలియదు, ( ఇప్పటికీ ) .... మా అమ్మ సొంతమనుకొనేవాడిని, అంత బాగా పాడేది మా అమ్మ
    ఎంత హాయిగా ఉందో, నిద్ర వస్తుంది ఇప్పుడు కూడా వింటూ ఉంటే
    ఏమైనా మా అమ్మే బాగా పాడుతుంది, అమ్మ కదండీ ❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +18

    ఓమ్ నమశ్శివాయ.
    అమ్మ చేతి వుయ్యాల " ఎంత అద్భుతం ". వూగే పసిపిల్లల దే అదృష్టం.
    యిది నా భావన మాత్రమే. 🌺

  • @radhikc5947
    @radhikc5947 ปีที่แล้ว +17

    ఇంత చక్కని పాట వింటే ఆ చంద మామ కూడా తప్పక దిగి వస్తుంది. చాలా మంచి శ్రావ్య మైన పాట.

  • @saraswathimurugula6324
    @saraswathimurugula6324 8 หลายเดือนก่อน +3

    పాట వింటుంటే చాలా హాయిగా ఉంది ,పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.

  • @nagarania9348
    @nagarania9348 11 หลายเดือนก่อน +17

    ఈ పాట మా పాప కు చూపి వినిపించి నాను చాలా సంతోషం అండి

    • @ravindrahemmanur3395
      @ravindrahemmanur3395 10 หลายเดือนก่อน +1

      Thank you.
      May God bless every Child.

  • @raviprasadpachipulusu457
    @raviprasadpachipulusu457 9 หลายเดือนก่อน +3

    నా బాల్యం. లో విన్న ఈ పాట ఇప్పుడు వింటే మనస్సు ఎంతో హాయిగా వుంది
    ఎవరి వద్ద ఐనా ఒరిజినల్ సాంగ్ వున్నచో అప్లోడ్ చేయ గలరు

  • @rayavarapueswararao2189
    @rayavarapueswararao2189 2 ปีที่แล้ว +29

    ఎంతో మంచి శ్రావ్యమైన మరియు అరుదైన పాటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ పాటలొని మాధుర్యం మరువ లేనిది.

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 ปีที่แล้ว +20

    చాలా మంచి పాట వినిపించారు. నాకు ఎంతో ఇష్టమైన పాట రమేష్ నాయుడు గారి సంగీతం అద్భుతంగా ఉంది. థ్యాంక్స్.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +7

    ఓమ్ నమశ్శివాయ.
    Res. Sir thank you very much and namasthe.
    యింత చక్కని చందమామ పాట, మా బాబు చిన్నతనం లో నేను కూడా ఇలానే , సుశీలమ్మ
    తల్లి లా పాడేదాన్ని. ఆ రోజులు నాకు అందించిన మీకు కృతజ్ఞతలు. నమస్సులు.
    పులకరించిపోయాను. ఆహా ఎంత అద్భుతమైన పాట.
    మా అమ్మ పాడుతూ వుండేవారు. విని నేను మా బాబుకు పాడేదాన్ని.
    యీ పాట పాడిన res. సుశీలమ్మ గారి పాద పద్మముల కు నమస్సుమాంజలి.
    ఎంత బాగా పాడారమ్మా. Thank you soooooo much , సుశీలమ్మ గాయనీ మణి అమ్మా.
    నమస్తే.
    🙏🌺🙏🌺🙏🌺
    నేను కూడా యించు మించు మీలానే పాడే దాన్ని అని అందరూ అంటూ వుండే వారు.
    ఒక చలన చిత్రం లో అవకాశం వచ్చినా మా నాన్న గారు వద్దు అన్నారు.
    యిపుడు అనిపిస్తోంది, మీ లాగా ఎవ్వరూ పాడలేరనే, ఆ పరమేశ్వరుడు నన్ను
    మా నాన్న గారి రూపం లో ఆపివేశారెమో ?
    ఆహా ఎంత బాగా పాడారమ్మ. మాటలే రాక , మౌనమే హాయిగా అనిపించింది.
    ఎన్ని రోజులు గా ఎదురు చూస్తూ వున్నాను.
    యీ పాటకై.
    యీ పాటను నాకు అందించిన వారికి, పేరు పేరునా ధన్యవాదాలు,కృతజ్ఞతలు.
    నమస్సులు. Sir. నమస్తే.
    🙏🌺🙏 . ఆనందం లో ఏమైనా చిన్న తప్పు వుంటే క్షమించండి.

    • @swarnagowri6047
      @swarnagowri6047 ปีที่แล้ว +1

      Res. Recording ఇంజినీర్ల దే యీ గొప్పతనము అంతా. అని శ్రీ సుశీలమ్మ గారు ,
      ప్రతి ఫన్షన్ లోనూ అంటూ వుండేవారు.
      మంచి మనసున్న మహా రాణి వారు, శ్రీ సుశీలమ్మ గారు.
      🌺

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 ปีที่แล้ว +14

    పాటను అతికినట్లు remix చేశారు. గొప్ప పని సార్. ధన్యవాదములు. 🙏🙏

  • @m.r.prasad
    @m.r.prasad 7 หลายเดือนก่อน +1

    ఈ పాట మొదటి చరణాలు అన్నమయ్య వ్రాసినవి .

  • @ramakrishnavaka7745
    @ramakrishnavaka7745 10 หลายเดือนก่อน +5

    మంచి పాట వినిపించినందుకు 🙏🙏🙏

  • @krishnasastrykonduru3537
    @krishnasastrykonduru3537 25 วันที่ผ่านมา

    Awesome....I have seen this movie in my childhood....manorama...Ramesh nayudu music...sweet voice...

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +11

    ధన్యవాదములు చారెపల్లి rk. పసిపిల్లల పాటలు అంటే నాకు ప్రాణం. Happy sir. From guntur.

  • @srinivasababuk5655
    @srinivasababuk5655 3 หลายเดือนก่อน

    సూపర్. ఈరోజు కూడా 3 నిమిషాల్లో పిల్లలు నిద్ర పోతారు❤

  • @subbaiah2774
    @subbaiah2774 17 วันที่ผ่านมา

    This song recollects all our infancy days. Very good song. OLD IS GOLD .V.VV.S.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 11 หลายเดือนก่อน +5

    Harmonious old song
    by Susheela garu.

  • @hemamalini2253
    @hemamalini2253 5 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు వింటుంటే మా అమ్మ బాగా గుర్తొస్తుంది పగలంతా పనుల్లో అలసిన అమ్మ మా కోసం తన సన్నటి గొంతుతో పాటలు పాడి నిద్రపుచ్చేది❤

  • @DKD183
    @DKD183 10 หลายเดือนก่อน +5

    na pillalaku nenee paata paadaanu sysavam lo ...ye movie lono theliyadu kuda...but my mom used to tell that she was singing for us in our childhood 😊..thanks for giving the opportunity to see this very nice song

    • @narasingarao150
      @narasingarao150 10 หลายเดือนก่อน

      Manorama picture name

    • @DKD183
      @DKD183 10 หลายเดือนก่อน

      @@narasingarao150 yes..ee vedio lo chusaja thelusindi 😊

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว +5

    Chala chala bagundi very morvelous

  • @ramadevi-in1jm
    @ramadevi-in1jm หลายเดือนก่อน

    మదురమైనపాట

  • @ananthareddyoruganti4966
    @ananthareddyoruganti4966 11 หลายเดือนก่อน +4

    Alanaati..chantee..paapala..laaleepata.... Super..

  • @lakshmikumarimanda254
    @lakshmikumarimanda254 2 ปีที่แล้ว +16

    అరుదైన ఆణిముత్యం అందించినందుకు ధన్యవాదాలు ,అయితే ఇదే పాట హిందీలో వుందా....వీలయితే అది కూడా అందించే ప్రయత్నం చేయగలరని కోరుతున్నాము

    • @bolisettyrao5843
      @bolisettyrao5843 6 หลายเดือนก่อน

      I think the madam was Nargis in Bollywood. Surely this song was also in Hindi.

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 10 หลายเดือนก่อน +5

    I got recollected my childhood days by listening this super melodious song,,,this song is from Manorama Telugu picture ( Mrs Krishnakumari heroine). Thankyou Sir.

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 2 ปีที่แล้ว +18

    ఇంత మధురతిమధురమైన పాత వినిపించినందుకు RK గారికి ధన్యవాదములు. మనోరమ సినిమా print దొరికితే upload చేయగలరు 🙏

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 11 หลายเดือนก่อน +8

    Thank you Sir for crafting our SuseelAmma's song on the Mother India.
    God bless you.

  • @sambasivarao8889
    @sambasivarao8889 2 ปีที่แล้ว +42

    ఈ పాత పాట నా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెస్తుంది. ఈ పాట పెట్టిన వారికి నా అభినందనలు

  • @sudhamani5343
    @sudhamani5343 10 หลายเดือนก่อน +5

    Thanks a lot for taking me to my" lost"memories which was hidden in my heart

  • @bharathideshpande9640
    @bharathideshpande9640 6 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు ఈ రోజుల్లో అసలే రావు

  • @chandramouly100
    @chandramouly100 ปีที่แล้ว +16

    వీనులకు విందు అంటే ఇదేనేమో! చెవుల్లో తేనె పోసినట్లుంది!

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 ปีที่แล้ว +6

    This is Nargis in laajzwanti 1958.
    This great song picturised on otherheroin,music was by Rameshnaidu

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 3 ปีที่แล้ว +5

    Chaala manchi paata vinipinchaaru. Alage manorama chitram lo mara chi poradoyi vinipiste santhosham.

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 3 ปีที่แล้ว +6

    Kamal Ghosh,photographer and director for this movie.Ramesh Naidu music. Excellent.

  • @nagarathna1744
    @nagarathna1744 4 หลายเดือนก่อน

    Hi. Amazing amma yes👍

  • @sambamurthy999
    @sambamurthy999 10 หลายเดือนก่อน +6

    Suseelamma......love her forever......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 8 หลายเดือนก่อน

    What a music even bitterly crying baby also sleeps after listening this song. I first heard this song on radio. This background music is such it makes us travel in the moon. Great composition good picture quality

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +14

    అసలు అన్నమయ్య వ్రాసిన చందమామ రావో - జాబిల్లి రావో అన్న పాట వీటన్నిటికీ మాతృక - మాధవపెద్ధి కాళిదాసు

  • @gadumurep
    @gadumurep 3 หลายเดือนก่อน

    మా అమ్మ ఇలాగే పాడేది.... I love you అమ్మా.... నీవు గుర్తుకోస్తున్నావు 😂😂😂❤️

  • @jayababunukathoti2279
    @jayababunukathoti2279 10 หลายเดือนก่อน +7

    అద్భుతం

  • @shaikasha8827
    @shaikasha8827 10 หลายเดือนก่อน +1

    Very very very nice and beautiful song video presentation good TQ
    by RASOOLSHAIK MMENGINEERS

  • @zphssrayavaram8406
    @zphssrayavaram8406 3 ปีที่แล้ว +5

    Ramesh Naidu music composition is very nice. K.L.Ganeswara Rao. Visakha dt

  • @chandranerer1255
    @chandranerer1255 2 ปีที่แล้ว +8

    Evergreen classic song of P.Susheelamma

  • @sarojinimak2322
    @sarojinimak2322 8 หลายเดือนก่อน

    MAK. Saronini,. Adv.
    Na chaidhood lo ide paata paadukunevallamu. E picture 1960 lo vachivuntadi. Nenu 1961lo puttanu. Appati na age. One year. Na vuha telisina dagganundi e paata vintunnanu. A paatha madhuralu ippatiki marachipolemu. Heart ki hattikupoyepatal. Ippudulevu. Manorama ane film vunnada ani ippati pillalaku telusa. Sirivennala picture lo ide paata pettaru. Very good hatsup. ❤❤❤🎉🎉🎉😊😊😊😊

    • @anikethmaddipati2716
      @anikethmaddipati2716 7 หลายเดือนก่อน

      Ammaa naaku I paata chala istam nene chinnappudu maapillaki mansvalaku paadedaanini .msrla vinte Anandanga vundi .pl i picture eppudu vachhindi. Naaku 88 years. Thsnks ipaata pettinanduku.

  • @Renukabachu-gx7zh
    @Renukabachu-gx7zh 5 วันที่ผ่านมา

    Chupinchina veedhanam bagunadhi👌

  • @indiravajrala5498
    @indiravajrala5498 6 หลายเดือนก่อน +1

    రానీచందమామనీపిలీచీ
    తేని గోగుపూలుతెమ్మనీ
    తెల్లమబ్బుమీదతేరుమీదతేవే
    అమ్మకొండంతప్రేమనుతోరాగమయంచేసీన
    జాబీల్లీ పాట
    ఎప్పుడూ పసీవయసే

  • @ramasubbareddytarigopula7167
    @ramasubbareddytarigopula7167 2 ปีที่แล้ว +8

    EXCELLENT SONG. THANKS.

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 4 หลายเดือนก่อน

    చందమామ రావో !జాబిల్లి రావో !
    పాట అన్నమయ్య వ్రాశాడు.
    ఈ పాట మనోరమ చిత్రం లోనిది. హీరో రమణమూర్తి .కృష్ణకుమారి హీరోయిన్.
    నేను మా పిల్లలను నిద్రపుచ్చటానికి ఈ పాటే పాడేదాన్ని.
    పాట వింటూ హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది.
    సుశీలమ్మది అంత తీయని స్వరం.🙏🙏🙏

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 11 หลายเดือนก่อน +2

    Super song telecast to for the film of Manorama super translation to Arudra from hindi to telugu. My sister was sining this song when i was child.

  • @achutaramayyatata7793
    @achutaramayyatata7793 ปีที่แล้ว +6

    Excellent song.Old is gold.

  • @vijayalaxmi1015
    @vijayalaxmi1015 10 หลายเดือนก่อน +6

    Same mana Amma padedi. Sweet song and remember my sweet memories. Avaru ee song pettaro variki sathakoti 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @jayaramchakravarthi8659
    @jayaramchakravarthi8659 8 หลายเดือนก่อน

    Those days all young mothers were singing this song. Very popular. Ramesh naidu, samudrala, susheela made many young mothers singers

  • @venugopalpenjuri8208
    @venugopalpenjuri8208 ปีที่แล้ว +2

    Jola paata...so nice

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao ปีที่แล้ว +9

    👌👌👌 అద్భుతం 🙏

  • @rameshwarrao1506
    @rameshwarrao1506 ปีที่แล้ว +2

    Nargis ki susila garu padinda great

  • @ManiP-t5p
    @ManiP-t5p 10 หลายเดือนก่อน +3

    Thank you sir for who posted this song

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 10 หลายเดือนก่อน

    Adbhutamyna Aanimutyam.Enta haayiga enta melody ga undo . Manaku gata peddalu andaru enno vishayallo manaku Andinchari.vatini kapadukuni viniyogincukovadam ledu.

  • @vasusalaka548
    @vasusalaka548 3 ปีที่แล้ว +2

    Mana mama chandamama aa patalu muddy vastayi sir tq u

  • @chakalakondaleelavathi3409
    @chakalakondaleelavathi3409 8 หลายเดือนก่อน

    చాల బాగుంది లాలి పాట 😊

  • @mukkamala1958
    @mukkamala1958 3 ปีที่แล้ว +11

    Very melodious song from the voice of Susheelamma. Best music. Best to my knowledge this is the best lullaby which is so soothing in Telugu unconditional. Now a days we have to depend on those down memory lane songs only. No creativity. In Bangaru Papa Thadhimi takadhimi sung by M Satyam lullaby though philosophical is awesome. Thank you for your nice upload. I have this record from Manorama but played million times. 🙏 Beautiful recreation as video is not available

  • @createfrp3648
    @createfrp3648 2 ปีที่แล้ว +6

    Wow so beautiful song ❤️

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 ปีที่แล้ว +4

    Good selection of song

  • @mblingam
    @mblingam 3 ปีที่แล้ว +6

    Thanks to Charepalli RK for uploading such a nice melody song and very rare collection.

  • @a.sreenivasamurthy9432
    @a.sreenivasamurthy9432 2 ปีที่แล้ว +4

    Old Melodious song. Nice.

  • @saidulusaidulu2822
    @saidulusaidulu2822 10 หลายเดือนก่อน

    Enni vasanthaala tharwatha vinnanu ee paatanu

  • @AustralialoRJSaroja
    @AustralialoRJSaroja 2 ปีที่แล้ว +18

    చందమామ రావె/ జాబిల్లి రావె/ కొండెక్కి రావె/ గోగుపూలు తేవె
    చందమామ రావె/ జాబిల్లి రావె/ కొండెక్కి రావె/ గోగుపూలు తేవె
    చందమామ రావె/ జాబిల్లి రావె
    వెండిగిన్నెలో వేడిబువ్వతేవె/ పైడిగిన్నెలో పాలబువ్వ తేవె/
    వెండిగిన్నెలో వేడిబువ్వతేవె/ పైడిగిన్నెలో పాలబువ్వ తేవె/అందాల పాపకు అందించిపోవే
    చందమామ రావె/ జాబిల్లి రావె/ కొండెక్కి రావె/ గోగుపూలు తేవె
    చందమామ రావె/ జాబిల్లి రావె/
    తెల్లమాబ్బులా తేరుమీదరావె/ పాలవెన్నెల పానకాలు తేవె/
    తెల్లమాబ్బులా తేరుమీదరావె/ పాలవెన్నెల పానకాలు తేవె/ అందాల పాపకు అందించిపోవె
    చందమామ రావె/ జాబిల్లి రావె/ కొండెక్కి రావె/ గోగుపూలు తేవె
    చందమామ రావె/ జాబిల్లి రావె/

    • @brahmeswari886
      @brahmeswari886 2 ปีที่แล้ว +4

      థాంక్స్ అండి

    • @santhaveluvali6523
      @santhaveluvali6523 ปีที่แล้ว +2

      Nice.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sriranganayakulumotamarri4056
      @sriranganayakulumotamarri4056 9 หลายเดือนก่อน

      అందాల పాపకు అందించి పోవే ఎంత మధురమైన పదాలు.

  • @ambekargovindarao
    @ambekargovindarao หลายเดือนก่อน

    👍🙏🙏

  • @kosuriraja5941
    @kosuriraja5941 6 หลายเดือนก่อน

    మరో ఆణి ముత్యమ్ అందించారు మనసంత ఆనందం

  • @shaiknoorulla6005
    @shaiknoorulla6005 11 หลายเดือนก่อน

    Amma Prema adbhutam Ga undi e patalo

  • @annapurnainguva1841
    @annapurnainguva1841 15 ชั่วโมงที่ผ่านมา

    All songs r gems
    Can u upload this movie sir 🙏🏻

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది

  • @mishnah368
    @mishnah368 10 หลายเดือนก่อน +2

    Wonderfully made.

  • @nirmalavundurty7015
    @nirmalavundurty7015 10 หลายเดือนก่อน +1

    Marvelous.వింటుంటే హాయిగా ఉంది.ఈవిడ నర్గీస్ కదా!రీ మిక్షా?

  • @balanageswararao9142
    @balanageswararao9142 8 หลายเดือนก่อน

    What a wonderful song!

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 ปีที่แล้ว +2

    The video clippings are taken from the movie, " Laajvanti", *Nargis (tamil movie Enga selvi dubbed in telugu as Kanna kuturu*ANR, అంజలీదేవి.

  • @SwamiMA
    @SwamiMA 11 หลายเดือนก่อน +2

    Super. Super song❤❤

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 10 หลายเดือนก่อน +1

    Nice sweet memories .. thanks

  • @dr.surabhi1949
    @dr.surabhi1949 8 หลายเดือนก่อน

    Ever lasting melody song

  • @Telthecelt
    @Telthecelt ปีที่แล้ว +4

    Lovely. Is this one of your favourites?

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 9 หลายเดือนก่อน

    p suseela gaari song and Nneb=ver imagined! thanks a lot!

  • @peddysettysubhashini6073
    @peddysettysubhashini6073 ปีที่แล้ว +1

    Suuuuuuper ever green

  • @prakashrao8077
    @prakashrao8077 ปีที่แล้ว +5

    Thanks a lot for your passion and dedication!

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +3

    Dhanyavadamulu

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 ปีที่แล้ว +7

    గీత రచయిత సముద్రాల రామానుజాచార్యులు

  • @atigaddadamoder7588
    @atigaddadamoder7588 24 วันที่ผ่านมา

    Bangarutimmaraju loni Yesudas song ninduchandamama song play vheyandi. Please!

  • @xyzvakpatiraju8132
    @xyzvakpatiraju8132 10 หลายเดือนก่อน +4

    This song was picturised on actress Krishna Kumari. Music was set by Ramesh Naidu garu.

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 11 หลายเดือนก่อน

    Talat mohmd music There are nice songs in this pic. Hero Balayya

  • @jayavanisirisha4027
    @jayavanisirisha4027 10 หลายเดือนก่อน +1

    Thanks sir

  • @krishnamoorthynaidumedasan7034
    @krishnamoorthynaidumedasan7034 9 หลายเดือนก่อน

    100percent sweet

  • @rameshch4852
    @rameshch4852 7 หลายเดือนก่อน

    Actor నర్గీస్. హిందీ movie అనుకుంటా. పేరు ఏమిటో?

  • @TulasiT-w1b
    @TulasiT-w1b 8 หลายเดือนก่อน

    I think the actress is Nargis. Dubbing of which Hindi movie?

  • @m.narasimharao8584
    @m.narasimharao8584 ปีที่แล้ว +2

    Good song🌹