Narthanasala Songs - Kanchanamaya - NTR - Savithri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 28

  • @munikumar7469
    @munikumar7469 4 ปีที่แล้ว +24

    కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు "
    బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు
    ‘కలశజుండు : (కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు
    "సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు " :
    సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.
    "కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు " :
    బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.
    "లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "
    "లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.
    "మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "
    "మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.
    "మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"
    బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు
    సురనదీసూనుడు.. సురనదీ : గంగ
    సూనుడు : కొడుకు ... భీష్మాచార్యుడు.
    ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు
    కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.
    తిక్కనగారు చేసిన చమత్కారం ఏమిటంటే... అందరికీ కేతనమనో, కేతువనో వాడక ఒకొక్కరికి ఒకో పదము వాడారు. కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ, సిడము.

    • @naaginik5572
      @naaginik5572 4 ปีที่แล้ว +2

      ఎందరో మహాను భావులు 56 అక్షరాలూ ..గుణింతాలూ..వత్తులూ ..పదాలూ ..వాక్యాలూ.. కావ్యాలూ మొదలైనవి అనితర సాధ్యంగా తయారుచేసి జాతికందిస్తే ..సామాన్యుడికి చేరువ .. సామాన్యుడికి చేరువ అనే నినాదంతో.. ౙారి..ౙారి .. దిగౙారి.. కనీసం పలకటానికి కూడా నామోషీగా భావించి భాషను ౘంపుకుంటున్న నిష్ట దరిద్రులం ...

    • @munikumar7469
      @munikumar7469 4 ปีที่แล้ว +1

      కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు!
      సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు!
      కనకగోవృషసాంద్రకాంతిపరిస్ఫుటధ్వజసముల్లాసంబువాడు కృపుడు
      లలితకంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు!
      మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి ,
      మహోగ్రశిఖరఘన తాళతరువగు సిడమువాడు సురనదీసూనుడు.....ఏర్పడ చూచికొనుము!
      ....
      కాంచనమయ....బంగారంతో చేయబడినటువంటి
      వేదిక...అరుగుతో
      కనత్+కేతనోజ్వల....ప్రకాశించే జండాతోఉజ్వలమయిన
      విభ్రమముగలవాడు....విలాసంకలవాడు
      కలశజుండు.....కుండనుండి పుట్టిన వాడు ద్రోణుడు!
      .
      సింహ+లాంగూల+భూషిత......సింహపుతోకతో అలంకరింపబడ్డ
      నభోభాగ ....ఆకాశం గల
      కేతు..జండాయొక్క
      ప్రేంఖణము వాడు...కదలికలకలవాడు......
      ఆయన జండా సింహపుతోకతో అలంకరింపబడి ఆకాశంలో రెపరెపలాడుతున్నదట ఆయన అశ్వత్థామ!
      ...
      కనకగోవృష...బంగారు ఆంబోతు
      సాంద్రకాంతి....దట్టంగా వెలిగే
      పరిస్ఫుట....మిక్కిలి స్పష్టమయిన
      ధ్వజ..జండాయొక్క రెపరెపలుగలవాడు కృపుడు
      ....
      లలిత....అందమయిన
      కంబు....శంఖముయొక్క
      ప్రభాకలిత పతాక.....కాంతితోకూడిన జండా యొక్క
      విహారంకలవాడు కర్ణుడు!
      ....
      మణిమయ+ఉరగ....మణిమయమయిన పాము యొక్క
      రుచిజాల....వెలుగు చేత
      మహితము అయిన.....గొప్పదయిన
      పడగవాడు...జండాకలవాడు దుర్యోధనుడు
      ....
      శిఖరఘన....శిఖరమంత ఎత్తున
      తాళతరువగు...తాడిచెట్టు గల
      సిడమువాడు...జండాగలవాడు
      సురనదీ.....గంగానది
      సూనుడు...కొడుకు.....భీష్మాచార్యులవారు...
      ...
      ఈ పద్యంలో అంతర్లీనంగా దుర్యోధనుడు ఎలా రక్షింపబడుతున్నాడో గూడా చెప్పారు తిక్కనసోమయాజి ...
      ద్రోణుడితో మొదలు పెట్టి, భీష్ముడితో అంతంచేశాడాయన ఈ పద్యాన్ని....అంటే వారివురి మధ్యలో సురక్షితంగా ఉన్నాడని! ఇది ఒక చమత్కారం!
      ....
      పార్ధుడి పలకరింపుతో పులకరించిన పితామహ,ద్రోణ,కృపులు ఇంకా తేరు కోలేదు! సవ్యసాచి తేరు రయ్యిన సుయోధనుడున్నవైపుకు దూసుకు పోసాగింది...
      అరెరే వెడుతున్నాడెళుతున్నాడు నిలవరించండి ఆతనిని! అంటూ కేకలు మిన్ను ముట్టాయి.
      ...
      పదండి ముందుకు పదండి తోసుకు పార్ధుడి పయికి అంటూ సేనలను ఉత్సాహ పరుస్తూ అందరినీ అర్జునుడి మీదికి మరలుస్తున్నాడు...భీష్మపితామహుడు..
      ...
      అప్పటికే విజయుడు ఆలమందలదగ్గరకు చేరి గోపాలకులను ఉత్తేజపరిచి గోవులను విరాట నగరంవైపుకు మళ్ళించి ,సమరోత్సాహంతో గొప్ప యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు.....
      ....
      ఇక్కడ మనకు...Surgical Strike of Arjuna కనపడుతుంది
      janakiramvutukuru.blogspot.com/2017/04/32.html?m=1

    • @yellpower2467
      @yellpower2467 4 หลายเดือนก่อน

      పద్యము యొక్క తాత్పర్యము ఇంతకు ముందే తెలిసినా మీరు చివరలో చెప్పిన ఆ చమత్కారం చాలా అద్భుతమండి 🥇🥇👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 ปีที่แล้ว +2

    ఘంటసాల గారూ మీరు మళ్ళీ పుట్టరూ ప్లీజ్ 🎉

  • @babum8006
    @babum8006 3 ปีที่แล้ว +8

    కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల
    విభ్రమమువాడు కలశజుండు
    సింహలాంగూలభూషిత నభోభాగ కేతు
    ప్రేంఖణమువాడు ద్రోణసుతుడు
    కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ
    సముల్లాసంబువాడు కృపుడు
    లలిత కంబుప్రభాకలిత పతాక
    విహారంబువాడు రాధాత్మజుండు
    మణిమయోరగ రుచిజాల మహితమైన
    పడగవాడు కురుక్షితిపతి
    మహోగ్ర శిఖరఘన తాళతరువగు సిడమువాడు
    సురనదీసూనుడేర్పడ జూచికొనుము

  • @seswarrao8692
    @seswarrao8692 11 หลายเดือนก่อน +1

    My favourite hero... Arjun & Eswar 🏹⚔️

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 10 หลายเดือนก่อน +3

    😂🙏🙏🙏🙏🙏 ఘంటసాల గారి పాద పద్మముల కు❤💐💐💐🍎🙏🙏🙏🙏😂

  • @ashokrao2377
    @ashokrao2377 2 ปีที่แล้ว +1

    Namaskaram naa bhagyam kavitrayam telugu chalanachitaseema saraswateeputrulu mariyu ghantasalagaru ntr gari natanakaushalyam punyabhoomi lo Janmamichhinandulaku janmadaataku runini keerti sheshulaku shanti migata andariki 9ratri n dasara shubhakankshalu telugu padya vlogs inkachoopinchalani manavi thanks

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 ปีที่แล้ว +3

    Hat's off to GHANTASALA

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 ปีที่แล้ว +5

    Hat's off to TIKKANA

  • @naaginik5572
    @naaginik5572 10 ปีที่แล้ว +12

    ఈరోజు ( 18/01/ 2014 ) కారణజన్ముని వర్ధంతి..
    అతనితోనే తెలుగు పౌరాణిక యుగం విశ్వవిఖ్యాతమైంది.. అతనితోనే ఆ సౌరభాలు ఆవిరైపోయాయి.. అతని ఆలంబనగానే ఓ కె.వి. రెడ్డి, ఓ కమలాకర , ఓ సముద్రాల .ఓఘంటసాల.. తెలుగు పౌరాణికాన్ని కీర్తి శిఖరంపై కూర్చోబెట్టగలిగారన్నది ఎవరూకాదనలేని నిజం ..
    ఇక " కాంచనమయ వేదికా ... " ఇంతకంటే రోమాంచిత టంగ్ ట్విస్టర్లు వుంటాయా.. ?!
    పద్యాన్ని మరుసటి తరానికి అందించటం మనకర్తవ్యం కాదా..

    • @MrDeviprasad25
      @MrDeviprasad25 5 ปีที่แล้ว +1

      Super said sir

    • @munikumar7469
      @munikumar7469 4 ปีที่แล้ว +2

      కాంచనమయవేదికా కనత్కేతనో
      జ్వల విభ్రమమువాడు కలశజుండు
      సింహలాంగూల భూషిత నభోభాగకే
      తు ఫ్రేంఖనమువాఁడు ద్రోణసుతుఁడు
      కనకగోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట
      ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుడు
      లలితకంబు ప్రభాకలిత పతాకావి
      హారంబువాఁడు రాధాత్మజుండు
      మణిమయోరుగ రుచిజాల మహితమైన
      పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
      శిఖరఘనతాళ తరువగు సిడమువాఁడు
      సురనదీసూనుఁ డేర్పడఁ జూచుకొనుము
      (విరాటపర్వము -5-4)
      ఈ పద్యంలో ప్రముఖులైన
      ఆరుగురిని పరిచయం చేశాడు అర్జునుడు.
      మొదట ద్రోణాచార్యనితో మొదలుపెట్టి
      చివర భీష్మాచార్యునితో ముగించాడు.
      ద్రోణుడు - స్వర్ణవేదికా ధ్వజము
      అశ్వత్థామ - సింహలాంగూలధ్వజము
      (లాంగూలము - తోక)
      కృపాచార్యుడు- బంగారు ఆబోతు ధ్వజము
      కర్ణుడు - రెండు ఏనుగులమధ్య ఉన్న శంఖ ధ్వజము
      దుర్యోధనుడు- నాగధ్వజము
      భీష్ముడు - ఐదు తాళవృక్షాల ధ్వజము

    • @naaginik5572
      @naaginik5572 4 ปีที่แล้ว

      @@munikumar7469 ఎందరో మహాను భావులు 56 అక్షరాలూ ..గుణింతాలూ..వత్తులూ ..పదాలూ ..వాక్యాలూ.. కావ్యాలూ మొదలైనవి అనితర సాధ్యంగా తయారుచేసి జాతికందిస్తే ..సామాన్యుడికి చేరువ .. సామాన్యుడికి చేరువ అనే నినాదంతో.. ౙారి..ౙారి .. దిగౙారి.. కనీసం పలకటానికి కూడా నామోషీగా భావించి భాషను ౘంపుకుంటున్న నిష్ట దరిద్రులం ...

    • @naaginik5572
      @naaginik5572 4 ปีที่แล้ว

      @@munikumar7469 ఎందరో మహాను భావులు 56 అక్షరాలూ ..గుణింతాలూ..వత్తులూ ..పదాలూ ..వాక్యాలూ.. కావ్యాలూ మొదలైనవి అనితర సాధ్యంగా తయారుచేసి జాతికందిస్తే ..సామాన్యుడికి చేరువ .. సామాన్యుడికి చేరువ అనే నినాదంతో.. ౙారి..ౙారి .. దిగౙారి.. కనీసం పలకటానికి కూడా నామోషీగా భావించి భాషను ౘంపుకుంటున్న నిష్ట దరిద్రులం ...

  • @vidhyasagar1893
    @vidhyasagar1893 3 ปีที่แล้ว +3

    OLD HIS GOLD

  • @vchaitanya23
    @vchaitanya23 3 ปีที่แล้ว +5

    అప్పటి తరం వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఆ కాలం లో పుట్టినందుకు బాధ పడుతున్నాను

    • @HeartistMurali
      @HeartistMurali ปีที่แล้ว

      ఆ కాలంలో సుగర్ కి మందు లేదు, పళ్లకి రూట్ కెనాల్ treatment లేదు.😁. ఈ కాలంలో ఉన్నందుకు ఆనందపడండి.....

  • @ragipatisubbaiah1253
    @ragipatisubbaiah1253 11 หลายเดือนก่อน

    Krishnudu, Arjunudu, Beemudu, Suyodhanudu, Beeshmudu, Karnudu, Simhabaludu, Mahabharat lo enka NTR yemaina Roles vunnava

  • @dargahussain7070
    @dargahussain7070 2 ปีที่แล้ว +1

    Ammai kooda alanti hava baavalu vyaktaparacha ledu

  • @varahanarender3865
    @varahanarender3865 3 ปีที่แล้ว +1

    👌🙏🙏🙏🙏

  • @karlapudimurali9588
    @karlapudimurali9588 6 ปีที่แล้ว +3

    ka'nchana maya ve'dika' kanatketano'jvala vibhramamu va'Du kalaSajunDu
    simha la'ngoola bhooshita nabho'bha'ga ke'tu pre'nkhaNamu va'Du dro'Na sutuDu
    kanaka go'vRsha sa'ndra ka'nti parisphuTa dhwaja samulla'sambu va'Du kRpuDu
    lalita kambu prabha' kalita pata'ka' viha'rambu va'Du ra'dha'tmajunDu
    maNi mayo'raga ruchi ja'la mahitamainapaDaga va'Du kurukshitipati ...
    maho'graSikhara ghana ta'La taruvagu siDamu va'Dusura nadi' soonuDe'rpaDa joochikonumu

    • @madhuramesh5294
      @madhuramesh5294 4 ปีที่แล้ว

      Please apply in telugu dis lyrics

    • @hemalatha4834
      @hemalatha4834 2 ปีที่แล้ว

      Thank you so much 😊🙏

  • @pcmcut9109
    @pcmcut9109 8 ปีที่แล้ว +2

    can any one post the padyalu i would like to learn

  • @janardhanraovallabhaneni6007
    @janardhanraovallabhaneni6007 4 ปีที่แล้ว +5

    వజ్రాల కే వజ్రం కోహినూర్ వజ్రం . కళా మ తల్లి వజ్ర కిరీటం . మా తారక రాముడు. నంద మూరి . తారక రాముడు