శ్రీశైలంలో కపాలలోయ రహస్యం. Srisailam kapalaloya. siddhula gutta. nallamala. siddha ramappa kolanu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • శ్రీశైలంలోని రహస్య ప్రదేశమైన కాపాలలోయ, రహస్యంను తెలుసుకొందాం
    పాల్కురికి సోమనాథుడు రాసిన “పండితారాధ్య చరిత్ర” ను బట్టి శ్రీశైలంలో ‘భృగుపాతం‘ ఆచారం కూడా ఉంది. అంటే భక్తులు శివైక్యం పొందటానికి కొండచరియలు పైనుండి దూకి ఆత్మాహుతి చేసుకోవడం. ప్రస్తుతం శ్రీశైలంలోని ‘సిద్ధ రామప్ప కొలను‘ ప్రాంతంలో పూర్వం భృగుపాతం జరిగేది
    వీరశైవ మతం ఉచ్చదశలో ఉన్న కాలంలో వీరశైవులు శివసాయిజ్యం కోసం ఆత్మాహుతి చేసుకున్నప్పుడు వేసిన శిలలు కూడా ఈ వీరగల్లు లలో కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో వీరశైవాన్ని ఎక్కువగా ఆదరించిన వారు కొండవీటి రెడ్డి రాజులు. శివుని భయంకర రూపాలైన భైరవ, మైలార, వీరముష్టి, జంగమ మఠాలు ప్రతిష్టించి పూజించేవారు. తాంత్రిక విధానంలో దేవతలకు ‘పంచమ’కారాలనే నైవేద్యం సమర్పించేవారు. మద్యం, మీనం, మాంసం, ముద్ర, మైధునం వీటిని పంచమకారాలు అంటారు.మైలారభటులు,వీరముష్టి వారు, వీర జంగములు పాశుపత ఆరాధనలో అనేక సాహసకృత్యాలు చేసేవారు. రాజు కోసం రాజ్యం కోసం వారు తలలు నరుక్కునేవారు, పొట్టలో కత్తులు జొప్పించుకునేవారు. స్త్రీ పురుషులు ఆత్మహత్యలు చేసుకునే గుడులు ఉండేవి. వీటినే ‘చంపడు గుడులు‘ అనేవారు. వీటి గురించి ప్రస్తావన కొరవి గోపరాజు రాసిన “సింహాసన ద్వాత్రింశిక” అనే గ్రంథంలో ఉంది. కొండవీటి రెడ్డి రాజు అనవేమారెడ్డి శ్రీశైలం లో నిర్మించిన ‘వీరశిరోమండపం‘ కూడా ఇలాంటిదే. దీనిలో భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ శరీర భాగాలను, తలను గండ కత్తెర వేసుకొని దేవుడికి అర్పించే వారు.
    #siddulaloya #siddharamappakolanu #kapalaloya

ความคิดเห็น • 10