పదవీ విరమణ వయసు లో కొలువు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం
    విరమణ వయసులో కొలువు
    55 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం డీఎస్సీ 1998 బ్యాచ్ లో శ్రీకాకుళం వాసికి చాన్స్ ప్రస్తుతం భిక్షాటన చేస్తూ దీనస్థితిలో
    చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ. బీఈడీ పూర్తి చేశాడు. టీచర్ కావాల నేది ఆయన కోరిక. అయితే తృటిలో ఉద్యోగం తప్పిపో యింది. కులవృత్తి కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం భిక్షా టన చేసుకుంటున్నాడు. అల్లక కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టారు. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998లో డీఎస్పీ రాసినా వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అది కలిసి రాలేదు. తల్లిదండ్రులు వృద్ధా ప్యంతో చనిపోయారు. తోబుట్టువులు ఇద్దరు ఉన్నా కేదారేశ్వ రరావు మానసిక స్థితిని చూసి విడిచిపెట్టారు. దీంతో ఆయ కడుపు నింపుకొనేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటున్నారు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాను అధికా రులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లు గడిచిపోయిందంటూ కేదారేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
    కేదారేశ్వరరావకు టీచర్ ఉద్యోగం వచ్చింది.

ความคิดเห็น •