వరదల్లో ప్రజలతో పాటు పశువులను కూడా పట్టించుకోవాలి: ఆళ్ల శ్రీకాంత్ చౌదరి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • కృష్ణాజిల్లా,
    పెనమలూరు నియోజకవర్గం,
    వరదల వల్ల మనుషులకే కాదు పశువులకు సైతం గడ్డి లేక అల్లాడుతున్నాయి. మూగజీవాల రోదన అర్థం చేసుకున్న కాటూరి గ్రామానికి చెందిన ఆళ్ళ శ్రీకాంత్ చౌదరి పశువుల మేతను రైతులకు అందజేశారు.
    ఇటీవల వచ్చిన వరదల వల్ల మనుషులకే కాదు పశువులకు సైతం గడ్డి లేక పశువులు అల్లాడుతున్నాయి.
    దాతలు మనుషులకు ఆహార పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసిన,మూగజీవాల ఆకలి రోదనను ఎవరు తీర్చలేకపోయారు.
    పాములంక గ్రామానికి చెందిన రైతులు తమ పశువులకు గడ్డి లేదని కాటూరి కు చెందిన రైతు ఆళ్ల శ్రీకాంత్ చౌదరిని అభ్యర్థించగా వెంటనే స్పందించిన శ్రీకాంత్ తన పశువుల కోసం నిలువ ఉంచిన ఎండు గడ్డి,ఎండు జనుము గడ్డి పాములను రైతులకు అందజేశారు.
    ఈ గడ్డిని పాములంక రైతులు టాక్టర్ ద్వారా తమ గ్రామానికి తీసుకువెళ్లి మూగజీవాల ఆకలి బాధను తీరుస్తామని తెలిపారు.
    ఎంతోమంది దాతలు కష్టాల్లో ఉన్న మనుషులకు ఆహారమైతే అందించారు గాని పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని మాత్రం అందించలేకపోయారు.
    పెద్ద మనసుతో ఆళ్ల శ్రీకాంత్ చౌదరి 100 కట్ల వరిగడ్డి 100 కట్ల ఎండు జనుము గడ్డి పశువుల ఆకలి బాధ తీర్చేందుకు పంపిణీ చేయడం అభినందనీయమని తమ గ్రామస్తుల తరుపున శ్రీకాంత్ చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాములంక గ్రామ వాసులు తెలిపారు.
    దాత ఆళ్ళ శ్రీకాంత్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ:
    వరదల వల్ల పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయని పాములంక గ్రామస్తులు తను అడగగానే వెంటనే తాన పశువుల కోసం నిలువచేసిన ఇందు గడ్డి ఎండు,జమప గడ్డి రైతులకు అందజేశానని, అవకాశం ఉన్నవారు పశువులకు పశుగ్రాసం అందజేసే ఆదుకోవాలని శ్రీకాంత్ చౌదరి కోరారు.

ความคิดเห็น • 1