'వసంత కాలం' - అనువాద కథ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • మూలం : మికేలి మరి ‘ఇటాలియన్’ లో రాసి, బ్రైన్ రాబర్ట్ మూర్ ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘The Black Arrow’
    ‘ఆ మధ్యాహ్నం, వసంత కాలపు ఆఖరిరోజుల్లో, ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు నుంచి ఘంటారావం మొదలైంది.’
    ‘ఒక మధ్యాహ్నం, వసంతకాలం ఇంక ముగిసిపోతోందనగా, ఆ అసాధారణ సమయాన కోట బురుజు నుంచి ఘంటానాదం విన్పించింది.’
    
    మా అమ్మమ్మ వాళ్ళింట్లోని లైబ్రరీలో, ఏ పుస్తకం చేతిలోకి తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఒక రోజంతా అలా అలమరల ఎదురుగా నిలుచుండిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో నేను చదివే బుట్టెడు పాత బొమ్మల పుస్తకాలు గత నెలరోజుల్లో చదివేసాను. నేను ఏదో ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాలనే పట్టుదలతో ఆ రోజు నిద్ర లేచాను. నాకు ఊహ తెల్సినప్పటినించీ వెంటాడుతున్న పుస్తకాల పేర్లన్నీ వరుసగా చదువుకుంటూ వెడుతున్నాను - Littleman, what Now? , What Do you think of America?, And How Green was My valley, విచిత్రమైన పేర్లు… కొన్ని జడిపించి అయోమయానికి గురిచేసినవైతే… కొన్ని విపరీతంగా ఆకర్షించినవి. పేర్ల తర్వాత పేర్లు ; ఏది చేతిలోకి తీసుకోవాలో తెలీక బుర్ర గిర్రున తిరిగేస్తోంది. నా జీవితమంతా చదవబోయే పుస్తకం మీద ఆధారపడినట్టు అక్కడే ఊగిసలాడాను. చివరికి నేనాగిపోయింది అలసట వల్లే తప్ప ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చికాదు. ఆఖరికి నా సమస్య మూడు పుస్తకాలకే పరిమితం కావడానికి వాటి పేర్లు కూడా కారణం అయ్యుండొచ్చు. ఎక్కడో మూలన ఉన్నాయి - కాన్రాడ్ రాసిన ‘Arrow of Gold’, రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ రాసిన ‘ The Black Arrow’ కూపర్ రాసిన ‘White Arrow and Other Stories’. వాటి రచయితల గురించి నాకేమీ తెలీదు కానీ నేనైతే పూర్తిగా ఆ రంగుల మాయాజాలంలో పడిపోయాను. - అప్పటికే చాలా సార్లు చదివిన ‘వైట్ ఫాంగ్’ , ‘బ్లాక్ కోర్సయిర్’ లతో అల్లుకుపోయిన నా తీపి జ్ఞాపకాలు ‘యారో అఫ్ గోల్డ్’ ను ముందుగా వెనక్కి తోసాయి. చివరికి ఏదో దుష్టశక్తి నన్నావహించినట్టుగా, చీకటి రంగే గెలిచింది. (కొన్నిపేజీలు ముందుకు వెళ్ళినతర్వాత పుస్తకంలోని ముఖ్యమైన సన్నివేశం, వైట్ రోజ్ ఆఫ్ యార్క్ , రెడ్ రోజ్ అఫ్ లాంకాస్టర్ అనే రెండు పాత్రల మధ్యన అని తెలుసుకుని, మూడు రంగులు కదా అని చాలా సంతోషించాను)
    బాగాఅలోచించి ‘The Black Arrow’ ను చేతిలోకి తీసుకున్నాను. ఆ పుస్తకాన్ని నేను ఆతృతగా చేతిలోకి తీసుకుని ఆనందంగా అతి జాగ్రత్తగా చదివాను. మూడురోజుల్లో పూర్తిచేసాను. పుస్తకం సృష్టించిన కాల్పనిక లోకంలో విహరించి వెంటనే బయటకు రాలేక, ఆ అద్భుత ప్రపంచపు జ్ఞాపకాలు పూర్తిగా వీడక, రోజూవారీ జీవితంలోని సామాన్య పరిస్థితులతో సమాధానపడలేక, నేను తికమకపడుతూంటే అకస్మాత్తుగా మా తాతయ్య మరుసటి రోజు సాయంకాలం ఏడు గంటలకు మా నాన్న వస్తున్నారన్న కబురందించారు.
    ఇప్పుడు ఈ కథలో విషాదం అర్థం కావాలంటే మా నాన్న భీకర స్వరూపం నాకెదురైనప్పుడు - ఒళ్ళు గగుర్పొడిచే భయాందోళనలు, వ్యక్తీకరించలేని ప్రేమానుభూతులు, ఎందుకో తెలీని వ్యతిరేకత, అపరాధ భావం, మనసు విప్పి మాట్లాడాలనే అమితమైన కోరిక, అయోమయం, మా నాన్నతో కలిసివున్నట్టు నాకొచ్చే కలలు, చివరికి ఏళ్ళ తరబడి అలవాటైన దూరం వల్ల నన్ను చుట్టేసే నిశ్శబ్దపు సంకెళ్ళు - వీటి మధ్య నేను ఉక్కిరిబిక్కిరి అవుతానని మీరు తెలుసుకోవాలి. అత్తగారింటి వాళ్ళను పూర్తి పరాయి మనుషులుగా నాన్న భావిస్తారని, వాళ్ళ ఇంటికొచ్చి నాతో ఏనాడూ ఒక పూట కూడా గడపలేదన్న విషయాలు తెలిసిన వాళ్ళకి, ఆయన వస్తున్నాడన్న సమాచారం నాలో అలివికాని సంతోషంతో పాటు అపరాధభావాన్ని ఎందుకు కలిగించిందో అర్థం అవుతుంది. ఆయన ప్రశాంత వదనం ఓ పక్క పరిస్థితిని ఉధృతం చేస్తూంటే అంతటితో సరిపోనట్టు ఆయన అకస్మాత్తుగా నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఏవనాలో తెలీలేదు. గుండెబరువై దిక్కుతోచలేదు: ఆయన వాత్సల్య ప్రదర్శన నన్నింకా ఇబ్బంది పెట్టింది. మా నాన్న సూటుకేసు తెరుస్తూంటే నోటమాట రాక నేనక్కడే నిలుచుండి పోయాను. ఆయనకు తిరిగి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ, నా దగ్గరుండే పనికిమాలిన వస్తువుల చిట్టానంతా ఒకసారి బుర్రలో తిరగేసుకున్నాను; మాగ్నోలియా మొక్క, గ్లాసుడు గులకరాళ్లు, కొత్తచొక్కాతో వచ్చిన అట్టపెట్టె … ఈ బీద పదార్థాలన్నిటికీ వెల కట్టలేని విలువనాపాదించి, మా మధ్య వున్న అరమరికలను శాశ్వతంగా దూరం చేసే ప్రతీకలుగా వాటిని భావించి, ఒక్కసారిగా మా మధ్య అన్ని అపార్థాలు సమసిపోయిన అనుభూతిని పొందాను.
    పడుకునే ముందర ఆ బహుమతిని ఆయన నా చేతికిచ్చాడు. అదో పుస్తకం. పేరు చూడగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా రాబోయే ఇబ్బంది పసిగట్టాను. నమ్మశక్యంగా లేకపోయినా, అది నాలుగు రోజులక్రింద నేను ఆస్వాదిస్తూ చదివిన ‘ Black Arrow’ నవల. ‘దారుణం!’ - అదే నాకు తట్టిన మొదటి పదం; ఘోరం, బాధాకరం కూడా. ఆలోచిస్తూంటే నాకనిపించింది - ‘దీనికి దురదృష్టమో మా నాన్నో కారణం కాదు… ఇదంతా నా వల్లే జరిగింది.’ ( నాన్న ఆ పుస్తకాన్ని వస్తూ వస్తూ నార్తర్న్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీదే కొన్నాడన్న విషయం గుట్టుగా తెలుసుకున్న తర్వాత కూడా నా స్థితి మెరుగుపడలేదు; అప్పటికే నా మనసులో ‘బహుమతి’ అన్న పదం తన అర్థాన్ని విస్తరించుకుని చెరిగిపోని చేదు గుర్తుగా ముద్రించుకుపోయింది.)
    అదీ పరిస్థితి. క్రిస్మస్కో నా పుట్టినరోజుకో సంబంధం లేకుండా, తన ప్రేమను వ్యక్తం చేయడానికి మా నాన్న బాహాటంగా ఇలాటి పనికి పూనుకోవడం ఎంత అసాధారణంగా ఉందంటే అది నన్ను తట్టుకోలేని ఇబ్బందికి గురిచేసింది; బహుమతి వల్ల వచ్చిన అసౌకర్యంతో పాటూ ఇంకో ఆలోచన కూడా మొదలైంది. నాకిచ్చిన పుస్తకానికి ఒక ఖరీదు అంటూ ఉండటం ( నా మీద ఒకరు డబ్బులు ఖర్చు చేయడం నన్ను ఎంతో సిగ్గుపడేలా చేస్తోంది.) నాకు సంతోషం కలిగించాలనీ, అందులోనున్న మానవతా విలువలు నాకు ఒంటపట్టాలని, ఇదికాక మా నాన్న పుస్తకాల షాపులో (వాడికి నచ్చుతుందా, వాడిలాటి పుస్తకాలేనా చదివేది?) నా కోసం… కేవలం నాకోసం కొంత సమయం ఖర్చుచేయడాన్ని ఊహించుకుంటే నాకు విచిత్రంగా ఉంది. ఇది ఎవ్వరి ఊహకూ అందనంత సంతోషాన్నిచ్చే విషయమే కానీ, ముందే ఆ పుస్తకాన్ని చదివేసి ఆ ఆనందాన్ని దూరంచేసుకున్నానని అర్థం అయ్యాక, ‘మరో సారి చదువుదాంలే!’ అన్న ఆలోచన వచ్చినా ‘ఎన్ని మార్లు చదివినా, మరిన్ని ...

ความคิดเห็น • 2

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 4 หลายเดือนก่อน +1

    మీ ఛానల్ లో కథలన్నీ చూసానండి చాలా బాగా చెబుతున్నారు మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకున్నారు. మాకు ఇవన్నీ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ఛానల్ త్వరలోనే మరింత పైకి ఎదగాలని ఎక్కువ మంది Viewers మీ కథలన్నీ చేరాలని కోరుకుంటున్నాను🙏👍👌