వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • బొగ్గు గనుల వేలం పాట ఆపాలని, నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా శుక్రవారం సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాసలేన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
    మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని అన్నారు.సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్వహించిందన్నారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థఅన్నారు. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలికానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నదని విమర్శించారు.ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు.మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయమన్నారు. పైగా సింగరేణిని ప్రయివేటీకరించబోమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు.క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతున్నదని విమర్శించారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు కదలాలని కోరారు.
    నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (నగదీకరణ) పేరుతో దేశంలో 6 లక్షల కోట్ల విలువైన ఆస్థులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.అందులో భాగంగానే రు.28,747 కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. గత పదేండ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టిందన్నారు. దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలంఅన్నారు. దేశవ్యాపితంగా 10వ విడతలో 61 బొగ్గు బావులను వేలం వేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్ నుండి 8మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికై బొగ్గుగనుల శాఖా మంత్రిగా ఉండి కూడా సింగరేణిని దివాళాతీయించేవిధంగా బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ความคิดเห็น •