PDR అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై నిరసిస్తూ 12న రాష్ట్ర మన్యం బందుDCC శతక బుల్లిబాబు Araku public voice
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది:-DCC అధ్యక్షుడు బుల్లిబాబు*
ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఆదివాసీ(గిరిజన) JAC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటు DCC అధ్యక్షులు శ్రీ.శతక.బుల్లిబాబు గారు పాల్గొన్నారు.మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి గౌరవనీయులు శ్రీ.చింతకాయల.అయ్యన్నపాత్రుడు గారు ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ...
టూరిజం అభివృద్ధిలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అమలు అవుతున్న 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు యావత్తు ఆదివాసీలను అవమానపరిచే విధంగా ,ఆదివాసీల స్థిరత్వాన్ని కాల గర్భంలో కలిపే విధంగా ఉన్నాయని బుల్లిబాబు గారు అన్నారు.ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని అన్నారు.అయ్యన్నపాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఈనెల 12వ తారీఖున ఆదివాసీ(గిరిజన) JAC ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడానికి పిలుపునిచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున తమ పూర్తి మద్ధతును తెలుపుతున్నదని ఆయన మీడియాకి వివరించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ బంద్ కార్యక్రమంలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పార్టీలకు అతీతంగా ఈ బంద్ కార్యక్రమంలో ప్రతీ ఒక్క గిరిజనుడు పాల్గొని ,తమ చట్టాలు-హక్కులు జోలికి
ఏ ప్రభుత్వం రాకుండా చేసేలా తమ నిరసనను తెలియజేసేలా కార్యక్రమాలు చేయాలని గిరిజన ప్రజానీకానికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.వంతల.కృష్ణారావు గారు మరియు గిరిజన JAC నాయకులు పెద్దలు రామారావు దొర గారు పాల్గొన్నారు.
#SriSathakaBullibabu
#DCC President@Araku Parliament
#Co.ordinator@Paderu Constituency
#Social Media Co.ordinator@ASR District
గుడ్ జాబ్
Good sir
సూపర్ సార్ 👍
Jai Congress Jai Jai Congress 🎉🎉🎉🎉🎉
Good job Sir 👍
Good
✊✊
Good job sir
జై కాంగ్రెస్...! జై జై కాంగ్రెస్...!! కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి..!!!✊
Jai adivase ✊
గుడ్ జాబ్