తెలుగు సాహిత్య ప్రక్రియలు | కథానిక | నవల | తెలుగు బోధనాభ్యసన శాస్త్రం | తెలుగు సాహిత్య ప్రక్రియలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
  • కథానిక
    కథానిక పదం 'కథ్‌’ అనే ధాతువు నుంచి కథగా పుట్టింది.
    కథానిక ప్రస్తావనం ‘అగ్నిపురాణం'లో కనిపిస్తుంది.
    ఆధునిక కథానిక రచన అమెరికన్‌ సాహిత్యంలో మొదటగా ప్రారంభమైంది.
    1850వ సంవత్సరం నుండి కథాసాహిత్యం ప్రారంభమైంది.
    1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు రచించిన “దిద్దుబాటు” కథ ఆధునిక కథా లక్షణాలకు అనుగుణంగా వచ్చింది కావున దీనిని మనం తెలుగులో వచ్చిన తొలికథగా భావిస్తాం.
    1902వ సంవత్సరంలో భండారు అచ్చమాంబ రచించిన స్తీ విద్య, ధనత్రయోదశి కథల్లోనూ ఆధునిక కథా లక్షణాలు కనిపిస్తున్నందున ఈ కథలనే తొలికథలుగా పరిశోధకులు వాదిస్తున్నారు.
    మీ పేరేమిటి, పెద్దమసీదు, మెటిల్లా కథలను గురజాడ అప్పారావు గారు రచించారు.
    మల్లికాగుచ్చం కథాసంపుటిలోని ‘హృదయ శల్యం’ అనే కథను మాడపాటి హనుమంతరావు గారు రచించారు.
    వడ్ల గింజలు, గులాబీ అత్తరు అనే కథలను శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు రచించారు.
    గోదావరి నవ్వింది, దాసరి పాట, చెంచురాణి అనే కథలను చింతాదీక్షితులు గారు రచించారు.
    కథాషట్మము, కథాసప్తకము అనే కథా సంపుటాలను వేటూరి శివరామశాస్త్రి గారు రచించారు.
    ‘ఓ పువ్వు పూసింది’ అనే కథానికను గుడిపాటి వెంకటాచలం గారు రచించాడు.
    భోగీరలోయ, వీణ, వసుబాలుడు అనే కథలను అడవి బాపిరాజు గారు రచించాడు.
    గానభంగం, చేసుకున్నవారికి చేసుకున్నంత అనే కథలను నోరినరసింహశాస్త్రి గారు రచించారు
    తోలుబొమ్మలు అనే కథను కవికొండల వెంకట్రావు గారు రచించారు.
    చిత్రం, భిక్షువు అనే కథలను మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించారు.
    నీ బుణం తీర్చుకున్నా, ముగ్గురు బిచ్చగాళ్ళు, మాక్లీదుర్గంలో కుక్క అనే కథలను విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు.
    వాయులీనం, కుంకుడాకు, బొండుమల్లెలు, మా గోఖలే కథలు, కరుణకుమార కథలు అనే కథానికలను చాగంటి సోమయాజులు గారు రచించారు.
    కాంతం కథలు, మరవలేని కథలను మునిమాణిక్యం నరసింహారావు గారు రచించారు.
    రాచకొండ విశ్వనాథశాస్త్రి, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, గోపిచంద్‌, కాశీపట్నం రామారావు, తిలక్‌, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, ముళ్ళపూడి వెంకటరమణ, మొదలైన రచయితులు కథాసాహిత్యంలో అత్యుత్తమమైన కథలను రచించారు.
    పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’ కథ అంతర్జాతీయ కథల పోటీలో బహుమతిని అందుకుని తెలుగు కథకు గొప్ప గుర్తింపును తెచ్చింది.
    ఇల్లందుల సరస్వతీదేవి, కె.రామలక్ష్మి, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి.ఆనందరామం, మాలతీచందూర్‌, ఓల్గా మొదలైన రచయిత్రులు అద్భుతమైన కథలను రాశారు.
    డాక్టర్ పి.యశోదా రెడ్డి గారు మా ఊరి ముచ్చట్లు, ఎచ్చెమ్మకథలు, ధర్మశాల కథా సంపుటాలతో తెలంగాణ భాషా సౌందర్యాన్ని, సామాజిక జీవన చిత్రణను అద్భుతంగా చిత్రించారు.
    విసుర్రాయి, మింగుతున్న పట్నం, వ్యాపార మృగం అనే కథా సంపుటాలను ముదిగంటి సుజాతా రెడ్డి గారు రచించారు.
    షాజహానా, గీతాంజలి, జాజులగౌరి, జూపాక సుభద్ర, నల్లాల లక్ష్మీరాజ్యం, కోట్ల వనజాత మొదలైన రచయిత్రులు సమకాలీన వస్తువుతో కొత్త జీవనపార్య్వాలను చూపారు.
    దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారు స్వామి, సురవరం ప్రతాప రెడ్డి, నెల్లూరి కేశవ స్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, గూడూరి సీతారాం, పొట్లపల్లి రామారావు, పాకాల యశోదారెడ్డి మొదలైన వారు తెలంగాణ తొలితరం కవులు.
    అల్లం రాజయ్య, బోయ జంగయ్య, బి.ఎన్.రాములు, కేతు విశ్వనాథ రెడ్డి, కొలకలూరి ఇనాక్, సురమౌళి, కాలువ మల్లయ్య, నవీన్, పెద్దింటి అశోక్ కుమార్, కె.వి. నరేందర్, బెజ్జారపు రవీందర్, జాతశ్రీ మొదలగు రచయితలు తెలుగు కథా దిశా నిర్దేశంలో ముఖ్యభూమికను పోషిస్తున్నారు.
    ‘తెలుగు కథానిక- స్వరూప స్వభావం’ అనే గ్రంథమును పోరంకి దక్షిణామూర్తి గారు రచించాడు.
    బుచ్చిబాబు ప్రకారం “కథానిక అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యం”
    పాలగుమ్మి పద్మరాజు గారు కథానిక ఒక మెరుపు వంటిది అని అభివర్ణించారు.
    నవల :-
    నవల అనేది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది.
    ఆంగ్లంలో ‘Novel’ అనే పదం నుండి నవల పుట్టింది.
    నవల పదానికి మూలం సంస్కృతంలో ఉందంటూ ‘నవాన్ విశేషాన్ లాతి గృహ్లాతీత నవల’ అంటూ కొత్త విశేషాలు తెలిపేదే నవలగా కాశీపట్ల బ్రహ్మయ శాస్త్రి గారు పేర్కొన్నాడు.
    నవలను హిందీలో ‘ఉపన్యాస్’ అని అంటారు.
    నవలను మరాఠీ, గుజరాతీ, కన్నడ భాషల్లో ‘కాదంబరి’ అని అంటారు.
    1872వ సంవత్సర కాలంలో నవల ‘వచన ప్రబంధము’ అనే పేరుతో పిలవబడింది.
    కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితిని అని ప్రకటించుకున్నాడు.
    1872వ సంవత్సరంకు పూర్వమే కొక్కొండ వెంకటరత్నం పంతులు 'మహాశ్వేత’ అనే నవలను రాసాడని నిడదవోలు వెంకట్రావు గారు అభిప్రాయపడ్డాడు.
    1872వ సంవత్సరంలో కర్నూలు డిప్యూటి కలెక్టర్‌గా ఉన్న గోపాలకృష్ణమశెట్టి గారు 'శ్రీరంగరాజ చరిత్రము” అనే నవలను రాసాడు. దీనిని ‘సోనాబాయి పరిణయము” అనే మరో పేరుతో పిలుస్తారు.
    రాజశేఖర చరిత్ర నవలను కందుకూరి వీరేశలింగం గారు రచించారు.
    ‘మహాశ్వేత' అనేది సంస్కృత నవల మరియు కాదంబరికి అనువాదమని, శ్రీరంగరాజ చరిత్రములో నవలా లక్షణాలు లేవనే అభిప్రాయాలతో రాజశేఖర చరిత్రనే తొలి నవలగా అందరూ అంగీకరించారు.
    రాజశేఖర చరిత్ర నవలకు 'వివేక చంద్రిక’ అనే మరో పేరుంది. ఇది ఆంగ్లంలో అలీవర్‌ గోల్డ్‌స్మెత్‌ రాసిన ‘వికార్‌ ఆఫ్‌ వేక్‌ ఫీల్డ్‌’ అను ప్రసిద్ధ నవలకు అనుకరణ.
    తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదమైన తొలి నవల - రాజశేఖర చరిత్ర
    ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే నవలను కందుకూరి వీరేశలింగ పంతులు గారు రచించారు. ఈ నవలను ఆంగ్ల హాస్యరచయిత అయిన జోనాథన్ స్విప్ట్ రాసిన ‘గలీవర్‌ ట్రావెల్స్‌’ నవల ఆధారంగా రాశాడు.
    “రచనా కాలంలోని వాస్తవికాలైన జీవితాచారావ్యవహారాలను చిత్రించేదే నవల” అని బొడ్డపాటి కుటుంబరావు గారు తన “తెలుగు నవలా పరిణామం” అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
    R.S.సుదర్శనం ప్రకారేం వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సాంఘిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియే నవల”
    “నవల మరియు తెలుగు నవలా వికాసం”
    మొదలి నాగభూషణ శర్మ గారు పేర్కొన్నాడు.

ความคิดเห็น •