తొర్రూరు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంత్రి ఎర్రబెల్లి ఎవరి మాటలు నమ్మకుండా పంపిణీ చేయాలి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో మంత్రి సానుకూలంగా ఉంటే.. నాయకుల చాటుమాటు పంపకాలేంటి.?
    తొర్రూరు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే టీ.డబ్ల్యు.జె.ఎఫ్ కార్యాచరణ ప్రకటిస్తాం.
    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నాయకులు కొమ్మనబోయిన యాకయ్య.
    తొర్రూరు 03 అక్టోబర్
    తొర్రూరు వర్కింగ్ జర్నలిస్టుల విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించి గతంలో ఇచ్చిన 40 మంది జర్నలిస్టులతో పాటు మరో 15 మందికి ఇస్తానని మంత్రి చెప్పిన మాటలను తుంగలో తొక్కి ఇటీవల గతంలో వెనక్కి తీసుకున్న పట్టాలను నాయకులు చాటుమాటుగా ఎవరి పట్టాలు వారికి ఇవ్వడం ఏమిటని...? తొర్రూరు లో వర్కింగ్ జర్నలిస్టులకు అందజేసే డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు లేదా మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నాయకులు కొమ్మనబోయిన యాకయ్య తెలిపారు. సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందరికీ ఇవ్వాలని ఆలోచనలనే ఉన్నా కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే చెడ్డ పేరు తీసుకువచ్చేలా కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తించి పక్షపాత ధోరణి వహిస్తున్న కొంతమంది నాయకులు ఎండగట్టి జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహృదయంతో స్పందించి 40 మందితో పాటు మరో 15 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తానని అర్హులైన వారి పేర్లను ఎంపిక చేయాలని కొంతమంది నాయకులకు సూచిస్తే... ఆ విషయాన్ని పక్కన పెట్టి తమ వారి కోసం తమ బంధువుల కోసం పేర్లను రాయించి అనర్హులకు కూడా అందజేయాలని చాంతాడంత లిస్టు తయారు చేయడంతో ఇంతమందికి ఇవ్వలేము అనే సాకుతో నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు కూడా మొండి చేయి చూపడం ఏమిటని ప్రశ్నించారు. జర్నలిస్టు సంఘాల నాయకులు అని చెప్పుకునే వారు తమ బంధువుల కోసం తమ ఊరు వారి కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు విన్నవించుకుంటూ నిజమైన వర్కింగ్ జర్నలిస్టులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందిస్తూ అందరికీ అందజేస్తానని మంత్రి చెప్తుంటే మంత్రిని కూడా పక్కదోవ పట్టించేలా కిందిస్థాయి నాయకులతో జర్నలిస్టు సంఘాల నాయకులు మంతనాలు జరుపుతూ వీరికి వద్దు వారికి వద్దు అంటూ చెబుతూ నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. ఈ విషయంపై మంత్రి జిల్లా కలెక్టర్ స్పందించి తొర్రూరు జర్నలిస్టులకు అందజేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో నిజమైన పేద వర్కింగ్ జర్నలిస్టులకు అందించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ความคิดเห็น •