జ్యోతి స్వామి(kuppuswamy) :తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • జ్యోతిస్వామి 1884లో తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోయారు. హైస్కూల్ విద్యానంతరం వ్యాపారంలోకి ప్రవేశించి, బట్టల వ్యాపారం ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నారు. 19వ ఏట వివాహం చేసుకుని, కుటుంబ జీవితం గడిపారు.
    ఆధ్యాత్మికతపై ఆకర్షణ కలిగి, పెరుమాళ్ స్వామిని గురువుగా స్వీకరించారు. ప్రభుత్వం ఆయనను గౌరవ మేజిస్ట్రేట్‌గా, తిరుత్తణి పంచాయతీ అధ్యక్షుడిగా నియమించింది. కానీ, అవినీతి, లంచగొండితనం చూసి మనస్తాపం చెందిన స్వామి, చివరకు సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించారు.
    తిరుత్తణిలో ఆశ్రమాన్ని స్థాపించి, భక్తుల ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్థాపించిన "శ్రీ బ్రహ్మజ్ఞానజ్యోతి" ఆశ్రమంలో భక్తులకు ఉపదేశాలు అందించారు. నిత్యం తపస్సు, ధ్యానం, పరమార్ధ బోధన చేస్తూ, జనసేవలో తరించేవారు.స్వామివారికి పాదపూజ చేస్తున్న భక్తులు వారి నొసలలో దేదీప్యమానంగా జ్యోతి వెలగడాన్ని గమనించేవారు.స్వామివారు చాలా తక్కువ ఆహారం తీసుకునేవారు. వంటి మీద కౌపీనం మాత్రమె ధరించేవారు. విశ్రమించే సమయం కూడా స్వల్పమే. అయితే ఒక్కోసారి 9 రోజులు ఒక్కోసారి 21రోజులు నిర్వికల్ప సమాధిలో మునిగిపోయేవారు
    జ్యోతిస్వామి 1977లో యోగసాధనలో లీనమై మహాసమాధిని పొందారు. ఈరోజు కూడా తిరుత్తణిలోని ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది.

ความคิดเห็น • 1