NTR Old Songs | Kalasi Vunte Kaladu Sukham | Mudda Banthi Poolu Song |NTR, Savitri| Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Kalasi Vunte Kaladu Sukham
    Watch NTR Old Songs Mudda Banthi Poolu Song Telugu old song from "Kalasi Vunte Kaladu Sukham" Movie, Starring NTR, Savitri. Movie Directed by Tapi Chanakya and Produced by Y. Ramakrishna Prasad, Music composed by Master Venu
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 3.8K

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 4 หลายเดือนก่อน +159

    ఎన్ని యుగాలైనా ఈ పాటకు తిరుగులేదు చాలా అద్భుతమైన పాట 2024లో చూసే అటువంటి వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 3 หลายเดือนก่อน +18

    ఎప్పటికీ నిలిచి పోయే పాటలు. ఈ పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 7 หลายเดือนก่อน +97

    విదేశాల్లో షూటింగ్ లేవు, గ్రాఫిక్స్ లేవు, ఆడంబరమైన డ్రెస్ లేవు, ఆ మహా నటీనటుల ఆహాబావాలు నటన కు అంకితం అయిన వారి అందాలు, చెవులు చిల్లులు పడే సంగీతం లేదు, ఎన్ని సార్లు చూసినా, విన్నా మరల మరల కావాలి అనే మధురమైన పాటలు ❤️❤️❤️❤️

  • @dhanushkumar9745
    @dhanushkumar9745 8 หลายเดือนก่อน +418

    చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్లం ఇప్పుడు ఇలాంటి పాటలు రావటం లేదు 2024 లో వినేవారు లైక్ చేయండి

  • @dr.v.s4995
    @dr.v.s4995 6 หลายเดือนก่อน +13

    ఆ కాలంలో జీవించిన వాళ్ళు ధన్యులు. కల్మషం కాలుష్యం లేని గొప్ప కాలం. ఈ తరం లో జీవించేవాళ్ళు సాధించింది శూన్యం

  • @sivasankarayya3541
    @sivasankarayya3541 ปีที่แล้ว +10

    ఈ పాటలు ఎంత బాగున్నాయో ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @krishh.2513
    @krishh.2513 2 ปีที่แล้ว +25

    ఈ పాట విన్న ప్రతీ సారి నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంది దూరదర్శన్ లొ ప్రతి శుక్రవారం చిత్రలహరి లొ ఇలాంటి పాటల కోసం ఎదురు చూసే వాళ్ళం అసలు ఆ రోజులు ఎంత బాగుండేవి

  • @balusrkbalu124
    @balusrkbalu124 5 ปีที่แล้ว +15

    ఎన్టీఆర్ మించిన నటుడు ఈ కలియుగం లో రారు సూపర్

  • @VeeraswamiKilari
    @VeeraswamiKilari 7 หลายเดือนก่อน +7

    అద్దమంటి మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకన్న చెప్పేది ఏంది

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 3 ปีที่แล้ว +97

    గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో గేదె పైన కూర్చుని అది వెళ్తున్నా ఏమాత్రం బెదురు లేకుండా అన్నగారు ఆ పాటలో పలికించిన హావభావాలు న భూతో న భవిష్యతి.

  • @bhashag3904
    @bhashag3904 ปีที่แล้ว +298

    ఇప్పుడు మహా నటుడు స్వర్గీయ శ్రీ యన్.టి.ఆర్. గారు & మహానటి సావిత్రి గారి అద్భుతమైన వినసొంపైన ఈ పాటను విని, చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 🙏🌹🌹🌹🌹

  • @chandanaguttala7976
    @chandanaguttala7976 4 หลายเดือนก่อน +8

    అజరామృతం అంటే ...ఇటువంటి ఆణిముత్యాలు అనుకుంటా....

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 ปีที่แล้ว +16

    నాకు 75 సం. అలనాటి సాహిత్యం, అభినయం, ఆలాపన, నటనపట్ల ఆరాధన ఫలితమే ఈ పాటలోని మాధుర్యం. ఇలాంటి సాహిత్యాన్నీ, సంగీతాన్నీ భావి తరాలకు అందించడం మన కనీస ధర్మం.

  • @vedasrinvaspvedasrinvasp8333
    @vedasrinvaspvedasrinvasp8333 ปีที่แล้ว +7

    ఆనాటి పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా vinalanipisthayi వాళ్ళ acting కాని వాళ్ళు కానీ అద్భుతం ఇప్పటి songs okasari వింటే ఇంకోసారి వినలేము

  • @boyaramanna8445
    @boyaramanna8445 ปีที่แล้ว +17

    ఇంత మంచి పాటలు వింటున్న అందుకు చాలా గర్వపడుతున్నాను ఇలాంటి పాటలు వింటుంటే ఎంత కష్టం అయినా మర్చిపోతాం జై ఎన్టీఆర్ జై సావిత్రి మీకు పాదాభివందనాలు

  • @vav9999
    @vav9999 3 ปีที่แล้ว +298

    మన తెలుగు మహానటి మన సావిత్రి..my god what an expressions.
    NTR మహానటుడు

  • @mvnageswararao
    @mvnageswararao ปีที่แล้ว +61

    గతం ఎప్పుడు తీపిగానే ఉంటుంది... అన్నగారు ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు

  • @rajashekar9461
    @rajashekar9461 3 ปีที่แล้ว +23

    ఇ సాంగ్ అంటే నాకూ చాల చాల చాల ఇష్టం ఎన్టీఆర్ గారి తరువాతే ఎవ్వరైనా

    • @vinodsivanoor6950
      @vinodsivanoor6950 ปีที่แล้ว

      నిజం చెప్పావ్ బ్రో..🙏🙏🙏

  • @srinivasd5838
    @srinivasd5838 2 ปีที่แล้ว +39

    వదినలు గేలి చేస్తున్నారని చెప్పగానే రెండవసారి ఎన్టీఆర్ వైపు సావిత్రి చుసిన చూపు అద్భుతం

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 ปีที่แล้ว +4

    మహానటుడు ఎన్టీ రామారావుఅటువంటి నటుడు మళ్లీవారి మనవడు కొమరం భీమ్ఎన్టీఆర్

  • @Prakashvage
    @Prakashvage ปีที่แล้ว +9

    ఎంత మధురనుభూతి వంటి అలనాటి ఆణిముత్యాలు మంచి పాటలు మనసులో

  • @srinivasd5838
    @srinivasd5838 3 ปีที่แล้ว +57

    ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది ఈ పాట.
    అలాగే వయస్సు ఎంతో విలువయినదని, వయస్సు లో ఉన్న వాళ్ళు అది గుర్తించి ఆనందించమంటుంది. ఎంత మంది గేలి చేసినా నేను ఉన్నాను నిన్ను అభిమానించే దాన్ని అంటూ మద్దత్తు ఇస్తుంది సావిత్రి. మంచితనంతో హాయిగా జీవించాలని ఈ పాట సారాంశం.

  • @govindg4318
    @govindg4318 ปีที่แล้ว +5

    పల్లవి:
    ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
    జడను చుట్టి
    హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా..
    చిట్టెమ్మా..
    మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా..
    చెప్పమ్మా..
    ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
    హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
    అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
    వయసు ఉంది..
    ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా
    కిట్టయ్యా..
    ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
    చెప్పయ్యా..
    అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
    ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
    చరణం 1:
    పుట్టింటి అరణాలూ..ఊ.. ఘనమైన కట్నాలూ..ఊ..హోయ్.. ఓ..
    పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు.. అత్తవారి ఇంటినిండా వేసినా
    అవి అభిమానమంత విలువ జేతునా..ఆ.. అభిమానమంత విలువ జేతునా
    ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
    హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
    అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా
    మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా
    అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
    ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
    చరణం 2:
    కాలు చేయి లోపమనీ..ఈ.. కొక్కిరాయి రూపమనీ..ఈ..
    కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని.. వదినలు నన్ను గేలిచేతురా
    పిల్లని తెచ్చి పెళ్ళిజేతురా..ఆ.. పిల్లని తెచ్చి పెళ్ళి జేతురా
    ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి..
    ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. నవ్విన నాప చేనే పండదా
    నలుగురు మెచ్చు రోజు ఉండదా..ఆ.. నలుగురు మెచ్చు రోజు ఉండదా
    అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
    ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
    ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
    హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 3 ปีที่แล้ว +68

    ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ పాట చూస్తుంటే ఆ రోజులే బాగుండెవి ఎంతైనా😍❤️🎵🙏💕

  • @bredara6000
    @bredara6000 3 ปีที่แล้ว +17

    ఏ తరం వారి నైనా ఆకట్టుకొనే అచ్చ తెలుగు పదాలతో ఆనాటి పాత పాటల మాధుర్యం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించేవి.old telugu songs వారికి దన్యవాదములు

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว +176

    తెలుగు పరిశ్రమ గర్వపడేలా నటించి జీవించారు, n t r. సావిత్రి గారి నటన అద్భుతం 🙏🙏

  • @anandbabuanand6340
    @anandbabuanand6340 2 ปีที่แล้ว +7

    Great old gold Song elanti paatalu vinte prati okkaru HELdi ga Untaru

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +54

    ఇంత మంచి మధురమైన పాటను విన్నంత చేపు నేను పొలం పనులు గుర్తుకు వస్తున్నాయి చాలా అద్భుతంగా పాడిన గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల గారికి చాలా చక్కగా నటించిన నందమూరి తారక రామారావు కు సావిత్రి గారికి పాదాభివందనం

    • @akuladurgaprasad797
      @akuladurgaprasad797 8 หลายเดือนก่อน +1

      😮

    • @prakashrao8077
      @prakashrao8077 7 หลายเดือนก่อน +1

      Original Tamizh song / tune story music by Vishwanathan and Ramamoorthy!

  • @rajeshyallamgari4274
    @rajeshyallamgari4274 2 ปีที่แล้ว +32

    తెలుగు సినిమా ఉన్నంత కాలం
    ... అన్న గారి ని ... గుర్తు ఉంచుకుంటారు తెలుగు ప్రేక్షకులకు

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 3 หลายเดือนก่อน +2

    అభిరుచి, సాహిత్య గొప్పతనము, కవిత్వపు రుచి, చక్కటి సంగీతం, అనుభవిస్తే నే తెలిసేవి, అర్ధం చేసుకొని ఆనందం పిందెలు వాళ్ళు ఎప్పుడు ఉంటారు.

  • @Nandhamuriempire
    @Nandhamuriempire 5 ปีที่แล้ว +451

    ఇంత నాగరికత అభివృద్ధి చెందుతున్న....... ఇలాంటి పాటలు ఇంకా ఆదరణ పొందుతున్న........ సాహిత్య గొప్ప తనం........

  • @sainathaj7388
    @sainathaj7388 5 ปีที่แล้ว +1240

    స్వచ్చమైన పల్లెటూరు..
    స్వచ్చమైన మనుషులు..
    స్వచ్ఛమైన ఆనాటి సాహిత్యం..
    మరల రాదు ఏనాటికీ..

    • @chantibabuinelli7534
      @chantibabuinelli7534 5 ปีที่แล้ว +14

      ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్.....

    • @pindiprolilakshman5401
      @pindiprolilakshman5401 5 ปีที่แล้ว +8

      Yes chalabhaga chepparu 👌🙏🙏

    • @parthasarathinaidu7
      @parthasarathinaidu7 5 ปีที่แล้ว +3

      7kkk
      Kuppam

    • @sridharbandari433
      @sridharbandari433 5 ปีที่แล้ว +4

      Yes..sir

    • @mrslakshmi.y6125
      @mrslakshmi.y6125 5 ปีที่แล้ว +7

      పిల్లలకు పెద్దలు వీటి ఆర్థాలు చెప్పాలి.eng.medium చదివే వాళ్లకు ఇంట మంచి తెలుగు రావటంలేడు.

  • @paladisudheerbabu5191
    @paladisudheerbabu5191 3 ปีที่แล้ว +134

    Always evergreen song
    Wow! What a lyrics
    ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడన చుట్టి
    జడన చుట్టీ...
    హంసలా నడిచివచ్చే చిట్టెమ్మ
    చిట్టెమ్మా....
    మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
    చెప్పమ్మా.... /ముద్దబంతి/
    అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
    వయసు ఉంది...
    ఇంత కన్నా ఉండేదేది కిట్టయ్యా
    కిట్టయ్యా...
    ఈ పేదవాళ్ళు తెచ్చేదేది చెప్పయ్యా /అద్దమంటి/
    పుట్టింటి అరణాలు...
    ఘనమైన కట్నాలు....
    అత్తవారింటి నిండా వేసినా
    అవి అభిమానమంతా విలువ చేతునా /ముద్దబంతి/
    అభిమానం ఆభరణం
    మర్యాదే భూషణం
    గుణము మంచిదైతే చాలయా
    మన గొప్పతనము చెప్పుకోను వీలయా /అద్దమంటి/
    కాలు చేయి లోపమనీ...
    కొక్కిరాయి రూపమనీ...//2//
    వదినలు నన్ను గేలి చేతురా
    పిల్లను పెట్టి పెళ్ళి చేతురా
    ఎవరేమి అన్ననేమి /2/
    ఎగతాలి చేయ్యనేమి
    నవ్విన నాప చేను పండదా
    నలుగురు మెచ్చు రోజు ఉండదా /అద్దమంటి/

  • @anilcherukuri5606
    @anilcherukuri5606 5 ปีที่แล้ว +1841

    ఇంత గొప్ప పాటలు గొప్ప నటుల కాలమ్ లొనే ఎప్పుడు ఎక్కడ ఉన్నాయండి.. ఆ మాధుర్యం.. ఆ గొప్పతనం.. ఆ అందం...2019 లో వినేవాళ్ళు ఒక like వేయండి

  • @rameshbabu9883
    @rameshbabu9883 2 ปีที่แล้ว +62

    మా చిన్నతనంలో ఇట్లాంటి పాటలను రేడియోలో వింటున్న ఇప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 ปีที่แล้ว +22

    కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పల్లెటూరి మాధుర్యమైన సాహిత్యం🙏🙏🙏
    సంగీతం అయితే పల్లెటూరి లో అలా గట్టుమీద నడుస్తుంటే పాడుతున్నట్టు సహజం గా ఉంది...
    అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా
    మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా
    అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
    ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్య...ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

  • @dammumissamma9961
    @dammumissamma9961 4 ปีที่แล้ว +165

    అలనాటి అందాల తారల వారి నటన
    మరలా రాదు.
    ఆ కట్టూ ఆ బొట్టు ఇక రాదు రాబొదు
    NTRగారు సావీత్రీ గారు మరల
    వస్తె బాగుంటుంది అని.
    ఆంధ్రుల కొరీక .
    🙏🙏🙏🙏🙏

    • @sumansatya1974
      @sumansatya1974 2 ปีที่แล้ว

      Jr ntr vunnaru but savitri garu lanti actor leru

    • @sravanikota3257
      @sravanikota3257 7 หลายเดือนก่อน +1

      ​@@sumansatya1974జూనియర్ ఎన్టీఆర్ వేస్ట్ తెలుగు దేశం పార్టీ నీ లేకుండా చేయాలని కుట్ర పన్నితున్నడు ఆస్కార్ అవార్డు ఇచ్చింది కదా బీజీపీ పార్టీ తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడో ఎత్తి పోయింది ఇలాంటి వాళ్ళు సినిమా వస్తే కాలా గర్భం లో పోతుంది

  • @teluguanjaneyulu5621
    @teluguanjaneyulu5621 4 ปีที่แล้ว +20

    ఇలాంటి పాటలు వింటే చాలు బీపీ,షుగర్, మనదగ్గరకు రావు

  • @jaisriram4866
    @jaisriram4866 3 ปีที่แล้ว +1060

    నా దేశం యాబై సంవత్సరాలు ముందు ఇంత అందమైన దంటే వేల సంవత్సరాల ముందు ఇంక ఎంత అందం వుండేదో

  • @balmurisatyamrao9827
    @balmurisatyamrao9827 3 หลายเดือนก่อน +66

    ఈరోజు చూసినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @ChandrayyaKattekola
      @ChandrayyaKattekola 28 วันที่ผ่านมา +2

      ❤❤ జై ఎన్టీఆర్

  • @కణితిశ్రీపావని
    @కణితిశ్రీపావని 4 ปีที่แล้ว +292

    ఎంతో బాగుంది ఈ తరంలో ఎలాంటి పాటలు ఇక రావు రాలేవు కూడా..

  • @sabahamed9781
    @sabahamed9781 20 วันที่ผ่านมา +1

    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వింటుంటే.. ఆ రోజులు మళ్ళీ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.. 🤲🙏

  • @Ssk95422
    @Ssk95422 7 หลายเดือนก่อน +5

    Evergren Song i listen every year .
    Tq Telugu Film industry .

  • @gangadharrao9799
    @gangadharrao9799 6 หลายเดือนก่อน +2

    Chinnappudu rediolo vinevallam meeru avarokani meeku naadhayavadalu ntrgaru savithrigaru manchi jodi naa age sixtysevan ee roju meedayavalla aa rojulu gurthuchesaru peddavarythe paadabhivandanam chinnavarythe naa aayushuposukoni nurellu challaga pilla papalatho vundalani devuduni koruthu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹

  • @venkatreddy-em7rz
    @venkatreddy-em7rz 4 ปีที่แล้ว +108

    పాత పాట ల్లో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది ఇటువంటి పాటల విలువ.

  • @harikrishnab1370
    @harikrishnab1370 2 ปีที่แล้ว +48

    అద్భుతమైన తెలుగు పాట...
    సావిత్రి గారి , ఎన్టీఆర్ గారి నటన నభూతో నభవిష్యత్....

  • @FunnyAnimalsClub1989
    @FunnyAnimalsClub1989 2 ปีที่แล้ว +19

    గంగి గోవు పాలు లాంటి స్వఛ్చమైన పాట మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందో 😘😘😘

  • @saichalla4172
    @saichalla4172 6 ปีที่แล้ว +813

    ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే.. ఇలాంటి పాటలు , పాటలు పాడిన మహానుభావులందరికి అందరికీ నా పాదాభివందనాలు..

  • @kasireddibabji3613
    @kasireddibabji3613 4 ปีที่แล้ว +100

    అందుకే మిమ్మల్ని విశ్వ విఖ్యాత నట సౌర బోమ అన్నారు... అని బిరుదు ఇచ్చారు🙏🙏

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 ปีที่แล้ว +7

    స్వచ్ఛమైన పాటలు అంటే ఇవ్వండిఇవి ఈ పాటలు వింటే మనసులో ఉన్న కష్టాలుపోతాయి

  • @durgaprasadsurapaneni3731
    @durgaprasadsurapaneni3731 4 ปีที่แล้ว +432

    కాలు చేయి లోపమని, కొక్కిరాయి రూపమని, వదినలు నన్ను గేలి చేతురే... ఆ సందర్భంలో సావిత్రి గారి హావ, భావాలు చూసి తీరాల్సిందే... మాటలలో వర్ణించలేము.. సావిత్రి గారు తెలుగింట్లో పుట్టటం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం..

    • @krishna_Lee
      @krishna_Lee 3 ปีที่แล้ว +6

      కొక్కిరాయి అంటే ఏంటి sir

    • @yakoobchina8996
      @yakoobchina8996 3 ปีที่แล้ว +5

      @@krishna_Lee a stone having so many up and downs.

    • @ksuguna5332
      @ksuguna5332 3 ปีที่แล้ว +1

      Uwryuueirperowytttouwowowurporpyoiieoopiwqueoryrtiriqptiwwutetytyrweooqowoyuwttqopepwoitrtpttruwipyrwuiqprorrppyipwyiyrypqiyooriowouriqoeporqutwepuw trustyw

    • @sudir3226
      @sudir3226 3 ปีที่แล้ว +2

      @@krishna_Lee కొక్కిరాయి antey కొంగ

    • @krishna_Lee
      @krishna_Lee 3 ปีที่แล้ว +4

      @@sudir3226 ohh thank you

  • @SrinivasSrinivas-iu4nd
    @SrinivasSrinivas-iu4nd 4 ปีที่แล้ว +457

    అన్నగారి నటన అద్భుతం అపూర్వం
    దేవతలు శపగ్రస్తులై భూమి మీద పుడతారు
    అలా పుట్టి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు.
    మీకు మీరే సాటి.

    • @durgaprasadpodili3913
      @durgaprasadpodili3913 4 ปีที่แล้ว +9

      Awesome sir

    • @saireddyreddy8534
      @saireddyreddy8534 3 ปีที่แล้ว +4

      Yes exactly

    • @kumarp6557
      @kumarp6557 3 ปีที่แล้ว +2

      Nenu same dialogue cheppali anukunna

    • @SrinivasSrinivas-iu4nd
      @SrinivasSrinivas-iu4nd 3 ปีที่แล้ว

      @@kumarp6557 not dialogue it's true .

    • @SrinivasSrinivas-iu4nd
      @SrinivasSrinivas-iu4nd 3 ปีที่แล้ว +1

      @@kumarp6557 మళ్ళీ అటువంటి నటులు మనుషులు పుట్టరు.ప్రజలు గుర్తించారు అన్నగార్ని తను కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు సపోర్టు చేయలేదు. ఇది దారుణం .

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 ปีที่แล้ว +5

    ఎంతో గొప్ప పాట మనసుని సంతోషపరుస్తుంది పాట మహానటులు ఎన్టీ రామారావు గారు ఎస్వీరంగారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి అమ్మగారు ఇటువంటి నటులు మల్ల రారు

  • @goudsadda3106
    @goudsadda3106 4 ปีที่แล้ว +286

    ఇప్పుడు ఉన్న పాటలు ఒక్కటీ కూడా అర్థం కావు ఎంతయినా పాత పాటలు మాధుర్యం

  • @ananduasmbathula9366
    @ananduasmbathula9366 3 ปีที่แล้ว +150

    నేను రామారావ్ అభిమాని ఒక్క లైక్ చేయండి

    • @RaguMoturi-is8vq
      @RaguMoturi-is8vq 3 หลายเดือนก่อน +1

      Jai NTR Johar Anna NTR 😢

    • @SuryaNaryana-cp5zg
      @SuryaNaryana-cp5zg 2 หลายเดือนก่อน +1

      Iam pspk fans Jai janasena

  • @nallamothulavikram7993
    @nallamothulavikram7993 6 ปีที่แล้ว +239

    ఎన్టీఆర్ గ్రేట్ . రియల్ ఆక్టర్

  • @bhavaniallaABC
    @bhavaniallaABC 5 ปีที่แล้ว +112

    విలువలు నేర్పిన కొసరాజు గారి సాహిత్యం, అత్యద్భుతమైన ఘంటసాల, సుసీలమ్మ గారి గానం, సంగీతానికి అర్ధం ఇచ్చిన మాస్టర్ వేణు గారు, నటనకు జీవం పోసిన మహానటి సావిత్రి గారు,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రాముడు, మన తెలుగు వారు అవ్వడం తెలుగు వారి అదృష్టం...

    • @c.s.venkatarangan9696
      @c.s.venkatarangan9696 ปีที่แล้ว +1

      Great Indian legends.hatts app.god bless their souls always.

    • @aroundtheglobe.3022
      @aroundtheglobe.3022 ปีที่แล้ว

      Hats off.

    • @lakshmanlakshman6285
      @lakshmanlakshman6285 ปีที่แล้ว

      @@c.s.venkatarangan9696 you canyiyyyy see6yyy why I though yyyyyyuhyyy Hugh and yyyyyuhyyy yyyyyyy

    • @lakshmig2094
      @lakshmig2094 7 วันที่ผ่านมา +2

      Manasuku hainiche song❤❤❤

  • @veerendranath0073
    @veerendranath0073 ปีที่แล้ว +48

    విద్య,వినయం,చదువు,సంస్కారం ఎన్ని ఉన్నా మంచిగుణాన్ని మించింది లేదని ఈ పాట భావం. కానీ ఖర్మకొద్దీ నేటి సమాజానికి వెగటైపోయింది ఆ సుగుణమే!

    • @gopalaraoimmadisetty2245
      @gopalaraoimmadisetty2245 3 หลายเดือนก่อน

      De ttttt I Gopala yyy6tvgrytttrttttt 2kkkkjkkjjjjjjjn
      Ghhhhuhhjhhjuggnn😅yyu7huhuujuujuujjjjjjhjjuu

  • @anjiboya4940
    @anjiboya4940 4 ปีที่แล้ว +162

    రామారావుగారు మహానటుడు ఆయన పుట్టిన తేలుగు రాష్ట్రంలో ఆయన నటించిన సినిమాలన్నీ మహాబ్దుథం పాటలుకూడా మనస్పూర్తిగా వీటె ఎంతొ జ్ఞానం అర్థం అవుతుంది

  • @svrao6488
    @svrao6488 6 ปีที่แล้ว +272

    నేను ఎన్టీఆర్ అభిమానిని, పాత పాటల రుచికరమైనవి

    • @rammohandabbiru7050
      @rammohandabbiru7050 2 ปีที่แล้ว +1

      Ennisarlu vinnano naku teliyadu Kani yeppudu oka kothaananda

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 ปีที่แล้ว +86

    ఎంత మధురంగా వుంది ఈ పాట.
    చెవిలో అమృతం పోసినట్లు ఉంది.

  • @gadamanjaneyulu1781
    @gadamanjaneyulu1781 2 ปีที่แล้ว +7

    సంగీతం అందించిన ఘనత సాధించిన తర్వాత ఆయన తన సొంత ప్రయోజనాల పరిరక్షణ వేదిక మీద ఉన్న ప్రేమ ఒక చిన్న పిల్లల చదువుల పట్ల అవగాహన ఉన్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన తన సంగీత గొప్ప చరిత్ర కలిగిన ఒక గొప్ప కళ్లాకారులు

  • @devabandari1984
    @devabandari1984 4 ปีที่แล้ว +48

    నా తెలుగు తేనె లోలుకు పలుకు పది కాలాలు వెలగని నా తల్లి పలుకు పండని నిండు వేయేళ్ళు...

  • @yerrabellivenkenna3680
    @yerrabellivenkenna3680 2 ปีที่แล้ว +13

    ఈ పాట రాసిన మహానుభావునికి నా పాదాభివందనాలు ఇలాంటి పాటలు చరిత్రలో రావు ఎవడికి దమ్ము లేదు పొట్టేలు అంత పిచ్చి వాళ్ళు

  • @srinivasareddy9243
    @srinivasareddy9243 6 ปีที่แล้ว +15

    ఇలాంటి పాత పాటలు వింటుంటే మనసు ఏవో మధురానుభూతిని పొందుతూ గత స్మృతులు జ్ఞప్తికి వచ్చిఆనంద భాస్పాలువస్తాయి.ఆరోజులు మళ్లీ రావు.

  • @mannemvimal8157
    @mannemvimal8157 6 ปีที่แล้ว +538

    ఇంత అద్భుతమైన మనసును మైమరపించే పాటలు ఇక రావు రాలెవు ఇలాంటి మదురమైన పాటలు అందించినవారికీ పాదాబి వందనాలు

  • @bhakiyalakshmibhakiyalaksh3191
    @bhakiyalakshmibhakiyalaksh3191 5 หลายเดือนก่อน +1

    Hormonius and sweet song! I am hearing this song in tamil for the last 62 years, now I am 66.language is not a problem, tune is same!!!!

  • @nagalakshmidevi2244
    @nagalakshmidevi2244 4 ปีที่แล้ว +596

    🙏నేను సావిత్రమ్మ అభిమానిని . సావిత్రమ్మ అభిమానులు ఒక లైకు వేసుకోండి 😊🙏

  • @KishorKumar-qx4ts
    @KishorKumar-qx4ts 4 ปีที่แล้ว +9

    ఇటువంటి పాటలు...అటువంటి ప్రకృతి... భగవంతుడా...నీకు 🙏🙏🙏

  • @Siva_1994
    @Siva_1994 3 ปีที่แล้ว +82

    అన్నగారి నటన అద్భుతం అపూర్వం, పాటలు పాడిన మహానుభావులందరికి అందరికీ నా పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvsoundsdjundavalli635
    @kvsoundsdjundavalli635 5 ปีที่แล้ว +637

    నిజ జీవితంలో కూడా భార్య భర్త లు ఇలా ఉంటే చాలా బాగుంటది ilove ntr

  • @Srinivaskokku
    @Srinivaskokku 6 ปีที่แล้ว +683

    పుట్టింటి అరణాలు... ఘనమైన కట్నాలు.. అత్తవారింటి నిండా వేచినా... అవి అభిమానమంత విలువ చేసునా... బంగారమెత్తు పదాలివి...

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว +2

    పల్లెటూరి వాతావరనాణికి చక్కనైన పాట అద్భుతమైన సంగతులు, విలువలతో కూడిన గ్రామ పల్లె మెచ్చిన పాట 🙏🙏

  • @chamananumula884
    @chamananumula884 5 ปีที่แล้ว +148

    ఎన్నిసార్లు విన్న వినాలి అనిపించే సాంగ్...మధర గీతం❤️❤️

  • @bhukyaanjaneyulu7684
    @bhukyaanjaneyulu7684 6 ปีที่แล้ว +299

    తెలుగు పాటలోని తియ్యదనం, అమ్మ మాటలోని కమ్మదనం, రెండు ఒక్కటే .

  • @rvrao5402
    @rvrao5402 7 หลายเดือนก่อน +2

    There will be no another NTR on this planet.No one can beat him in natural acting particularly in old movies.Nice song

  • @pranyindian9275
    @pranyindian9275 6 ปีที่แล้ว +158

    నిజమైన యాక్టర్లు అంటే వీళ్ళే

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 ปีที่แล้ว +149

    ఈ పాటను నిండు పున్నమి రోజు రాత్రి మేడమీదపండుకొనివింటేఆఆనందంచెపలేనిదిఆపాటలేవేరు💐🌺🙏

  • @kmaheshwari9116
    @kmaheshwari9116 4 ปีที่แล้ว +10

    ఈప్పటి పాటలు 1 లేదా 2 సార్లు వింటే చాలు కానీ ఒకప్పటి పాటలు ఎప్పుడు విన్న చాలా ప్రశాంతంగా ఉంటుంది 🤗♥️👌👏👏

  • @mahimaheswari748
    @mahimaheswari748 3 ปีที่แล้ว +4

    ఇంత మంచి పాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంది మళ్లీ మళ్లీ వినలనిపించే పాటలు వింటుంటే మనసుకు ఆనందంగా ఉంది సావిత్రి గారి నటన అద్భుతం అపూర్వం 🙏 ఇలాంటి నటీనటులు మన తెలుగు గడ్డ పై జన్మించిన మన అదృష్టం

  • @anjiboya4940
    @anjiboya4940 4 ปีที่แล้ว +15

    కానీ రామరావుగరు నీ ఇష్టపడ్డారు కధ పాటలు వింటే ఎంతో జ్ఞానం వస్తుంది

  • @lasyaponnam1896
    @lasyaponnam1896 2 ปีที่แล้ว +2

    Thelugu theraku NTR Garu Savitri garu rendu kallu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 4 ปีที่แล้ว +111

    మధురమైన గానం.😍😍😍
    పాతరోజులు బాగున్నాయి.❤❤❤

  • @siripasupuleti6544
    @siripasupuleti6544 2 ปีที่แล้ว +11

    ఎంత మధుర అనుభూతి వస్తుందో ఇలాంటి పాటలు వింటే😍

  • @Tarasworld89
    @Tarasworld89 2 ปีที่แล้ว +2

    Ilaanti patalu vintey mana palle thalli....mana kanna thalli odilo nidrusthunattu untundi......❤️

  • @subrahmanyamsagi5520
    @subrahmanyamsagi5520 2 ปีที่แล้ว +3

    ఈ నాటి కృత్రిమ జీవితం గడుపు తున్న నాకూ ప్రాణం లేచి వచ్చింది. ఆ కాలానికి వెళ్లి పోవలెనని ఉంది.

  • @shivalokati5848
    @shivalokati5848 5 ปีที่แล้ว +410

    ఆ రోజుల్లో పుట్టుంటే ఎంత బాగుండేది.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +4

      Yes...Thanks for your comment !!!

    • @vemularaju2944
      @vemularaju2944 5 ปีที่แล้ว +5

      Medicine and money lefu

    • @ajet619
      @ajet619 4 ปีที่แล้ว +10

      @@vemularaju2944 happiness was there which is more precious than anything else...

    • @bairojunaveen6282
      @bairojunaveen6282 4 ปีที่แล้ว +2

      EXACTLY...

    • @ganarajusai5717
      @ganarajusai5717 4 ปีที่แล้ว +1

      Nijangha

  • @sakhamuriharibabu209
    @sakhamuriharibabu209 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు చూసిన యింకా ఇంకా చూడాలి, వినాలి అనిపించే నాజర్ బృందం బుర్ర కథ!
    మరీ ముఖ్యంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామయ్య విరోచిత వీర పోరాటం గురించి!

  • @ajaychikkaajay6930
    @ajaychikkaajay6930 5 ปีที่แล้ว +312

    డిస్లైక్ కొట్టిన ముండ కోరులు కూడా ఉన్నారా దేవుడా......
    వీళ్లు ఎక్కడో తుప్పలో పుట్టి ఉంటారు.....
    మన తెలుగు సంప్రదాయము ఉట్టి పడే పాటలు ......

    • @gopierraballi5485
      @gopierraballi5485 4 ปีที่แล้ว +8

      Your right...

    • @hemanthkumar3796
      @hemanthkumar3796 4 ปีที่แล้ว +6

      Bhale chepparu. asalu dislike anduku kottaru vallake teliyali

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +13

      Ajaychikka Ajay నిజమైన మాట చెప్పావైయ్యా ఇంత మంచిపాటకు డిస్లైక్ కొట్టిన యదవలు భూమికే భారం పుట్టామే వేష్టు

    • @hemanthkumar3796
      @hemanthkumar3796 4 ปีที่แล้ว +1

      Hi

    • @shivadronadula2075
      @shivadronadula2075 4 ปีที่แล้ว +1

      @@gopierraballi5485 s

  • @patnamgurumohan932
    @patnamgurumohan932 4 หลายเดือนก่อน +7

    దయచేసి, ఎంత కష్టం వచ్చినా సరే, ఈ ఓల్డ్ వీడియోస్ ని డిలీట్ చెయ్యొద్దు(మన దేవుడు ఎన్టీఆర్). మన భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు ఈ ఓల్డ్ సాంగ్స్ లో ఉన్నాయ్. భావి తరాల వాళ్లకు ఈ వీడియోస్ మన పెద్దలు టెక్నాలజీ లేకుండా మరియు సంస్కృతి చెడిపోకుండా ఎలా బ్రతికారూ అని చెప్పటానికి ఉదాహరణ. Please, no matter how hard it goes, Never Ever delete these old videos of our God NTR. Our South and Indian culture, tradition is available in these old songs as referance. These videos are an example to the future generations of how our elders survived without technology and without spoiling the culture.

  • @sjjhony1436
    @sjjhony1436 2 ปีที่แล้ว +2

    Appatlo kkalushyam lekundaa ,ekkuva dabbulu Karcher lekundaa prasanthangaa chithraalu theesevaallu kadaa friends 😘😘😘🤩🤩😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @kumarn5824
    @kumarn5824 4 ปีที่แล้ว +77

    ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా

  • @anjineyareddykalavala6036
    @anjineyareddykalavala6036 5 ปีที่แล้ว +190

    ఇలాంటి ఆణిముత్యాలు మనకు పాడి వినిపించి నందుకు నిజంగా పాదాభివందనం చేయాలి.

    • @gopijaji4181
      @gopijaji4181 4 ปีที่แล้ว +1

      No

    • @enjamurinaresh4696
      @enjamurinaresh4696 3 ปีที่แล้ว +1

      Yes

    • @yashgamerfreefire3977
      @yashgamerfreefire3977 2 ปีที่แล้ว

      @@gopijaji4181 w

    • @azamsyed7618
      @azamsyed7618 2 ปีที่แล้ว

      పాట పాడడం ఒక కల దానికి పాదాభివందనము చేయడం తప్పు దేవునికి తప్ప ఎవ్వరికీ పాదాభివందనము చేయకూడదు

  • @gattunarender3711
    @gattunarender3711 ปีที่แล้ว +2

    ఈ కాలంలో ఇలాంటి పాటలు వింటున్న మీ అందరికీ కూడా ధన్యవాదములు

  • @ravindraravi4783
    @ravindraravi4783 4 ปีที่แล้ว +129

    ముద్దబంతి పూలుబెట్టి మొగలిరేకులు జడను చుట్టి.జడను చుట్టి
    హంసల నాడిచి వాచే చిట్టేమా, చిట్టేమా
    మా ఇంట్కేమి టెచవమ్మ చెప్పమ్మ, చెప్పమ్మ…
    ముద్దబంటి పూలుబెట్టి మొగలిరేకులు జాడను చుట్టి
    హంసల నాడిచి వాచే చిట్టేమా
    మా ఇంట్కేమి టెచవమ్మ చెప్పమ్మ…
    అదామంటి మనసు ఉండి, అండమయ వయాసు ఉండి, వయసు ఉండి
    ఇంటాకన్న అండేండి కిట్టయ్య, కిట్టయ్య
    ఈ పేదవాళ్ళు తెచ్చేదెంది చెప్పాయ్యా, చెప్పయ్యా.......
    అదామంటి మనసు ఉండి, అండమయ వాయుసు ఉండి
    ఇంటాకన్న అండేండి కిట్టయ్య
    ఈ పేదవాళ్ళు తెచ్చేదెంది చెప్పాయ్యా
    పుట్టింటి అరనలు, ఘనమైన కట్నలు, ఓ
    పుట్టింటి అరనలు, ఘనమైన కట్లాలు
    అత్త వరింతి నిందా వెసినా
    అవీ, (అభిమన్ ఆంత విలువజేసున) * 2
    ముద్దబంటి పూలుబెట్టి మొగలిరేకులు జాడను చుట్టి
    హంసల నాడిచి వాచే చిట్టేమా
    మా ఇంట్కేమి టెచవమ్మ చెప్పమ్మ…
    (అభిమానం అభరణం మరియాడే భూషణం) * 2
    గుణము మంచిదైతే చాలయ్య
    మన గోప్పటనము చెప్పుకోను విలయ్య
    గోప్పటనము చెప్పుకోను విలయ్య…
    అదామంటి మనసు ఉండి, అండమయ వాయుసు ఉండి
    ఇంటాకన్న అండేండి కిట్టయ్య
    ఈ పేదవాళ్ళు తెచ్చేదెంది చెప్పాయ్యా
    (కాలు చెయీ లోపం అని, కొక్కరాయి రూపమ్ అని) * 2
    వడినులు నాను గెలిచెతురా
    (పిల్లను డెచ్చి పెల్లిజేతురా) * 2
    (యెవరేమి అన్నానేమి యేగటాలి చెయనేమి) * 2
    నవ్విన నాపాచెను పాండడ
    (నలుగురు మేచు రోజు ఉందడ) * 2
    అదామంటి మనసు ఉండి, అండమయ వాయుసు ఉండి
    ఇంటాకన్న అండేండి కిట్టయ్య
    ఈ పేదవాళ్ళు తెచ్చేదెంది చెప్పాయ్యా
    ముద్దబంటి పూలుబెట్టి మొగలిరేకులు జాడను చుట్టి
    హంసల నాడిచి వాచే చిట్టేమా
    మా ఇంటీకేమి తేచవమ్మ చెప్పమ్మ.  ♥ 

  • @kvenkateswararao1847
    @kvenkateswararao1847 6 ปีที่แล้ว +126

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు చూచిన లేదా ఎంపీ3 పాటల రూపం లో విన్నా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది
    101

  • @shaikimam7867
    @shaikimam7867 ปีที่แล้ว +3

    Ntr గారు Song 👌👌సాహిత్యం 👌👌👌.... Old is Gold

  • @sunilkumar.m6985
    @sunilkumar.m6985 4 ปีที่แล้ว +108

    బంగారం కంటే విలువైంది బాష అటువంటి బాష నేటి సినిమాలో కనిపించడం లేదు

  • @gattusudhir2180
    @gattusudhir2180 4 ปีที่แล้ว +47

    1.2 Crore views i.e. one percent of India's population has viewed this video song. 👌👌

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 5 หลายเดือนก่อน +3

    పదహరణాల తెలుగు వారు పాడుకున్న వన్నె తెచ్చిన పాట