ఏలో ఏలో ఏలో || Christmas Song || Choreography || LGF Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 1

  • @MariemarkMandadi
    @MariemarkMandadi ชั่วโมงที่ผ่านมา

    ఏలో ఏలో ఏలో అంటూ - వచ్చారండి గొల్లలు
    సంతోషాలే పొంగేనండి - హైలెస్సా
    దారే చూపే దేవుడొచ్చే - ఉల్లాసంగా ఊరు ఆడే
    సంగీతాలే పాడాలండి - హైలెస్సా
    అంధకారాన్ని తొలగించే మహనీయుడు
    పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
    నిన్నే కోరి - నిన్నే చేరి
    ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో||
    లోకాలనేలేటి రారాజురా - ఉదయించే సూరీడై వచ్చాడురా
    ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒక తార మురిసిందిగా ||2||
    దూతాళి పాడి - కొలిచారు చూడు - ఘనమైన ఒక వేడుక
    ఆ గొల్లలేగా - దరువేసే చూడు - మెస్సయ్య పుట్టాడని
    మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో||
    వెన్నెల్లో పూసింది ఓ సందడి - పలికింది ఊరంతా ఈ సంగతి
    ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా ||2||
    మనసున్నవాడు - దయ చూపువాడు - అలనాటి అనుబంధమే
    కనులారా చూడు - మనసారా వేడు - దిగి వచ్చె మనకోసమే
    ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో||
    ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
    వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా ||2||
    సలి గాలి రాత్రి - పిలిసింది సూడు - మనలోన ఒక పండగ
    భయమేల నీకు - దిగులేల నీకు - యేసయ్య మనకుండగా
    మన యేసయ్య మనకుండగా ||ఏలో||