Deevinchave Samruddiga || Sami Symphony Paul ||
ฝัง
- เผยแพร่เมื่อ 18 พ.ย. 2024
- దీవించావే సమృద్ధిగా - నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా - నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో - అగ్ని స్తంభమై నను నడుపుమయా ॥ దీవించావే ||
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే -
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిలా సాగమని ॥ దీవించావే ॥
2. కొరతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా - సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా - కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో - నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో - నా పక్షముగా నిలిచావే ॥ దీవించావే ॥