శివ పార్వతుల కళ్యాణం పాట// శివరాత్రి స్పెషల్ సాంగ్
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
- #Siv పార్వతులకళ్యాణం పాట// #శివరాత్రిస్పెషల్సాంగ్ #కళ్యాణంపాట #శివరాత్రిspecial lsong #శివరాత్రి #
యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆదియోగి శివుడు ఇంకా పార్వతి దేవీల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక యువ రాణి కనుక, ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులూ, రాణులూ, దేవుళ్ళూ, దేవతలూ, ఒకరిని మించి ఒకరు గొప్పగా, అందంగా ముస్తాబై వచ్చారు. .
అప్పుడు పెళ్ళికొడుకు శివుడు, జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకుని, రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా, ఎదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్ధం కానీ ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటు ఏవో శబ్దాలు చేస్తున్నారు.
మీనాదేవి, పార్వతి తల్లి, పెళ్ళికొడుకుని చూసి, కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరకి వెళ్ళి,"మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరెలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరు. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి" అని వేడుకుంది.
ఆయన సరే అని, ఒక అందమైన రూపాన్ని ధరించి, చక్కగా అలంకరించుకుని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని "సుందరమూర్తి" అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. అయన తొమ్మిది అడుగుల ఎత్తున్నాడు. ఆయన నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు.. అయన దక్షిణ భారత దేశానికి వచ్చినప్పుడు, అక్కడ సాధారణంగా నాలుగున్నర నుంచి ఐదడుగుల ఎత్తు ఉండే స్త్రీలకి, రెండింతలు ఎత్తు ఉండేవారని అంటారు. ఆయన దాదాపూ తొమ్మిది అడుగుల ఎత్తు ఉండేవారు, అతి సుందరంగా ఉండేవారు, అందరూ ఆయన్ని చూసి ముగ్దులయ్యే వారు.
శివుడు - పార్వతి: ఒక తపస్వి ఒక రాజకుమారిని పెళ్లాడిన తరుణం
శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో, ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురుల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశం, ఎక్కడి వారు, ఎలాంటి రక్తం నుండి వచ్చారు, అంటూ వాళ్ళ వంశ వృక్షాన్ని గురించి చెప్తారు
పెళ్లి కూతురి విషయానికి వస్తే , ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలన్నిటికీ రాజు.. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. “మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతేమిటి?” అని అడిగారు. శివుడు మౌనంగా అలా కూర్చుని ఉండిపోయాడు . ఆయన ఏమీ చెప్పలేదు. పోనీ అతని పరివారం లో వారి భాషను అర్ధం చేసుకోగాలిగినవారు కూడా ఎవరూ లేరు. వారివో అర్ధం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురి తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది: పుట్టుపూర్వోత్తరాలు లేని వ్యక్తి, నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? అయన ఎక్కడివాడో ఎవరికీ తెలీదు. అయన తల్లిదండ్రులెవరో తెలీదు. ఏ వంశమో తెలీదు. ఈ వ్యక్తికీ నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చెయ్యను ? అంటూ కోపంతో లేచాడు
పెళ్ళికి అతిథిగా వచ్చిన నారదముని, తన ఏకతారా పట్టుకుని ముందుకు వచ్చాడు. ఏకతారా అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. అయన తన ఎక్తార తో " టంగ్, టంగ్, టంగ్ " అని శబ్దం చేసాడు.
రాజుకు మరింత కోపం వచ్చింది “ఇప్పుడు ఎక్తార ఎందుకు వాయిస్తున్నారు? "
నారదుడు అన్నాడు " ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రీ లేడు"
" అయితే మరి అతనికి మూలమేది?? "
“" టంగ్... ఆయన మూలం నాదం.. ప్రకంపన. నాదం నించే ఆయన ఆవిర్భవించాడు ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాతముత్తాతలు, వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభువు - స్వయంగా సృష్టించుకున్న వాడు, పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన.
రాజు మండి పడుతూ ఉన్నాడు, అయినా వివాహం జరిగింది.
శివ పార్వతుల వివాహం: ఈ కథ దేనికి ప్రతీక?
ఈ కథ - మనం ఆదియోగి అన్నప్పుడు, ఆయన ఒక సున్నితమైన, నాగరిక వ్యక్తి కాదని, ఆయన జీవత్వంతో ఎల్లప్పుడూ సంపూర్ణంగా మమేకమైన స్థితిలో ఉండే ఒక మూల రూపం అనీ గుర్తు చేస్తుంది. అయన స్వచ్ఛమైన చైతన్యం, ఎటువంటి కపటమూ లేని, నిత్య నూతనమైన, ఎప్పుడూ స్ఫూర్తితో ఉండే, ఎప్పటికీ వినూత్నమైన, తెంపు లేని క్రియాత్మకత గల వాడు ... ఆయనే జీవం.
ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రాధమికంగా కావలసినది ఇదే. మీరిక్కడ - కేవలం మీ ఆలోచనలు, నమ్మకాలూ, ఇంకా అభిప్రాయాల మూటలాగా కూర్చుని ఉంటె, అంటే, బైటనించి పోగుచేసుకున్న ఒక మెమరీ స్టిక్కుతో ఉంటె, మీరు మానసిక ప్రక్రియలకు బానిసలై పోతారంతే. కానీ, అదే మీరిక్కడ ఒక జీవంగా కూర్చుని ఉంటె, మీరు ఈ జగత్ప్రక్రియతో ఐక్యమౌతారు. మీరు సిద్ధంగా ఉంటే, మీరు ఈ విశ్వమంతటినీ దర్శించగలుగుతారు.
జీవితం అన్నిటినీ మీకు అందుబాటులోనే ఉంచింది. ఈ ఉనికి ఎవరికీ కూడా దేన్నీ నిరాకరించలేదు. "తలుపు తట్టండి. ద్వారం తెరుచుకుంటుంది " అనే చెప్పడం జరిగింది. అసలు మీరు తట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే, నిజానికీ తలుపనేదే లేదు. జ్ఞాపకాల, పునురావ్రుత్త జీవితాన్ని పక్కన పెట్టటం ఎలాగో మీకు తెలిస్తే, మీరు నేరుగా వెళ్ళవచ్చు. జ్ఞానోదాయానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది.
భోగీ పళ్ళ మంగళ హరతి పాట 👇👇👇
• భోగి పళ్ళ మంగళ హరతి పా...
నలుగు పెట్టే తప్పుడు పాడే పాట 👇👇👇
• Nalugu patalu//పెళ్ళిక...
పసుపు దంచేటప్పుడు పాడే పాట 👇👇👇
• Pasupu Danche pata//pa...
కార్తీకమాసంలో లో పాడే శ్రీ కేదారేశ్వర స్వామి పాట 👇👇👇
• Sri Kedareswara Swami ...
సంక్రాంతి భోగి విశిష్టత తెలిపే పాట👇👇👇
• 🔥భోగి - సంక్రాంతి విశి...