Kavali Famous Ghee Karam Dosa | NO.1 Famous Dosa In Kavali |Chandra Tiffins | Kavali | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ఉద్యాన పంటలతోపాటు ఆహార పంటలను విరివిగా పండిస్తారు కావలి ప్రాంత రైతులు.ముఖ్యంగా వరిని విస్తృతంగా సాగు చేస్తూ దేశ ప్రజలకు పట్టెడు అన్నం తమ వంతుగా అందిస్తూ వ్యవసాయ రంగాన కనకపట్నం కీర్తిని ఇనుమడింపజేస్తోంది ఇక్కడ రైతాంగం.అలానే వస్త్ర మరియు విద్యా రంగాలలో కావలికీ విశిష్ట గుర్తింపు కలదు.
    అట్టి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అల్పాహార శాల గూర్చి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం.. నమస్కారం..నా పేరు లోక్ నాధ్.
    నేను ఈవేళ మీకు పరిచయం చేయబోతున్నాను
    ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మెచ్చిన, కావలి వాసులకు సుపరిచితమైన చంద్రా గారి అల్పాహార శాలను ప్రత్యేకంగా ఇక్కడ లభించు నెయ్యి కారం దోశను.
    గత 25 ఏళ్ళు గా శుచి రుచితో ఇంటి తరహా అల్పాహారాలను అందిస్తూ కావలి లో ప్రసిద్ధులైనారు చంద్రా గారు.
    వారి వద్ద లభించు నెయ్యి కారం దోశ భలే రుచికరంగా ఉంటుంది. ఓసారి తింటే ఈ శాలను.కావలి పట్టణాన్ని మరువరు.అంతలా ప్రభావితం చేస్తుంది అల్పాహారంలో నిండి ఉన్న ఆస్వాధన పూరిత కమ్మని రుచి.
    తమకే తెలిసిన విధానంలో తయారు చేసుకున్న కార పచ్చడి, గ్రామంలో పాడి రైతులు వద్ద సేకరించి వినియోగించు స్వచ్ఛమైన నెయ్యి,ఉపాహారం కాల్చు విధానం దోశ రుచి ఉన్నతికి ప్రాముఖ్యంగా చెప్పవచ్చు.
    పెనం మీద మధ్యస్థానికి కాస్త హెచ్చుగా కాలిన దోశ అంతటా కారం సింగారించి మరికాస్త కాల్చి.తర్వాత నెయ్యి ఓలకబోసి ఒద్దిక పరిచి రెండు రకాల పచ్చడులతో అందిస్తారు.ఆ దోశ రాజిల్లుతూ నేతి సువాసనతో తినకమునుపే సద్భావం తెలుపుతుంది.ఆయా పచ్చడులు దోశకు అద్ది అలా నోటికి అందిస్తే నాలుకపై అద్భుత రుచి అవహిల్లుతుంది.
    ఇచ్చట లభించు అట్లు సైతం చాలా బావుంటాయి. బొజ్జనిండినా మరో అట్టు కోరు విధంగా ఉంటుంది రుచి నేపథ్యం.
    చంద్ర గారి దోసెలు అంటే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి ఇష్టం.వారికి సెట్టెమ్మ దోశలుగా సుపరిచితం.వెంకటాచలం వచ్చినప్పుడు తినాలనుకుంటే తెప్పించుకుంటారు.ఈ నేపథ్యంలో ఓసారి చంద్ర గారిని వారి కుటుంబ సభ్యులను తమ ఇంటికి ఆహ్వానించి అభినందించారు వెంకయ్య నాయుడు గారు.
    చిరునామా:-Chandra Tiffins
    maps.app.goo.g...

ความคิดเห็น • 111