పితృ దేవతలని ప్రసన్నం చేసుకునే 5 మార్గాలు | 5 rituals to satisfy Pitru Devatas| NanduriSrinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ส.ค. 2019
  • This video explain the science of PitruDevatas and how to please them
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteren. You can know more about him here:
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    ప్రశ్నలు...సమాధానాలు
    1) నేము మా తల్లి తండ్రులకి ఒకే ఆడపిల్లని. అన్నదమ్ములు లేరు, ఇప్పుడు శ్రార్ధ క్రియలు ఎలా చేయాలి?
    జ) అల్లుడు చేసినా పర్లేదు...లేదంటే ఎవరైనా బ్రాహ్మణుణ్ణి పిలిపించి వాళ్ల చేత చేయించి వాళ్లకి భోజనం పెట్టండి... (బ్రాహ్మణులు మీ ఇంట్లో భోజనం చేయనంటే స్వయం పాకానికి కావల్సిన వస్తువులు కానీ ధనం కానీ ఇవ్వండి)
    అదీ కుదరదంటే, దగ్గర్లో ఉన్న రాఘవేంద్రస్వామి మఠం లో చేస్తారు
    2) మా తల్లితండ్రులకి సాంప్రదాయం అంటే గౌరవం లేదు...వాళ్ళు మా తాతలకు శ్రార్ధ ప్రక్రియ చేయరు. నేను చేయచ్చా?
    జ) ఈ ప్రశ్న విని బాధా సంతోషమూ రెండూ కలిగాయి...మనకి మార్గం చూపాల్సిన తల్లి తండ్రులే సాంప్రదాయాన్ని పాటించకపోవడం బాధాకరమైతే, మీకైనా పాటించాలి అనిపించడం సంతోషం. మీ తల్లి తండ్రులు ఉన్నన్ని రోజులూ అది చేసే అర్హత మీ నాన్నగారిదే...ఆయన చేయకపోతే, మీరు దగ్గరలోని మఠానికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి చేయమనండి. మీ నాన్నగారి తదనంతరం అది చేసే హక్కు మీకు వస్తుంది, అప్పుడు శ్రధ్ధగా చేయండి, అంతేకానీ మీ నాన్నగారితో వాదించద్దు. తప్పు చేసినా సరే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రికి ఇచ్చి తీరాలి.
    3) మేము ఇద్దరం కొడుకులం. మా అన్నయ్యకి ఇవేమీ నమ్మకం లేదు, నేను చేయవచ్చా?
    జ) మీ అన్న చేస్తూ ఉంటే, వెళ్ళి పెద్ద అన్నయ్యతో పాటు చేయండి, ఆయన చేయకపోతే మీరు తప్పకుండా చేయండి...మీ కుటుంబం కాపాడబడుతుంది.
    4) మీరు వీడియోలో దోసిళ్లతో తర్పణం ఇస్తున్నట్టు చూపించారు...అలా ఇవ్వాలా , లేక బ్రొటన వేలి మీదుగా ఇవ్వాలా?
    జ) తిల తర్పణం అయితే బ్రొటన వేలి మీదుగా ఇవ్వాలి. అర్ఘ్యం అయితే దోసిళ్లతో ఈయండి.
    5) నేను మా అమ్మకీ నాన్నగారికీ చేస్తే చాలా, తాతలకీ ముత్తాతలకీ కూడా చేయాలా?
    జ) మీ తల్లితండ్రులకి చేసే దానిలోనే, మీ తాతగారి పేరూ, ముత్తాతగారి పేరూ కూడా వచ్ఛేస్తాయి...అందువల్ల తల్లి తండ్రులకి చేస్తే చాలు...
    6) పిల్లలు లేని వారి మాట ఏమిటి?
    జ) మీరు ఎవరిననినా దత్తత తీసుకుంటే వాళ్లు చేయవచ్చు...పిత్రు దేవతలకి సంబంధించిన సాంప్రదాయాన్ని చక్కగా పాటించే ఏ వంశమూ, ఎప్పుడూ నిర్వంశం అవ్వదు.
    7) మా సాంప్రదాయంలో, శ్రార్ధ ప్రక్రియలో మాంసాహారం పెడతారు, లేకపోతే ఊరి చివరకి తీసుకెళ్ళి చిన్న పూజ చేసి సాంబ్రాణి ధూపం వేస్తారు, అలా చేయవచ్చా?
    జ) మీ సాంప్రదాయం ఎలా ఉంటే అలాగే చేయండి. చేయడం ముఖ్యం.
    8) మరి విదేశస్థులు ఇలా చేయరుగా?
    జ) వాళ్ళ పధ్ధతి వాళ్లకి ఉంది. Halloween day, All Saints' day, All Soul's day లాంటివి ఇటువంటివే. మన దురదృష్టం ఏమిటంటే, తండ్రికి శ్రార్ధం పెట్టడం మానేసి "Halloween day చేస్తాము. ఎందుకు చేస్తామో మనకే తెలియదు
    9) తండ్రికీ తాతకే ఎందుకు చేయాలి, అమ్మకీ అమ్మమ్మకీ ఎందుకు చేయరు?
    జ) మీ అమ్మగారికి కూడా చేయాలి...ఆవిడకి చేసేటప్పుడు మీ నాయనమ్మ గారి, ఆవిడ అత్తగారి పేర్లు కూడా వస్తాయి. మీ అమ్మమ్మ గారిది వేరే వంశం. ఆవిడకి మీ మేనమామ చేస్తారు.
    10) నేను వేరే దేశంలో ఉంటాను...నాకు ఇదంతా చేతకాదు. ఇక్కడ చేయించేవాళ్లు ఎవ్వరూ దొరకరు. ఇక ఎలాగ చేయడం? ఆ ప్రక్రియని వీడియో చేసి పెట్టగలరా?
    జ) నాకు కుదిరినప్పుడు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను...ఈ లోపు, మీ నాన్నగారి తిధి రోజు ఎవరైనా అన్నం లేని వాళ్లని పిలిచి అన్నం పెట్టి మీ పితృ దేవతలని స్మరించుకోండి...ఎవ్వరూ దొరకకపోతే మీ దగ్గరలో దేవాలయంలోనో, అనాధాశ్రమంలోనో ప్రసాదం పంచి, వాళ్లని స్మరించండి.
    11) మీరు శ్రార్ధ ప్రక్రియ వీడియో చేసి పెడితే అది పురోహితులకి ద్రోహం చేసినట్టు కాదా?
    జ) పురోహితులు అందుబాటులో లేని చోట ఉపయోగపడాలి అనే తప్ప, అది ఎవ్వరికి ద్రోహం చేసినట్టు కాదు . మీకు లెఖ్ఖలు తెలిస్తే అవి వీడియో చేసి TH-cam లో పెడితే, విద్యార్ధులకి సహాయం అవుతుంది కానీ, మీరు Tution teachers కి ద్రోహం చేసినట్టు అవుతుందా? ఇదీ అంతే!
    12) చనిపోయిన తిథి అస్సలు తెలియకపోతే అప్పుడు ఏమి చేయాలి?
    జ) భాద్రపదమాసంలో వచ్చే మహాలయ అమావాస్య రోజు చేయండి
    ---------------------------------------------------------------------------------------------------------------------------------
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #garudapurana #garudapuranam #pitrupaksh #mahalayaamavasya
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel
    This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” is not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk.

ความคิดเห็น • 3.2K

  • @pvijay1747
    @pvijay1747 2 ปีที่แล้ว +184

    నా రిటైర్మెంట్ తర్వాత మీ వీడియోస్ లో చిన్న చిన్న ధార్మిక విషయాలు నేను ఆచరించటానికి చాలా ఉపయోగ పడుతున్నాయి.. ఆధ్యాత్మిక అమృతవాహిని తో మీరు ఇంకా ఎన్నో విషయాలు సమాజానికి మేలు చేసే విధంగా ఆ అమ్మ అనుగ్రహము కలగ చేయమని ప్రార్ధిస్తూ
    మీ అనుయాయి
    విజయ్..,,

  • @tharakaram3350
    @tharakaram3350 4 ปีที่แล้ว +529

    మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం మా అదృష్టం గురువు గారు.

    • @saidmangalamm.saianalam3733
      @saidmangalamm.saianalam3733 4 ปีที่แล้ว +1

      Sir your Chanel is very nice. Nenu metho matladale chalavaraku devudi gurinche naku email pettadam sariga Radu thappulu ekkuvaga vasthayi please sir

    • @durgasavitri4589
      @durgasavitri4589 3 ปีที่แล้ว

      Pitru tarpanalu chala chakkaga chepparu thank you guruvugaru .prati samvatsaram 3sarlu chestamu thank you very much .

    • @ramadevigopishetty1064
      @ramadevigopishetty1064 3 ปีที่แล้ว

      @@saidmangalamm.saianalam3733 ..1

    • @namlekiran1945
      @namlekiran1945 3 ปีที่แล้ว

      Correct

    • @prathusham8834
      @prathusham8834 2 ปีที่แล้ว

      @@saidmangalamm.saianalam3733 ĺ⁰

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 3 ปีที่แล้ว +229

    ఈ వీడియో ని స్కూళ్లల్లో పాఠ్యాంశంగా పెట్టాలి.

  • @savitriy2682
    @savitriy2682 2 ปีที่แล้ว +73

    మీలాంటి మహాను భావులు ఉండ బట్టి ఇంకా సంప్రదాయలు, సంస్కారం, సభ్యత, గౌరవం మిగిలి ఉన్నాయి. మీలాంటి మహాత్ములు అందరికి శతకోటి 🙏🙏🙏

  • @saravanank3390
    @saravanank3390 ปีที่แล้ว +25

    హిందువుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు శతకోటి వందనాలు

  • @indiraummineni2870
    @indiraummineni2870 4 ปีที่แล้ว +1483

    మహానుభావా ఏ తల్లి కన్నబిడ్డవో , మీ పాదాలకు వందనాలు

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 ปีที่แล้ว +59

      నండూరి శ్రీనివాస్ గారి అమ్మ నాన్న కు, చివటం అమ్మ దర్శనం చేసుకుని, చివటం అమ్మ ఉచిస్ట ప్రసాదం తీసుకున్న తరువాత కలిగిన సంతానం. చివటం అమ్మపై వీడియో లో నండూరి శ్రీనివాస్ చెప్పారు.

    • @kameswararao6872
      @kameswararao6872 4 ปีที่แล้ว +50

      మీ కామెంట్ కు నా హృదయం..ఉప్పొంగుతోంది..ఎంతటి గౌరవ సూచికము..
      మీ హృదయం ఉన్నతమైనది...జై శ్రీ రాం.

    • @nageswararaoknrao8006
      @nageswararaoknrao8006 4 ปีที่แล้ว +18

      Meelaga cheppevaru lekapovatam Valle many we kastalu..bags chepperu sir..TQ very much..

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 4 ปีที่แล้ว +20

      భగవంతుడు మీకు మేలు చేయుగాక

    • @mentepedababu7040
      @mentepedababu7040 4 ปีที่แล้ว +7

      Eyana talli tandrlu darsinchukone Margam naku kaligindi

  • @umamaheshwari63
    @umamaheshwari63 3 ปีที่แล้ว +279

    గురువు గారు మేం ఎంత అదృష్టవంతులు మీ లాంటి వారు లభించారు మీ పాదాలకు అనంతకోటి నమః స్కారాలు

    • @avbabu13
      @avbabu13 3 ปีที่แล้ว

      🙏🙏🙏👍

    • @siddarthreddy2149
      @siddarthreddy2149 2 ปีที่แล้ว +1

      గురువు గారు మీకు వందనములు

    • @reddyranikanchana996
      @reddyranikanchana996 ปีที่แล้ว

      గురువుగారు మంచి. విషయాలు తెలియచేస్తారు

    • @bajibabunallagorla8693
      @bajibabunallagorla8693 ปีที่แล้ว

      గోవిందా గోవిందా

  • @yerrakrishnamraju7780
    @yerrakrishnamraju7780 ปีที่แล้ว +14

    గురువు గారికి నమస్కారములు,
    నేను పితృదేవతారాధన భక్తిశ్రద్ధలతో పాటించి శ్రాద్ధకర్మలను నిర్వహించి నా జీవితంలో నేను ఎంతో పురోగతి సాధించి,
    ప్రాక్టికల్గా శుభ ఫలితాలను అనుభవిస్తున్నాను

  • @rajurvns330
    @rajurvns330 2 ปีที่แล้ว +10

    సార్ మీ వీడియోస్ చూస్తే అలౌకిక ఆనందం,తన్మయ్యత్వం వస్తుంది.
    హిందూదర్మం కాపాడడానికి మీరు చేస్తున్న కృషికి శిరస్సు వంచి పాదాబి వందనం చేస్తున్నాను 🙏🙏🙏

  • @raoba4109
    @raoba4109 4 ปีที่แล้ว +377

    హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్న మీకు జోహార్లు....ఆ దేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి వుండు గాక....

    • @swibrothers8019
      @swibrothers8019 4 ปีที่แล้ว +5

      ఆయ్య నమస్కారం
      మేము కాపు కులం మా తల్లి గారు , తాత గారు లేరు వారికి నేను ఈ వీడియో లో మీరు చెప్పినట్లు చేయవచ్చా

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 4 ปีที่แล้ว +4

      జోహార్లు కాదు అభినందలు అనగలరు

    • @sasichaitanya
      @sasichaitanya 3 ปีที่แล้ว +1

      @@swibrothers8019 cheyochu bro Anni caste people cheyochu

    • @anilsamleti5865
      @anilsamleti5865 2 ปีที่แล้ว

      @@swibrothers8019 i

    • @ramuyadav3176
      @ramuyadav3176 2 ปีที่แล้ว

      ..., .Guru Gariki paadabi vandanalu

  • @rambonthu4688
    @rambonthu4688 4 ปีที่แล้ว +292

    శ్రీ విష్నురూపాయ నమఃశివాయ
    నమస్కారం గురువుగారు. మీ విలువైన కాలాన్ని మరియు జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @sainath7056
    @sainath7056 ปีที่แล้ว +5

    గురువు గారు, మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, నిజంగా మా అమ్మ నాన్న లకు నా స్వహస్తాలతో చెేసుకుంటే నే నాకు ఆనందం, మీరు చెప్పిన విధంగా తప్పనిసరిగా పాటిస్తాను, శ్రీ మాత్రే నమః

  • @jagadeesh3585
    @jagadeesh3585 4 ปีที่แล้ว +38

    చాలా గొప్పగా చెప్పారు హిందూ ధర్మం మంటకలుస్తున్న రోజులు ఇవి కళ్ళు తెరేపెంచారు

  • @sriramdesu4350
    @sriramdesu4350 3 ปีที่แล้ว +100

    మా బాధ్యతలను గుర్తుచేస్తున్నందుకు మీ ఋణం తీర్చుకోలేనిది గురువుగారు

    • @edarasatyavathi4083
      @edarasatyavathi4083 2 ปีที่แล้ว +1

      Chala chala thanks. Me kutumbaneke chala patha namaskaaraam

  • @srenewaason5352
    @srenewaason5352 ปีที่แล้ว +5

    మీ అంత వివరంగా ఎవరు ఇంతవరకు చెప్పలేదు... విష్ యు గుడ్ లక్.

  • @santoshdubbala2176
    @santoshdubbala2176 2 ปีที่แล้ว +14

    తమరి పాదాలకి శతకోటి ప్రణామములు🙏🙏🙏

  • @SATEESHBABU999
    @SATEESHBABU999 4 ปีที่แล้ว +91

    మీకు మీ కుటుంబానికి నా తండ్రి జగద్గురు శ్రీ దత్తాత్రేయుని ఆశీర్వచనాలు..... జై గురు దత్త

  • @chacosravan
    @chacosravan 3 ปีที่แล้ว +123

    మీ పాదాలకు వందనాలు గురువు గారు 🙏

  • @umaranibukka7263
    @umaranibukka7263 2 ปีที่แล้ว +10

    గురువుగారు మీ పాదాలకు నా నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gatlahanumanthrao8379
    @gatlahanumanthrao8379 9 หลายเดือนก่อน +2

    మీ పాదాలకు నా వందనాలు గురూజీ! ఇది పితృ పక్షాలు మరియు ఆచారాలపై లోతైన వీడియో. నమో నమః!

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 3 ปีที่แล้ว +94

    స్వామి ఏమిచ్చి మీరుణం తీర్చుకోగలం శతకోటి వందనాలు

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 4 ปีที่แล้ว +56

    అయ్యా మీరు అతి గొప్పవారు. మీరు చాలా మంచి విషయాలు చెబుతారు. మీలాంటి వారు ఉండటంవలన మా జన్మధన్యం. స్వామి మీకు సదా దైనకృప కలగాలి.

  • @vudathanirmala263
    @vudathanirmala263 2 ปีที่แล้ว +2

    గురు దేవ శత కోటి నమస్కారాలు.
    మీరు స్వయం పూర్వ ఋషి ప్రతిరూపం.
    ఎన్నో మంచి విషయాలు తెలిసి అఖండమైన కష్టాలు దాట గలుగు తున్నాము.
    విశ్వ శాంతి కోసం ఎన్నో విషయాలు శ్రద్ధగా చేసి అందిస్తున్నారు.
    ప్రజల సంతోషమే మీ ఆనందం గా భావిస్తున్న మీ పాదాలకు నమస్కరిస్తున్నాను.
    🙏🙏🙏

  • @ashagupta7293
    @ashagupta7293 ปีที่แล้ว +6

    గురువుగారికి శతకోటి వందనాలు 🙏
    మా ఇంట్లో మావారు నా మాట వినరు
    ఇవన్నీ చేయరు మా అబ్బాయి నా దగ్గర లేడు నేనే మహాలయ పక్షములో బ్రాహ్మణులకు భోజనం పెడతాను అలా పెట్టవచ్చ తెలియచేయగలరు 🙏

  • @thechndu619
    @thechndu619 4 ปีที่แล้ว +153

    మహానుభావా మీకు పాదాభివందనం మీరు మాకు చాలా ఉపయోగకరమైన విషయాలు నేర్పిస్తున్నారు

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 4 ปีที่แล้ว +5

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ
    స్వామి నాపిల్లలు ఎంతో గొప్పమనసున్న పిల్లలు చాలా భక్తి కలపిల్లలు కానీ...కొంత బుద్ధిమాంద్యం కలదు మీరు చెప్పిన పితృ దేవతలకు తర్పణం గురించి పిల్లలే చూపించారు. చాలా సంతోషం స్వామి
    నాభర్త స్వర్గస్తులయ్యారు ..మహాలయ పక్షం పూజ ఒక్కటి మా ఆచారం ప్రకారం చెపిస్తున్నాను కానీ ఈ విధంగా తెలియదు ఎవరినైనా బ్రాహ్మణులను కనుక్కుని తప్పకుండా చేయించాలని ఉంది నాపిల్లలకు మంచిజీవితం ఉండాలని మమ్మలిని ఆశీర్వదించండి స్వామి

  • @srinivasgudisey8513
    @srinivasgudisey8513 2 ปีที่แล้ว +3

    గురువు గారు మరిచిపోతున్న సాంప్రదాయలు మరియు వాటి విలువలు గురించి చాలా చక్కగా వివరించారు. దత్తాత్రేయ స్వామి మీ రూపంలో వచ్చాడు. ధన్యవాదాలు.

  • @mutnuruupendrasarma515
    @mutnuruupendrasarma515 6 หลายเดือนก่อน +1

    అయ్యా... మీ ప్రవచనం అద్భుతం.. పితృ దేవతలను ప్రసన్నం చేసుకునే విధానం వివరంగా చెప్పేరు. ప్రణామాలు. 🙏🏻🙏🏻

  • @brmkumari3369
    @brmkumari3369 4 ปีที่แล้ว +50

    I am a Christian. But your message 💯👍Excellent sir. God bless you.

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 ปีที่แล้ว +6

    🙏🙏సరైన సమాదానాలు తెలియచేసారు , శ్రీనివాస్ గారు మీకు వందనం🙏🙏
    చాలా బాగా, గట్టిగ చెప్పారు. ఇలా చెప్పగలిగేతేనే కొంత మందికి శరీరంవిడిచిన తల్లితండ్రులను పూజ్యభావనతో కలిగి ఉండాలని, తప్పక పితృ కర్మలు చేయాలని తెలియదు, ఇంట్లోవాళ్ళు చెపితే వినరు.
    మీరు చెప్పే విషయాలు, ధర్మాసుక్షమములు విన్న, ఆచరించిన మన సనాతన ధర్మం పరివాదిళ్ళుతుంది, ముందుతరాలకు చక్కగా అందుతుంది.
    🙏🙏ఓం నమః శివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏
    !!శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే!!

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 ปีที่แล้ว +8

    Namaskaaram to your feet Guruvugaru. Thank you sir for explaining and creating a healthy relationship among family members that will guide us to the best life. Your motivation has been helping us from meaningless to meaningful life. You are bringing the point that some values never change along with time. Namaskaaram Sir.

  • @ankambalaraju6290
    @ankambalaraju6290 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీకు మా శతకోటి వందనాలు మేము ఎంత అదృష్టవంతులం అయితే మీ వీడియో ని మేము చూడగలిగాము మాకు తెలియని ఎన్నో కష్టాలు వస్తాయని మీ ద్వారా తెలుసుకున్నాము ఆ కష్టాలకు పరిష్కారం కూడా మీరు చూపించగలిగారు మీకు మేము ఏమని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయ లో తెలవడం లేదు మీ పాదాలకు శతకోటి వందనాలు మీ శిష్యులము గురువుగారు......

  • @prabhu741181
    @prabhu741181 3 ปีที่แล้ว +105

    శ్రర్ధ కర్మల వీడియో చేస్తాను అన్నారు, ఇంకా మేము వేచి ఉన్నాం ఆ వీడియో కోసం సార్

    • @shivalinga4646
      @shivalinga4646 2 ปีที่แล้ว +3

      నేను కూడా కాలంగా వేచి చూస్తున్నాను

    • @drsatyanarayana7357
      @drsatyanarayana7357 2 ปีที่แล้ว +1

      S

    • @srinu6154
      @srinu6154 2 ปีที่แล้ว

      స్వామి చేయండి

    • @arunagiddaluri8761
      @arunagiddaluri8761 2 ปีที่แล้ว

      Please srardha karma vedio pettandi guruvu garu please

  • @satishmynampati8073
    @satishmynampati8073 4 ปีที่แล้ว +29

    జనంలో చైతన్యాన్ని కలిగించే మీ ప్రవచనాలకి కృతజ్ఞతలు....

  • @SrinivasSrinivas-kd3lt
    @SrinivasSrinivas-kd3lt 2 ปีที่แล้ว +1

    మహానుభావా మీకు పాదాభివందనం ఇంతవరకు ఇంత స్పష్టంగా చెప్పిన ఆడియోని నేను వినలేదు

  • @durgakumari5724
    @durgakumari5724 2 ปีที่แล้ว +1

    నమస్తే గురువుగారు మీరు పితృదేవతలకు చేసే కార్యక్రమాల గురించి చాలా బాగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు తెలిపారు ధన్యవాదములు

  • @spr6064
    @spr6064 4 ปีที่แล้ว +18

    Namaste Guruvu garu, My father passed away on 2005, Aug 16. What a coincidence. You mentioned the same in this video. It’s very surprising. I felt, due to my father’s grace, I am seeing this video now. Very crystal clear explanation.
    Thanks!

  • @badarinathc2122
    @badarinathc2122 4 ปีที่แล้ว +88

    Sir Kudos to you..... మీ లాంటి వారు వున్నారు కాబట్టే , తెలుగు వారము బ్రతికి బట్ట కలుగు తున్నాము. మీకు అభినందనలు మరియు అభివాదములు.

    • @phani5265
      @phani5265 4 ปีที่แล้ว +2

      Sir very very valuable information

    • @rahulsharma2623
      @rahulsharma2623 3 ปีที่แล้ว +2

      Yes you are exactly right

  • @jyothipallem3127
    @jyothipallem3127 2 ปีที่แล้ว +11

    గురువుగారికి 🙏🏻 ఇంటి యజమాని నాస్తికుడు గా ప్రవర్తించి నప్పుడు గృహిణి తర్పణం వదలవచ్చ గురువుగారు తెలుపగలరు 🙏🏻

  • @vaaraahiconsultants9685
    @vaaraahiconsultants9685 ปีที่แล้ว +1

    మీకు పాదాభివoదనాలు గురువు గారు.🙏🙏🙏. మనసుకు బాధ కలిగినప్పుడు మీ వీడియోలు చూస్తే మాకు ధైర్యం కలుగుతుంది. మీ రుణం తీర్చుకోలేనిది.

  • @kmrbonala5452
    @kmrbonala5452 4 ปีที่แล้ว +52

    Excellent Guruvu garu, Till now in my life I never seen such a great explanation with great patience...please continue.... Thanks alot

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 3 ปีที่แล้ว +31

    శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏.........

  • @hamppiskitchenk9410
    @hamppiskitchenk9410 3 หลายเดือนก่อน

    ఎంత బాగా చెప్పారండి ఎంత వివరంగా చెప్పారు తెలియని వాళ్లకు అందరికీ బాగా అర్థమవుతుంది అనేక నమస్కారములు

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పింది 100%కరెక్ట్. 🙏🙏🙏🙏🙏🙏

  • @siva-qv3si
    @siva-qv3si 4 ปีที่แล้ว +3

    మీ వల్లనే చాల విషయాలు తెలుసుకోగలుగుతున్నాము.చాల కృతజ్ఞతలు. అలాగే తిధి, తర్పణం ఎలా చేయాలో వచ్చే వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.

  • @surya-ky2fh
    @surya-ky2fh 4 ปีที่แล้ว +20

    Sir, Your service to the society is much appreciated. You are such a great soul...

  • @kattularavinder5423
    @kattularavinder5423 ปีที่แล้ว

    చాలా అమూల్యమైన విలువైన సమాచారం అందించారండి ధన్యవాదములు🌹🙏🌹

  • @venkayammapureti9563
    @venkayammapureti9563 ปีที่แล้ว +1

    మహానుభావా మీకు శతకోటి వందనాలు స్వామీ ఇంత వివరంగా తెలియజేశారు

  • @raghuramr825
    @raghuramr825 3 ปีที่แล้ว +20

    Sir, I always watch your video presentations. Your wit, wisdom, explanation, presentations everything are simply the best. I have no other words except brilliant, superb, extraordinary. You are doing a great job by awakening the Hindus & teaching them their forgotten culture. I wish you live long, healthy & happy

  • @ramurkrish
    @ramurkrish 4 ปีที่แล้ว +7

    Thanks for detailed information Sir, very useful & valuable facts.

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 2 ปีที่แล้ว +6

    మీ పాదాలకు నమస్కరములు 🙏🙏🙏🙏🙏

  • @user-sp4qu7ew7u
    @user-sp4qu7ew7u 2 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారికి వందనములు మీరు ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా చెబుతున్నారు దాని వలన తెలియని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము ధన్యవాదములు కానీ ఒక విషయము మిమ్మల్ని అడుగుతున్నాము మా తాతగారు, మా నాన్నగారు, మా తమ్ముడు, చిన్న వయసు లోనే కాలం చేసారు అది పుట్టిన పిల్లలకు 13 సం వత్సరములు వస్తుండగా ఇలా జరగరడం ఏదన్నా దోషముల వలన ఏమో అని అందరూ అంటున్నారు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. మూడు తరాలు కూడా ఏ జబ్బులు లేకుండా 40 ఇయర్స్ లోపు హార్ట్ hetach దేని గురించి ఎమన్నా మీకు తెలిస్తే దోషం పోయందుకు పరిష్కారం వివరించగలరు

  • @krysanthakale210
    @krysanthakale210 4 ปีที่แล้ว +6

    Super sir..
    We love you for sharing this worthfull wisdom.

  • @meruvuramanujarao2671
    @meruvuramanujarao2671 4 ปีที่แล้ว +119

    శ్రీ గుర్భ్యోనమః మా నాన్న గారు నా చేత మా అమ్మ గారికి తిధి ప్రకారం తద్దినం పెట్టిస్తూ వచ్చారు. తర్వాత మా నాన్న గారికి తిధి ప్రకారం తద్దినం పెడుతూ వస్తున్నాను. అప్పుడు తద్దినం విలువ నాకు తెలియదు. అయిన నాన్న గారు చెప్పారని చేస్తూ వచ్చాను. శ్రీ గురువుల (బ్రహ్మశ్రీ చాగంటి గారు) ప్రవచనాల ద్వార తద్దినం పెట్టడం ఎంత పవిత్ర కార్యమో తెలుసుకున్నాను. మీ పోస్ట్ ద్వారా మహాలయ పక్షాల లో తండ్రికి తప్పనిసరిగా పెట్టాలి అనే కొత్త విషయం తెలుసుకున్నాను. 2005 నుండి ఇప్పటి వరకు పితృదేవతలకు నేను పిండ ప్రదానం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలను నేను చూసాను. మీ వీడియో పోస్ట్ ఎక్కువ మందికి చేరి, కష్టాలు పడుతున్న కుటుంబాల లో ఆనందాలు వెల్లి విరియాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. మీకు నా పాదాభివందనాలు. - మేరువు రామానుజ రావు, పాలవంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

    • @hiranyakumariyaddanapudi2643
      @hiranyakumariyaddanapudi2643 4 ปีที่แล้ว +1

      Guru thulyulu cheppina pitru karmmalu chala viluvyinavi ani thelusukunnamu. Meeku dhanyavaadamulu mariyu paadabhi vandanaalu.

    • @sudharanib.4401
      @sudharanib.4401 4 ปีที่แล้ว +1

      మంచి విషయం పంచుకున్నారు

    • @k.nagabhushanamrajee4016
      @k.nagabhushanamrajee4016 4 ปีที่แล้ว

      Then your wife is great lady.

    • @venkyvenkatnaidu4655
      @venkyvenkatnaidu4655 4 ปีที่แล้ว

      Mahalaya paksham antey emiti sir ?

    • @K.Murali1614
      @K.Murali1614 4 ปีที่แล้ว

      Brother ..nenu ma Tata gariki ,mama gariki pettocha ...and adi Ela cheyali ...

  • @bcvenkatesh1080
    @bcvenkatesh1080 2 ปีที่แล้ว

    గురువుగారూ... మీకు పాదాభివందనాలు... మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు..... 🙏🙏🙏

  • @mps5488
    @mps5488 9 หลายเดือนก่อน

    👌 మీ జ్ఞానానికి సదా పాదాభివందనం మంచి విషయాలు అందరితో పంచుకుంటున్నారు మీకు శిరసా అభివందనములు

  • @leelaramakrishnayarramsett5629
    @leelaramakrishnayarramsett5629 2 ปีที่แล้ว +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    మీరు చేస్తున్న ఈ వీడియోల వలన మాలాంటి వారికి సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుస్తుంది 🙏

  • @nagarajumaddula2329
    @nagarajumaddula2329 4 ปีที่แล้ว +24

    THANKS SRINU GARU THANKS SO MUCH FOR GIVING VALUABLE SUGGESTIONS

    • @Ravishastry63
      @Ravishastry63 3 ปีที่แล้ว +3

      Please don't call short cut Names on elders like this type of people.

  • @kvvulakshmikvvulakshmi5814
    @kvvulakshmikvvulakshmi5814 ปีที่แล้ว +4

    పితృ శాపం విమిచనవం కు మార్గము చ్చప్పంది guruvugaru

  • @vkvsarmasarma4953
    @vkvsarmasarma4953 10 หลายเดือนก่อน

    Very good . The importance of PITRU Tarpanam shradham told nicely. . All shpuld know tarpanam . Giving water to them . Vkv sarma

  • @makarasankranthi333
    @makarasankranthi333 4 ปีที่แล้ว +7

    We are happy to listen this, clip .....it's useful...

  • @GSANKARBABU
    @GSANKARBABU 4 ปีที่แล้ว +4

    *మాటలలో నమస్కరించి హృదయంతో పాదాభివందనం చేస్తున్నాను.మీరు మాకు దేముడు కానుక*

  • @ramakrishnadevaki9327
    @ramakrishnadevaki9327 2 ปีที่แล้ว

    Acharya Varya
    Meru chesina ee video malantivalluku chala useful. Sri Krishna Bhagavan bless you and your family 🙏🙏🙏

  • @karanamramamurthy6026
    @karanamramamurthy6026 2 ปีที่แล้ว +1

    పితృదేవతారాధన.....చాలా చక్కగా విశదపరిచారు. ధన్యవాదాలు.

  • @n.rhanumanthrao653
    @n.rhanumanthrao653 3 ปีที่แล้ว +6

    🙏 The way you explained is realy very clear and till now I don't know about all this. Thank you very much sir for this video.

  • @aeroanil
    @aeroanil 4 ปีที่แล้ว +4

    chala baga chepparu srinivas garu..namo naryana..
    Regards Nanduri Anil

  • @gurudevasaranam5685
    @gurudevasaranam5685 2 ปีที่แล้ว +2

    మహానుభావా..మీ కు,,,,,తెలుగు జాతి,,,,,ఎప్పటికీ ఋణపడే ఉంటుంది

  • @govindalakshmi4560
    @govindalakshmi4560 2 ปีที่แล้ว +1

    మంచి విషయాన్నీ చెప్పారు sir మా వారితో ప్రతి అమావాస్యకి మీరు చెప్పినట్లుగా చెప్పి చేయిస్తాను మీకు శతకోటి ధన్యవాదాలు

  • @neelchitturi9989
    @neelchitturi9989 3 ปีที่แล้ว +4

    Thanks for the valuable information 👍 God bless you and your family as always.

  • @rajumyakala7039
    @rajumyakala7039 4 ปีที่แล้ว +9

    మీ యొక్క సాన్నిత్యం మా అదృష్టం.

  • @damudeepika786
    @damudeepika786 2 ปีที่แล้ว

    Thanks alots Guruvugaaru ,for ur valuable explanation.

  • @priya4ravi
    @priya4ravi 2 ปีที่แล้ว +3

    Very well said Sir! 🌸🙏🌸

  • @dwarakanathperubhotla3898
    @dwarakanathperubhotla3898 4 ปีที่แล้ว +6

    Really good explanation and suggestions to follow

  • @sumalathadev2867
    @sumalathadev2867 4 ปีที่แล้ว +4

    మంచి విషయాలు చెపుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @vellalamallikharjun2093
    @vellalamallikharjun2093 2 ปีที่แล้ว

    Srinivas garu ,very good video.
    Very informative.
    Thank you sir

  • @ranibhavani4457
    @ranibhavani4457 2 ปีที่แล้ว

    Very clear Execpelsion thank u sir.🙏🙏🙏

  • @manjunathshetty1541
    @manjunathshetty1541 3 ปีที่แล้ว +3

    Thanks a lot for this enlightening video... I shall never miss these from. Now...

  • @sandhyanani8902
    @sandhyanani8902 3 ปีที่แล้ว +6

    గురువు గారు మీ పాదాలుకు కోటి కోటి వందనాలు

  • @sharanya.b.s.sarayu37
    @sharanya.b.s.sarayu37 2 ปีที่แล้ว +1

    Chala baga nijalu chepparu. Ee speech prathi okkaru vinali

  • @devireddysubbareddy8660
    @devireddysubbareddy8660 9 หลายเดือนก่อน

    ఈ వీడియో చూసి చాలా ఆనందంగా ఉంది పిత్రు దేవతల గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది

  • @vamsypamarthy5232
    @vamsypamarthy5232 4 ปีที่แล้ว +5

    Perfect, This is awesome..

  • @nalluriharikrishna9188
    @nalluriharikrishna9188 4 ปีที่แล้ว +4

    Thank you very much Srinivas garu it is very useful information.

  • @surya8950
    @surya8950 2 ปีที่แล้ว

    నమస్కారం సార్
    మీరు చెప్పే ఈ విషయం ఎంతో విలువైనది మరియు గొప్పది ఏ విధంగా అయినా విషయం తెలిస్తే ఆచరించి తరించాలి అని ఆలోచించే కొంతమంది మహానుభావులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దయచేసి భీష్మ తర్పణం ఆ నాలుగు శ్లోకాలు, పూజ చేసే విధానం తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @metukuniranjan5065
    @metukuniranjan5065 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యనమః. పాదాభివందనం 🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹

  • @satyakrishna5995
    @satyakrishna5995 4 ปีที่แล้ว +4

    Simply super.
    Thank u. Nenu chestanu.

  • @rptech6029
    @rptech6029 4 ปีที่แล้ว +5

    Namaskaram guruvugaru your video is excellent in this video you have given the importance to our parents i really appreciate that hat,'s off to you

  • @satyavathinemani4739
    @satyavathinemani4739 2 ปีที่แล้ว

    ఎంత చక్కగా చెప్పారండి! 👌👍

  • @turupatishivaleela4330
    @turupatishivaleela4330 ปีที่แล้ว +1

    నమస్కారంమండి గురువుగారు
    మీరు చెప్పే ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి మాకు చాలా నచ్చాయి
    మా ఆయన ఇవన్నీ పట్టించుకోడు
    మా పిల్లవాడి చేత చేయించొచ్చండి అన్ని

  • @DeepthiRatnam
    @DeepthiRatnam 3 ปีที่แล้ว +13

    May the godess bless you and your family sir.

  • @kandularamesh1055
    @kandularamesh1055 3 ปีที่แล้ว +11

    గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @swathi-fc9bt
    @swathi-fc9bt 2 ปีที่แล้ว

    Nameste andi meru chala manchi vishallu e general vallaki super ga Ardham ayelaga cheptharu, awesome 👏 👌👌

  • @k.sranganayakis4994
    @k.sranganayakis4994 2 ปีที่แล้ว

    ఆచార్యులు వారి పాదపద్మములకు నమస్కారము లు. చాలా బాగా చెప్పారు.దనయవాదములు

  • @spkumar9196
    @spkumar9196 4 ปีที่แล้ว +10

    Thanks SIR for giving a lot of precious information, we always with you

  • @NagaRaju-tv9om
    @NagaRaju-tv9om 4 ปีที่แล้ว +3

    Meeru nejanga manchi visyalu explain cheasthunnaru..

  • @gurunadhkothakonda603
    @gurunadhkothakonda603 2 ปีที่แล้ว

    చాలా విపులంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు మీకు. కృతజ్ఞతలు మీకు. నమస్కారములు మీకు. ,

  • @Naidu-vlog
    @Naidu-vlog 2 ปีที่แล้ว

    Nice Video with lot info, thanks sir...

  • @Shivansh0177
    @Shivansh0177 4 ปีที่แล้ว +2

    ఆచార్యులు గారికి నమస్కారం మీరు చెప్పేది వింటే మన భారత సనాతన ధర్మం ఇంత గొప్పదా అనిపీస్తుంది.🙏🙏🙏🕉️🕉️🕉️

  • @raghuramss
    @raghuramss 4 ปีที่แล้ว +9

    Excellent sir
    Thank you for the best knowledge pl share more and more videos.
    Pl sir

    • @jonnyjonny7437
      @jonnyjonny7437 4 ปีที่แล้ว

      Guruvugaariki paadabhi vandanaalu. Ayya naako sandeham eppatinuncho ventaadutundi. Poyinajanmlo chesina manchikaani chedu kaani ee janmaku enduku mudipedataaru? Ee janmalo entapunyam chesina vrudhayena? Dayachesi cheppagalaru.

  • @kishoremachani8094
    @kishoremachani8094 2 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు గురువుగారు 🙏🙏🙏 పాదాభివందనం 🙏

  • @suprememaster8443
    @suprememaster8443 ปีที่แล้ว +1

    Namaskaram sir... Chaala kashtapaduthunnanu sir... Ma intlo magavaru leru... Aadavaru pitru devathalaki elanti poojalu cheyyali...