“Mahanubhavula bata - Viswanatha Satyanarayana” by Brahmasri Chaganti Koteswara Rao garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2022
  • మహానుభావుల బాట- శ్రీ చాగంటి వారి మాట : శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు
    పూజ్య గురుదేవులు, వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సందర్భములలో ప్రాతఃస్మరణీయులు, ఋషితుల్యులైన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, వారి కవితా పటుత్వమును గురించీ అనేక ప్రవచనములలో చెప్పియున్నారు. వాటిలోని కొన్ని విశేషములు తెలుగు భాషామతల్లిని మొట్టమొదట జ్ఞానపీఠమునెక్కించిన కవిసమ్రాట్ విశ్వనాథ వారి జయంతి సందర్భంగా…
    విశ్వనాధ సత్యనారాయణ గారు "చెలియలి కట్ట" అన్న ఒక నవల వ్రాశారు. సముద్రమును పురుషుడితో పోలుస్తారు. సముద్రము యొక్క శక్తి అపారము. తలచుకుంటే ఊరిమీద పడిపోగలదు అయినా కెరటము వచ్చి వెనకకు వెళ్ళిపోతుంది తప్ప ఊరుమీదకు రాదు. అది తనకి తాను చెలియలి కట్ట దాటను అని నియమము పెట్టుకున్నది. సముద్రము అలా గీత గీసుకున్నది కనక అందరూ సంతోషముగా ఉన్నారు. ప్రతి పురుషుడు సముద్రమైతే "ధర్మేచ, అర్ధేచ, కామేచ మోక్షేచ నాతి చరామి" చెలియలి కట్ట. అది దాటకపోవడములోనే లోకము యొక్క శాంతి ఉన్నది. వ్యక్తిగత నిర్ణయము ఒకటే కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయము కావ్యములలో మహర్షులు ఎంత పరిణతితో చెప్పారో, విశ్వనాథ వారు కూడా అంతే గొప్పగా వివరించారు.
    మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వేయిపడగల నవల వ్రాస్తూ 999 పడగలు చితికి పోయినా ఒక పడగ బ్రతికి ఉన్నది. అదే చావో, రేవో ఈ జాతికి ఒక స్త్రీమెడలో తాళికడితే ఆమె వలన సంతానము పొంది సంసారము చక్కగా నడచిందా నడచింది, లేదా ఆయనకి ఆమె కూతురు, ఆమెకి ఆయన కొడుకు. ఇద్దరూ భగవన్ మార్గములో నడచి ఈశ్వరుని చేరుకోవడము. ఏ కారణము చేత కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడము కానీ, ఆడది తక్కువ ఆన్న భావముతో విడచిపెడతానన్న మాట కానీ ఈ జాతియందు లేదు. అది ఈ జాతి విశిష్టత, అద్భుతమైన సంస్కృతి. దీనికొరకు ప్రపంచదేశములు అన్నీ మన జాతికీ, ఇక్కడి సంస్కారమునకూ నమస్కారము చేశాయి.
    వారి రామాయణ కల్పవృక్షంలో -
    ప్రభు మేని పైగాలి వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె,
    ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె,
    ప్రభు మేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె,
    ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు కలిగె
    ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక
    రించినంత ఉపల హృదయవీధి
    నుపనిషద్వితాన మొలికి శ్రీరామ భ
    ద్రాభిరామ మూర్తి యగుచు తోచె!!
    ఎప్పుడయినా సరే, మనం అహల్య గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడడానికి మనకు హక్కులేదు. కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తారు. రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి. ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశారు. తన భార్య తప్పుచేస్తే, ఆమె ఏ దోషాన్ని ఎందువల్ల చేసిందో గమనించి, ఆమె చేత తపస్సు చేయించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి, రాముడు వస్తే ఆమె పాపము పూర్తిగా నశిస్తుందని గౌతమ మహర్షి గొప్ప ఆదర్శముతో వ్యవహరించారు. ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ, పై పద్యములో శ్రీరాముడు ఎలా పతితపావనుడో మహాద్భుతముగా చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు.
    "మళ్ళీ అందరూ వ్రాసిన రామాయణమే నేను వ్రాయడం ఎందుకు? అంటే ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళా ఎందుకు తింటున్నావు? అంటే అన్నం తినకపోతే ఉండలేము కనుక తింటున్నాము. అలాగే వినిన రామాయణాన్నే మరల మరల వింటున్నాము. రామాయణం లేనినాడు మనిషి జీవితమే లేదు." అని అన్నారు . అందుకనే ఆ మహానుభావుడు ఋషితుల్యుడు అయ్యారు.

ความคิดเห็น •