క్రీడాభిరామం కథ | Kreedabhiramam | శ్రీనాథుడు | వినుకొండ వల్లభరాయుడు | Rajan PTSK
ฝัง
- เผยแพร่เมื่อ 18 พ.ย. 2024
- కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.
ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు.
ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.
ఇక క్రీడాభిరామం కథలోకి వెళదాం.
#Kreedabhiramam #Sreenathudu #teluguliterature
పోతరాజు కథ: • పోతురాజు ఎవరు? అతని ఏడ...
మొబైల్ పట్టుకుని గంటలతరబడి అడ్డమైన చెత్తా చూసే బదులు ఇలాంటివి వింటే అయినా ఎంతోకొంత మన సాహిత్యం గురించి తెలుస్తుంది. అజీవ కి శతాధిక వందనాలు
నిజమేనండి మీరన్నట్టు ఇటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది
అజగవ ఛానల్ వారి కి సతాకోటి వందనాలు
ప్రాచీన సాహిత్యం ఈ తరం వారికి అందించే మీ ప్రయత్నం అభినందనీయం
చక్కని వాచకం వినసొంపుగా ఉంది వ్యాఖ్యనం
ఆనాటి సమాజ జీవితం గురించి మనకు తెలియ జేసిన అరుదైన సాంఘిక కావ్యం. మీకు ధన్యవాదములు...
మిగిలిన కాశీ మజిలీలు కథలు చెప్పండి,చాలా నెలలు అయింది,ఎంతో miss అవుతున్నాం.త్వరగా పూర్తి చేయగలరని మనవి
Yes
తెలిసేది లేని కథలు విన్నాము గాని మీలాగా సాహిత్యం గురించి గ్రంధాలు కథల గురించి వివరంగా విపులంగా ఎప్పుడూ వినలేదు అంతేకాకుండా అర్థమయ్యేలా వివరంగా చెప్తున్నా మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు🙏🙏
బావుంది సర్. ఆనాటి కాలమాన పరిస్థితులు తెలియచేస్తుంది ఈ కావ్యం. మీ ద్వారా వినగలిగాము. ధన్యవాదములు.
Swaminathan Sir, you do listen AJAGAVA of Rajan PTSK. Great 👍
అద్భుతమైన గురువు గారికి👏👏👏👏🙏
Beautiful task andi ancient book reading of the central idea
Ajagava ద్వారా వినే అదృష్టం మక్విచిన నందుకు ధన్యవాదాలు
ధన్యవాదములు గురువు గారూ...మాకు తెలియనివి ఎన్నో విషయాలను మీరు చక్కగా వివరిస్తు న్నారు 🙏🙏💐💐
అప్పటి కాలానికి వెళ్లాలని ఉంది....
ఇది అవచి తిప్పయ్య శెట్టి,శ్రీ నాధుడు ఇద్దరు మంచి మిత్రులు. క్రీడాభిరామం లోని.మంచన శర్మ, శెట్టి ఇద్దరి పాత్ర లుగా రూపు దిద్దిన్ది శ్రీనాధుని రచనే ఇది.
వీరిద్దరిలాగె వారిద్దరూ కలిసి అనేక యాత్రలు చెసివుంటారు.మంచన శర్మ శృంగార చమత్కారం శ్రీ నాధుడు కే అది కరతలామలకం. అతని ఖర్చు భరించె మిత్రుడిగ అవచి తి ప్పయ శెట్టి శెట్టి పాత్రగా నిలిచాడు
మీ వాక్ చాతుర్యానికి ధన్యవాదాలు సార్🙏
ఇన్ని రోజులూ మీ వీడియోస్ నేను మిస్స్ అయినందుకు చాలా భాద పడుతున్న సిర్
ఆహా ఏమి ఈ అనుభూతి ధన్యవాదాలు
మీకు ధ న్య వాదాలు, గురువు గారు
బారిష్టర్ పార్వతీశం నవల మీ మాటల్లో వినాలని ఉంది
Yes.
Ss
అయ్యా దుర్గా సప్తశతి లోని రహస్యం త్రయం గురించి భావం వివరించ ప్రార్థన
నాకు అదృష్టం ధీపుడు కథ చాలా బాగా నచ్చింది. గురువు గారు
మీ సాహిత్య సేవకు నా జోహారులు
🙏🙏 చక్కగా వివరించారు 🙏🙏
సూపర్ సార్
Thank you sooo much guru ela adagggane ala video pettesaru kreedabhiramam py ❤
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ప్రాతఃస్మరణీయలు.నిర్వివాదాంశం. కానీ క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు వ్రాశాడనేదే నిజం.ఎందుకంటే వినుకొండ వల్లభరాయుడు బడగనాటి కర్ణాటక బ్రాహ్మణుడు. ఋగ్వేది.ఆశ్వలాయన సూత్రుడు.స్వయంగా విద్వాంసుడు. శ్రీనాధుల వారు,ప్రౌఢదేవరాయలవారి పరిపాలనా కాలంలో ఆంధ్ర దేశంలో విజయనగర సామ్రాజ్య ఏలుబడిలో ఉన్నప్పుడు వినుకొండ దుర్గాధీశుడైన వినుకొండ వల్లభరాయుడు సమకాలికులు. వినుకొండ వల్లభరాయుడు కవికాకపోతే శ్రీనాధుడు వ్రాసిన కావ్యాన్ని అంకితం తీసుకునేవాడు.కానీ శ్రీనాధుల వారు రచిస్తే ఆయన కావ్యంలో వల్లభరాయ ప్రణీతమని ఎందుకు వ్రాస్తాడు.ప్రమాధో ధీమతామపి.శ్రీనాధుల వారి కంటే వల్లభరాయులవారు పిన్న వయస్కులై ఉండవచ్చు. శ్రీనాధుల వారు ఆయనకు గురుతుల్యులై ఉండవచ్చని నా ఉద్దేశ్యం.
Super samacharam sir
This became a daily routine for me, listening to your vlogs even when going for walks., Thanks for the content.
చెబుతూ ఉన్న కథకు తగిన వాక్యాలను స్క్రీన్ పై ఇవ్వవలసినది గా కోరుచున్నాము...
Good great knowledge you are sharing❤🎉
Very well explained Thank you Rajan garu 🌹🌹👍
Wowsuper
దయచేసి కాశీ మజిలీ కథలు పూర్తి చేయండి
Namaskaram guru gaaru samskrutham slokaalu chaduthu vaati arthalu chppanddi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
సూపర్
Thank you brother 🙏
🙏💐👏
MARVELOUS.THAN Q
Very good sir sir
ఎంతటి నగర వైభవం అలనాటి ఓరుగంటి విభవం.
Tq sir
THANK YOU FOR YOUR POSTINGS
Happy 😊
Meru vivarinchina Telugu Sahithyam loni pramukha rachanalu pi pratyeka videos cheyandi please
Ee story artham kavtle naku😢😢😢
Nice👍👍
🙏🙏🙏🙏🙏
మా చిన తాత గారు మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి గారి మృత్యుంజయ శతకం దొరకడం లేదు దాని విశేషాలు తెలియ పరిస్తే కృతజ్ఞతలు - 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
మీ email ID పంపించండి కాళిదాసు గారు
కథ లో పట్టులేకపోయిన చెప్పిన విధానం బావుంది.చె ప్పని ఆ శృంగారం ఏమిటో కాస్త వివరిస్తే అబ్బో అని హస్చర్య పోయే వాళ్ళం
పట్టు తెలియాలంటే ! తెలుసుకోవాలి మరి!!
ఈ మైలారులు గురించి శ్రీ పాద శ్రవల్లభ చరితామృతం లో కూడా ఉంది,అంటే అప్పటికే తురకలు ఉన్నారన్నమాట,
Suravaram pratapareddy gari andhrula sanghika charitra pic video cheyandi
🎉🎉🎉
🙏🙏🙏🙏
కాశి మజిలీ కథలు ఇంకా ఉంటే చెప్పండి గురువు గారు దయచేసి. మిమ్మల్ని ardhisthunnanu
రావిపాటి త్రిపురాంతకుడి ' ప్రేమాభిరామం ' అనే సంస్కృత వీథి రూపకాన్ని తెలుగులో రచించారు రచయిత. కానీ మా ఆచార్యులు వినుకొండ వల్లభరాయలు రచించారు ఇది అని అంటారు.
లేదు సార్ అది కాస్త కాంట్రవర్సీ గానే ఉంది వినుకొండ వల్లభరాయుడు కూడా ఒకటి రచించారాని ఉవాచ కానీ అది లభ్యం కాలేదంటారు మన సాహిత్య చరిత్ర కారులు
క్రీడాభిరామం కావ్యం పులివెందుల
సమీపంలోని శైవుల ప్రముఖ దేవాలయం
మోపూరు .గ్రామం నందు వినుకొండ వల్లభు రాయుడు శ్రీనాథుడు కలిచి ఇక్కడే రచన
చేశారు.సుమారు 1430 ప్రా తములో. జరిగింది
ఇక్కడే
Super samacharam sir
వినుకొండ వల్లభరాయుడు రచించాడు
కాకతీయుల కాలం నాటి కధలు చేప్పండి
Ss sir
ఇది శ్రీ నాధుని అనిపి అనిపిస్తోంది పిస్తుంది రచనే ఆ శైలి వింటే నే
మేము చదివే కన్న మీరు చెబుతూ ఉంటే ఆ అనుభూతి వేరు గురువు గారు ఆ కథా కళ్లకు కట్టినట్లు చెబుతారు మీరు.
Ek Veera story explain chestaru ani korukuntunnanu
Ajagava ante enti andi
Chinnappudu appudo vinnamu
arojullo bellam matrame vundhe, panchadharaledhu
🙏🙏🙏