Sri Bhagavat Gita Arjuna Vishada Yogam Slokam-4
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- భాష్యము
యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుని గొప్పశక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైనవారు పెక్కురు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధములవంటివారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతియొక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చిచూపెను.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.