దృవ చరిత్ర -2 | Solid history -2 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- దృవ చరిత్ర - 2 | Solid history -2| Dhruva Story | | EducationalContent | MoralValues |DhruvaNakshatra | DhruvaStory | InspiringTales | MythologyForKids | EducationalContent | MoralValues | DhruvaNakshatra | IndianMythology | KidsEntertainment
ఒకరోజు తండ్రి ఉత్తానపాదుడు నిండు సభలో కూర్చున్నాడు. తండ్రి గారి తొడపై ఉత్తముడుని కూర్చుండబెట్టుకున్నాడు రాజు. ఆ పక్కనే రాణి సురుచి నిలబడి ఉంది.అది చూసిన దృవుడు తన తండ్రి గారి ఇంకో తొడపై తమ్మునితో సమానంగా కూర్చోవాలని ఆశపడ్డాడు. వెంటనే తండ్రి గారి వద్దకు వెళ్ళాడు , తన తండ్రిగారు గాని, తన సవతి తల్లి సురుచి గాని కనీసం పట్టించుకోలేదు సరికదా! దూరంగా వెళ్ళు దృవా, నువ్వు నాకోడుకుతో సమానంగా కూర్చోవాలంటే ఎంతో తపస్సు చేయాలి, అప్పుడు నా కడుపున పుట్టాలి అప్పుడు మాత్రమే నీకు ఆయన తొడపై కూర్చునే అధికారం ఉంటుంది. ఇక్కడనుంచి పో అంటూ రెక్క పట్టుకుని లాగి కింద పడేస్తుంది, ఆ పసివాడిని చూసిన తండ్రిగారి కూడా కిమ్మనలేదు సరికదా దృవుడిని చూసి చీత్కరించుకున్నాడు. అది చూసిన అయిదేళ్ళ పసివాడి మనసు చివుక్కుమన్నది. కిందపడ్డ దృవుని కాలికి గాయం అయింది. సభలో అంతమంది ఉన్నా ఒక్కరు కూడా సురచితని కాదని పిల్లవాడ్ని లేపలేదు, ఓదార్చలేదు. ఆ సంఘటన పిల్లవాడి మనసుకి చాలా భాద కలిగించింది. మెల్లిగా లేచి తన గాయాన్ని తడుముకుంటూ, ఏడుస్తూ మెల్లిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దృవుడు
కాలికి తగిలిన గాయంతో వగరుస్తూ, ఏడుస్తూ కంటి నీటిని తన మోచేత్తో తుడుచుకుంటూ వస్తున్న దృవుని చూసిన తల్లి సునీత ఎదురు వచ్చి నాయనా! ఏమైంది, నీ ఒంటినిండా ఈ గాయాలేమిటి, నిన్ను ఎవరైనా కొట్టారా, లేదంటే ఎక్కడైనా పడిపోయినావా! ఏమి జరిగింది అని తన అయిదేళ్ళ కొడుకుని అడిగింది తల్లి సునీత. వగరుస్తూ, ఏడుస్తూ ఏమి చెప్పాలో తెలియని పసివాడు తన నోటినుంచి మాటలు రాక రొప్పుతూ ఉండడాన్ని చూసిన చెలికత్తే జరిగిన విషయాన్ని వివరించింది. తల్లి హృదయం బాధతో మూలిగింది. సవతి తల్లి మాటలు దృవుని మనసుని నొప్పించాయి, తన తల్లి సునీత ఏ రోజు పిన్నమ్మ గురుంచి చెడుగా చెప్పలేదు. కాని తన పిన్నమ్మ తన తల్లి గురుంచి అనరాని మాటలు అనడం అయిదేళ్ళ దృవుడి మనసు గాయపరిచింది. సవతి తల్లికి తనమీద, తన తల్లి మీద ఉన్న ద్వేషం, అసూయ భాగా అర్ధం అయింది. అంతే కాకుండా తండ్రి గారి నిరాదరణ మరింత మనసుని భాద పెట్టింది.
అమ్మా! నాన్నగారి తొడపై కూర్చునే హక్కు తమ్మునికి మాత్రమే ఉందా! నాకు లేదా! నేను నాన్నగారికి కొడుకునే కదా పరాయి వాడిని కాదుగా! నా తమ్మునికి ఉన్న హక్కు నాకు ఎందుకు లేదు అని నిలదీశాడు తల్లిని దృవుడు. పినతల్లిని నేను ఎంతో గౌరవిస్తాను, పైగా తమ్ముడు ఉత్తముడు నేను ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటాము. పిన్నమ్మకు నామీద, నీమీద ఎందుకు అంత కోపం. పైగా నేను నాన్నగారి తొడ పై కూర్చోవాలంటే, ఎంతో తపస్సు చేసి చచ్చి ఆమె కడుపున పుట్టాలంట. నేనెందుకు చావాలి, ఆవిడ కొడుకుగానే ఎందుకు మళ్ళీ పుట్టాలి? నువ్వు కూడా ఈ రాజ్యానికి రాణివే కదమ్మా! రాజు గారి పక్కన కూర్చోవలసినదానివి. నీ స్థానాన్ని పినతల్లి ఎలా ఆక్రమించింది? నీవు మహారాజుకి పెద్ద భార్యవి, పట్టపురాణివి, నాన్నగారి పక్కన నువ్వే కూర్చోవాలి కదా! పైగా పిన్నమ్మ నన్ను అంతలా అవమాన పరుస్తుంటే నాన్నగారు కిమ్మనకుండా ఉండిపోయారేమిటి? ఆయనకీ బాధ కలగలేదా! కోపం రాలేదేందుకు? ఈ తిరస్కారం నన్ను దాహించివేస్తోంది అమ్మా! అంటూ బోరుమంతున్న దృవుని ఓదార్చడం సునీత వల్ల కాలేదు. సునీత పుట్టెడు దుఃఖంతో ఏడుస్తున్న కొడుకుని దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకుంది. కొడుకు అడుగుతున్నా ఒక్కొక్క ప్రశ్నని తలచుకుని తరుక్కుపోతున్న గుండెని ఒడిసి పట్టుకుంటూ దుఃఖాన్ని దిగమింగుతూ కొడుకుని కౌగలించుకుంది సునీత. అలా చాలా సేపు తన ఒడిలో కొడుకుని దాచుకుని కన్నీరు మున్నీరు అయింది సునీత.
అయ్యో! భగవంతుడా! ఎంత పని చేసావు. నా పసివాడి మనసు ఎంత గాయం చేసావు? ఏమని చెప్పి ఈ పసివాడిని ఊరడించగలను? నేను పడుతున్న భాధలను చెప్పి ఈ లేత మనసుని ఇంకా బాధించటం, ఇంకా కష్టం కలిగించడం మంచిది కాదు కదా! నన్ను మనిషిగా ఎందుకు పుట్టించినావయ్యా! ఏ చెట్టుగానో, పుట్టగానో పుట్టించి వుంటే నా కొడుకుకి, నాకు ఇటువంటి భాధలు ఉండేవి కావు కదయ్యా అంటూ బోరుమని విలపిస్తోంది సునీత. కాసేపటికి తనని తాను సంబాలించుకుంటూ తన కంటినుంచి ఏకదాటిగా కారుతున్న కన్నీటిని తుడుచుకుని కొడుకుకి ధైర్యం చెప్పింది సునీత.
తండ్రి, పినతల్లి చేసిన అవమానం భరించలేని పసివాడికి తల్లి సునీత ఏమని ఓదార్చింది? ఎలా ఓదార్చిందో వచ్చే భాగంలో మన చిన్ని చానల్ లో విని తరిద్దాం రండి...మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.
#dhruvastory
#StepMotherSuruchi
#SunitiAndDhruva
#kinguttanapada
#indianmythology
#moralstories
#kidsstories
#mythologyforkids
#familydrama
#inspirationforkids
#educationalcontent
#StoryOfDetermination
#dhruvanakshatraserial
#SanskritiTales
#ChildrenStorySeries
Super story
pls improve the music quality