interesting facts about multi talented actor Kongara Jaggaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 15

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 10 หลายเดือนก่อน +3

    బహుముఖ ప్రజ్ఞాశాలి, కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి జీవిత విశేషాలను చక్కగా వివరించిన మీకు..... 👌🌹🌻💐🙏

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 10 หลายเดือนก่อน +3

    జగ్గయ్య చాలా గొప్ప నటుడు.చాలా గొప్ప ఉపన్యాసకుడు.అంతవరకే పరిమితం. కాని రాజకీయాలకు పనికిరాడు.1967 లో ఒంగోలు నుండి. లోక్ సభ కు పోటీ చేసి 80 వేల మెజారిటీ తో నెగ్గాడు.ఎన్నికల ప్రచారం లో ఎన్నో మాటలు చెప్పాడు.కానీ తర్వాత ఒంగోలు ముఖం చూడలేదు.
    1978 లో పొన్నూరు నుండి కాంగ్రెస్ (రెడ్డి) టికెట్ మీద పోటీ చేసి డిపాజిట్ గూడ తెచ్చుకోలేక పోయాడు.

  • @doddisankararao6669
    @doddisankararao6669 10 หลายเดือนก่อน +4

    Highly acclaimed intellectual, non controversial and a gentleman to the core.

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 6 หลายเดือนก่อน

      మీరు ఇంగ్లీషు వారైనా మా తెలుగు కొంగర జగ్గయ్య గురించి తెలుసా?
      మా సిగ్గు లేని ఆంధ్రులు తెలుగులో రాయలేరు. కానీ మీరు వేరే గడ్డ మీద పుట్టినా తెలుగు నటీనటుల గురించి చెప్పటం ముదావహం.😂

  • @bujjikg
    @bujjikg 10 หลายเดือนก่อน +16

    కళావాచస్పతి , కంచు కంఠంతో నటుడిగా తెలుగు చలచిత్రరంగంలో సుస్థిర స్థానం సాధించిన జగ్గయ్య యన్టీఆరుతోనూ , ఏయన్నారుతోనూ కలసి అనేక సినిమాలలో సెకండ్ హీరోగానూ , జగపతి వారి సినిమాలలో విలనుగానూ నటించిన జగ్గయ్య కోన్ని సినిమాలలో హీరోగా నటించి విజయవంతం అయ్యారు అలాగే తమిళ నటుడు శివాజీగణేషనుకి తెలుగు సినిమాలలో డబ్బింగ్ చెప్పి ఆశ్చర్య పరిచిన జగ్గయ్య గారి కంచుకంఠానికి అల్లూరిసీతారామరాజు చిత్రంలోని రూధరుఫర్డు (బ్రిటీష్ దేశస్థుడిగా ) చేసిన పాత్ర ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది 💐💐💐

    • @KishoreKishore-c5t
      @KishoreKishore-c5t 10 หลายเดือนก่อน +1

      జగ్గయ్య గారు ఒక మంచి నటులు ధీరగంభీరమైన కంఠస్వరంతో విలన్ పాత్రల్లో జగపతి పిక్చర్స్ సినిమాలో వి.మధుసూదనురావు దర్శకత్వంలో ఎక్కువగా నటించారు హీరోగా, సహాయక హీరోగా , విలనుగా విశేషంగా రాణించిన జగ్గయ్య

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 10 หลายเดือนก่อน +7

    నటన వారసత్వంగా వచ్చేది కాదు. అందుకు యస్వీ రంగారావు, జగ్గయ్య, నాగయ్య వంటి అనేక మంది మహానటుల కుటుంబాలే ఉదాహరణ. కేవలం యన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి వంటి కుటుంబ వారసులు మాత్రమే సినీ కళామతల్లి సేవ పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను తమ పిడికిలిలో బిగించి పట్టుకుని ప్రతిభ గల్గిన నూతన నటుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు వీరి వారసులకు మాత్రం నటకౌశలంతో పనిలేదు. గత 40 / 50 సంవత్సరాలుగా అవేముఖాలు. విశేషం ఏమిటంటే, ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఈకుటుంబాలలో మహిళలకు మాత్రం వారసత్వం సంక్రమించే వీలు లేదుసుమా!!

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 10 หลายเดือนก่อน +3

      చూడండి! నట వారసత్వం అనేది వాళ్ళ ప్రతిభ మీద ఆధారపడి వుంటుంది. తాతలు తండ్రులు నటులు అయినంత మాత్రానా వాళ్ళ వారసులు కూడా నటులుగా రాణించరు. ఇక్కడ ప్రతిభే కొలమానం. అగ్రనటుల వారసుల సినిమాలు కొన్ని ప్రారంబంలో సక్సెస్ కాలేదు. వాళ్ళు ఉన్నంత మాత్రానే ఇతర నటులు ఇండస్ట్రీ లో రాలేకపోయారనడం అవివేకం.

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 4 หลายเดือนก่อน

    Good Video

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 4 หลายเดือนก่อน

    మేము అప్పుడు Ongole లో 4 వ తరగతి ఆయన గుర్తు అరక జోడేడ్లు మీరు చెప్పినట్లు ఆవుదూడ గుర్తు 1969 లో బెంగుళూరు లో రెండుగా చీలి ఇందిర కాంగ్రెస్ కు ఆవు దూడ గుర్తు పాత కాంగీ కి అరక జోడు ఎడ్లు గుర్తు మిగిలిపోయింది
    ఏ నటులు ఆయనకు ప్రచారానికి రాలేదు.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 หลายเดือนก่อน +4

    కంచు కంఠం కళావాచస్పతి జగ్గయ్య గారు. తొలి నాళ్ళల్లో ఆకాశవాణి డిల్లీ కేంద్రంలో తెలుగు వార్తలు చదివే వారట. జగ్గయ్య గారి సొంత బంధువు డాక్టర్ కొంగర రవికాంత్ గారు opp. స్వాతి ప్రెస్, రవి హాస్పిటల్. విజయవాడ.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 10 หลายเดือนก่อน

    ఎన్నో తెలియని విశేషాలు చెప్పారు
    ఆయన సినిమాల్లో ఉంటే రామారావు, నాగేశ్వరరావు గారలకు బలమే కానీ ఆయనా ఒక యాక్టర్ లా కాదు

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 10 หลายเดือนก่อน

    Kongara Jaggarao gariki, jaggaiah gariki relationship ఏమిటి?

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 5 หลายเดือนก่อน

    మీరు shorts లో ఒక చోట జగ్గయ్య పోటీ చేసినప్పుడు NTR,ANR, సావిత్రి వచ్చి ప్రచారం చేశారని చెప్పారు.అది అబద్ధం. సినిమా వాళ్ళు ఎవ్వరు ప్రచారానికి రాలేదు. ఆయనొక్కడే ప్రచారం చేసుకున్నాడు.అనర్గళంగా మాట్లాడగలడు,గణాంకాలు గడగడా వల్లించగలడు.అంతవరకే పరిమితం.ఇంక ఏవిధంగాను ప్రజలకు గానీ నియోజకవర్గానికి గానీ ఉపయోగపడలేదు.గెలిచినప్పటి నుండి తర్వాత ఎన్నికల వరకు ప్రజల ముఖం చూడనేలేదు.