Shiva Padamalika || శివ పదమాలిక || Lord Shiva Devotionals || My Bhakti Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 6

  • @mybhaktitv
    @mybhaktitv  2 ปีที่แล้ว

    శివశివ శివశివ శుభంకరా
    హరహర హరహర అభయంకరా
    అగణిత గుణగణ అమృత శివా
    పరమానందా పరమ శివా
    కోరస్ :శివశివ శివ శివ శివశంభో
    హరహర హరహర హరశంభో
    సుందరమైనది నీ రూపం
    అతి సుందరమైనది నీ నామం
    స్వచ్ఛమైనది నీ తేజం
    శుభములు కూర్చుటె నీ తత్వం
    ఆది దేవుడవు నీవయ్యా
    ఆది దంపతులు మీరయ్యా
    ఆద్యంతములు ఏవయ్యా
    అనాది దేవా తెలుపుమయా
    ప్రణవ తేజమున విరిసేవు
    పంచ భూతముల మెరిసేవు
    పంచాక్షరిగా తెలిసేవు
    పరమ పదమున నిలిచేవు
    మూడు కన్నుల నీ రూపం
    ముల్లోకాలకు అపురూపం
    మురిపెము తీర్చును నీ రూపం
    మోదము కూర్చును నీ నామం
    విలాస మెరుగని విలాసము
    కొండ కోనల ఆవాసము
    కనులకు తెలియని కైలాసము
    సర్వాత్మలకు నిజ వాసము
    భస్మదారిగా భాసించేవు
    సర్ప భూషణములు దరియించేవు
    వంక జాబిలికి వరమిచ్చేవు
    సిగలో పూవుగ దరియించేవు
    మూలమైనది నీ తేజం
    ముల్లోకాల కిది మూలం
    కాలానికి నువు దూరం
    తెలుసుకొనగ విడ్డూరం
    అనాది నుండి ఉన్నావు
    ఆద్యంతములు లేకున్నావు
    అంత్య మెరుగుట దుస్సాధ్యం
    శివరాత్రి తెలిపెను ఆ సత్యం
    నిన్ను తెలియని అజ్ఞానం
    అహంకారానికి అది మూలం
    తల ఎగరేసిన తృంచేవు
    అహంకారమును మాపేవు
    మగువ మనసు తెలుసుకొని
    సతీదేవిని చేరుకొని
    పాణిగ్రహణము చేసేవు
    పరమ మోదమును కూర్చావు
    .సతి దేహమును త్యజియించి
    అగ్నికి ఆత్మను అర్పించ
    భద్రుని సృష్టి చేసావు
    భీభత్సమును కల్పించావు
    దక్ష యజ్ఞమును తెలిసేవు
    దక్షుని దర్పము నణచేవు
    అహమను తలను తృంచేవు
    అజ్ఞానము తొలగించేవు
    కళ్యాణమున నిను చూడ
    కాముని భాణము నిను జేర
    కన్నుల నిప్పులు కురిపించి
    కాముని కాల్ఛుట నీ ఘనత
    కందర్ప హరునిగ తెలిసేవు
    కాయము లేని కాముడుని
    అనంగునిగా తెలిపేవు
    అందరిలోన నిలిపేవు
    రతీదేవి ఎద శోకము బాపి
    మతిలో మోదము కూర్చావు
    కామిత ఫలముల నొసగేవు
    కన్నుల వెలుగులు చూసేవు
    పర్వత పుత్రిని పెండ్లాడి
    సగదేహమును తన కొసగి
    అర్ధ నారీశ్వరుడై అగుపించావు
    అద్భుత తత్వం తెలిపావు
    నీ శక్తి నీకు అభేదము
    తెలియగ జేసెను ఓ తత్వము
    అదియే అర్ధనారీశ్వరము
    తెలిసిన జన్మము ధన్యము
    సాగర మధనం సమయాన
    ఆలాహలమును గ్రహించి
    కంఠములోన నిలిపావు
    నీల కంఠునిగ వెలిగావు
    అహంకారమున అగుపించ
    తనయుని తలనే తృంచావు
    గజముఖమును కూర్చావు
    గజానునిగా తెలిపావు
    సుబ్రమణ్యుని సంభవము
    చిత్రములందు విచిత్రము
    శివ తేజమును విదిలించి
    పలు తావులలో నిలిపావు
    దివ్య రహాస్యం దాచావు
    మోహిని వెంట నడిచావు
    అద్భుతాలకు ఆదిగా
    అపురూపాన్ని కనబరచావు
    సకల దేవతల సహకారం
    అద్భుతాల సమహారం
    తిరుగులేని నీ వ్యవహారం
    త్రిపురాసురుల సంహారం
    నాట్యానికి నువు ఆధ్యుడవై
    చైతన్యములకు భాద్యుడవై
    లాస్య నాట్యముల విరిసేవు
    నటరాజ మూర్తిగా తెలిసేవు
    పలు క్షేత్రాల వెలిసేవు
    పలునామాలా మెరిసేవు
    పరంజ్యోతిగా తెలిసేవు
    పరమానందం కూర్చేవు
    భక్త సులభునిగ మసలేవు
    ముక్తి ప్రదాతగ తెలిసేవు
    లయ కార్యమున నిలిచేవు
    స్థితికారకుని కలిసేవు
    అడిగిన వరములు అందించి
    అందొక మర్మము దాచించి
    రజో తమములను పెంచావు
    సృష్టి ధర్మమున కూల్చేవు
    ఆత్మ లింగమును ఒసగేవు
    అహంకారమును పెంచేవు
    అంతా నీవని మరచిన వారను
    అంతలోనె హతమార్చేవు
    మౌన దీక్షలో మునిగేవు
    జ్ఞాన జ్యోతిగా వెలిగేవు
    పలుకు లేకనే పలికేవు
    ప్రశ్నోత్తరాలను తెలిపేవు
    అహంకారమున ఉరికన గంగను
    జడపాయలలో పట్టేవు
    గర్వభంగము చేసేవు
    గతి గమనము నెరిగించావు
    గణాదిపత్యపు గడబిడలో
    సూక్ష్మ బుద్దినే మెచ్చావు
    గణపతికే పట్టం కట్టావు
    గణాదిపత్యం నొసగావు
    సందె వేళలో కైలాసం
    తాండవ ఖేలికి శుభ తరుణం
    సురముని జన సందోహం
    సురాధిపతికి సంతోషం
    అవతారములకు అందవు
    సగుణ రూపమునకు చెందవు
    నిర్గుణముల నిలిచేవు
    నిరుపమానమున మెరిసేవు
    అరూప రూపిగా అగుపించేవు
    అందరి పూజలు అందేవు
    నిరుపమానము నీ తేజం
    నిఖిల జగతికి ప్రమోదం
    శివ కేశవుల అభేదమంటూ
    హరి హర మూర్తిగ తెలిసేవు
    అవతారములను దాల్చేవు
    అంశను కూడి వచ్చేవు
    పలు విధమ్ముల ప్రభవించేవు
    ఫాల నేత్రమున పాలించేవు
    పలు క్షేత్రాల భాసించేవు
    పలు నామాలకు పలికేవు
    పట్టు పుట్టములు పట్టవు నీకు
    పసిడి వెలుగులు పొందవు నీవు
    రథ తురగములు చేరవు నీవు
    నంది వాహనమును వీడగరావు
    మంచు కొండల మసలేవు
    రాతి గుండెలో నిలిచేవు
    ధాన్య ముద్రలో మునిగేవు
    ధన్యత చెందగ తెలిపేవు
    ధరణీ జనులు తరియింప
    దివ్య రూపములు దాల్చేవు
    దివ్య తేజమున పంచేవు
    దిశ దిశలా వర్ధిల్లేవు
    విశ్వవ నాయకా విజయోస్తు
    విశ్వ పాలకా విజయోస్తు
    విశ్వనాథునికి నమస్తు
    విశ్వ తేజునికి నమస్తు

  • @gratnam8815
    @gratnam8815 3 ปีที่แล้ว

    Jai shivaya

  • @gowripasupureddy5809
    @gowripasupureddy5809 ปีที่แล้ว

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏

  • @nalamrajesh1399
    @nalamrajesh1399 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🌺🌺🌺

    • @mybhaktitv
      @mybhaktitv  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.