HLM GPT - 2KINGS
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- 2రాజులు 2:15 యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
2రాజులు 2:16 అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను.
2రాజులు 2:17 అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.
2రాజులు 2:18 వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
2రాజులు 2:19 అంతట ఆ పట్టణపువారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
2రాజులు 2:20 అతడు క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
2రాజులు 2:21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
2రాజులు 2:22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
2రాజులు 2:23 అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
2రాజులు 2:24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.
2రాజులు 2:25 అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.