THIRUPALLIYEZHUCHI 6🙏తిరుప్పళ్ళియెழுచ్చి 6వ పాశురం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • సూర్యుడు ఒక్కడు కాదా!?
    ఉదయాన్నే దేవతలంతా ఏమి చేస్తున్నారో తెలుసా!?
    నేడు శుక్రవారం కదా! మానసికంగా రూపాయి ఖర్చు లేకుండా శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాచ్చిమార్లను దర్శిద్దామా!
    శ్రీరంగనాథస్తోత్రము 5వ శ్లోకము
    పాశురము - ౦౬ :
    ఇరవియర్ మణినెడుమ్ ౹
    తేరొడు మివరో ౹
    ఇఱైయవర్ పదినొరు ౹
    విడైయరు మివరో ౹
    మరువియ మయిలినన్ ౹
    అరుముగ నివనో ౹
    మరుదరుమ్ వశుక్కళుమ్ ౹
    వన్దు వన్దు ఈణ్డి ౹
    పురవియో డాడలుమ్ ౹
    పాడలుమ్ తేరుమ్ ౹
    కుమరదణ్డమ్ పుగున్దు ౹
    ఈణ్డియ వెళ్ళమ్౹
    అరువరై యణైయ ౹
    నిన్ కోయిల్ మున్నివరో ౹
    అరఙ్గత్తమ్మా !
    పళ్ళి యెழுన్దరుళాయే॥
    ప్రతిపదార్థములు :
    ఇరవియర్ = ద్వాదశాదిత్యులు, మణి = విలక్షణమగు, నెడుమ్ = గొప్పలు, తేరొడుమ్ = రథము గల్గిన, ఇవరో = ఇరుగో, ఇఱైయవర్ = నిర్వాహకులగు, పదినొరు విడైయరుమ్ = ఏకాదశ రుద్రుడు, ఇవరో = ఇరుగో, మరువియ =విడువని, మయిలినన్ = అఱుముగన్ = ఆరు మోము వాడు, ఇవనో = ఇరుగో, మరుదరుమ్ = మరుత్తులును, వశుక్కళుమ్ = వసువులును, వందు వందు = వచ్చి వచ్చి, ఈండి = గుమిగూడి, పురవియోడు = గుఱ్ఱములతో, ఆడలుమ్ = ఆటలునై, పాడలుమ్ = పాటలను, తేరుమ్ = రథములతో, కుమరదండమ్ పుగుందు = కుమారస్వామితో కూడి వచ్చి, ఈండియ వెళ్ళమ్ = దట్టమగు సమూహము, అరువరై = గొప్ప మేరు పర్వతమునకు, యణైయ = సమానమగు, నిన్ = నీ, కోయిల్ = కోయిల, మున్ను = ముందు, ఇవరో = ఇరుగో, అరఙ్గత్తమ్మా = ఓ రంగనాథా, పళ్ళి యెళున్దు = పడక నుండి లేచి, అరుళాయే = కృప జేయుమా !
    సీసం + తేటగీతి :
    అల్లదే యరుదెంచి రాదిత్య బృందమ్ము
    దివ్యమౌ బంగారు తేరు లందు
    అల్లదే యధిపతు లా రుద్రు లరుదెంచి
    రపరంజి రథముల నద్భుతముగ
    అల్లదే యరుదెంచి రష్ట వసువులును
    సప్త మరుత్తులు సంతసమున
    అల్లదే యరుదెంచె నారు మోముల ఱేడు
    నెమలి వాహన మెక్కి నెమ్మి గాను
    అదియె యరుదైన నీ దివ్య ఆలయాన
    నాట్య మాడుచు పాడుచు నయముగాను
    దేవ సేనాని సైన్యమ్ము తేరు లందు
    నియతి కైంకర్య మొనరింప నిలచి నారు
    కనులు తెరువుము శ్రీరంగ ! కరుణ మెఱయ ౦౬
    తాత్పర్యం :
    శ్రీ రంగ ధామా ! గొప్ప రథములుగల ద్వాదశాదిత్యులును, ఏకాదశ రుద్రులు, నెమలి వాహనుడగు సుబ్రహ్మణ్యుడును, అష్ట వసువులును, వారి వారి రథములు, గుఱ్ఱములు మొదలగు వాహనములతో ఆడుచూ పాడుచూ షణ్ముఖ సమేతముగా వచ్చిన సేనా సమూహము మహా మేరు సదృశమగు మీ కోవెల ఎదుట దేవర వారి కటాక్ష వీక్షణమునకై నిలుచున్నది. వీరి ననుగ్రహించుటకై కృప చేసి మేల్కొనుము !
    #thirupalliyezhuchi
    #thondaradippodi_azhwar
    #padmajaramanujadasi
    #acharya_vaibhavam
    #ramanuja_vaibhavam
    #bhagavad_ramanuja
    #thirunakshatram
    #divyadesalu
    #samasrayanalu
    #vaishnava_sampradayam
    #srivaishnavism
    #bhagavadvishayam
    #alwar
    #azhwar
    #andal
    #goda
    #krishna
    #srirangam
    ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణమ్🙏
    నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:
    ప్రతిరోజు మధ్యాహ్నం 3.30గంటలకు:
    FCC (Free Conference Call) LINK:
    join.freeconfe...
    TELEGRAM LINK:
    t.me/joinchat/...
    TH-cam LINK:
    / @padmajaramanujadasi
    WEBSITE ADDRESS:
    padmajaramanuj...
    WHATSAPP CHANNEL LINK:
    whatsapp.com/c...
    INSTAGRAM LINK
    www.instagram....
    అడియేన్ రామానుజదాసి🙏

ความคิดเห็น • 8