సందేహమేల సంశయమదేలా | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- సందేహమేల సంశయమదేలా | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song
.
.
.
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||
ఆ ముళ్ల మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను తానే - భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||
ఎందాక యేసుని నీవు - ఎరగనందువు
ఎందాక హృదయము బయట - నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||
ఈ లోక భోగములను - వీడజాలవా
సాతాను బంధకమందు - సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||
లోకాన ఎవ్వరు నీకై - మరణించరు
నీ శిక్షలను భరియింప - సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||
Raise. The. Lord
టైం అంత మీ పాటలతోనే సరిపోయింది superb ji miss u
వావ్ స్టార్టింగ్ super ఎవరు మీలా పడలేరండి miss u 🌹🌹🌹🌹
Naku esong track kavali
Eragadisaru ఆశీర్వాదం Garu miss andi
2 months అయ్యింది రండి తెలుగు ప్రజలు వెయిటింగ్ ❤️👍🌹🌹
అన్న పరిణితి కలిగిన గాయకుడు miss u anna 😭
ఎక్సలెంట్ awesome singing
Mike ల high pitch singing మీ తర్వాత మీ మనవడు వారసుడు
Eragadesaru లెండి ఎక్సలెంట్
Glory to god... ఆమెన్ 👏
ఎక్సలెంట్ awesome singing miss u andi
High pitch ఎలా మర్చిపోగాలం sep 16 th u r good singer
Wow super సింగింగ్ ❤❤🌹🌹
Sep 17 th where sir పరలోకం లో ఈ పాట పాడరా అండి miss u ఆశీర్వాదం గారు 🌹
వావ్ కడుపులోనుడి గొంతులోనికి high tone దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు పోనీలెండి
వావ్ కడుపులోనుడి గొంతులోనికి high tone దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు పోనీలెండి - రోజు ఈ పాటలు వింటూ ఎంతో సంతోషిస్తాను. దిగులు పడకు, వేదన పడకు... ఎంత బాగున్నదో. ఆ గాత్రం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ స్వరం తో మన మధ్యనే ఉన్నారు ఆశీర్వాదం గారు. ఎక్కడికి పోలేదు.
హాస్పిటల్ కి vellakuda ఇంటిలో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారా అండి ఎంత పని అయ్యింది సో sad sir 👍