వీరుడే లేచెను | Veerude Lechenu | TELUGU CHRISTIAN SONG |WITH LYRICS | BRO.ANIL kumar song . watch
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి -2
మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయా వెళ్ళెనే
ఆత్మను పంపి తన శక్తితొ నింపి తనకు సాక్షులుగా మనల చేసెనే
ఉరుమల్లె ప్రకటించేసెయ్ ప్రభుని మహిమేంటో చుపించేసెయ్
వెలుగల్లె వ్యాపించేసెయ్ జనుల హృదయాన్ని మండించేసెయ్
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
అరె నమ్మినవారిని సూచకక్రియలు వెంబడించునెల్లపుడు
వీరుడే లేచెను - మరణపు ముల్లును విరచి - సాధ్యమా మంటికి - ప్రభువునే వుంచను అణచి
శృంగారం అనే ద్వారమునొద్దన కుంటి వాడు ఉండెనుగా
దేవాలయముకు వచ్చుచుండిన పేతురు యోహానుల చూస్తుండెనుగా
వెండి బంగారం మా యొద్ద లేదని మాకు కలిగినదే నీకిస్తాం చూడని
యేసు నామంలో లేచి నువు నడువని పేతురు లేపెనుగా చెయి పట్టి అతనిని
గుమికూడిన ప్రజలంతా విస్మయమొందగా శుద్ధాత్మ అభిషేకం బలము నింపగా
మమ్మెందుకు చూస్తారు ప్రభువె మాకు చేశాడు అని పేతురు సాక్షమిచ్చెగా...హే హే
వాక్యాన్ని నమ్మారు రక్షణను పొందారు జనుల హృదిని వాక్కు పొడువగా|| అరె నమ్మినవారిని ||
లుస్రా అనెడి ఆ పట్టణమందున కుంటి వాడు నడిచెనుగా
పౌలు బర్నబా ఆత్మ పూర్ణులై అద్భుత క్రియలెన్నో చేస్తుండెనుగా
దేవతలే మనుషులుగా వచ్చారు అనుకుని అన్యులు పూనారే బలి అర్పించాలని
అయ్యో జనులారా ఇది ఏమి పనియని మేము మీలాంటి మనుషులమేనంటని
ఈ వ్యర్ధ దేవతలను విడిచిపెట్టండని జీవముగల ప్రభు వైపుకు తిరగండని
అంతటను అందరును మారుమనసు పొందాలని ప్రభువు ఆజ్ఞాపించెననెనుగా
భూలోకామంతటిని తలక్రిందులు చేసుకుంటు దేశాలనె కుదిపివెసెగా|| అరె నమ్మినవారిని ||
దేవకుమారుల ప్రత్యక్షతకై సృష్టి చూస్తూ ఉండెనుగా
విడుదల కోసమై మూల్గుచుండెనే రక్షకుడేసయ్యే విడిపించునుగా
దేవా పుత్రుడ ఇక ఆలస్యం ఎందుకు యూదా సింహంలా దూకేయ్ నువ్ ముందుకు
యేసునామములో అధికారం వాడవోయ్ యేసురక్తంలో శక్తేoటో చూపవోయ్
దెయ్యాలను తరిమేసెయ్ రోగులను బాగుచెయ్ ప్రభువల్లె జీవించి వెలుగు పంచవోయ్
లోకాన జనమంతా సాతాను ముసుగులోన గ్రుడ్డివారై తూలుచుండెనే
సువార్త ప్రకాశమే కన్నులను తెరుచునింక వినిపించెయ్ సిలువ వార్తనే|| అరె నమ్మినవారిని ||