ఆకు వక్క సున్న మది మూడు వన్నెలు || VEMANA SHATHAKAM || ప్రజాకవి వేమన శతకం || My3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam#vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam #vemana #vemanapadyalu #vemanapadyaalu #my3 #my3media #ancientpoet #socialreformer #prajakavi #popularpoetry #padhyam112 #my3media
    పద్యం - 112
    ------------------------
    ఆకు వక్క సున్న మది మూడు వన్నెలు
    నేకమైన చోట దాకు నెరుపు
    సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ
    విశ్వదాభిరామ వినురవేమ!
    మిత్రులారా!
    ఈ పద్యంలో వేమన భగవద్గీతా చార్యుడు చెప్పిన త్రిగుణాల గురించి చర్చించాడు. భగవద్గీత ప్రకారం త్రిగుణాలు అంటే.. తమో, రజో, సత్వ గుణాలు. తమో గుణం అంటే అజాగ్రత్త, అవివేకం, మరపు, పరాకు మొదలైన లక్షణాలు. రజో గుణం అంటే ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి, కోరికలు కలగడం, ఇక సత్వ గుణం అంటే..మిగతా రెండింటి కంటే పవిత్రమైనది. క్షేమ దాయకమైనది.ఇలా భిన్నమైన మూడు లక్షణాలు, మూడు వన్నెలు కలిసి నాలుగో అద్భుతం ఆవిర్భవిస్తుంది. అదే త్రిగుణ శోభితమైన పరమాత్మ అని వేమన అంటాడు.
    "ఆకు వక్క సున్న మది మూడు వన్నెలు
    నేకమైన చోట దాకు నెరుపు
    సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ
    విశ్వదాభిరామ వినురవేమ!"
    అవును. ఆకు, వక్క, సున్నం మూడూ మూడు రకాలు. మూడు వన్నెలు కలిగి వుంటాయి. కానీ ఈ మూడు కలిసినప్పుడు, ఏకమైనప్పుడు ఎరుపు రంగు ఉద్భవిస్తుంది. అలాగే సత్వ, రజో, తమో గుణాలు అనే త్రిగుణాలు వేటికవే ప్రత్యేక లక్షణాలు, గుణాలు, స్వభావాలు కలిగి వుంటాయి. కానీ అవి కలిసి పరమాత్మలా ఏక రూపంలో ప్రకాశిస్తాయి అని వేమన చెబుతున్నాడు..
    ధన్యవాదాలు!
    ******
    ప్రతి రోజూ ఒక పద్యం
    మీ పిల్లల కోసం..

ความคิดเห็น •