నాలో నేను - ఉత్తరాలు / లేఖలు (Letters) కోల్పోయిన సంపద
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- మొబైల్ ఫోన్లు కు ముందు, లాండ్ ఫోన్లు కూడా అంతగా అందుబాటు లేని రోజులలో అంటే ఒక 25, 30 సంవత్సరాల క్రితం వరకూ, ప్రయాణాలు కూడా క్లిష్టం గా వున్నప్పుడు దూరాభారం వలన ఆత్మీయులను తరచుగా కలుసుకో లేని రోజులలో ఉత్తరాలు మానిషి జీవితం లో ప్రథానమైన భాగం
అనుభూతుల్ని వ్యక్త పరచడం లోనూ, చేరవేయడం లోనూ, పదిల పరచడం లోనూ ఉత్తరాలదే పైచేయి.
ఉత్తరాలు ప్రేమాభిమానాలకు నిదర్శనాలు, అవి కాలాతీతాలు.
ఉత్తరాలు భావవ్యక్తీకరణ ను మరింత పెరుగు పరిచేవి, భాషలో నైపుణ్యాన్ని పెంచేవి. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం మంచి వ్యక్తిత్వానికి పునాది. సరైన వ్యక్తిత్వం జీవితం పట్ల మంచి దృక్పదాన్నిస్తుంది. మంచి దృక్పదం ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని జీవించడం నేర్పిస్తుంది
ఉత్తరాల గురించి ఉదాహరణలతో చాలా చక్కగా ఉంది
చాలా బాగుంది
ఉత్తరాలు ఇష్టపడే వాళ్ళు, ఉత్తరాలను కోల్పోయాము అనుకొనే వారు comment చెయ్యండి.. నేనే నా, యింకా వున్నారా 😊
ఎన్నో విషయాలు ఉత్తరాలలో వ్యక్తపరచ్చినట్లు ఫోన్ లో వ్యక్తపరచ లేము. Really super topic. 👏👏👏👏👏
Bagundi annayya.
ఉత్తరాలు ఉత్తరంలో హృదయానికి అపురూప సన్నిహితులు. బాగుంది.
Vutharam vudharistundi. Bhaavaanalini anubhuthuluni migilchevi
అబ్బా! నా లాంటి వాళ్ళు ఇంకా కొంత మంది ఉన్నారు అని తెలిసి చాలా ఆనందపడ్డాను. వెంటనే ఇంతకుముందు నేను ఉత్తరాల ద్వారా పలకరించుకొంటూ వచ్చిన నా మిత్రులందరికీ ఈవీడియోని పంపిచాను.
మీ ఆలోచనల్ని మాతో
పంచుకున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.... నమస్తే.
@@lakshmipathiganji2259 చాలా సంతోషమండి , ధన్యవాదములు 🙏
చాలా బాగా వ్యక్తీకరించారు..ఉత్తరాలను ఇష్టపడే వారందరి తరపున ఒక ప్రతినిధిగా వాళ్ల భావాలను represent చేసారు..మీరు చెప్పిన ప్రతీ అనుభూతిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను..నా first job కోసంdelhi వెళ్లినపుడు మొదటి వారంలో నాకు 20 letters పైన వచ్చాయి..ఇవి, ఇంకా ఎన్నో జ్ఞాపకాలను తట్టిలేపిన మీ ఉపన్యాసానికి thanks చెప్పడానికైనా మీకో letter రాయాలన్పిస్తుంది😀😀.
మీ స్పందన కు ధన్యవాదములు. మీకు ఉత్తరం రాయాలి అనిపించడం , యీ అంశానికి గొప్ప ప్రశంస. తప్పకుండా రాయండి 🙏🙏🙏