గబ్బిలం|గుఱ్ఱం జాషువా|భాగం-1|Gabbilam|Gurram jashuva|9550313413|పాతూరి కొండల్ రెడ్డి|Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #గబ్బిలం#Gurramjashuva#Padyaparimalam
    మిత్రులారా!పూర్తి పద్యాలు ఇక్కడ రాయడం వీలు కాలేదు ఈ వీడియో క్రింద కామెంట్ లలో రాస్తున్నాను
    మొత్తం 124 పద్యాలు
    పద్యం :1
    చిక్కినకాసుచే దనివి జెందు నమాయకు డెల్ల కష్టముల్
    బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
    ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
    డొక్కెడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై.
    పద్యం :2
    పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
    బ్రాపక మిచ్చినట్టి రఘునాధనృపాలకు డేలియున్న తం
    జాపురి మండలబునకు జక్కగ దక్షిణభాగ భూములన్
    గాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై.
    పద్యం :3
    ముప్పు ఘటించి వీని గలిమిన్ గబళించి దేహమున్
    బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా
    జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
    దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్.
    పద్యం :4
    వాని రెక్కల కష్టంబు లేనివాడు
    సస్యరమ పండి పులకింప సంశయించు
    వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
    భోజనము బెట్టు వానికి భుక్తి లేదు.
    పద్యం :5
    వాని తలమీదబులిమిన పంకిలమును
    గడిగి కరుణింపలేదయ్యె గగనగంగ
    వాని నైవేద్యమున నంటు వడిన నాడు
    మూడు మూర్తులకును గూడ గూడు లేదు.
    పద్యం :6
    పామునకు బాలు, చీమకు బంచదార
    మేపుకొనుచున్న కర్మభూమి జనించు
    ప్రాక్తనం బైన ధర్మదేవతకు గూడ
    నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట.
    పద్యం :7
    వాని నుద్ధరించు భగవంతుడే లేడు
    మనుజు డెట్లు వాని గనికరించు
    వాడు జేసికొన్న పాపకారణమేమొ
    యింతవరకు వాని కెరుకలేదు.
    పద్యం :8
    ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
    యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
    గసరి బుసకొట్టు నాతని గాలిసోక
    నాల్గు పడగల హైందవ నాగరాజు.
    పద్యం :9
    కులములేని నేను కొడుకుల బుట్టించి
    యీ యఖాతమందె త్రోయవలెనె
    భార్యయేల బుట్టుబానిసకని వాడు
    జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష.
    పద్యం :10
    ఉదయమాది రక్త మోడ్చికష్టముజేసి
    యినుని సాగనంపి యిల్లు సేరి
    యున్న గంజిద్రావి యొక్కనాడా పేద
    ప్రక్కమీద యేను వాల్చియుండె.
    పద్యం :11
    భూ నభముల గ్రొంజీకటు
    లేనుగునకు మధము వోలి యెసక మెసెగె సం
    ధ్యా నాట్య కేళి మాని మ
    హానటుడు శివారవముల నారంభించెన్.
    పద్యం :12
    ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
    విహరణము సేయసాగె గబ్బిల మొకండు
    దాని పక్షానిలంబున వాని చిన్న
    యాముదపు దీప మల్లన నారిపోయె.
    పద్యం :13
    తిల్లిక నారిపి దయ్యపు
    బిల్లవలేం దిరుగుదబిసిపపిట్టా నరయగా
    బల్లవితమయ్యె నాతని
    యుల్లంబున గ్రొత్త క్రొత్త యుహాంకురముల్.
    పద్యం :14
    చెలిమిన్ బక్షికి విన్నవించుకొనజొచ్చెన్ స్వీయవృత్తాంతము
    మ్మలికన్ గందిన నెమ్మనంబున మదోన్మత్త ప్రపంచంబులో
    బులుగుంబుట్రటు గాక బేదలకు నాప్తుల్ చుట్టపక్కంబులు
    న్గలరే వానికవోష్ట బాష్పములు వ్యాఖ్యానించ జక్రాంగనల్.
    పద్యం :15
    ప్రవిమల దేవతాభవన వాసముచేయుచు మమ్మువంటి మా
    నవులకు లేని గౌరవమునం దులదూగెడు గబ్బిలాల రా
    ణివిగద నీవు స్వాగతము నీకు శుభంబకదమ్మ నీతనూ
    భవులకు దల్లక్రిందుల తపంబులకున్ గుడి గోపురాలకున్.
    పద్యం :16
    గాఢనిద్రావలంబిమై కన్ను మూసి
    క్ష్మాతలము మేను మరచిన కాళరాత్రి
    నా గృహంబున వెదకుచున్నా వదేమి
    దొరక దిచ్చట నానంద కొరణ లవము.
    పద్యం :17
    నిన్ను బహిష్కరించు నవనీవలయం బిది యంటరానివా
    డున్న నిషిద్దగేహము సహోదరి నీవు సమస్త దేవతా
    సన్నిధి నారగింతపు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
    యున్నములేని పేదల గృహంబులు సొచ్చితివేల బేలవై.
    పద్యం :18
    హృదయములేని లోకముసుమీ యిది మాపుల బశ్చిమంబుగా
    నుదయము తూర్పుగా నడచుచుండు సనాతనధర్మ ధేనువుల్
    పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞాలో
    బేదవి గదల్పజాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్.
    పద్యం :19
    ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
    ఖితమతు లైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
    మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే
    వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే.
    పద్యం :20
    పరమార్థంబులు బోధసేయుదురు లోభ స్వాంతులై నిత్యమున్
    గురువుల్ ముక్కుకుసూటిగా దగులు యుక్తుల్ పన్ని కైవల్యపుం
    దెరువుల్సూపి మహాపరాధివనుచున్ దీర్మానముల్ సేయుచుం
    దురు వేదాంతరథంబు సాగదనుకొందున్ నేను లేకుండినన్.

ความคิดเห็น • 283

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +55

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @shyamsundercheruku2356
    @shyamsundercheruku2356 3 ปีที่แล้ว +56

    అందరూ చీదరించకునే గబ్బిలాన్ని కావ్య రచనకు ఎంచుకొని దళితుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా తెలియపరిచారు జాషువాగారు. చాలా మంచి పద్యాలు. మీరు కష్టపడి ఇన్ని పద్యాలు చదివి వినిపించినందుకు మీకు, మీ ఓపికకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏👍

  • @shreesailam999
    @shreesailam999 ปีที่แล้ว +13

    మీ గళం ఒక అద్భుతం.
    మీ గాత్రం అమోఘం , అనర్గళం.
    మీకు మా మనస్సుమాంజలి.🙏🙏🙏

  • @brlreddy9473
    @brlreddy9473 3 ปีที่แล้ว +20

    అర్థాలతో వివరించి యుంటే నాలాంటి సామాన్యుడు కూడా ధన్యుడై ఉండేవాడు..
    గురువు గారూ..

  • @ramanaraonattuva8351
    @ramanaraonattuva8351 ปีที่แล้ว +12

    జాషువాగారి “గబ్బిళం” గురించి వినటమే గాని, దర్శనభాగ్యం మీద్వారా కలిగినందుకు ధన్యులం..🙏

  • @krishnaprasadbabu603
    @krishnaprasadbabu603 3 ปีที่แล้ว +18

    గురువు గారు
    అర్ధం తో వివరించి మాలాంటి సామాన్యులకు అర్ధమయ్యేటట్లు చెయ్యగలరు.మీకెంతో రుణపడి ఉంటాను.

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +15

    పద్యం :41
    పక్షిసుందరి నీ చిన్న కుక్షి నిండ
    నిన్ని నీరంబు బాలహార మున్న జాలు
    నెన్ని దేశాలు తిరిగిన నేమి నీకు
    నీవు నావలె బుట్టుబానిసవు కావు
    పద్యం :42
    తడవైనన్ గుడి గోపురంబులను సందర్శించుచుం బొమ్ము నీ
    కడవుల్ కొండలు నడ్డు సేయువుగదమ్మా వ్యోమయానంబునన్
    సుడిగాల్పు ల్సెలరేగినన్ నిలువవచ్చుం ధర్మసత్రాలలో
    బిడుగుల్ వడ్డ బ్రవేశయోగ్యతలు పాపన్నా కు లేవచ్చటన్
    పద్యం :43
    అందందు ఫలవనంబుల
    విందుగుడుచు చల్ల నల్ల విశ్రామ మణీ
    మందిరముల నిద్రించుచు
    ముందుకు జనదోచు నెన్నొ పుణ్యస్థలముల్
    పద్యం :44
    కొమరారు దంజనగరము
    సమీపమున గలదు తెలుగు సౌరభ్యంబుల్
    గమ గమ వలచిన చోటది
    యమరున్ రఘునాథరాజు నాస్థానంబున్
    పద్యం :45
    కృష్ణరాయలవారి యెడబాట్లు చీకట్లు
    ముసరి దిక్కులలోన మసలువేళ
    భూరి వాజ్మయలక్ష్మి దారిబత్తెముతోడ
    దంజాపురమువంక దరలు వేళ
    వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి
    శ్లేషోక్తు లలవాటు సేయువేళ
    బచ్చ పచ్చని ముద్దుపళని ముద్దుల కైత
    శృంగార రసము వర్షించువేళ
    మువ్వగోపాల దేవుని పూజసేయ
    ఘనుడు క్షేత్రయ కలమందుకొనినవేళ
    నపరరాయలు రఘునాథ నృపతి విభుడు
    కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టిమంబు
    పద్యం :47
    తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
    మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
    బునకున్ ద్రావిడభూములం గడచి పోబోదోచెడిన్ వాడువా ఱని శౌర్యంబుసుమించు దెల్గు పొలిమేరన్ నేత్రపర్వంబుగన్
    పద్యం :48
    యతియుంబ్రాసయులేని సంస్క్రుత కవిత్వారణ్యమందున్న భా
    రతవేదాన బదేనుపర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
    శ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
    నతులర్పింపుము స్నానమాడు మతి గణ్యంబైన పెన్నానదిన్
    పద్యం :49
    ఒకపల్కు జాణతనమున
    సకియలు నెల్లూరుసీమ సత్కవి వరులం
    దికమకలు పెట్టగలరని
    పుకారు గల దది యబద్ధమో నిక్కువమో
    పద్యం :50
    హంపీక్షేత్రము జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపునై
    లింప శ్రీల కొకానొకప్పుడది కేళీరంగ మేతద్రమా
    శంపావల్లరు లాణిపోయిన బ్రదేశంబందు నీ బందుగుల్
    కొంపల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్

  • @kavuturinaresh8609
    @kavuturinaresh8609 3 ปีที่แล้ว +17

    మరో కాళిదాసు గుర్రం జాషువా గారు 🙏🙏🙏

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 3 ปีที่แล้ว +20

    కవి గారూ చాలా సంతోషము. మదికి ఆనందంగా యున్నది. జాషువా గారు మనలను గబ్బిలం ద్వారా దక్షిణము నుండి ఉత్తరానికి తీసికొని వెళ్లినారు. పద్యపరిమలమునకు మీరు వన్నె తెచ్చినారు. Thank you, Reddi garu.

  • @tjpcreativethinks5655
    @tjpcreativethinks5655 3 ปีที่แล้ว +15

    సార్ గబ్బిలం కవ్యా గానం అద్భుతంగా చేసినందుకు జై భీమ్ సార్...
    పద్యం లోని ప్రతి పద అర్థం కూడా
    దయచేసి తెలియ చేయగలరు సార్...
    🙏🙏🙏💐💐💐✊✊✊

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 ปีที่แล้ว +6

    పద్య పరిమళం నిర్వహణ సాహసోపేత మైనదీ
    పద్య గానం అద్భుతం
    ఆడుకొనుట సాహితీ ప్రియుల బాధ్యత
    అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం

  • @tirukoppala8112
    @tirukoppala8112 3 ปีที่แล้ว +12

    మీరు పాడునప్పుడు.....పద్యం తెర మీద కనబడుతుంటే .....చాలా బాగుండేది గురువు గారు.

  • @tejasamsani1849
    @tejasamsani1849 3 ปีที่แล้ว +9

    చాలా మంచి ప్రయత్నం.
    చాలా బాగా పాడారు కూడా.
    పద్యాన్ని ఆలపించడంతో పాటు దాని భావాన్ని కూడా వివరించగలిగితే మాలాంటి సామాన్యులకు ఇంకా సులభంగా అర్ధం అవుతుంది.
    దయచేసి ఆ కోణంలో ప్రయత్నించమని మనవి.🙏

  • @kandibandanarayanarao3875
    @kandibandanarayanarao3875 2 ปีที่แล้ว +13

    జా షు వా గారి గబ్బిలం కావ్యం లోని పద్యాలను శ్రావ్యంగా గానం చేసి అలరింపజేసిన మీకు ధన్యవాదాలు.

  • @Icon239
    @Icon239 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన కావ్యం ప్రతి తెలుగు విద్యార్థి తెలుసుకోవాలు ఈ కావ్యాన్ని ఐదవ తరగతి నుంచి ఒక ఒక పాఠంగా చెప్పాలి అప్పుడే మంచి యువతరం రాగలదు

  • @appalacharyulub1540
    @appalacharyulub1540 ปีที่แล้ว +8

    పద్య పరిమళం ఛానల్ వారికి ధన్యవాదములు 🙏🙏🙏
    సార్ మీరు పద్యం చదువు తున్నప్పుడు ఆ పద్యాన్ని కూడ స్క్రీన్ పై చూపించు గలరని కోరి ప్రార్దించుచున్నాను 🙏🙏🙏

  • @gorlegovindarao5469
    @gorlegovindarao5469 3 ปีที่แล้ว +6

    మీ ప్రయత్నననికి జోహార్లు గురువుగారు

  • @madhunlrr
    @madhunlrr 3 ปีที่แล้ว +9

    ఏంత మధురమైన గొంతు sir మీది 💐💐💐🙏🙏🙏🙏 జాషువా కవితాత్మను ఏంతో గొప్పగా ఆవిష్కరించినారు thank you sir

  • @VellasiriSivasankar
    @VellasiriSivasankar 12 วันที่ผ่านมา

    మహాకవి సన్మానసభకు పండితులు అధ్యక్షులు గా ఉండు అవకాశం వదులుకుని మహోపకారం చేసినా కావ్య మాధురి నేటికి కూడా మనసులమాలిన్యాలను కడుగుతూనే ఉంది ఈ "గబ్బిలం ".

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +9

    పద్యం :109
    జడనిధివంటి మానసము సాటికిరావు సరస్సులెల్ల నం
    దుడుగక రేగు పేరలల యూపున గట్టులదాకి ప్రాణముల్
    విడిచిన గండు చేపలు గుళీరము లెల్లడ దీరభూములం
    దడుగిడరాక చీకి వికలాంగములై పడియుండు గుట్టలై
    పద్యం :110
    దమయంతీ నలులకు దౌ
    త్యము చేసిన తొంటి పసిడి హంస విభుని చు
    ట్టములందు పంకజోద్యా
    నములందున నాలపింత్రు నైషధ కథలన్
    పద్యం :111
    నిండిన దోరవెన్ననెలల నిక్కిన పచ్చిక మేసి చాందినీ
    కొండబయళ్ళలో దిరుగు గోపతి నీకగుపించు నందు వే
    దండవిరోధి దాల్చి జటులాటవి బూచినపూవు చంద్రమా
    ఖండము గోచరించు నెఱుకల్గల నీ కెఱగింప నేటికిన్
    పద్యం :112
    విలు నమ్ముల్ ధరియించి చెంచులు తదాభీలాటవీమధ్య భూ
    ముల గన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
    క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
    దుల వేటాడుచు భీల్లుడై నరుల కన్నుల్ గప్పి క్రీడించెడిన్
    పద్యం :113
    అచ్చోటి తబిసి రాజులు
    నిచ్చలు దపమాచరించు నీ కాతిథ్యం
    బిచ్చెదరు పరుల విద్యలు
    మెచ్చెద రీ గుణము నేడు మృగ్యంబు కదా
    పద్యం :114
    ఇప్పటికి గూడ గ్రొంబొగ లెగయుచున్న
    త్రిపురముల ప్రాత బూడిద దిచ్చి లచటి
    కనతి దూరాన నీకు బ్రత్యక్ష మగును
    చిత్రముగ పానమున కెంత చేవ గలదొ
    పద్యం :115
    వలరాజు పగవాని గొలచి ముందుకు సాగు
    తొలకరించిన నీలి జలధరంబు
    మహిషుని వనిత లుమ్మలికింప గర్జించు
    సితికంఠు నిల్లాలి సింహరమణి
    కొసరి దిక్కులు మేలుకొలిపి గానము సేయు
    కొమరుసాముల వారి కోడిపుంజు
    తలమీద రతనాలు మొలిచి ముద్దులుగార
    నటియించు సర్పంబు నటకురాలు
    పద్యం :116
    కనుల జూచి రమ్ము కైలాసభూముల
    వింతలెల్ల దెలుప వేళకాదు
    నీకు శుభము గల్గు నిఖిలామరశ్రేణి
    సరసుడమ్మ బాలచంద్ర ధరుడు
    పద్యం :117
    రేగిన గంధపుందరు పరీ మళముంగని మోసపోయి యం
    దాగి పదంబుమోపవల దచ్చట కొమ్మల నాశ్రయించి మి
    న్నాగులు తాండవించు మరణంబును బుక్కిటబట్టి యాపదల్
    డాగిన తావులే వలపులం దొణికించి మనస్సు నీడ్చెడిన్
    పద్యం :118
    పుడమి ననంతకాల రథమున్ గదలించి మనుష్యకోటిపై
    నడిపి నశింప జేయు యతనంబులు నీ బెదరింపు లిచ్చటన్
    బడవని రుండమాలికలు పండ్లిగిలించి వెడంద నోళ్లతో
    మృడుని గళంబునన్ జెనటిమృత్యువుతో వెకసక్కె మాడెడిన్
    పద్యం :119
    ఒలికిపోయిన పండెవెన్నెలల పాలు
    క్రోలుచున్నది తపిత చకోరకంబు
    ప్రొద్దువోయెను నీ చిన్న భోజనమును
    వెదకికొన బొమ్ముతబసి గబ్బెతల రాణి
    పద్యం :120
    వీనులు చిన్నవోవ వినిపించు నదె డుబుడక్కువాని ఢ
    క్కా నినదంబు తూరుపు ముఖంబుగ హైందవవీధి సభ్యతా
    స్థానముగల్గు తాను మన సఖ్య మెరింగిన గంటగించు నో
    మౌనిశకుంతమా చను ముమాపతి మేడకు గోడి గూసెడున్
    పద్యం :121
    న న్నొకమారు నీ దరిసెనంబున ధన్యుని జేసి భర్గుడే
    మన్నది చెప్పి పొమ్ము విబుధాలయ వాసిని నాకు లేరు నీ
    కన్య శరణ్యు లాప్తులు వికాసితమైనవి తూర్పు రేఖలున్
    కన్నపు దొంగతోడ సదనంబునకుం జనుమమ్మ పక్షిణీ
    పద్యం :122
    ద్వారములు లేని నాదు కుటీర లక్ష్మి
    స్వాగతం బిచ్చి నీకు మర్యాదచేయు
    నా యనుజ్ఞకు వేచియుండంగ నీకు
    వలదు వలదమ్మ రాత్రిం దివంబులందు
    పద్యం :123
    నిద్దుర మేల్కొని యల్లన్
    ఖద్దరు రాట్నంబు పౌరకాంత వహించెన్
    ప్రొద్దు పసివాడు తూరుపు
    ముద్దియ పొత్తిళ్ళలోన ముద్దులు గురిసెన్
    పద్యం :124
    వాని యిష్టార్థములు కూర్చుదాని వోలె
    విశ్వనాథుని గుడికి గబ్బిలము సనియె
    వేయిచేతుల పెనుకాపు వేగిరింప
    గచ్చ బిగియించె నప్పేద కార్మికుండు

  • @emuddarangappa1308
    @emuddarangappa1308 11 หลายเดือนก่อน +2

    పద్యం పరమళం సభ్యులు అందరికీ నా సాష్టాంగ నమస్కారములు.
    మీ పద్య పఠనం భావాన్ని ప్రస్ఫుటంగా వినిపించేస్తున్నాయి.మనో చిత్రపటం పై కనిపించు చున్నవి.అమోఘం.అత్యద్భుతం.❤❤❤

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 ปีที่แล้ว +2

    మీ గొంతు నుండి పద్యాలు జాలువారుతుండగా నిశ్శబ్ద నిశీధి సమయంలో మధురానుభూతిని పొందుతూ మొదటి పద్యంతో మూసిన కళ్ళు చివరి పద్యం వరకు తెరువలేక లీనమై పోయి ఒక ధ్యానానుభూతిని అనుభవించాను. ధన్యవాదాలు. నమస్సులు. కావ్యామెంతో అద్భుతం, మీ ఆలాపన ఎంతో మధురం.

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +7

    పద్యం :71
    అమృతమ్ము విషము వాక్కున
    నమరిన కవిరాక్షసునకు నావాసంబై
    కొమరారు నపరకాశిక
    సుమి కడు మహిమాడ్యమైన చోటది పతగీ
    పద్యం :72
    అల బుస్సీ దొర కొల్లగొట్టిన యనన్యంబైన మావెల్మవీ
    రుల విఖ్యాతపరాక్రమజ్వలన మూర్పుల్ జిమ్ముచున్నట్టి బొ
    బ్బిలి కోటం గని దాటిపొమ్ము చటులావేశంబు దేహంబునన్
    మొలుచున్ బొల్చు కవోష్ణవీర రుధిరంబున్ జీవనాళంబులన్
    పద్యం :73
    నాయెడ జాలిలేక చరణంబున గత్తులు గట్టి ప్రాణముల్
    దీయదొడంగు రాజవితతిం దెలవార్చితి దెల్లవారునే
    నాయులివాలకింపని యనంత విభావరులంచు గొక్కురో
    కోయని కూయుచున్న దదిగో తొలికోడి బడాయికొట్టుచున్
    పద్యం :74
    పూసపాటివారి ముఖ్యపట్టణమైన
    విజయనగరమందు విశ్రమించి
    జగము దద్దరిల్ల సకిలించినది తొల్లి
    రాయరావు తుల గురాలదండు
    పద్యం :75
    కరవాలంబున గొల్చి రాయలు పరిష్కారంబు గావించుచున్
    సరిహద్దుల్ సవరించినాడటు లొరిస్సాదాక ఆరాజభా
    స్కరుడెత్తించిన బొట్టునూరి విజయస్థంభంబుపై వేలుపుం
    దెఱవల్ నిల్చి పఠింతు రాంధ్రులవిభూతిన్ ముక్తకంఠంబులన్
    పద్యం :76
    నీవు బొబ్బిలి మీదుగా నిర్గమించి
    మన్యము తరించి కొన్ని యామడలు నడువ
    పలుచబడిపోవు మన జిల్గు తెల్గు శోభ
    తావు లెగజిమ్ము నోడ్ర వాతావరణము
    పద్యం :77
    తేటయైన తీపినీట దిక్కులదాక
    విస్తరించి రుచులు గుస్తరించి
    చిల్కసంద్ర మింపు సేయుచు గన్పట్టు
    స్వచ్ఛమైన తెల్గు భాష వోలె
    పద్యం :78
    చిట్టి మరు దంకురంబుల
    బుట్టిన కెరటాల మొత్తములు తీరములన్
    గొట్టుకొని మరలిపోవును
    గట్టులెగయ జూచు చిలిపి కవనములవలెన్
    పద్యం :79
    తగులు న్నీకట మార్గమధ్యహమున బౌద్ధస్తూప శైథిల్యముల్
    మగధోర్వీశుల రాణివాసములు లీలాభర్మ హర్మ్యావళుల్
    జగముల్మెచ్చిన శాక్యసింహుని యహింసాసూక్తి మాధ్వీక ని
    మ్మగలం దేలిన పుణ్యభూములు నలందా పాటలీ పుత్రముల్
    పద్యం :80
    ముక్తి దంబులైన పుణ్యస్థలములందు
    బ్రథమగణ్య మమ్మ వారణాసి
    అన్నపూర్ణ సేయు నాహారభిక్షతో
    ముక్తిభిక్ష నీకు ముట్టగలదు

  • @lalithakala3961
    @lalithakala3961 3 ปีที่แล้ว +14

    గురువుగారు మీరు అందిస్తున్న సాహిత్య సేవకు మీము జీవితాంతం రుణపడి ఉంటాం🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐💐

    • @anilthejoshna6177
      @anilthejoshna6177 3 ปีที่แล้ว

      దయచేసి రుణం అనే పెద్దపెద్ద పదాలను వాడవలదని మనవి.

  • @mishnah368
    @mishnah368 11 หลายเดือนก่อน +1

    ఈ రోజే గుర్రం జాషువాదైన మీ గబ్బిల గానం పూర్తిగా విన్నాను. ఇంత బాగుంటుందని నాకు తెలియదు. చదివే ప్రయత్నం చెయ్యలేదేమో!
    మీకు చాలా ధన్యవాదములు.

  • @mittapallichandraiah8869
    @mittapallichandraiah8869 3 ปีที่แล้ว +16

    అద్భుతమైన పద్యాలను, శ్రావ్యమైన కంఠంతో ఆలపించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్... 🙏🙏

    • @srinivasgajarla2805
      @srinivasgajarla2805 2 ปีที่แล้ว

      అద్భుతం గా ఉంది మీ స్వరం 🙏🙏

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 ปีที่แล้ว +5

    మహాకవి జాషువా గారి రచనలు చాల గొప్పగా ఉన్నావి....ధాన్యవాదములు మీకు

  • @bnrao9787
    @bnrao9787 หลายเดือนก่อน +1

    భారత్ మాతాకీ జై మీ గాయత్రి స్వామి

  • @narasimharaokyl4438
    @narasimharaokyl4438 หลายเดือนก่อน

    చాలా అద్భుతమైన గొంతు.విన్నాకొద్ది వినాలనిపిస్తుంది.

  • @arpularavitelugu6843
    @arpularavitelugu6843 2 ปีที่แล้ว +6

    నమస్కారం సార్ చాలా అందంగా చెప్పారు సార్ ఈ పద్యాల యొక్క భావాలు కూడా వేరే పార్టులో వివరణ చెపితే బాగుంటుందని నాయొక్క మనవి సార్ 🙏

  • @netetiganeshwararao9731
    @netetiganeshwararao9731 ปีที่แล้ว +4

    పద్యకవితోద్ధరణకు చేసే
    మంచిప్రయత్నంబాబూ
    అభినందనలు

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +5

    పద్యం :91
    షాజాను నశ్రుజలకణ
    మీ జగముపురంధ్రి దాల్చు నేడవ నగ ముం
    టాజమహలు నిద్రించెడు
    తాజమహలు దృశ్యమద్భుతంబు పతంగీ
    పద్యం :92
    కుహనా గోపుం డాగమ
    రహస్యమగు గీత బాహిరము చేసిన శ్రీ
    మహిత కురుక్షేత్రంబున
    విహార మొనరించి పొమ్ము విహగవధూటీ
    పద్యం :93
    సుజనస్తుత్యుడు బోధిసత్వధరణీశుండర్ధరాత్రంబునన్
    నిజవాసంబు బరిత్యజించి యతిశాంతి స్థాపనేచ్ఛా మనోం
    బుజుడై బిచ్చ పు గిన్నె దాచ్చిన మహాపుణ్యప్రదేశంబులన్
    మజలీ సేయుము రెండునాళ్ళు ఖగభామా జన్నసిద్ధించెడిన్
    పద్యం :94
    లుంభినీ వనపు పరిమలోల్లసిత మగుదు
    నే గుదెంచెడు నీకర్ఘ్య మీయ గలదు
    గౌతముం డాదరించిన కనకహంస
    నీరు గలియని మధుర గోక్షీరధార
    పద్యం :95
    దర్శింపగలవు గౌతమబుద్ధదేవుని
    ప్రాచీన భరత శిల్పంబునందు
    సాధింపగల వహింసా మంత్రరాజంబు
    శాక్యసింహుని కాలి జాడలందు
    తెలిసికోగలవు బౌద్ధుల సాహితీ సేవ
    అమరసింహుని కవిత్వమునయందు
    వీక్షింపగలవు కపిలవస్తు నగరంబు
    నాశన దేవ్యధీనంబు నందు
    పద్యం :96
    రెండువేలేండ్లు క్రింద నిద్రించుచున్న
    మౌర్యరాజుల విపుల సామ్రాజ్య చరిత
    యేకరువు పెట్టు ప్రకృతి యం దాకళించి
    వెచ్చ వెచ్చని కన్నీరు విడువగలవు
    పద్యం :97
    అక్కడనుండి యుత్తర దిశాభిముఖంబుగ నిర్గమించు నీ
    దృక్కుల నడ్డుచున్ హిమగిరీంద్రము దర్శనమిచ్చు దానిపై
    నెక్కగనెంచి తెల్లదొర లీలిగిరెందరొ వారి దేహముల్
    స్రుక్కవు నేటికిం బులుగు సుందరి మంచుమహత్త్వ మెట్టిదో
    పద్యం :98
    కరగిన మంచు బండలు ప్రగఢభరంబున బట్టుదప్పి, త
    ద్గిరి శిఖరాల నుండి తలక్రిందులుగా దిగజారి లోయలన్
    దిరిగెడు జీవరాసుల వధించుచు నుండును పేదవారికిన్
    జెఱపె కదా! జలాధికుల నేయుము సంయమి పక్షిభామినీ
    పద్యం :99
    అందు నెవరెష్టు శిఖారన నధవసించి
    వ్రాసికొనవచ్చు భరత వర్షంబు పటము
    దాని యున్నతి తారకాధ్వజము మిగులు
    సులలితములైన కవుల యూహలకు దరుగు
    పద్యం :100
    కలహంసల్ సనువాయుమార్గముల రేఖల్ పర్వతాగ్రంబునన్
    గలవాత్రోవల దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్ ప్రోన్నతం
    బులు నీకుం జన గాదు నిచ్చలు నిలింపుల్ గుంపు లై రాకపో
    కలు గావించెడు వెండి కొండ వెరవుల్ గన్పట్టు నైమూలగన్

  • @murthyavs6885
    @murthyavs6885 11 หลายเดือนก่อน +1

    ఆ యభాగ్యుని రక్తంబునాహరించి ఇనుపగజ్జలతల్లి జీవనం.....అద్భుతమైన రచన.కర్మ సిద్ధాంతమున నోరు కట్టివైచి .....ఆలోచన చేయవలసిన పద్యం

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 3 ปีที่แล้ว +5

    గుర్రం జాషువా గారి "ఫిరదౌసి లేఖ" కూడా చాలా అద్భుత కావ్యం.

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +6

    పద్యం :81
    నదుల తోడికో లదధీశు పెదభార్య
    జాహ్న వీ స్రవంతి జలము దేర
    అతిథి పూజ సేయ నన్నపూర్ణాదేవి
    వారణాసి గూడి వారణాసి
    పద్యం :82
    కలరు కళాసముద్రములు గట్టులు రాయగ నీదినట్టి ధీ
    విలసితులైన పండితులు పెక్కురు వేదపురాణ శాస్త్రముల్
    బలికిన సత్కవీశ్వరుడు వ్యాసమునీంద్రుడు శిష్యకోటితో
    మెలగె నొకప్పుడుండు నట మేచక కం
    పద్యం :83
    మొగలాయి చక్రవర్తుల
    మృగాంక కేతనము నింగి మెఱసిన ఢిల్లీ
    నగరంబు దృష్టి గోచరా
    మగు ప్రోన్నత సౌధుచుంబితాం బోధరమై
    పద్యం :84
    ఆ ఢిల్లీపుర హస్తినాపురి సమాఖ్యన్ ద్వాపరంబందుగొం
    డాడం బడ్డది ధర్మజుండచట రాజ్యంబేలి చేయించినా
    డీడుం జోడును లేని జన్నముల నెన్నే గన్నులున్నందుకున్
    జూడన్ డగ్గ పురంబు సమ్మచట వీచున్ భోగసౌరభ్యముల్
    పద్యం :85
    ముడిచె నిచ్చట కుంతి కొడుకు ద్రోవది కొప్పు
    పగవాని రుధిరంబు పరమళింప
    మెరసెనిచ్చోట నాదురుషా కుఠారంబు
    నిఖిల భారతము కన్నీరు నింప
    వెలసె నిచ్చోట పచ్చట బర్హిపీఠంబు
    షాజానురాజునాస్థానవాటి
    పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజొక రోజు
    జయచంద్రు సుతను దోస్సార గరిమ
    పద్యం :86
    యుగయుగాల కథల నుదరాన జీర్ణించి
    రాజరక్త నిర్ఘరముల దేలి
    నవ్వుచున్న ఢిల్లి నగరంబు నందంబు
    తరుగులేదు శిరము నెరయ లేదు
    పద్యం :87
    సులతానీ సులతానులన్ మణిగణాంశుల్ దట్టుమిట్టాడుమే
    డలలో వాసము చేసినారు నిజరాష్ట్రంబాకటందూలబే
    దలనోరూర భుజించినారిచట ముక్తారత్న పాత్రంబులన్
    గలమాన్నంబు సుఖించినా రఖిల భోగశ్రీ మహాడోలలన్
    పద్యం :88
    కుతుబుద్దీనుడు నిల్చిన
    కుతుబుమినారనెడు గొప్ప గోపురము సము
    న్న తమయ్యు జెక్కు చెదరదు
    శతాబ్దములనాటి శిల్ప చకచకితం బై
    పద్యం :89
    చామనచాయ గలట్టిది
    కామజనకు ననుగుభార్య కాళింది వినీ
    లామల కోమలవీచి
    చామరములువీచి నీకు స్వాగతమిచ్చున్
    పద్యం :90
    సూనుని కాయిలా తనకు జొప్పడు లాగు సమాజుజేసి య
    ల్లానలరించి యాదిమొగలాయి నరేంద్రుడు బేబెరుండుమా
    యూనున కాయురున్నతులు సృష్టియొనర్చిన చిత్రగాథ ఆ
    గ్రానగరంబు కర్ణ శుభగంబుగ నీకు నుపస్యసించెడిన్

  • @karunakarreddy9202
    @karunakarreddy9202 3 ปีที่แล้ว +20

    Excellent, it is indeed a revaluation in Telugu "sahityam" the pain in each " padyam" can be felt, this is not a poetry said by a soul, this is a poetry felt by a soul.
    No words to pay tribute to the great poet

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 ปีที่แล้ว +4

    చాలాచాలా బాగున్నాయి జాషువా పద్యాలు పరిమళింపు మొత్తం మూతిని తరువాత భావమంతయు కథగను చెప్పి మమ్మానందింపచేయ గలరని ప్రార్థించున్నాను. 🙏

    • @padmavathiyakkanti8040
      @padmavathiyakkanti8040 ปีที่แล้ว

      టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మన్నింపగలరు

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 3 ปีที่แล้ว +12

    Melodious singing. Heart touching 🙏🙏🙏🙏🙏

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 ปีที่แล้ว +1

    గబ్బిలం యొక్క ప్రయాణ వర్ణన ఎంతో విజ్ఞానదాయకము, అద్భుతము.

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 ปีที่แล้ว +2

    గురువుగారికి ధన్యవాదములు.

  • @jamindarbuddiga3328
    @jamindarbuddiga3328 11 หลายเดือนก่อน +1

    you are great sir. Paturi Kondal sir. Hatsoff to Jashuva garu

  • @bsatyanarayanabhagavatula3149
    @bsatyanarayanabhagavatula3149 11 หลายเดือนก่อน +1

    Maha kavi sri Jashuva vari padyalu pustaka rupamulo chadive opika kontha madiki undadu . Kani meeru chadivina sili madhuryam mammalini entho akattu kunnadi . Mee kantham entho sravyamuga unnadi. Dhanyavadalu.

  • @sudhamadhuraalu8797
    @sudhamadhuraalu8797 2 ปีที่แล้ว +3

    Thank you P. Gondal Reddy garu🙏👍👍👍
    From California USA

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +5

    పద్యం :101
    విహిత కైలాసయాత్రగావించు నిన్ను
    మంచుకొండల విభు డాదరించగలడు
    అల్లునకు గూతునకు వార్త లంపునేమొ
    సమ్మతింపుము నుడులు భారమ్ముగావు
    పద్యం :102
    అస్త్రవిద్యాభ్యసన వేళ నుద్భుతముగ
    కొంచకొండకు రంధ్రంబు గొట్టినాడు
    చిన్నతనంబున బార్వతి చిన్న కొడుకు
    తారకాగిరి కదియ యుత్తరపు గవిని
    పద్యం :103
    గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప
    మస్తమునదాల్చు మొక చిన్ని మంచుతునక
    విసపుమేతరి కది సిఫారసుగ నుండు
    వ్యర్థములుగావు పెద్దల పరిచయములు
    పద్యం :104
    మంచుఫలించు నగ్గిరులమాడు ల గారు మొయిళ్ళపై నుడా
    యించు గమింపు మవ్వల మహేంద్రుని వీడు త్రివిష్టపంబు గ
    న్పించు డలాయిలామలను వింత నృపుల్ పరిపాలనంబు సా
    గించెద రిప్పు డచ్చరలు క్రీడ యొనర్పరు నందనంబునన్
    పద్యం :105
    ఆలామాలకు బెండ్లి పేరటము లే దాజన్మసన్యాస దీ
    క్షా లగ్నాశయులై ధరింతు రతి దీర్ఘంబైన కుళ్ళాయముల్
    మౌళిన్ వారి యనుజ్ఞలేక విహరింపంబోల దెవ్వారి కా
    నేలన్ బక్షివి నీకు బోదగని క్షోణీమండలం బుండునే
    పద్యం :106
    ఆ రాజ్యంబును గూబపట్టుకొని బిట్టాడించుచుండున్ దురా
    చారంబుల్ వెడ నమ్మకాల కది వాసస్థాన మస్ప్రు శ్యతా
    క్రూరవ్యాఘ్రము సంచరించుటకు సంకోచంబులే దైన బౌ
    ద్దారామంబులు సాగనీయవు గదమ్మా! దాని యవ్ ద్ధత్యమున్
    పద్యం :107
    అసమ రుచిరాంబువైన మానస సరస్సు
    కన్న కూతురు బుడుత గంగాభవాని
    యెక్కి దిగుచుండు కొండల చక్కదనము
    ప్రేక్షణీయంబు సుమ్ము గబ్బిలపుదేవి
    పద్యం :108
    బలిసిన మేనులన్ జడల బఱ్ఱెల కొమ్మల వింత సింహముల్
    బలె విహరించు కొండల యుపత్యకలన్ సెలయేటినీళ్ళ గ్రో
    ల్పులుల కళేబరా లచటి లోయలలో బొరలాడు వాని య
    మ్ములకెనయైన శృంగములు పోటుల దూటులు బట్టపొట్టలన్

  • @jojappajojappa44
    @jojappajojappa44 2 ปีที่แล้ว +6

    Congratulations brother for interest of jashuva poet's

  • @user-hf1rp9pq1w
    @user-hf1rp9pq1w 11 หลายเดือนก่อน +1

    గబ్బిలం అనే కావ్యం ఎన్ని సార్లు చదివినా అర్దం చేసుకోవడం ఎలాగో తెలియలేదు...కానీ మీరు పాడిన పద్యం వినడం వల్ల నాకు చాలా బాగా అర్దం అయింది. 👏

  • @user-bj7pr7gz5x
    @user-bj7pr7gz5x 11 หลายเดือนก่อน +2

    Sir..., నిజంగా మీరు నమ్మరు, మీ వీడియో పూర్తి అయి phone పక్కకు పెట్టినతర్వాత కూడా ఆ ధ్వనులు చెవులకు అట్లాగే వినబడుతున్నట్టు అనిపిస్తుంది. ❤❤❤

  • @sayulugundu3965
    @sayulugundu3965 11 หลายเดือนก่อน +1

    After so many years after I could hear padyalu from a good voice.

  • @rajeshkanna8144
    @rajeshkanna8144 2 ปีที่แล้ว +2

    Chala gopaga veenekodi veenalani pisthundi sir thank you so much

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +7

    పద్యం :61
    కృతులంది కృతు లొసంగిన
    వితరణ రతులైన కొండవీటి నృపుల యు
    న్నతియుం బతనం బిప్పుడు
    కృతులై కొండల నలంకరించి జితించెన్
    పద్యం :62
    విసిగి విరక్తిచే దెలుగు వీధులలో నొక పిచ్చివానిగా
    మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాశుధారగా
    విసరిన కావ్యముల్ శ్రవణ పేయముగా బ్రతిశబ్ద మీనెడిన్
    దెసల నలంతి పోలికల దీయదనంబున భావసంపదన్
    పద్యం :63
    జలదవ్రాతము తోడుగా యవల గృష్ణాతీర దివ్యస్థలుల్
    గలయంగ్రుమ్మగ సాగిపొమ్ము కవిలోకబ్రహ్మ నన్నయ్యకున్
    నిలయంబై తగు రాణ్మహేంద్ర పురికిన్ విద్వత్స భారంజిత
    స్థలికిన్ బూర్వచళుక్య భూపతుల రత్నస్థాపితానికిన్
    పద్యం :64
    ఎచ్చట జూచినన్ బ్రతిపదించు కళంబలె బచ్చపచ్చగా
    రచ్చలకెక్కు గన్నడ సరస్వతి నారయ మానసంబులో
    ముచ్చరకించి నన్నకవిమాన్యుడు రాజమహేంద్రునాన దా
    నిచ్చట జేయిజేసికొనియెన్ బ్రథమాంధ్రకవిత్వ సృష్టికిన్
    పద్యం :65
    రెండున్నర పర్వంబులు
    పిండిన రస మొలుకునట్టి పెను జెరకుగడన్
    బాండవుల చరిత నన్నయ
    పండించెన్ దెలుగులోన బ్రజ్ఞానితుడై
    పద్యం :66
    జనవిభుండైన విష్ణువర్థనుని నాటి
    గౌతమీగంగ నీకు స్వాగత మొసంగు
    వీరమాగాణముల నుద్భవిల్లునట్టి
    గఱకపోచయు నాకర్షకమ కదమ్మ
    పద్యం :67
    తొలి సారంగధరుండు వట్టి యపవాదు న్నెత్తిపైదాల్చిక
    త్తులపాలైన విషాదగాథ వినలేదో నీవు చిత్రాంగి మే
    డలలో మూలుగుచున్న విప్పటికిగూడ న్బావురాల్ నీతికిన్
    బలియైపోయిన రాజనందనుని దౌర్భాగ్యంబు నూహింపుచున్
    పద్యం :68
    అజ్జాయింతువొ చుట్టుమార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుం
    డుజ్జీలేని దయాస్వభావుడు ప్రభావోల్లాసి ముప్ర్పొద్దులున్
    గజ్జంగట్టెడి నాట్యగాడతడు సాక్షాత్కారమున్ జెందినన్
    మజ్జాత్యుద్ధరణంబుగల్గ గలదమ్మా పొమ్ము సేవింపగన్
    పద్యం :69
    నిద్దంపు లేత కస్తురి
    ముద్దవనుచు నిన్నుజూచి ముచ్చటపడి రా
    ముద్దియలు ముచ్చటించెద
    రొద్దిక శ్రీనాథకవి బహూకరణముగన్
    పద్యం :70
    అరవింద రత్న మండిత
    తరంగరథ మెక్కి విభుని దర్శనమునకై
    పరువెత్తుచున్న గోదా
    వరితోడుగ బొమ్ము దక్షవాటి నగరికిన్

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 4 หลายเดือนก่อน +1

    మహా అద్భుతం గురువు గారు

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +4

    పద్యం :1
    చిక్కినకాసుచే దనివి జెందు నమాయకు డెల్ల కష్టముల్
    బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
    ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
    డొక్కెడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై.
    పద్యం :2
    పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
    బ్రాపక మిచ్చినట్టి రఘునాధనృపాలకు డేలియున్న తం
    జాపురి మండలబునకు జక్కగ దక్షిణభాగ భూములన్
    గాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై.
    పద్యం :3
    ముప్పు ఘటించి వీని గలిమిన్ గబళించి దేహమున్
    బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా
    జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
    దెప్పుడు నప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్.
    పద్యం :4
    వాని రెక్కల కష్టంబు లేనివాడు
    సస్యరమ పండి పులకింప సంశయించు
    వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
    భోజనము బెట్టు వానికి భుక్తి లేదు.
    పద్యం :5
    వాని తలమీదబులిమిన పంకిలమును
    గడిగి కరుణింపలేదయ్యె గగనగంగ
    వాని నైవేద్యమున నంటు వడిన నాడు
    మూడు మూర్తులకును గూడ గూడు లేదు.
    పద్యం :6
    పామునకు బాలు, చీమకు బంచదార
    మేపుకొనుచున్న కర్మభూమి జనించు
    ప్రాక్తనం బైన ధర్మదేవతకు గూడ
    నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట.
    పద్యం :7
    వాని నుద్ధరించు భగవంతుడే లేడు
    మనుజు డెట్లు వాని గనికరించు
    వాడు జేసికొన్న పాపకారణమేమొ
    యింతవరకు వాని కెరుకలేదు.
    పద్యం :8
    ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
    యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
    గసరి బుసకొట్టు నాతని గాలిసోక
    నాల్గు పడగల హైందవ నాగరాజు.
    పద్యం :9
    కులములేని నేను కొడుకుల బుట్టించి
    యీ యఖాతమందె త్రోయవలెనె
    భార్యయేల బుట్టుబానిసకని వాడు
    జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష.
    పద్యం :10
    ఉదయమాది రక్త మోడ్చికష్టముజేసి
    యినుని సాగనంపి యిల్లు సేరి
    యున్న గంజిద్రావి యొక్కనాడా పేద
    ప్రక్కమీద యేను వాల్చియుండె.

  • @mungarakoti5436
    @mungarakoti5436 ปีที่แล้ว +1

    నమస్కారం సార్ .మీ అద్భుతమైన గాత్రంతో .9వతరగతి కొత్త సిలబస్ లోని పద్యబాగంలోని పద్యాలు గానం చేయగలరని మనవి

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 ปีที่แล้ว +3

    Thank you for sharing.,,great voice sir

  • @nyusa78
    @nyusa78 2 ปีที่แล้ว +5

    Very amazing poetry by Late Sri Gurram Joshua Gaaru . Great rendition by Kondal reddy gaaru . Thank you.

  • @vyasoruganti54
    @vyasoruganti54 3 ปีที่แล้ว +9

    Melting heart of jashua weeping soul of reddimastaru could be felt

  • @Jd-Virat
    @Jd-Virat ปีที่แล้ว +1

    జాషువా గారి గబ్బిలాన్ని కోకిల కంఠంలో గ్రహించి ధన్యులమయ్యాము🙏

  • @ramukolu9825
    @ramukolu9825 2 ปีที่แล้ว +5

    అత్భుతంగా.. పాడారు.. సర్👌👌💐💐

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 หลายเดือนก่อน +1

    ముందు గా మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఒక యజ్ఞం చేస్తున్నారు

  • @bikshamvelishala305
    @bikshamvelishala305 2 ปีที่แล้ว +7

    చాలా బాగా పాడారు సార్ 👍

  • @lalithakala3961
    @lalithakala3961 2 ปีที่แล้ว +2

    Adbhutham guruvugaaru 🌹🙏

  • @user-wr4ji7vp5r
    @user-wr4ji7vp5r 11 หลายเดือนก่อน +1

    💪 వేనవేల పాదాభివందనాలు

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +4

    పద్యం :31
    మృగపక్షిత్వ విచిత్రధర్మములు మూర్తిన్ దాల్చియున్నట్టి నీ
    మొగముం జూడదు లోక మట్టి శకునంబుల్ ప్రాతపట్టింపులు
    న్దగవీ పేదకు రమ్ము గబ్బిలపుచానా నాదు స్వాంతంబులో
    దిగులుంబాపి పినాకపాణి కొక సందేశంబు నందింతువా
    పద్యం :32
    ధర్మమునకు బిరికితన మెన్నడును లేదు
    సత్యవాక్యమునకు జావు లేదు
    వెఱవనేల నీకు విశ్వనాథుని మ్రోల
    సృష్టికర్త తాను సృష్టి వీవు
    పద్యం :33
    నరునకు జేరరాని సదనంబున వాసము సేయు నీశ్వరే
    శ్వరునకు నానమస్క్రుతు లుపాయనమిమ్మొకవేళ గారణాం
    తరముల వెండి పర్వతమున న్నివసించుచు నున్న బక్షిసుం
    దరి యొకపూట యానమకదా యిది నీకు బరోపకారిణీ
    పద్యం :34
    గౌరీనాథుడు కాశికిం జనెడు మార్గం రా మేఘపుం
    బాఱన్ జక్కలతోట నాటుకొని మింటన్నీకు గన్పట్టు నా
    దారిం బొమ్మొ కవేళ జూచెదవు భూతస్వామిని న్నీకు జ
    త్వారం బేర్పడి దారి దప్పెదవుగాదా భానుడేతెంచినన్
    పద్యం :35
    ఛత్రములవంటి నీతి పక్షములు విచ్చి
    నీవు బ్రహ్మాండమున బయనించు వేళ
    జిత్తజల్లుల ముమ్మాయి ముత్తియములు
    జలధరస్వామి నీమీద జల్ల గలడు
    పద్యం :36
    మొలక సంధ్యారాగమున గెంపు లెగ జిమ్ము
    జరమాచలంబున జరణమూది
    సెలయేటి నీట నీతటు గొట్టి విహరించు
    మరుదంకురముల సన్మానమంది
    కొండకొమ్ముల నెదుర్కొని తత్తునియలైన
    తోయదమ్ముల మీద దుఱగలించి
    కలహంస పొదిరి పిల్లలుసేయు మిన్నేటి
    జాంగలంబుల మీద సంచరించి
    పద్యం :37
    చిలుక లెంగిలింప జిటిలి తేనియలూరు
    స్వాదుఫలము లెలమి నారగించి
    కొన్ని నాళ్ళపాటు కుటిల సంసారంబు
    దిగులు మఱచి రమ్ము ఖగ వధూటి
    పద్యం :38
    స్వాతికాహారిణి తపశ్చర్య కతన
    నీ మనంబున జాలివెన్నెల రహించు
    నాదు కన్నీటి కథ సమస్వయము సేయ
    నార్ధ్ర హృదయంబు గూడ గొంతవసరంబు
    పద్యం :39
    బిడ్డల గని పాలిచ్చెడు
    దొడ్డతనంబున్న పుల్గు దొరసానివి నా
    కడ్డుపడ దిగిన వేలుపు
    గిడ్డివి నా మనవి నాలకించెదవు గదా
    పద్యం :40
    నీయవ్ దార్యగుణంబు మెచ్చెదరు సందేహంబు లేకుండగా
    నా యుష్మంతులు నీ కుమారులు మగండంగీకృతిం జూపి నీ
    వాయెత్తైన నగంబు కొమ్మల విహాయ స్కేశు నావాసమం
    చూయేలూగి కృతార్థురాలవయి రమ్మో పుల్గు పుణ్యాంగనా!

  • @pappalaarjuna3578
    @pappalaarjuna3578 2 ปีที่แล้ว +18

    అయ్యా మీరు పద్యం పాడుతున్నప్పుడు పద్యాన్ని కూడా తెరపై ప్రదర్శింస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @badampudijayarao5058
    @badampudijayarao5058 11 หลายเดือนก่อน +1

    , ,👌💥💫శతకోటీ.వందన్ మమ్మ

  • @muchapothuanil3186
    @muchapothuanil3186 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏 Abba Abba em voice sir 🙏🙏🙏🙏🙏

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 3 หลายเดือนก่อน +1

    చాలామంచి కంఠం మీది

  • @vunnamvenkaiah3953
    @vunnamvenkaiah3953 4 หลายเดือนก่อน +1

    Anaggralamuga padyaparila. My vinisanthasinchinaanu namaskaramulu

  • @narayanareddy7156
    @narayanareddy7156 6 หลายเดือนก่อน +1

    Excellent,

  • @lovarajuayinaparti1062
    @lovarajuayinaparti1062 3 ปีที่แล้ว +6

    శతకోటి ధన్యవాదాలు గురువు గారు, చాలా సంతోషం ఆ జగన్మాత మీకు మహాత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇచ్చుగాక

  • @vrattaluri9045
    @vrattaluri9045 ปีที่แล้ว +1

    మీ అభిరుచి., సాహితీ సేవ , పరి మళాలు నలుదెసల విరజిమ్ము తున్నాయి. 🙏🙏🙏

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +4

    పద్యం :21
    ఒగిసంసారము దిద్దుకొంచు గర మత్యుచ్ఛస్థితిం దూగుచుం
    బగలెల్లన్ మునివృత్తినుండి యనుకంపన్ శర్వరీ వేళలన్
    వగలందూలు దరద్రమూర్తుల సమాశ్వాసింపనేతెంచితే
    ఖగసన్యాసిని! యర్హురాల వకలంకంబైన మర్యాదకున్
    పద్యం :22
    గిరుల గుండెలు కరిగి నిరర్ఘమలట్టు
    లుబుకుచున్నవి దిశల నన్నూఱడింప
    బక్షికళ్యాణి, సోదర ప్రజలకండ్ల
    నిర్గమించెనె యొక్క కన్నీటిచుక్క
    పద్యం :23
    చుట్టాలేగద వాలఖిల్యు లిన తేజుల్ యోగవిద్యానిధుల్
    పుట్టుందాపసు లార్ర్దచిత్తులు మహాత్ముల్ వైనతేయ స్తుతిన్
    జెట్టుం గొమ్మ బరిత్యజించిన పరశ్రేయశ్శుభాకాంక్షు లో
    పిట్టా :నీకు నమస్కరించెదను నా విజ్ఞప్తి నాలింపవే
    పద్యం :24
    ఈ ప్రశాంతరాత్రి యెల్లలోకంబులను
    బుజ్జగించి నిద్ర బుచ్చుకొనియె
    నౌషధంబులేని యస్ప్రశ్యతాజాడ్యు
    మందభాగ్యు నన్ను మరచిపోయె
    పద్యం :25
    కర్మసిద్దాంతమున నోరు కట్టివేసి
    స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు
    కర్మమననేమొ దాని కీ కక్ష యేమొ
    యీశ్వరునిచేత ఋజువు చేయింపవమ్మ
    పద్యం :26
    ఆలయంబున నీవు వ్రేలాడువేళ
    శివుని చెవి నీకు గొంత చేరువుగ నుండు
    మౌని ఖగరాజ్ఞ, పూజారి లేనివేళ
    విన్న వింపుము నాదు జీవిత చరిత్ర
    పద్యం :27
    ఆపూజారులు విన్న నీకగును బ్రాయశ్చిత్త మీశానుడున్
    గోపించున్ వివరింప నేమిటికి నీకుం బొమ్ము వార్థక్యమున్
    దాపై పెంజెడ దెల్లనై నది నిశీధస్త్రీకి నాఖేటక
    వ్యాపారంబు ముగించి నీ పొరుగు గూబల్గూండ్లకున్ బోయెడిన్
    పద్యం :28
    పనిమించు నీ గరుత్తుల
    విసరి శ్రమంబడపి నన్ను బ్రేమించిన నీ
    యసమోపకారమునకుం
    బసదన మిడలేక నే బుణస్థుడ నైతిన్
    పద్యం :29
    నీనమస్కారముల నిక్కి నిక్కి నడువ
    బక్షిణీ నాకు నుద్యోగబలము లేదు
    మెచ్చదగు నీ కళాశక్తి నుచ్చరింప
    ఖగసతీ! నాకు గులము యోగ్యతలు లేవు
    పద్యం :30
    స్వార్థమున నిన్ను గొఱముట్టువలె గణింప
    గుడుపునిండిన భాగ్యవంతుడను గాను
    దోషములు సూపి నీకు నీతులు వచించి
    దొరతనము సేయగా మతస్థుడను గాను

  • @koppolujayasimharao8526
    @koppolujayasimharao8526 ปีที่แล้ว +2

    Super

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +3

    పద్యం :11
    భూ నభముల గ్రొంజీకటు
    లేనుగునకు మధము వోలి యెసక మెసెగె సం
    ధ్యా నాట్య కేళి మాని మ
    హానటుడు శివారవముల నారంభించెన్.
    పద్యం :12
    ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
    విహరణము సేయసాగె గబ్బిల మొకండు
    దాని పక్షానిలంబున వాని చిన్న
    యాముదపు దీప మల్లన నారిపోయె.
    పద్యం :13
    తిల్లిక నారిపి దయ్యపు
    బిల్లవలేం దిరుగుదబిసిపపిట్టా నరయగా
    బల్లవితమయ్యె నాతని
    యుల్లంబున గ్రొత్త క్రొత్త యుహాంకురముల్.
    పద్యం :14
    చెలిమిన్ బక్షికి విన్నవించుకొనజొచ్చెన్ స్వీయవృత్తాంతము
    మ్మలికన్ గందిన నెమ్మనంబున మదోన్మత్త ప్రపంచంబులో
    బులుగుంబుట్రటు గాక బేదలకు నాప్తుల్ చుట్టపక్కంబులు
    న్గలరే వానికవోష్ట బాష్పములు వ్యాఖ్యానించ జక్రాంగనల్.
    పద్యం :15
    ప్రవిమల దేవతాభవన వాసముచేయుచు మమ్మువంటి మా
    నవులకు లేని గౌరవమునం దులదూగెడు గబ్బిలాల రా
    ణివిగద నీవు స్వాగతము నీకు శుభంబకదమ్మ నీతనూ
    భవులకు దల్లక్రిందుల తపంబులకున్ గుడి గోపురాలకున్.
    పద్యం :16
    గాఢనిద్రావలంబిమై కన్ను మూసి
    క్ష్మాతలము మేను మరచిన కాళరాత్రి
    నా గృహంబున వెదకుచున్నా వదేమి
    దొరక దిచ్చట నానంద కొరణ లవము.
    పద్యం :17
    నిన్ను బహిష్కరించు నవనీవలయం బిది యంటరానివా
    డున్న నిషిద్దగేహము సహోదరి నీవు సమస్త దేవతా
    సన్నిధి నారగింతపు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
    యున్నములేని పేదల గృహంబులు సొచ్చితివేల బేలవై.
    పద్యం :18
    హృదయములేని లోకముసుమీ యిది మాపుల బశ్చిమంబుగా
    నుదయము తూర్పుగా నడచుచుండు సనాతనధర్మ ధేనువుల్
    పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞాలో
    బేదవి గదల్పజాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్.
    పద్యం :19
    ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
    ఖితమతు లైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
    మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే
    వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే.
    పద్యం :20
    పరమార్థంబులు బోధసేయుదురు లోభ స్వాంతులై నిత్యమున్
    గురువుల్ ముక్కుకుసూటిగా దగులు యుక్తుల్ పన్ని కైవల్యపుం
    దెరువుల్సూపి మహాపరాధివనుచున్ దీర్మానముల్ సేయుచుం
    దురు వేదాంతరథంబు సాగదనుకొందున్ నేను లేకుండినన్.

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 5 หลายเดือนก่อน +1

    Very nice 👌 👍

  • @krishnamurthypunyamurthula580
    @krishnamurthypunyamurthula580 3 ปีที่แล้ว +2

    అత్యంత అద్భుతం గా వుంది తాత్పర్య సహితము గా వివరించి ఉంటే ఇంకా బాగుండేది

  • @sharathkumar4492
    @sharathkumar4492 5 หลายเดือนก่อน +1

    Super Super Super
    Entha Madhuryam Me Kantam lo dagivunnadhi.Me ganam dwara Gabbilam maduryam enumadicharu

  • @solomonraju609
    @solomonraju609 3 ปีที่แล้ว +2

    Sir మీ పద్య పరిమలం వినే కొలది వినాలి అని వుంది Sir🙏🙏🙏🙏🙏🙏🙏,voice very very very good,wonderful Sir

  • @devkesuganikesugani5279
    @devkesuganikesugani5279 7 หลายเดือนก่อน +1

    Super sir

  • @kprajchannel5469
    @kprajchannel5469 3 ปีที่แล้ว +3

    Padyam ki bavam cheppivunte bagundu sir

  • @swamidasthommandru3210
    @swamidasthommandru3210 3 ปีที่แล้ว +2

    Padyalaloni prathi padam oka aanimutyam.Bahu sravanaandakaramgaa aalapinchina meeku dhanyavaadamulu.

  • @PVTSTUDIES
    @PVTSTUDIES 3 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా పాడారు🙏🙏

  • @swamypasuladeputytahsildar2872
    @swamypasuladeputytahsildar2872 8 หลายเดือนก่อน +1

    Excellent sir

  • @saikishore7462
    @saikishore7462 10 หลายเดือนก่อน +1

    padyam cheputu vivarinchukuntu pothe baguntadi sir

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 ปีที่แล้ว +1

    Very good

  • @penuputta3708
    @penuputta3708 2 ปีที่แล้ว +3

    You are the best Sir

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 ปีที่แล้ว +3

    Great social justice poet jashuva Gurram

  • @kikum3067
    @kikum3067 3 ปีที่แล้ว +3

    Excellent sir....one should not die without listening to this

  • @chandrachandra2144
    @chandrachandra2144 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా చెప్పారు సార్ జై భీమ్

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 ปีที่แล้ว +1

    Great narration

  • @rrrtv782
    @rrrtv782 3 ปีที่แล้ว +3

    చాలా కృతజ్ఞతలు

  • @sudheerbab7183
    @sudheerbab7183 9 หลายเดือนก่อน

    మీ గాత్రం మీకు వరం

  • @TheAyyappa
    @TheAyyappa 2 ปีที่แล้ว +1

    Na Vanthu Sayam

  • @dalinaidukilaparthi9957
    @dalinaidukilaparthi9957 ปีที่แล้ว

    అద్భుత పఠనం

  • @subramanyamys8626
    @subramanyamys8626 2 ปีที่แล้ว +1

    మీకు నా నమస్కారములు

  • @vellankiramarao1397
    @vellankiramarao1397 2 ปีที่แล้ว +3

    Super sir sir Gabbilam Part -2 send cheyyandi please

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 ปีที่แล้ว

    పద్య పరిమళం గబ్బిలం.
    జాషువా కవిత్వానికే అక్షర రాశి@

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 ปีที่แล้ว +1

    Gurram Jashuva garu is a great writer to be remembered for ever by all and also by the generations to come.. అంతటి మహనీయుని రచనలు పరిచయం చేసినందుకు రెడ్డి గారికి అభినందనలు. He has taken so much pains in reading more than 100 poems at a stretch so nicely and also uploading them for which one has to appreciate him very much. Thanks.

  • @thelusatv4697
    @thelusatv4697 3 ปีที่แล้ว +2

    Super ga chepparu sir meeku danyavadalu

  • @torah245
    @torah245 3 ปีที่แล้ว +2

    మంచిపని చేస్తున్నావు, కొండల్ రెడ్డి.