ఆవకాయ మనకు ఆరోగ్యమే.....
ฝัง
- เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
- అంతరించిపోయిన సంస్కృతి కి అంకురార్పణ చేసిన చిన్నారులు....
25 సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో కలసి బాణాలు తో పువ్వులు విసిరి దసరా పాటలతో వీధుల్లో తిరిగితే గ్రామస్తులు పిల్లలను తమ ఇంటివద్దకు పిలిపించుకొని దసరా పాటలు పాడించుకొని చిన్నారుల దీవెనలు పొందితే సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు తో వుంటామని విశ్వసించేవారు. కానీ ఈ ఆధునిక కంప్యూటర్, చరవాని యుగంలో పాత సంస్కతి సంప్రదాయాలు మట్టికలిసిపోయాయి. వాటిని వెలికితీసి ZPHS కొత్తపల్లి కి చెందిన పిల్లలు సరస్వతీ పూజ అనంతరం నేటి కాలం లోని ఆధునికత ను దసరా పాటలకు జోడిస్తూ సామాజిక చైతన్యం కలిగించేలా సీతమ్మవాకిట్లో _సిరిమల్లె చెట్టు_, మాయమైపోయాడు మనగాంది తాత, కొత్తపల్లి లోన భాగోతలాట, సారాలు తాగొద్దు ఖైనీలు వద్దు అంటూ 13 పాటలను వీధులలో వేషధారణలో తిరిగి పూలతో బాణాలు వేసి ఆకట్టుకున్నారు.చిన్నారులను మెచ్చి ఇచ్చిన కానుకలను తాము క్రీడా సామగ్రి కొంటామని విద్యార్థి నాయకులు చక్రి,లావణ్య తెలియజేశారు. అలాగే వీధుల్లో పిల్లలతో పేరెంట్స్ కమిటీ చైర్మన్ జుట్టు సింహాచలం, HM డోకి soneswara rao ,ఉపాధ్యాయులు షణ్ముఖ రావు,గోపి,గోవిందరావు గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు