హజరత్ సుల్తాన్ వలియా గంధం మహోత్సవం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • ఆత్మకూరులో ఘనంగా సుల్తాన్ షాహిద్ దర్గా గంధమహోత్సవం
    నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ హజరత్ సుల్తాన్ వలియా దర్గా గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
    ఈ సందర్భంగా నిర్వాహకులు గంధము కలిపిన కలశాన్ని అస్వం పై ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొని వచ్చి స్వామి వారి సమాధి కి గంధం పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం దర్గా వద్దకు వచ్చిన భక్తులకు గంధమును అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంధ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా దర్గా వద్ద భారీగా ఫకిరుల వాయిద్య గీతాలను ఏర్పాటు చేశారు. ఫకీరుల గీతాలాపన భక్తులకు ఎంతో ఆలరించాయి. దర్గాలో
    నిర్వహించిన గంధ మహోత్సవానికి జిల్లా వాసులతోపాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు మరియు చెన్నై, బెంగళూరు, తెలంగాణ ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా వచ్చారు. దర్గా గంద మహోత్సవానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించి పూజలు నిర్వహించారు.

ความคิดเห็น •