Naamaata [31]: Nagabhushanam Dasari, IFS., Retd.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Naamaata [31]: Nagabhushanam Dasari, IFS., Retd.
    నామాట - 31 లో కూడా ఇంతక్రితం చేసిన వీడియోల మాదిరిగానే మొత్తం తొమ్మిది (9) నాలుగు పాదాలతో కూడిన నా కవితలున్నాయి.
    ఈ కవితలన్నీ సామాజిక, మానవ సంబంధాలకు సంబంధించినవాటితో పాటు భావాత్మకత నిండినవి. గత ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాసిన వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసి అభిమానుల ముందుకు ఆడియో/వీడియోల రూపాలలో (అక్షరయుక్తంగా) తీసుకు రావడమైనది.
    వివిధ సందర్భాల్లో ఆయా సంఘటనలు నిత్య జీవితంలో ఎదుర్కొన్నప్పుడు కలిగిన స్పందనలకు అనుభవాన్ని జోడించి అక్షర రూపం ఇచ్చినవే ఈ కవితలన్నీ.
    వీటన్నింటినీ నా స్వరంతో మేలవించి, పలికించి (అక్షరయుక్తంగా) మీ ముందుకు తీసుకొని రావడమైనది.
    ఇవన్నియూ నా స్వంత అభిప్రాయాలు మాత్రమే. వీటితో మీరు ఏఖీభవిస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ నాటి యువత వీటిని వింటే మా చిన్నప్పటి జ్ఞాపకాలను మరియు అనుభవాలను అర్థం చేసుకునే వీలుంటుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకునే అవకాశం ఉంటుందనీ నా ప్రగాఢమైన విశ్వాసం.
    వీటిని విన్న వారు వారికి కలిగిన స్పందనలను శ్రమకోర్చి నిర్ద్వందంగా యూట్యూబ్ కామెంట్స్లో రాయాలని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలు ఏదో విధంగా ఊతమిస్తాయనుటలో ఉత్సాహాన్నందిస్తాయనులో నాకు ఎలాంటి సందేహం లేదు.
    మలి వయస్సులో ప్రభుత్వ పదవీ విరమణానంతరం విశ్రాంత జీవితంలో నా కున్న కొద్దిపాటి అవగాహనతో ఈ వీడియోలను తయారు చేసి యూట్యూబ్ మాధ్యమంలో అప్ లోడ్ చేస్తున్నాను. గతంలో నా వీడియోల?కు అందిస్తున్న మాదిరిగానే ఈ వీడియోకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తారని భావిస్తున్నాను.
    ధన్యవాదాలతో…
    మీ
    దాసరి నాగభూషణం, IFS (విశ్రాంత),
    హైదరాబాదు, +91 80965 11200
  • บันเทิง

ความคิดเห็น • 2

  • @BudatiVenkateswarluBudatiVenka
    @BudatiVenkateswarluBudatiVenka 19 วันที่ผ่านมา

    సార్ మీ నామాట 31 విన్నాను. వాడిపోనీకు మదిలో ప్రేమ తత్త్వవాన్ని. నరికివేయకు పెరిగే చెట్టుని. చాలా బాగుంది సార్. మీ. వెంకటేశ్వర్లు

    • @pachabottubhushanam
      @pachabottubhushanam  19 วันที่ผ่านมา

      ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు
      🌿🙏🏽🌿