CHERI MOKKARO NARULU /చేరి మొక్కరో నరులు /AAV SERIES 06 EP - 551/ G NAGESWARA NAIDU / ABHERI
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- NARASIMHA VAIBHAVAM - 24 🌷
🌺🍃 -----------🍃🌺
తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
( చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు..)
రాగము:-- నాట
రేకు: 0023-04 సంపుటము: 15-132
స్వర రచన:-- శ్రీ G.నాగేశ్వరనాయుడు గారు
రాగం :-- అభేరి
గానం :-- శ్రీ G.నాగేశ్వరనాయుడు గారు
🌺🍃 -----------🍃🌺
🌹🌹 సంకీర్తన 🌹🌹
॥పల్లవి॥
చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు
కోరి వరము లిచ్చు కొండవంటి సింహము
॥చ1॥
గద్దెమీఁదఁ గూరుచుండి కనకకసిపుఁ జెండీ
గద్దరి ప్రహ్లదునిపై కరుణనిండీ
వొద్దనె మారుగొండల వువిదయుఁ దాను నుండీ
తిద్దుకొనె మీసాలు దివ్యనారసింహుఁడు
॥చ2॥
భవనాశిదరి దొక్కి బ్రహ్మాదులలోన నిక్కి
తివిరి ప్రతాపమున దిక్కుల కెక్కి
రవళి నారదాదుల రంగుపాటలకుఁ జొక్కి
చెవు లాలించీ నుతులు శ్రీనారసింహుఁడు
॥చ3॥
అదె కంబములోఁ బుట్టి ఆయుధాలు చేతఁ బట్టి
వెదకి అహోబలాన వేడుకఁ బుట్టి
కదిసి శ్రీ వేంకటాద్రికాంతలలో గుంపుగట్టి
వెదచల్లు మహిమల వీరనారసింహుఁడు
🌺🍃 -----------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 551
( చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు .. )
🌺🍃 ----------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 551 కి శుభ స్వాగతం ..🙏
ప్రార్థన ః-- 🌹🙏
చక్కని కంబము విఱుగగ
తక్కక ప్రహ్లాదుకొరకు దానే పుట్టెన్
డొక్కలు చీల్చుచు కశిపుని,
వ్రక్కలు గావించె నృహరి వసుధకు హితుడై !
✍️ --స్వీయపద్యము ( కందము )
🌹🌹
తప్పకుండా ప్రహ్లాదుని కాపాడెడివాడై
స్తంభమును విరచి ఉద్భవించి , హిరణ్యకసిపుని ప్రేగులు త్రుంచి ,అతనిని ముక్కలు చేసి , భువికి హితమును చేకూర్చినాడు .
తప్పకుండా కాపాడు దొర అనగా నరహరి ఒకడే !
ఎక్కడినుంచైనా రాగలడు , ఎవడినైనా ముక్కలు చేయగలడు !
అతని శరణమే దివ్యమైన రక్ష దాసులకు !🙏
🌹🙏🌹
🌺🍃 -----------🍃🌺
మున్నుడి ః-- 🌹👇
శ్రీ నారసింహుని వ్యాపకత్వమును , వీరత్వమును ప్రత్యేకముగా కొనియాడుచున్నారు అన్నమయ్య ఈ కీర్తనలో .🙏
ఇక్కడి ప్రహ్లాదుని దగ్గరనుంచీ అక్కడి నారదుని వరకూ అందరిచే నుతింపబడుచున్నాడని ,
ఇక్కడి భవనాశి నది ( అహోబలం ) నుండీ అక్కడి బ్రహ్మాదులలోనూ తానే శక్తిగా నిలిచి ఉన్నాడని ,
తిరుమలను అహోబలమును ఏకము చేసేసి సర్వము తానై ఉన్నాడని , అటువంటి నారసింహునికి మ్రొక్కండి ఓ భక్తజనులారా అని అతిశయముతో కీర్తుస్తున్నారు అన్నమయ్య .🙏
మరి చక్కని ఈ కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
🌺🍃 ----------- 🍃🌺
🌹🌹
ఓ మానవులారా ! అందరు ఇతని వద్దకు చేరండి ! ఇతనికి నమస్కరించుకోండి . ఇతడు అనేకమైన సిరులు గలవాడు .🙏
తనకు తానే ఇష్టపడి మనకు వరాలను ప్రసాదించగల కొండంత పెద్ద దేవుడు ఈ నారసింహుడు.🙏
🌹🌹
అదిగో ఎత్తైన పీఠముపై కూర్చుని ఉన్నాడు .
ఇతడే హిరణ్యకసిపుని చీల్చి చెండాడినవాడు .
అంతటి గద్దరివాడైనప్పటికీ , బాలుడైన ప్రహ్లాదునిపై తన వాత్సల్యమునంతా కురిపించినాడు .🙏
ఆ నరసింహుడే ఇదిగో తన దేవేరిని కూడి ఈ గరుడాద్రి వేదాద్రికొండలకు మారుగా వారే కొండంతలుగా దయనుకురిపిస్తూ జంటగా ఉన్నారు .🙏
ఆ సంతోషముతో ఈ నారసింహుడు తన మీసములను తిప్పుచున్నాడు విజయగర్వముతో .🙏
🌹🌹
ఇక్కడ ఈ భవనాశి యేటి ఒడ్డున కాలుమోపి , అదిగో అక్కడ ఉన్న బ్రహ్మ మొదలగు వారిలో కూడా తానే వ్యాపించి ఉండి , తన ప్రతాపమునను దిక్కులనన్నిటా నింపినాడు ఈ నారసింహుడు .🙏
చక్కగా నారదుడు అందమైన స్తుతులనెన్నెన్నో తనపై పాడుచుండగా , ఆసక్తిగా తన చెవులను అప్పగించి వినుచున్నాడు సంతోషముతో ఈ వీరనారసింహుడు .🙏
🌹🌹
స్తంభములోనుంచీ పుట్టి ,
తనచేతులతో ఎన్నెన్నో ఆయుధాలను చేపట్టిన వాడై
ఇక్కడ ఈ అహోబలమునందు అనురక్తి కలిగి తనకు తానే ఇక్కడ వెలసి ఉన్నాడు .🙏
అంతటా వ్యాపించి ఉన్నవాడై , తిరుమలపై ఉన్న భూదేవి శ్రీదేవిని కూడి , అంతా ఒక్కరై , ఇతడే పరబ్రహ్మమను రీతిలో ఎనలేని మహిమలను కురిపించుచున్నాడు ఈ నారసింహుడు .🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
#CHERIMOKKARO #చేరిమొక్కరో #gnageswaranaidu #narasimhaswamysongs #narasimhaswamy #narasimhaswamytelugusongs #narasimhasongs #akshayatritiya #akshaya_tritiya #simhachalam #chandanotsavam #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #annamayyaaksharavedam