వనపర్తి జిల్లా నుండి సూర్యాపేట జిల్లాకు బదిలీ పై వచ్చిన నూతన కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యత చేపట్టిన తేజస్ నందలాల్ పవార్. జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలి : జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.
    జిల్లాకు ఏడవ కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. తేజస్ నందలాల్ పవర్. సూర్యాపేట కలెక్టరేట్ లోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ కు పుష్పగిచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. 2018 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కలెక్టర్ తేజ సునందలాల్ పవర్ స్వస్థలం బీహార్ జిల్లాకు చెందినవారు. మహబూబ్నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా, అదనపు కలెక్టర్ గా పని చేశారు. కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి బదిలీపై సూర్యపేట కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత , ఏఓ సుదర్శన్‌ రెడ్డి ఆన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ความคิดเห็น •