పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు సుమారు 200 మందికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • యాంకర్‌ - దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర రెడ్డి పాలన ప్రజాపాలనను స్మరించుకుంటూ పేదలకు తనవంతుగా తోడ్పాటు అందిండం సంతోషదాయకంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పీస్‌ సయ్యద్‌ గౌస్‌పీర్‌ తెలిపారు.
    వాయిస్‌ - డాక్టర్‌ వైఎస్సార్‌ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సయ్యద్‌ గౌస్‌ పీర్‌ పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు సుమారు 200 మందికి పండ్లు, బ్రెడ్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన పేద,బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, ఆయన పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయన్నారు. అందరికీ కూడు, గుడ్డ, విద్య,వైద్యం అందించడంలో సఫలీకృతులయ్యారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లడంలో వైఎస్సార్‌ కుమార్తె షర్మిలమ్మ ముందు ఉంటారన్నారు. తన తండ్రి లక్ష్యసాధనకు షర్మిలమ్మ నడుం బిగించారని, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ ను షర్మిలమ్మ ముందుకు తీసుకు వెళ్తారన్నారు. అందుకు తమ వంతు సహకారం అన్ని వేళలా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. అలాగే పరిశుద్ధ కార్మికుల వల్లనే మన కడప నగరం శుభ్రంగా, సుందరంగా ఉందని, కరోనా సమయంలో వారి సేవలు అమోఘమని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น •