||జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో||శ్రీ గుర్రం జాషువా గారి జయంతి||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • ఈరోజు కాటారం మండల కేంద్రంలో..
    జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో...
    మహాకవి శ్రీగుఱ్ఱం జాషువా గారి జయంతి ని (సెప్టెంబర్-28) పురస్కరించుకుని ముందుగా సమూహకవులు, రచయితలు,గాయకులు
    శ్రీగుఱ్ఱంజాషువాగారి చిత్రపటానికి పూలమాలాంకరణ చేయడం జరిగింది.
    జయశంకర్ సారస్వత సమితి వ్యవస్థాపకులు..
    గడ్డం.లక్ష్మయ్య ప్రసంగిస్తూ..
    నవయుగకవిచక్రవర్తి, కవితావిశారధ,పద్మభూషన్, మధురశ్రీనాథ, కవికోకిల అధునాతన పద్యశిల్పి, సాహితీస్రష్ట, సమతావాది,
    సమసమాజ సంక్షేమాన్ని దర్శించి,కాంక్షించిన ఆదర్శ అధ్యాపకులని, ఆధునిక పద్యసాహిత్యములో కవితారస గంగాతరంగములను సాహితీక్షేత్రాలకు అందించి సస్యశ్యామలంగావించిన అభినవ సాహితీభగీరథుడు శ్రీగుఱ్ఱం జాషువా గారని తమ పద్యకవితలో కీర్తించడం జరిగినది.గౌరవసమూహ ఉపాధ్యాయులు,పద్యకవులైన బోనాల శ్రీశైలం గారు..
    జాషువాగారిని పద్యకవితలో అభివర్ణిస్తూ..
    "కులముకన్న గుణము గుర్రము జాషువా గొప్పదంటు జెప్పెమెప్పుగాను" అనిగానంచేస్తూ ప్రసంగించారు. కవిర,చయిత,పుల్లూరి నాగేశ్వర్ గారు తన పద్యకవితలోజాషువాగారి ఉన్నత సాహితీవైభవాన్ని ఉటంకిస్తూ... "కవికులమునవెలిగె రవిగయిలను" అని జాషువా గారి సాహిత్య విశిష్టతను గానంచేశారు.
    అడప శ్యామ్ గారు జాషువా గారిచేవ్రాయబడిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించి గానంచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,కవులు,
    రచయితలైన కట్కూరి సత్యనారాయణ, మోహన్, సుమన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
    /-
    జమశంకర్ సారస్వత సమితి
    #శ్రీ గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవం
    #గుర్రం జాషువా సాంగ్స్
    #గుర్రం జాషువా పద్యాలు
    #గుర్రం జాషువా
    #కవి కోకిల గుర్రం జాషువా గారి పుస్తకాలు
    #తెలుగు పద్యాలు
    #తెలుగు కవితలు

ความคิดเห็น • 3