ఆకాశవాణి కార్మికుల కార్యక్రమంలో సీతక్క..రేడియో హీరోయిన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • శారదా శ్రీనివాసన్.
    రేడియో వినడం అలవాటు ఉన్న నిన్నటి తరం వారందరికీ ఆమె గళం సుపరిచితం. అందుకే ఆమెను రేడియో హీరోయిన్ అంటూ అభిమానంగా పిలిచేవారు. ఆమే
    శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా ఆమె వందలాది నాటకాలను తన డైలాగ్ లతో ఆకట్టుకునేలా చేశారు. ఆ రోజుల్లో ప్రముఖ రచయితలు పింగళి లక్ష్మీకాంతం, బాలాంత్రపు రజనీకాంతరావు, ముని మాణిక్యం, బాలమురళీ, బుచ్చిబాబు, దాశరధి , గోపిచంద్ తదితరులు తమ రచనలకు ఆమె గళంతో ప్రాణం పోయమని కోరేవారు. అలా వెయ్యికి పైగా నాటకాల్లో వందలాది పాత్రలను ఆమె శ్రోతల ముందుంచారు. శ్రీకాంతశర్మ రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని తన 83 యేట తన గళంలో వినిపించారు. దాదాపు మూ డున్నర దశాబ్దాలు ఆకాశవాణిలో ఆమె లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె రచించిన నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు - ఈ పుస్తకం రేడియో జీవితాన్ని పరిచయం చేస్తుంది.

ความคิดเห็น • 12