KAAYAMANE VOORIKI KAMTALU ANNAMAYYA KEERTANA అన్నమాచార్య కీర్తన కాయమనే ఊ రికి కంతలు తొమ్మిది.
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- అక్షరార్చన అందిస్తున్న A.P 10వ తరగతి తెలుగు సూక్తి సుధ పాఠంలోని
అన్నమాచార్య కీర్తన కాయమనే ఊ రికి కంతలు తొమ్మిది...
పాఠ్యాంశ రచయిత -శ్రీ యస్ గంగప్ప
గాత్ర సహకారం -రసూల్ బాబు
అన్నమాచార్య కీర్తన - కాయమనే వూరికి గంతలు తొమ్మిదియాయ
10వ తరగతిలోని "సూక్తి సుధ"పాఠంలోని అన్నమాచార్య కీర్తన
భావము:-
కాయము (శరీరము) అనే ఊరికి 9 కంతలు (దారులు) ఉన్నాయి.ఈ ఊరిలో పాపులైన తలారులు (తలనరికి వేసేవారు) తిరుగుతూ ఉన్నారు. ఆ నగరానికి సింహాసనాదిష్టుడైన రాజు కాముడు (మన్మధుడు) వానికి "దీము కోపము(ప్రజ్వరిల్లే ఆగ్రహం) అనే ప్రధాన మంత్రి ఉన్నాడు. వాడు దిక్కులన్నీ పరిపాలిస్తున్నాడు. దానికి (ఆ నగరానికి) కామిడు లైన (కోర్కెలతో నిండిన ఇంద్రియాలు) కాపువారై (రక్షకులై) ఉన్నారు.రోజురోజుకీ కొద్దికొద్దిగా ఆ నగరాల నుంచి కోమలమైన జ్ఞానం (చక్కటి జ్ఞానము) కొల్లగొట్టబడింది. అదిగో ఆ వైనం చిత్తగించండి.
ఆ నగరానికి దళవాయి (సేనాధిపతి) చిత్తము (మనస్సు) దానికి" పౌజు పెట్టిన" సైన్యమే చింతలు. (మనస్సు కలిగించే ఆలోచనలు) ఆ సైన్యం వాళ్ళ అసలు పని మానేసి విషయ సుఖాల మీద ఆసక్తితో వాటికి ప్రాధాన్యతను ఇచ్చారు. అప్పుడు ఆ మనసులోని కోరికలు తుత్తుమురై (పొడి పొడి అయిపోయ దొండెము రేగగా జొచ్చే (చెలరేగాయి) ఆ మనస్సు దాని ఫలితంగా రక్తసిక్తమైన జన్మలను పొందవలసి వచ్చింది.
ఈ విధంగా బలవత్తరమైన సంసారమున సంసారం అనునట్టి బొక్కసాన్ని (ధనాగారాన్ని) యవ్వనము అనే ధనంతో నింపుతూ అంతమైపోతున్నారు జీవులు. దీనికి అంతం ఎప్పుడు? అంతమనేది ఉన్నది భయపడవద్దు. శ్రీ వేంకటేశ్వరుడు ఈ జీవిపై దయ తలచి బలమైన జీవుని ఎన్నుకొని వాడిని మిగతాజీవులకి రాజును చేస్తాడు.
బాగా తరచి ఆలోచిస్తేనే గాని అర్థం కాని అధ్యాత్మ కీర్తనను చెబుతున్నారు అన్నమాచార్యులవారు. శరీరం అనే ఊరికి తొమ్మిది దారులు ఉన్నాయట. వాటిలో పాపాలు అనే తలనరికేసే వాళ్ళు తిరుగుతుంటారట. కొన్నాళ్ళు మన్మధుడనే రాజు ఆ ఊరిని ఏలి కోపమనే ప్రధానమంత్రితో పాలన చేస్తే ఇంద్రియాలనే వాళ్లు కాపులై కూడా జ్ఞానధనాన్ని కొల్లగొట్టారట. చిత్తమనే సేనాధిపతి చింతలనే సైన్యాన్ని విషయాలోలురుగా చేశాడట. కోరికలనే బందిపోటు దొంగలు పెరిగిపోయారట. ఇక ఇలా లాభం లేదని వేంకటేశ్వరుడు జీవుని రాజును చేసి పరిస్థితి చక్కదిద్దాడట.ఆలోచించండి ఎంత జ్ఞానం ఉన్నదో.
అర్థం
పల్లవి:
ఈ శరీరమనే ఊరికి తొమ్మిది రంధ్రాలు కదా ! రెండు చెవులు, రెండు ముక్కు ద్వారాలు, నోరు, రెండు మల మూత్ర ద్వారాలు, ఈ తొమ్మిది రంధ్రాలలోను పాపమనే కాపలా కాచేవాళ్లు (తలారులు) ఎప్పుడూ (పాయక) తిరుగుతుంటాడు.(ఎక్కడ పుణ్యము చేస్తారో అని జాగ్రత్తగా పాపాలు చేయించటానికి కోరిక అనే తలారులు ఎప్పుడూ రాత్రింబగళ్లు తిరుగుతుంటారని భావం.)
చ.1:
ఈ శరీరమనే ఊరిలో మన్మథుడు అనే రాజు సింహాసనమెక్కి కూర్చుంటాడు.
పక్షి మృగాదులను పట్టుకోవటానికి వేట కానిచే పెంచబడిన పక్షి, మృగంలా ఉండే - కోపమనే ప్రధాని - దిక్కులు పరిపాలిస్తుంటాడు
మృదువైన జ్ఞానమంతా దోపిడికి గురి కాగా (= కొల్లబోయ) అక్కడక్కడా
ఇంద్రియాలు బాధలు తొలగించి రక్షించేవిగా (గామిడులై) మారాయి.. ఇదిగో...
(అసలుమోక్ష విషయికమయిన జ్ఞానము శ్రేష్ఠమయినది. అదే జీవుడిని రక్షించేది. కని ఆ రక్షకత్వాన్ని ఇంద్రియాలు దానినుండి దోపిడి చేసాయి. తామే అసలైన రక్షకులమని జీవునికి భ్రాంతి కలిగిస్తున్నాయని భావం)
చ.2:
మనస్సు అనే సైన్యాధిపతి బాధలు లేక ఆలోచనలు అనే సైన్యాన్ని నడిపిస్తూ ఇవతలవైపు(ఇత్తల) ఉండే విషయాలను శ్రేష్ఠములుగా భావించాడు.( ఇవతల అంటే ఈ లోకము. అవతల అంటే ఆ లోకము . ఈ లోకానికి సంబంధించిన విషయాలను మనస్సు శాశ్వతములుగా తలచి ఆ లోకానికి సంబంధించిన వాటి వైపు దృష్టి పెట్టడం లేదని కవి భావన.)
మిక్కిలి పొడిగా మారి కోరికలనే గుంపు విపరీతంగా చెలరేగిపొతున్నాయి. అలంకార విశేషాలను(శృంగారాలను) ఆశ్చర్యపడి చూస్తున్నాయి జన్మములు.( విపరీతములైన కోరికలు - జీవితాలను సుఖంగా ఉండనివ్వకుండా ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. అందువల్ల మోక్షమనే గమ్యాన్ని చేరుకోకుండా జీవుడు జన్మలు ఎత్తుతున్నాడు. ఎత్తిన ప్రతి జన్మలోను అలంకారాలమీద - శృంగారాల మీద జీవునికి మోజు.)
చ.3: గొప్పదయిన (బలు) సంసారము అనే ఖజానా(ధనగృహము) గొప్పగా అనిపిస్తుంటుంది.
ఇది దేవుడు జీవునికి అనుగ్రహించాడు
తియ్యగా అందంగా వ్యాపించే (కలదీగి) పదునారేండ్లకు పైన ఉండే వయస్సు జవ్వనము. ఆ యవ్వనములో ఇంద్రియాలతో
చిలిపి చేష్టలు చేయించే శక్తి జీవునికి దేవుడు ఇచ్చు దినము వారీ కూలీ. ( కై జీతము)
ఈ లోకములో శ్రీ వేంకటేశ్వరుడు ఇంత మైమరపు కలిగించి జీవుడనే బలవంతుని రాజుగా చేసి నన్ను అనే భావాన్ని - అంటే- నాది అనే స్వార్థ భావం పెంచి పరిపాలింప చేస్తున్నాడు.
పరమార్థం
మహా బాగవతములోని పురంజనోపాఖ్యానములో శరీరాన్ని తొమ్మిది ద్వారాలతో పోల్చిన వర్ణన సుప్రసిద్ధం. దానినే అన్నమయ్య ఇక్కడే అనుసరించాడు.
చిదంబర దేవాలయంలో తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను తెలుపుతాయి.
ఈ శరీరాన్ని పురముతో పోలుస్తారు కనుక జగన్నాథ స్వామి ఉన్న పూరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఏమి చెప్పేదిది యీశ్వరమాయలు/ దీము ప్రతిమకును త్రిజగము గలిగె(సం: 02-251) అను మరొక గీతములో కూడా మలమూత్రంబుల మాంసపుముద్దకు/కులగోత్రంబుల గుఱి గలిగె/ తొలులు తొమ్మిదగు తోలుఁదిత్తికిని/ పిలువఁగఁ బేరును బెంపునుఁ గలిగె” అని నవరంధ్రాల తిత్తిని కవి వెక్కిరించాడు. స్వస్తి.
For More Information Visit Our Website : www.akshararcha...
Please Like, Comment & Share Our Videos.
Subscribe Our TH-cam Channel :
/ akshararchanajosyula
/ telugulessons LEARNING HUB
/ josyula MUSICALS
ప్రతి పదార్థం తెలిస్తే చెప్పగలరు
చాలా బాగుంది sir 👌🏻👏🏻💐
భావం ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు
Josyula vari krishi Abhinandaneeyam 💐🙏
Enta ardhamunnado
చాలా అద్భుతంగా రమణీయంగా ఉంది సార్ అక్షరార్చన జోస్యుల వారికి ధన్యవాదాలు ❤
పల్లవి॥ కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ
పాయక తిరిగాడేరు పాపపుతలారులు
॥చ1॥ కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగాను
దీము గోపపుప్రధాని దిక్కు లేలీని
కోమలపుజ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడ
గామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో
॥చ2॥ చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టి
యిత్తలవిషయములు యెన్నికిచ్చిరి
తుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చె
జొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టుగులు
॥చ3॥ బలుసంసారమనేటిభండారము ఘనమాయ
కలదీగి జవ్వనపుకై జీతము
యిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటి
బలువుని రాజుఁజేసి పాలించె నన్నును
అద్భుతం మాస్టారు
మనసుకు హాయిగా మధురంగా ఉందీ గురువుగారు ధన్యవాదాలు
🎉🎉 అద్భుతం గా ఆలపించారు sir
జోస్యుల సార్ అద్భుతం చాలా బాగుంది
Awesome sir
అద్భుతం సర్🎉