హుస్నాబాద్ లో దివ్యాంగులకు కొత్త పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా...PRP NEWS
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6000 పెన్షన్ తో పాటు, అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న దివ్యాంగులకు ఇస్తామన్న 6000 పెన్షన్ అమలు చేయలేదని దివ్యాంగులు తెలిపారు. అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు సబ్సిడీ వాహనాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
- บันเทิง