బరువాయె బ్రతుకు// Telugu lyrics //Baruvaye bratuku/ రచయిత:కవి తిరుపాలు గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • బరువాయె బ్రతుకు-కరువాయె మెతుకు/Baruvaye bratuku karuvaye metuku/రచయిత: కవి తిరుపాలు గారు/ కొత్త పాట
    ____________________________________________
    సంగీతం:పర్ధిపురం గోవింద గౌడ్ (హార్మోనిస్ట్)
    ఎర్రకోట మహేష్ (తబలిస్టు)
    రచన,స్వరకల్పన:
    కవి శ్రీ రామావదూత, స్వర సామ్రాట్ డి తిరుపాలు గారు
    శివరంజని రాగం - ఆదితాళం
    ---------------------------------------------------------------------------
    👉👉👉👉🌺🌺కొత్త పాట 🌺🌺👉👉👉👉👉
    --------------------------------
    సాకి: మాసిన మేను చితికిన హృదయం
    చిల్లి గవ్వయే లేని నా జేబు
    దయ తలచని ఈ సమాజం
    దాపురించె నాకు కడు దారిద్ర్యం
    నేనొక కష్టజీవిని నాదో లోకం - నాదో లోకం....
    పల్లవి: బరువాయె బ్రతుకు - కరువాయె మెతుకు
    జీవితమే నాటకం - నా జీవితమే బూటకం
    చర: ఆశల పల్లకిలో ఊరేగితి
    అంతే చిక్కక అల్లాడితి - 2
    శ్రమయే జీవితం దుఃఖమే సర్వం - 2
    ఇదియే నా జీవన యానం //బరువాయె//
    చర: దైవమే దయ తలచక
    నా కర్మలు ఎడబాయక - 2
    కాంతిని విడచి నిశీధిలో నడచి - 2
    దారే తెలియని అందుడనైతి ‌ //బరువాయె//
    చర: ఉన్నది అంతా ఊడ్చుకుపోయే
    లేనిది వెతికితే ఫలమేమి - 2
    కలిమిలేములు కష్టసుఖాలు - 2
    ఇదియే నా జీవితం
    ఇదియే నా జీవితం రామావదూత //బరువాయె//
    **********************************************
    🙏🙏please subscribe my channel 🙏🙏
    #telugu bajana songs
    #bajana songs
    #bhajana
    #sri d.thirupalu bajana songs

ความคิดเห็น • 23

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo 5 หลายเดือนก่อน +4

    గురువుగారు చాలా చక్కని జీవితం యొక్క పరమార్ధ భావన్నీ ఆలపియించారు ధన్యవాదములు 👏🏼👏🏼👏🏼👏🏼❤️❤️👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jagan6509
    @jagan6509 ปีที่แล้ว +2

    అందరు బాగా కష్ట పడ్డారు మీ అందరికీ నా ధన్యవాదములు, అభినందనలు👌❤💐

  • @sambasivareddytelugubajans9889
    @sambasivareddytelugubajans9889 ปีที่แล้ว +4

    పూజ్య గురుదేవులు ముందుగా నమస్కారాలు మీరు చేస్తున్నది చిన్న ప్రయత్నం కాదు స్వామి చాలా మహత్తరమైన ఒక మహా యజ్ఞం

  • @narendrakesanapalli8022
    @narendrakesanapalli8022 ปีที่แล้ว +2

    ఆణిముత్యాలు లాంటి పదమంఝరి గురువు గారు 👍 ఎంతో అద్భుతమైన పాట🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramulu3137
    @venkataramulu3137 ปีที่แล้ว +1

    Super

  • @mandaammaji9509
    @mandaammaji9509 ปีที่แล้ว +1

    Meeku mundugaa pranaamamulu guruvu garu.meeru chese e prayathnamlo konthamandi aiyine marithe chala santhosham guruvu garu.

  • @penkiramesh6903
    @penkiramesh6903 ปีที่แล้ว

    గురువుగారు చాలా చక్కగా రచించారు అదే చక్కనైన గాత్రంతో ఆలపించారు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @AmruthaSantoshlingampally
    @AmruthaSantoshlingampally 5 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనం ❤

  • @SheshaiahSheshaiah-ym8le
    @SheshaiahSheshaiah-ym8le ปีที่แล้ว

    Super sir

  • @subbusubramanyam6641
    @subbusubramanyam6641 10 หลายเดือนก่อน

    Chala bagundu super super

  • @mondurikanakaraju9630
    @mondurikanakaraju9630 3 หลายเดือนก่อน +1

    Kanakaraju challa badundi sir🙏🙏🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 ปีที่แล้ว

    Verygoodsir thirupelugaru songbagapadinaru phonenombercheppandiguruva

  • @narvashankarrao8885
    @narvashankarrao8885 5 หลายเดือนก่อน +1

    🙏 నమస్కారం గురువుగారు చాలా చక్కనైన పాట బహుశా నాలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రాసారు కాబోలు ధన్యవాదములు 🌹

  • @kvenkatramudu39
    @kvenkatramudu39 9 หลายเดือนก่อน

    కే వెంటట్రాముడు బీ వీరపూరం

  • @AppalanaiduReddi-uq9pg
    @AppalanaiduReddi-uq9pg หลายเดือนก่อน

    ❤❤❤

  • @kmlp.venkatramuludharmapur9705
    @kmlp.venkatramuludharmapur9705 ปีที่แล้ว

    Jeevitha sathyani teliparu dhanyavad swami

  • @MaheshwarreddyChiteke-jm7xg
    @MaheshwarreddyChiteke-jm7xg ปีที่แล้ว +2

    హార్మోనియం వాయించిన గురువు అయినటువంటి గోవింద్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు మరియు అక్కడ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు

  • @balusaikumar
    @balusaikumar ปีที่แล้ว

    Super 👌 👍 namaste 🙏 👌 namaste 🙏

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 ปีที่แล้ว

    Great philosafy

  • @rameswarengworks8835
    @rameswarengworks8835 ปีที่แล้ว

    వివరాలు మొత్తం చెబుతున్నారు కానీ రాగం మాత్రం చేపటం లేదు Great 👍

    • @srnaidutv6516
      @srnaidutv6516  ปีที่แล้ว +1

      అన్నా రాగం - తాళం తంబనైల్ లోనే ఉంది.శివరంజని రాగం అని కూడా రాశాను.కొంచం క్షుణ్ణంగా చూడండి

    • @srnaidutv6516
      @srnaidutv6516  ปีที่แล้ว +1

      వీడియోలో కూడా అన్ని ఉన్నాయి కొంచెం క్షుణ్ణంగా చూడండి.

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว +2

    Super 👌