మనం పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల ఫలితాలు అనుభవించేందుకు జన్మలు ఎత్తుతున్నాం.జన్మ తీసుకొన్న మరు క్షణం మన జీవితం ఎలా జరగాలో జాపథకంలో (జాతకంలో) నిర్ణయించబడుతుంది.ఆ ప్రకారమే మనం సన్మార్గంలో నడవడం లేదా దుర్మార్గంలో నడవడం అనేది ఉంటుంది.అదే మన ప్రారబ్ద కర్మ.అందుచేత మనకి కావాల్సిన విధంగా మన ప్రవర్తన మార్చుకోవడం కుదురు.శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఆ జ్ఞానాగ్నిలో కర్మల్ని కాల్చుకొనే అవకాశం ఉంది.
(మొదటి కామెంట్ కంటిన్యూ అయింది)ఉద్యోగికి బదిలీలాంటిదే జీవులకు మరణము. బదిలీ అయినంత మాత్రమున ఉద్యోగస్తుడు లేకుండ పోలేదు. అట్లే మరణము పొంది శరీరము మారినంత మాత్రమున జీవుడు లేదనుట తగదు. ఎన్ని ఊర్లు మారిన, చివరకు రిటైర్డు (ఉద్యోగవిరమణ) అయిన తర్వాత వాడు ఉద్యోగి ఎట్లు కాకుండ పోవునో, అట్లే జీవుడు కూడ ఎన్ని శరీరములు మారిన మోక్షము పొందిన తరువాతనే జీవుడు కాకుండ పోవును. రిటైర్డు తో ఉద్యోగి అను పేరు లేకుండా పోయినట్లు, మోక్షముతో జీవితము లేకుండాపోయి జీవుడు కాకుండా పోవును. అందువలన ఇచట గ్రహించవలసినది మరణించుట అనునది నాశనము కాదు. నాశనము అనునది మరణము కాదు. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా ఉన్నదని తెలియాలి. జీవునికి చావు లేదన్నాము, కానీ నాశనము పొందడని చెప్పలేదు. అట్లే ఆత్మ చంపబడును అన్నాము, కాని నాశనమగువాడని చెప్పలేదే! జీవాత్మ ఎట్లు చంపబడదో, ఆత్మ ఎట్లు చంపబడుచున్నదో క్రింద తెలుసుకొందాము. ఒక సజీవ శరీరమును పరిశీలించి చూచిన ఆ శరీరము ఎన్నో భాగములుగా ఉన్నది. ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని చేయుచు యంత్రమువలె సాగిపోవుచున్నది. శరీరములో అన్ని భాగములు పని చేయుటకు శక్తి అవసరము. ఆ శక్తిని కుండలీశక్తి అనియు, ఆత్మశక్తిఅనియు అనుచున్నాము, ఆత్మ శరీరములోని తల భాగమును, వెన్నుపామును కేంద్రముగ చేసుకొని శరీరమంతా వ్యాపించి అన్ని భాగములచేత పనిచేయిస్తున్నది. అన్ని శరీరభాగముల వరకు ఆత్మ వ్యాపించివున్నది. ఈ విధముగ శరీరమందు ఆత్మఉండగ, జీవాత్మ మాత్రము శరీరములో ఒక్కచోట మాత్రము ఉన్నది. శరీరముతో తనకెలాంటి సంబంధము లేనిదిగా జీవాత్మ ఉన్నది. జీవాత్మకు తనవరకొచ్చిన కష్టసుఖములను అనుభవించు పని తప్ప ఏమిలేదు. ఆత్మచేత పనిచేయుచున్న కన్ను పంపెడి సమాచారమును బుద్ధి ద్వార జీవుడు అనుభవిస్తు ఆ దృశ్యములోని ఆనందమునో, కష్టమునో అనుభూతి పొందుచున్నాడు. అట్లే జ్ఞానేంద్రియములైన ముక్కు, చెవులు, నాలుక, చర్మములచేత మనస్సు ద్వార పంపబడు విషయములను బుద్ధి ద్వార మాత్రమే జీవుడు అనుభవిస్తున్నాడు. బయటి జ్ఞానేంద్రియాలకు లోపలి జీవునకు మధ్యవర్తిగ మనస్సు ఉన్నది మధ్యలో ఉన్న మనస్సు లేకపోయిన, పనిచేయకపోయిన జీవుడు చీకటిగదిలో ఉండినట్లగును. బయటి ప్రపంచ విషయమేమి తెలియదు. అట్లే బయటి జ్ఞానేంద్రియము ఏ ఒక్కటి లేకున్న దాని విషయము జీవునికి తెలియకుండా పోవును. కన్నుల్లేని శరీరములోనున్న జీవుడు దృశ్యముల సుఖమునుగాని, కష్టమునుగాని అనుభవించలేడు. శరీరములో బయటి జ్ఞానేంద్రియములు పనిచేయాలన్నా, లేక లోపలి మనస్సు పనిచేయాలన్నా అన్నిటికి ఆత్మయే కారణము. శరీరములోని తల మధ్యలో ఉన్న జీవునికి శరీరమునకు ఏమాత్రము సంబంధములేదని, ఆత్మచేత పని చేయబడు శరీర భాగములనుండియే జీవునకు అన్ని తెలియాలని, అట్లు తెలియకపోతే జీవుడు చీకటి గదిలో ఉన్నవానితో సమానమేననుకోవాలి. ఉదాహరణకు ఒక బావి దగ్గర నీరు తోడి కాలువలో పోయువాడుండగ, కాలువ ద్వారావచ్చు నీరును ఫర్లాంగు దూరములో గట్టుమీద కూర్చొని త్రాగువాడు వేరొకడున్నాడనుకొనుము. తన శక్తిని ఉపయోగించి బావి నుండి నీరు తోడి పోయగా, ఆ వచ్చిన నీరు తియ్యనివి కాని, ఉప్పువికాని, త్రాగేవాడు దూరముగ కూర్చొనియున్నవాడు. తీపుకాని, ఉప్పుకాని అనుభవించువాడు పొలములో గట్టుమీద కూర్చున్నవాడు. ఆ నీరులోని ఉప్పునుగాని తీపునిగాని నీరు తోడువాడు అనుభవించడు. నీరుతోడు వానిది శక్తి మాత్రమే. అనుభవించువాడు పొలములోనివాడు. ఇదేవిధముగ ప్రపంచమను బావి నుండి తన శక్తిచేత శరీరేంద్రియముల ద్వారా కష్టసుఖములనబడు నీరును అందించువాడు ఆత్మకాగా పొలములో కూర్చొని నీరు త్రాగువానిగ శరీరములో ఎక్కడో లోపల కూర్చున్న జీవాత్మ ఉన్నాడు. బావినుండి నీరు తోడు పరికరములు లేకపోయిన లేక తన వరకు వచ్చు కాలువ లేకున్న త్రాగువానికి నీరందదు. అట్లే ఇచట శరీర భాగములైన జ్ఞానేంద్రియములను నీరును తోడు పరికరములుగా, కాలువను మనస్సుగా పోల్చుకొనవలెను. బుద్ధిని నీటిని అందించు పాత్రగ పోల్చుకోవలెను. జ్ఞానేంద్రియములు గాని, మనస్సుగాని, ఏ ఒక్కటి పనిచేయకున్న జీవునికి సమాచారమందదు.(3 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(2వ కామెంట్ కంటిన్యూ చేస్తూ 3 వ కామెంట్) ఇచ్చట ప్రమాదవశాత్తు బావిలోపడి మరణించు అవకాశము నీరు తోడువానికే ఉన్నది, కాని దూరముగ పొలములో కూర్చున్న వానికి ఏమాత్రము లేదు. అట్లే ప్రమాదవశాత్తు హత్య జరిగిన ఎడల మరణించు అవకాశము బయటి వరకు ఉన్న ఆత్మకు కలదు, కాని లోపలయున్న జీవాత్మకు లేదు. ఇట్లు హత్య సమయములో జీవాత్మకు మరణములేదని, ఆత్మకు మరణము కలదని తెలియాలి. ఒకవేళ ఆత్మచావలేదు జీవాత్మయే చస్తున్నదని ఎవరైనా అనిన, బావి దగ్గర నీరు తోడువాడు బావిలోపడలేదు, పొలములో ఉన్నవాడు పడినాడన్నట్లుండును. ఆత్మ జీవాత్మల యొక్క హత్య, ఆత్మహత్యల గురించి క్రింద విపులముగా తెలుసుకొందాము. ఒక జైలులో శిక్షవేయబడిన ఖైదీకి ఒక కాపలాదారుడుండి, ఆ ముద్దాయి ఎక్కడికి పారిపోకుండ వానిచేతికి వేయబడిన సంకెళ్ళ గొలుసును తన నడుముకు కట్టుకొన్నాడనుకొనుము. అట్లు కట్టుకొనుట వలన ముద్దాయి ఎక్కడికి పోయిన కాపలాదారుడు కూడ వాని వెంటపోవలసివున్నది. ఒకవేళ కాపలాదారుడు పోవలసి వచ్చిన వాని వెంట ముద్దాయి కూడ పోవలసి ఉంది. ముద్దాయిని వేరొక జైలుకు మార్చిన ఎడల వానితోపాటు కాపలాదారుడు కూడా ఆ జైలుకు పోవలసి ఉంది. ఖైదీకి కాపలాదారుని శాశ్వతముగా నిర్ణయించిన దానివలన, ఖైదీ ఏ జైలుకు పోయిన తప్పనిసరిగా వాని రికార్డులతో పాటు కాపలాదారుడు కూడ పోవలసియున్నది. శిక్ష ప్రకారము ముద్దాయికి ఆహారము మొదలగునవి ఇస్తూ, వానిచేత ఏ పని చేయించాలో ఆ పనులనే కష్టములైనవికాని, సుఖములైనవికాని చేయిస్తు, వాడు చేయు అన్ని పనులకు కాపలాదారుడు ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. జైలులో ఖైదీకి కాపలాదారుడు ఉన్నట్లే, ఒక శరీరమను జైలులో ముద్దాయిగ జీవాత్మ ఉండగ, కాపలా దారునిగా ఆత్మ ఉంటూ వానికి సాక్షిగ కూడ యుండి వానిచేత పనులు అనుభవింప చేయిస్తున్నది. ఒక శరీరము వదలిపోవునపుడు జీవునితో పాటు వాని కర్మయను రికార్డును తీసుకొని వేరే శరీరమునకు ఆత్మ పోవుచున్నది. శరీరము జైలులాంటిది, అందులో ఉన్న జీవుడను ఖైదీ ముందుచేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తు ఆ జైలులోనే తిరిగి క్రొత్త తప్పులు చేశాడనుకొనుము, వాని రికార్డులో క్రొత్త తప్పులు రికార్డు చేసి శిక్షను పెంచుదురు. అట్లే ఒక శరీరములో కర్మననుభవించు జీవుడు అదే శరీరములో క్రొత్త కర్మను సంపాదించుకొనిన, తిరిగి క్రొత్త శరీరమను జైలుకుపోయి శిక్షననుభవించవలసి వచ్చును. జీవుడు పాతకర్మను అనుభవిస్తు క్రొత్త కర్మసంపాదించుకొనుట వలన, శరీరములను జైళ్ళను ముద్దాయి అనబడు జీవుడు మారుచూనే ఉన్నాడు. వానితోపాటు కాపలాదారుడైన ఆత్మ కూడ మారుచూనే ఉన్నది. ఈ విధముగ జైలు మార్పిడిని మరణము అందుము. ఒక శరీరములో అనుభవించవలసిన కర్మను పూర్తిగా అనుభవించి వేరొక శరీరమునకు పోవడము మరణమైతే, ఒక శరీరములో అనుభవించవలసి కర్మను పూర్తిగా అనుభవించకమునుపే ఆ శరీరమును వదలి పోవడమును 'అకాల మరణము' అంటాము. ఈ అకాలమరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి హత్య, రెండవది ఆత్మహత్య. అనుభవించవలసిన ప్రారబ్దకర్మను శరీరములో అనుభవించక ముందే ఆ శరీరమును జీవుడు వదలిపోవడము హత్య అంటాము. అట్లే ఒక శరీరములో అనుభవించవలసిన ప్రారబ్దమును అనుభవించక ముందే ఆత్మ ఆ శరీరమును వదలి వెళ్లిన అది ఆత్మహత్య అంటాము. ఇక్కడ గమనించతగిన విషయమేమనగా! జీవాత్మ ఆత్మలలో ఏది ముందు బయలుదేరుచున్నదో దానిని బట్టి హత్యనా, ఆత్మహత్యనా అని నిర్ణయించడము జరుగుచున్నది.(4 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(3 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ 4 వ కామెంట్) మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మను భగవద్గీతయందే క్షరుడన్నాము. 'క్షరుడు' అనగా నాశనమగువాడని అర్థము. శరీరము నాశనమైనప్పటికి జీవుడు నాశనము కాడని కూడ ఇదే గీతలోనే చెప్పుకొన్నాము. ఒకచోట నాశనమగువాడని వేరొకచోట నాశనములేనివాడని అనుట విచిత్రమేయైనప్పటికి రెండూ వాస్తవమేనని తెలియాలి. సందర్భానుసారము చెప్పుటలో అలా చెప్పవలసి వచ్చినది. శరీరము నాశనమైనపుడు జీవుడు నాశనము కానిమాట నిజమే. ఎన్ని శరీరములు మారి పోయిన జీవుడు నాశనమగువాడు కాడు, ఇక్కడ నాశనము కానిమాట నిజమే అయినప్పటికి జీవుడు క్షరుడే, నాశనమగువాడే. అది ఎలా అనగా ! జీవాత్మ కర్మలనుండి బయటపడునపుడు తిరిగి పుట్టవలసినది లేదు. పరమాత్మగ మారినపుడు ఇక జీవాత్మ లేడు. అపుడు జీవాత్మ నాశనమైనాడనియే చెప్పవచ్చును. అంతవరకు శరీరమునకు తప్ప జీవాత్మకు నాశనములేదనిన మనమే, ఇపుడు జీవాత్మకు నాశనమున్నదని ఒప్పుకోక తప్పదు. అట్లే ఆత్మను అక్షరుడని గీతయందే చెప్పాము. అక్షరుడనగా నాశనము లేనివాడిని అర్థము. క్షరుడైన జీవున్ని అనగా నాశనము కలవానిని నాశనములేని ఆత్మను కూడ మరణము కలవాడని సందర్భానుసారముగ చెప్పవలసి వచ్చినది. హత్య, ఆత్మహత్య అనడములో ఆత్మహత్య యొక్క అర్థము ఆత్మ చంపబడుచున్నదని. ఆ విషయము అర్థము కావాలంటే అలా చెప్పక తప్పదు. దీనిని ఎవరు అపార్థము చేసుకోకూడదు. పై శ్లోకములో 'హన్తినహన్యతే' అను మాట వచ్చింది. కనుక హత్యను గురించి పూర్తి వివరము ఇచ్చట ఇవ్వవలసి వచ్చింది. హత్య, ఆత్మహత్యల యొక్క వివరము క్రింద చూస్తాము. హత్య అంటే ఇతరులచేత చంపబడడమని, ఆత్మహత్య అంటే తన్నుతాను చంపుకోవడమని నేడు వాడుకగ అందరికి తెలిసిన విషయమే కదా! అని అనుకొనవద్దండి. ఇక్కడ ధర్మము అధర్మముగా మారిపోయినది. ధర్మము యొక్క స్థానములో అధర్మము, అధర్మము యొక్క స్థానములో ధర్మము నిలబడి ఉన్నాయి. కావున ఈ విషయములో ధర్మమేదో, అధర్మమేదో వివరముగా తెలుసుకొందాము. జీవులకు మరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి కాలమరణము, రెండవది అకాలమరణము. హత్య, ఆత్మహత్యలు రెండు అకాలమరణమునకు చెందినవి. కాలమరణమును గురించి మా రచనలలోని 'జనన మరణ సిద్ధాంతము' అను పుస్తకములో వివరముగ తెలుపబడినది. జీవుడు కర్మరీత్యా శరీరములో నివాసముండి కష్టసుఖములను అనుభవిస్తున్నాడు. శరీరములో జీవుని యొక్క పని కష్టసుఖములను అనుభవించడము మాత్రమేనని తెలియాలి. జీవుడు కష్టసుఖములను అనుభవించుటకు తగిన కార్యములు చేయుటకు శరీరమును కదిలించుచున్నది ఆత్మయని తెలియాలి. ఆత్మ చైతన్యము చేత శరీరమును కదిలించుచుండగ ఏర్పడు సుఖదుఃఖములు జీవుడు లోపల నుండి అనుభవించుచున్నాడు. దీనిని బట్టి జీవునికి శరీరమును కదలించు శక్తి లేదు. కేవలము ఒక్క ఆత్మకే ఆ శక్తి ఉన్నదని తెలియుచున్నది. ఆత్మయొక్క చైతన్యశక్తి శరీరములోని సకల అవయవములను కర్మ ప్రకారము కదిలించుచు, జీవరాసులను ప్రపంచములో చరించునట్లు చేయుచుండగ , నాచేతనే శరీరము కదలుచున్నదని జీవుడు భ్రమించుచున్నాడు. అజ్ఞానముచేత ఆత్మంటే ఏమిటని, దాని పని ఏమిటని తెలియక జీవుడు తానే అన్ని పనులకు కారణమనుకొనుట సహజముగ నున్నది. వాస్తవమునకు జీవుడు వేరు, ఆత్మ వేరు. కర్మరీత్యా జరుగవలసిన పనులన్నిటిని ఆత్మయే శరీరముచేత చేయిస్తున్నది. ఇపుడు అసలు విషయానికొస్తాము. సజీవమైన శరీరములో ఆత్మ జీవాత్మ అను రెండు ఆత్మలు ఉన్నాయి. ఇది అన్ని శరీరములకు వర్తించు విషయము. ఉదాహరణకు బల్లి శరీరము తీసుకొందాము. దానియందు రెండు ఆత్మలున్నవి, బల్లి శరీరము గోడమీద కదలుటకు దానిలోని ఆత్మే కారణము. అది కదులుచు పోవుచుండగ పట్టు తప్పి కాలుజారి క్రింద పడింది. అపుడు దాని కొనతోక తెగిపోయింది. బల్లి పూర్తి శరీరమంత ఒక భాగముగ, చివరి కొంత తోకమాత్రము వేరొక భాగముగ విడిపోయాయి. బల్లి పూర్తి శరీరమంతయు సహజముగానే ఉన్నది. కావున అది వెంటనే తిరిగి గోడమీద ప్రాకుచు పోయినది, కాని క్రింద తెగిపడిన తోక ఒక నిమిషము పాటు వంకరలు తిరుగుచు ఎగిరెగిరి పడుచుండును. ఈ సంఘటన చాలామంది చూచియే ఉందురు. తెగిపడిన తోక కదలుటకు ఆత్మచైతన్యమే కారణము. బల్లి శరీరములో తలనుండి తోక వరకు వ్యాపించిన ఆత్మచైతన్యము తోక తెగిపోగ అందులో కొంత మిగిలి పోయింది. ఆ కొంత శక్తి వలన తోక ఎగిరిపడుచు కదిలింది. ఆ శక్తి అయిపోయిన వెంటనే అది నిలిచిపోయి చలనములేనిదైనది. బల్లి శరీరములో మిగతా ముఖ్యమైన భాగములన్ని ఉన్నవి. కావున అందులో ఆత్మ నివాసయోగ్యమేయైనందున, బల్లి శరీరము కదులుచు బ్రతికే ఉన్నది. శరీరమంతా వ్యాపింపబడిన ఆత్మ కొద్దిగ ఖండింపబడినదని ఈ సంఘటన ద్వారా తెలియుచున్నది.(5 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(4 కంటిన్యూ 5 వ కామెంట్) కోడి శరీరము నుండి దాని తలను వేరుచేసినపుడు ఆ కోడి శరీరము కొద్దిసేపు తనకాలాడుట కూడ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ శరీరములోని ముఖ్యమైన భాగములన్నింటిని తలనుండి వేరుచేయడములో తలలోని ఆత్మ ఒక భాగముగను, శరీరమంత వ్యాపించిన ఆత్మ ఒక భాగముగను ఖండింపబడ్డాయి. తలలోని కర్మకనెక్షన్ మరియు ఆత్మచైతన్య ప్రసారము తెగిపోయిన దానివలన ఆశరీరము మృత్యువును పొందినది. శరీరము లేదు కావున తల భాగములోని ఆత్మ జీవాత్మలు ఆ భాగమును కూడ వదలి వెళ్లిపోవుచున్నవి. ఈ సంఘటనలో ఆత్మ రెండు భాగములుగ ఖండింపబడినదని తెలియుచున్నది. ఆశ్చర్యముగ ఉన్నది కదా! ఆత్మ ఆయుధములచేత తెగదు, నీటికి నానదు, అగ్నికి కాలదు అని భగవద్గీతలో చెప్పగా " ఈయనకేమి పిచ్చి పట్టింది ఆత్మ ఖండింపబడుచున్నదంటున్నాడు" అని మీరనుకోవచ్చును దానికి మా సమాధానమేమనగా! భగవద్గీతలో చెప్పినది నిజమే, కాని మనము అవగాహన చేసుకోవడములో పొరపాటుపడ్డాము. అక్కడ ఖండింపబడదని చెప్పినది ఏ ఆత్మను గురించి? జీవాత్మనా? ఆత్మనా? పరమాత్మనా? ఈ మూడు ఆత్మల వివరము తెలియకపోతే మనము పప్పులో కాలువేసినట్లే. అంతెందుకు నేనొక ప్రశ్నవేస్తాను హత్య అంటే చంపబడడమని అర్థమున్నపుడు ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మ చంపబడడమనియేగా అర్థము. అవును ఆత్మ ఖండింపబడుచున్నది. ఖండింపబడిన శరీరములోని ఆత్మ కూడ ఖండింపబడుచున్నది. ఖండించబడి ముక్కలైన భాగమములలోని ఆత్మ కదలికలను మనము కళ్ళతో చూడగల్గి కూడ అర్థము చేసుకోలేకపోయాము. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నరికినపుడు, నరకబడిన శరీరములోని ఆత్మ శరీరముతో బాటు చిధ్రమై చలనములేనిదై పోవుచున్నది. అట్లే ఒక జంతువు ఇంకొక జంతువును వేటాడి చీల్చి వేసినపుడు కూడ ఆత్మ అదే స్థితి పొంది చలనములేనిదై పోవుచున్నది. యదార్థ సంఘటన అయిన ఒక ముఖ్య ఉదాహరణను కూడ ఇక్కడ పరిశీలిద్దాము. రైల్వేవంతెన మీద ఒక విద్యార్ధి తనతోపాటు సైకిల్ ను త్రోసుకుంటు పోవుచు, ప్రమాదవశాత్తు కాలుజారి వంతెన మీద నుండి ముప్పై అడుగుల క్రిందికిపడ్డాడు. పడినపుడు అతనికి ఏమాత్రము రక్తగాయము కాలేదు. కాని క్రిందపడినపుడు వెన్నుముకలోని వెన్నుపాము మధ్యలోనికి తెగిపోయింది. మధ్యలోనికి తెగిపోవడము వలన అతను చూస్తున్నట్లే నడుము నుంచి క్రింది శరీరమైన కాళ్ళు తనకలాడుచుండడము కళ్ళారా చూచాడు. అవి ఎందుకు అలా ఎగిరిపడుచున్నవో అర్థముకాలేదు. గుండెక్రింది వరకు వెన్నుపాము తెగిపోవడము వలన గుండె ఊపిరితిత్తులు పనిచేయుచున్నవి. కానీ క్రింది భాగమును నడిపించు చైతన్యము వెన్నుపాము ద్వారా క్రిందికి ప్రాకలేదు. కావున అతనిలోని జీర్ణాశయము కూడ పనిచేయలేదు. శరీరము తెగకున్నను చైతన్యము ప్రసారమగు నాడి తెగిపోవడము వలన, క్రింది భాగములోని చైతన్యము రెండు నిమిషముల కాలము తనకలాడి నిలిచిపోయినది. సగము శరీరము చచ్చిపోయి, సగము శరీరము మాత్రము మిగిలివున్న అతను, రెండు దినములకు చనిపోవడము జరిగినది. ఈ సంఘటనలో కూడ ఆత్మ రెండు ముక్కలై సగము శరీరము మరణము పొంది, మిగతా సగము రెండు రోజులకు నిలిచిపోయినదని తెలియుచున్నది. ఇన్ని సంఘటనల యొక్క ఆధారముతో శరీరములోని ఆత్మ ఖండింప బడుచున్నదని, జీవునితోపాటు మరణము పొంది వేరొక శరీరమును చేరుచున్నదని తెలియుచున్నది. దీని ప్రకారము ఒకడు ఇంకొకనిని కత్తితో నరికి చంపినపుడు, శరీర భాగములలో వ్యాపించిన ఆత్మ కూడ నరకబడుచున్నది. కావున దానిని 'ఆత్మహత్య' అనుట సమంజసము. ఒకరిచేత ఇంకొకరు చంపబడుట 'హత్య' అనుట అందరికి తెలిసినదే. కానీ అది హత్యకాదు ఆత్మహత్య అని తెలియాలి. శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను ఇంకొకరు బలవంతముగా నిలిపి వేయడమును హత్య అనకూడదు, ఆత్మహత్య అనాలి. ఒక మనిషి ఇంకొక మనిషినిగాని, జంతువు మనిషిని కాని, చంపినట్లయితే అది హత్యకాదు 'ఆత్మహత్య' అని తెలియాలి. ఇంత కాలము హత్య అని దేనిని అనుకుంటున్నామో, అది ఆత్మహత్య అని తెలిసింది కదా! అట్లే ఇంత కాలము ఆత్మహత్య అని దేనిని అనుకుంటున్నామో, అది 'హత్య' అని తెలియాలి . ఇక 'హత్య యొక్క వివరము తెలుసుకుందాము. శరీరములో జీవాత్మ, ఆత్మ అను ఇద్దరు పురుషులున్నారని భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగములో 16వ శ్లోకమున చెప్పబడివున్నది. ఇందులో ఆత్మ చంపబడడము ఆత్మహత్యయని ఇందాక తెలుసుకొన్నాము. ఆత్మ జీవాత్మలు చావులోను పుట్టుకలోను ఒకదానివెంట ఒకటి పోక తప్పదు. శరీరమును ధరించునపుడుకాని, శరీరమును వదలునపుడుకాని, ఆత్మ జీవాత్మ ఇద్దరు ఒకేమారు రావడము పోవడము జరుగుచున్నది. ఆత్మ శరీరమును ముందుగా వదలాలనుకొన్నపుడు దానివెంటనే జీవాత్మ కూడ పోవును. అదే విధముగా జీవాత్మ శరీరమును వదులునపుడు దాని వెంట ఆత్మ పోవును.(6 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(6 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ) వీటి భేదములోనే 'హత్య' 'ఆత్మహత్య' అనుట జరుగుచున్నది. ఆత్మతో పాటు జీవాత్మ పోతే ఆత్మహత్య అనియు, జీవాత్మ వెంట ఆత్మ పోవడమును హత్య అనియు అంటున్నాము. ఇంకొక శరీరము చేత శరీరములోని ఆత్మ చనిపోవడమును ఆత్మహత్య అనుకొన్నాము. ఆ విధముగానే ఒక శరీరములోని ఆత్మచేత అదే శరీరములోని జీవాత్మ చంపబడడమును హత్య అనబడును. ఆత్మ చంపబడడము ఆత్మహత్య అయితే జీవాత్మ చంపబడడము హత్య అగుచున్నది. ఇక్కడ గమనించదగ్గ విషయమేమనగా! జీవాత్మ ఆత్మల తేడా తెలియనప్పుడు హత్య ఆత్మహత్యల తేడా కూడ తెలియదు. ఒకడు తాడుతో గొంతును బిగించుకొని ఉరివేసుకొన్నాడనుకొందాము, అది ఆత్మహత్య కాదు హత్య అగును. ఆ శరీరములోని ఆత్మ తన చైతన్యము చేతనే జీవుడు ఆ శరీరములో నివసించుటకు వీలుకాకుండా చేయుచున్నది. కావున ఆత్మ జీవాత్మను చంపినట్లగుచున్నది. మరణించినపుడు ఇక్కడ జీవుని వెంట ఆత్మ పోవుచున్నది అందువలన అది హత్య అనబడును. అదే విధముగ మరణశిక్ష చెప్పబడిన ఖైదీని మరణశిక్ష అమలులో వేరొకడు గొంతుకు తాడు బిగించి చంపాడనుకొనుము. అది పై విధముగా హత్యకాదు ఆత్మహత్య అగును. ఇక్కడ ఆత్మతోపాటు జీవుడు పోవుచున్నాడు. ఇక్కడ శాస్త్రబద్ధంగా ధర్మసూక్ష్మమేమనగా! ఇతర శరీరములచేత ఒక శరీరము చనిపోయినపుడు ఆ 'చావు' నేరుగా ఆత్మకు చెందును. అట్లే ఒక శరీరము ఇంకొకరి జోక్యం లేకుండ ఆత్మచేత మరణించినపుడు ఆ 'మరణము' నేరుగా జీవునికి చెందును. అది ఏ విధమనగా! ఒక శరీరములోని జ్ఞానాగ్ని ఇంకొక శరీరములోని కర్మను కాల్చునపుడు అది ప్రారబ్దమునే కాల్చును. అట్లే ఒక శరీరములోని జ్ఞానాగ్ని అదే శరీరములోని కర్మను కాల్చాలంటే అది ప్రారబ్దము కాల్చదు. నేరుగా సంచిత కర్మను కాల్చును. ఒకే జ్ఞానాగ్ని తన శరీరములోనైతే సంచితకర్మ మీద, ఇతర శరీరములలోనైతే ప్రారబ్దము మీద ఎట్లు పనిచేయుచున్నదో, అదే విధముగానే ఒకే 'మరణము' తన శరీరము ద్వారా ఏర్పడితే జీవునికి, ఇతర శరీరము ద్వారా ఏర్పడితే ఆత్మకు చెందునని తెలియాలి. తన శరీర మరణమునకు తానె కారణమైనపుడు అది 'హత్య' అని, ఇంకొకరు కారణమైనపుడు 'ఆత్మహత్య' అని శాస్త్రబద్ధముగా ఉండగ అజ్ఞానము వలన దానికి వ్యతిరిక్తముగ హత్యను ఆత్మహత్య అని, ఆత్మహత్యను హత్య అని అందరు అనుకుంటున్నారు. ఆత్మహత్యగాని, హత్యగాని అకాలమరణములోనివని జ్ఞాపకముంచుకోవలెను. ఆత్మ ప్రయత్నముతో జీవుడు చనిపోవడము సూత్రబద్దముగ హత్య అగును. దానివలన వచ్చు పాపము ఆత్మను అంటదు. జీవుడు చంపబడుటచేత వచ్చు పాపము ఆత్మకు అహములేదు కావున అది ఆత్మ నంటదు. ఒక శరీరము వేరొక శరీరము యొక్క చావుకు కారణమైనపుడు అది ఆత్మహత్యయగును. అందులో వచ్చు పాపము చాలా భయంకరమైనది. దైవమునే చంపినంత పాపము జీవునికి ఏర్పడుచున్నది. ఒక శరీరములోని ఆత్మ మరణమునకు ఇంకొక శరీరములోని ఆత్మచైతన్యమే కదా కారణము అటువంటప్పుడు ఆత్మహత్య పాపము జీవునికి ఎందుకు అంటును? అను ప్రశ్న రాగలదు. దానికి సమాధానము ఆత్మహత్యకు ఆత్మ కారణమనుట నిజమే, జీవుడు ఏమి చేయనివాడు అను సూత్రము ప్రకారము వానికి ఆత్మహత్యకు సంబంధములేదు. అయినప్పటికి శరీరములోని అహము జీవుని చేత తానే చేసినట్లు ఒప్పించుచున్నది. కనుక అక్కడ వచ్చు పాపము జీవుని కర్మకూడలిలో చేరుచున్నది. సంబంధములేని కర్మను జీవుడు అనవసరముగా తన మీద అహము చేత వేసుకొనుచున్నాడు. మిగతా ప్రపంచపు పనులలో జీవునకు చిన్నచిన్న కర్మలు అహము చేత వచ్చుచుండును. వాటి ఫలితము అంతపెద్దగా లేకపోయినా మరణవిషయములో వచ్చు కర్మ చాల భయంకరమైనది. అది ఆత్మనే హత్యచేసినది, కావున జీవుడు ఎక్కడ అహము పొందినా చిన్న కర్మ వచ్చును కాని, చావు విషయములో అహము పొందడము వలన భయంకరమైన కర్మ వచ్చును. అందువలన ఆత్మ హత్య మహాపాపమని పెద్దలన్నారు. నేడు భూమిమీద కొంతమంది కిరాయికి చాలామందిని చంపుచున్నారు. హత్య ఆత్మహత్యల వివరము తెలియనివారు తాము హత్య చేశాము అనుకుంటున్నారు. వారు చేసినది ఆత్మహత్య అని వారికి తెలియదు. అందువలన వచ్చుపాపము భయానకరమైనదని కూడ వారికి తెలియదు. ఇప్పుడు ఈ విషయము తెలుసుకున్న పెద్దలు ప్రజలకు ఆత్మ జీవాత్మల భేదములు, హత్య ఆత్మహత్యల భేదములు తెలిపి వారిని అజ్ఞానము నుండి బయట పడునట్లు చేయుదురని కోరుచున్నాము.(7 వ కామెంట్ చూడండి)
(7 వ కామెంట్)ఒకశరీరములో జీవాత్మ ఒకడే ఐనపుడు దానికి కాపలాగా ఉన్న ఆత్మ కూడ ఒకటే. అన్ని శరీరములలో ఒకే నిబంధనతో, ఒకేమాదిరి వేరు వేరు ఆత్మలు ఉండుట వలన ఒక శరీరములోని ఆత్మకు వర్తించినది ఒకేమారు అన్ని శరీరములలో వర్తించదు. కావున ఒక శరీరములో హత్య కావింప బడినప్పటికి అన్ని శరీరములలో ఆత్మ హత్య కావింపబడలేదు. ఆత్మను విశాలముగా చూచినపుడు అది హత్య కావింప బడలేదు. ఆత్మను విశాలముగా కాక శరీరములో ఒక్క ఖండముగా చూస్తే ఆ మరణము ఆత్మహత్య అనబడును. ప్రతి శరీరములోని భిన్నముగా ఉన్న జీవాత్మ నాశనమగువాడైనను సందర్భానుసారముగ మరణములో శరీరమునకేనాశనము, జీవునకు లేదన్నట్లు, అన్ని శరీరములలో ఒకే అంశగ ఉన్న ఆత్మ నాశనమును లేనిదైనను కొన్ని మరణములలో మరణించునదిగా చెప్పబడుచున్నది. నాశనమగు జీవాత్మకు చావులేదన్నను, నాశనములేని ఆత్మకు చావు ఉన్నదన్నను చివరకు జీవాత్మకు నాశనము కలదు, ఆత్మకు నాశనము లేదని తెలియాలి. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా గలదని తెలియవలెను. ఒక్క శరీరములోని ఆత్మను తెలుసుకోగలిగితే అది వానికి ఆత్మ దర్శనమైనట్లే. సకల జీవరాసులలో ఆత్మ ఎట్లు ఉన్నదో తెలుసుకొన్నట్లే అగును. మూడవ ఆత్మయైన పరమాత్మను భూమి మీద బ్రతికివున్న ఏ జీవరాసి కానీ తెలుసుకోలేదు, ఇది శాసనము. రెండవ ఆత్మను తెలుసుకొన్న తర్వాత శరీరమును వదిలినపుడు మూడవ ఆత్మయైన పరమాత్మ అనునది ఏమిటో తెలియును. అటువంటివాడు తిరిగి పుట్టడు అదే విడుదల లేక మోక్షము అంటారు. ఆత్మను తెలిసినవాడు భూమి మీద ఉండవచ్చునుగాని పరమాత్మను తెలిసినవాడు భూమి మీద ఉండడని తెలియాలి.
మనం పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల ఫలితాలు అనుభవించేందుకు జన్మలు ఎత్తుతున్నాం.జన్మ తీసుకొన్న మరు క్షణం మన జీవితం ఎలా జరగాలో జాపథకంలో (జాతకంలో) నిర్ణయించబడుతుంది.ఆ ప్రకారమే మనం సన్మార్గంలో నడవడం లేదా దుర్మార్గంలో నడవడం అనేది ఉంటుంది.అదే మన ప్రారబ్ద కర్మ.అందుచేత మనకి కావాల్సిన విధంగా మన ప్రవర్తన మార్చుకోవడం కుదురు.శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఆ జ్ఞానాగ్నిలో కర్మల్ని కాల్చుకొనే అవకాశం ఉంది.
మళ్లీ శంకరాచార్యులు పుట్టినట్లుంది🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
జై శ్రీ కృష్ణా య జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
Jai sree krishna
HareKrishna HareKrishna HareKrishna
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
Oka manishini premalo padaveyalekapote తెలుగు తక్కువ వాళ్ళు అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకోండి life అంటే ఏమిటి అని అర్థం అవుతుంది అవుతుంది
❤
🙏🙏🙏
శరీరం మనది కాకపోతే ఎవరిది?మనం ఎవరం?
Manaki malli gurukulalu start aithe bavuntundi… sasyashyamalam avthundi…ee bhoomi…. Guruvulu dandinchali appude student baagupadathadu… but meelanti guruvulu ravali swamiji
Guruji mana desam lo kuda … govula ghee, pure milk vachhela cheyandi …every state lo… cities lo vachhela cheyali ante meere cheyagalaru…..
(మొదటి కామెంట్ కంటిన్యూ అయింది)ఉద్యోగికి బదిలీలాంటిదే జీవులకు మరణము. బదిలీ అయినంత మాత్రమున ఉద్యోగస్తుడు లేకుండ పోలేదు. అట్లే మరణము పొంది శరీరము మారినంత మాత్రమున జీవుడు లేదనుట తగదు. ఎన్ని ఊర్లు మారిన, చివరకు రిటైర్డు (ఉద్యోగవిరమణ) అయిన తర్వాత వాడు ఉద్యోగి ఎట్లు కాకుండ పోవునో, అట్లే జీవుడు కూడ ఎన్ని శరీరములు మారిన మోక్షము పొందిన తరువాతనే జీవుడు కాకుండ పోవును. రిటైర్డు తో ఉద్యోగి అను పేరు లేకుండా పోయినట్లు, మోక్షముతో జీవితము లేకుండాపోయి జీవుడు కాకుండా పోవును. అందువలన ఇచట గ్రహించవలసినది మరణించుట అనునది నాశనము కాదు. నాశనము అనునది మరణము కాదు. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా ఉన్నదని తెలియాలి. జీవునికి చావు లేదన్నాము, కానీ నాశనము పొందడని చెప్పలేదు. అట్లే ఆత్మ చంపబడును అన్నాము, కాని నాశనమగువాడని చెప్పలేదే! జీవాత్మ ఎట్లు చంపబడదో, ఆత్మ ఎట్లు చంపబడుచున్నదో క్రింద తెలుసుకొందాము.
ఒక సజీవ శరీరమును పరిశీలించి చూచిన ఆ శరీరము ఎన్నో భాగములుగా ఉన్నది. ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని చేయుచు యంత్రమువలె సాగిపోవుచున్నది. శరీరములో అన్ని భాగములు పని చేయుటకు శక్తి అవసరము. ఆ శక్తిని కుండలీశక్తి అనియు, ఆత్మశక్తిఅనియు అనుచున్నాము, ఆత్మ శరీరములోని తల భాగమును, వెన్నుపామును కేంద్రముగ చేసుకొని శరీరమంతా వ్యాపించి అన్ని భాగములచేత పనిచేయిస్తున్నది. అన్ని శరీరభాగముల వరకు ఆత్మ వ్యాపించివున్నది. ఈ విధముగ శరీరమందు ఆత్మఉండగ, జీవాత్మ మాత్రము శరీరములో ఒక్కచోట మాత్రము ఉన్నది. శరీరముతో తనకెలాంటి సంబంధము లేనిదిగా జీవాత్మ ఉన్నది. జీవాత్మకు తనవరకొచ్చిన కష్టసుఖములను అనుభవించు పని తప్ప ఏమిలేదు. ఆత్మచేత పనిచేయుచున్న కన్ను పంపెడి సమాచారమును బుద్ధి ద్వార జీవుడు అనుభవిస్తు ఆ దృశ్యములోని ఆనందమునో, కష్టమునో అనుభూతి పొందుచున్నాడు. అట్లే జ్ఞానేంద్రియములైన ముక్కు, చెవులు, నాలుక, చర్మములచేత మనస్సు ద్వార పంపబడు విషయములను బుద్ధి ద్వార మాత్రమే జీవుడు అనుభవిస్తున్నాడు. బయటి జ్ఞానేంద్రియాలకు లోపలి జీవునకు మధ్యవర్తిగ మనస్సు ఉన్నది మధ్యలో ఉన్న మనస్సు లేకపోయిన, పనిచేయకపోయిన జీవుడు చీకటిగదిలో ఉండినట్లగును. బయటి ప్రపంచ విషయమేమి తెలియదు. అట్లే బయటి జ్ఞానేంద్రియము ఏ ఒక్కటి లేకున్న దాని విషయము జీవునికి తెలియకుండా పోవును. కన్నుల్లేని శరీరములోనున్న జీవుడు దృశ్యముల సుఖమునుగాని, కష్టమునుగాని అనుభవించలేడు.
శరీరములో బయటి జ్ఞానేంద్రియములు పనిచేయాలన్నా, లేక లోపలి మనస్సు పనిచేయాలన్నా అన్నిటికి ఆత్మయే కారణము. శరీరములోని తల మధ్యలో ఉన్న జీవునికి శరీరమునకు ఏమాత్రము సంబంధములేదని, ఆత్మచేత పని చేయబడు శరీర భాగములనుండియే జీవునకు అన్ని తెలియాలని, అట్లు తెలియకపోతే జీవుడు చీకటి గదిలో ఉన్నవానితో సమానమేననుకోవాలి. ఉదాహరణకు ఒక బావి దగ్గర నీరు తోడి కాలువలో పోయువాడుండగ, కాలువ ద్వారావచ్చు నీరును ఫర్లాంగు దూరములో గట్టుమీద కూర్చొని త్రాగువాడు వేరొకడున్నాడనుకొనుము. తన శక్తిని ఉపయోగించి బావి నుండి నీరు తోడి పోయగా, ఆ వచ్చిన నీరు తియ్యనివి కాని, ఉప్పువికాని, త్రాగేవాడు దూరముగ కూర్చొనియున్నవాడు. తీపుకాని, ఉప్పుకాని అనుభవించువాడు పొలములో గట్టుమీద కూర్చున్నవాడు. ఆ నీరులోని ఉప్పునుగాని తీపునిగాని నీరు తోడువాడు అనుభవించడు. నీరుతోడు వానిది శక్తి మాత్రమే. అనుభవించువాడు పొలములోనివాడు. ఇదేవిధముగ ప్రపంచమను బావి నుండి తన శక్తిచేత శరీరేంద్రియముల ద్వారా కష్టసుఖములనబడు నీరును అందించువాడు ఆత్మకాగా పొలములో కూర్చొని నీరు త్రాగువానిగ శరీరములో ఎక్కడో లోపల కూర్చున్న జీవాత్మ ఉన్నాడు. బావినుండి నీరు తోడు పరికరములు లేకపోయిన లేక తన వరకు వచ్చు కాలువ లేకున్న త్రాగువానికి నీరందదు. అట్లే ఇచట శరీర భాగములైన జ్ఞానేంద్రియములను నీరును తోడు పరికరములుగా, కాలువను మనస్సుగా పోల్చుకొనవలెను. బుద్ధిని నీటిని అందించు పాత్రగ పోల్చుకోవలెను. జ్ఞానేంద్రియములు గాని, మనస్సుగాని, ఏ ఒక్కటి పనిచేయకున్న జీవునికి సమాచారమందదు.(3 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
Birthanddeathislifecycleinall❤❤❤ 3:24 w
(2వ కామెంట్ కంటిన్యూ చేస్తూ 3 వ కామెంట్)
ఇచ్చట ప్రమాదవశాత్తు బావిలోపడి మరణించు అవకాశము నీరు తోడువానికే ఉన్నది, కాని దూరముగ పొలములో కూర్చున్న వానికి ఏమాత్రము లేదు. అట్లే ప్రమాదవశాత్తు హత్య జరిగిన ఎడల మరణించు అవకాశము బయటి వరకు ఉన్న ఆత్మకు కలదు, కాని లోపలయున్న జీవాత్మకు లేదు. ఇట్లు హత్య సమయములో జీవాత్మకు మరణములేదని, ఆత్మకు మరణము కలదని తెలియాలి. ఒకవేళ ఆత్మచావలేదు జీవాత్మయే చస్తున్నదని ఎవరైనా అనిన, బావి దగ్గర నీరు తోడువాడు బావిలోపడలేదు, పొలములో ఉన్నవాడు పడినాడన్నట్లుండును. ఆత్మ జీవాత్మల యొక్క హత్య, ఆత్మహత్యల గురించి క్రింద విపులముగా తెలుసుకొందాము.
ఒక జైలులో శిక్షవేయబడిన ఖైదీకి ఒక కాపలాదారుడుండి, ఆ ముద్దాయి ఎక్కడికి పారిపోకుండ వానిచేతికి వేయబడిన సంకెళ్ళ గొలుసును తన నడుముకు కట్టుకొన్నాడనుకొనుము. అట్లు కట్టుకొనుట వలన ముద్దాయి ఎక్కడికి పోయిన కాపలాదారుడు కూడ వాని వెంటపోవలసివున్నది. ఒకవేళ కాపలాదారుడు పోవలసి వచ్చిన వాని వెంట ముద్దాయి కూడ పోవలసి ఉంది. ముద్దాయిని వేరొక జైలుకు మార్చిన ఎడల వానితోపాటు కాపలాదారుడు కూడా ఆ జైలుకు పోవలసి ఉంది. ఖైదీకి కాపలాదారుని శాశ్వతముగా నిర్ణయించిన దానివలన, ఖైదీ ఏ జైలుకు పోయిన తప్పనిసరిగా వాని రికార్డులతో పాటు కాపలాదారుడు కూడ పోవలసియున్నది. శిక్ష ప్రకారము ముద్దాయికి ఆహారము మొదలగునవి ఇస్తూ, వానిచేత ఏ పని చేయించాలో ఆ పనులనే కష్టములైనవికాని, సుఖములైనవికాని చేయిస్తు, వాడు చేయు అన్ని పనులకు కాపలాదారుడు ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. జైలులో ఖైదీకి కాపలాదారుడు ఉన్నట్లే, ఒక శరీరమను జైలులో ముద్దాయిగ జీవాత్మ ఉండగ, కాపలా దారునిగా ఆత్మ ఉంటూ వానికి సాక్షిగ కూడ యుండి వానిచేత పనులు అనుభవింప చేయిస్తున్నది. ఒక శరీరము వదలిపోవునపుడు జీవునితో పాటు వాని కర్మయను రికార్డును తీసుకొని వేరే శరీరమునకు ఆత్మ పోవుచున్నది.
శరీరము జైలులాంటిది, అందులో ఉన్న జీవుడను ఖైదీ ముందుచేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తు ఆ జైలులోనే తిరిగి క్రొత్త తప్పులు చేశాడనుకొనుము, వాని రికార్డులో క్రొత్త తప్పులు రికార్డు చేసి శిక్షను పెంచుదురు. అట్లే ఒక శరీరములో కర్మననుభవించు జీవుడు అదే శరీరములో క్రొత్త కర్మను సంపాదించుకొనిన, తిరిగి క్రొత్త శరీరమను జైలుకుపోయి శిక్షననుభవించవలసి వచ్చును. జీవుడు పాతకర్మను అనుభవిస్తు క్రొత్త కర్మసంపాదించుకొనుట వలన, శరీరములను జైళ్ళను ముద్దాయి అనబడు జీవుడు మారుచూనే ఉన్నాడు. వానితోపాటు కాపలాదారుడైన ఆత్మ కూడ మారుచూనే ఉన్నది. ఈ విధముగ జైలు మార్పిడిని మరణము అందుము. ఒక శరీరములో అనుభవించవలసిన కర్మను పూర్తిగా అనుభవించి వేరొక శరీరమునకు పోవడము మరణమైతే, ఒక శరీరములో అనుభవించవలసి కర్మను పూర్తిగా అనుభవించకమునుపే ఆ శరీరమును వదలి పోవడమును 'అకాల మరణము' అంటాము. ఈ అకాలమరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి హత్య, రెండవది ఆత్మహత్య. అనుభవించవలసిన ప్రారబ్దకర్మను శరీరములో అనుభవించక ముందే ఆ శరీరమును జీవుడు వదలిపోవడము హత్య అంటాము. అట్లే ఒక శరీరములో అనుభవించవలసిన ప్రారబ్దమును అనుభవించక ముందే ఆత్మ ఆ శరీరమును వదలి వెళ్లిన అది ఆత్మహత్య అంటాము. ఇక్కడ గమనించతగిన విషయమేమనగా! జీవాత్మ ఆత్మలలో ఏది ముందు బయలుదేరుచున్నదో దానిని బట్టి హత్యనా, ఆత్మహత్యనా అని నిర్ణయించడము జరుగుచున్నది.(4 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(3 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ 4 వ కామెంట్)
మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మను భగవద్గీతయందే క్షరుడన్నాము. 'క్షరుడు' అనగా నాశనమగువాడని అర్థము. శరీరము నాశనమైనప్పటికి జీవుడు నాశనము కాడని కూడ ఇదే గీతలోనే చెప్పుకొన్నాము. ఒకచోట నాశనమగువాడని వేరొకచోట నాశనములేనివాడని అనుట విచిత్రమేయైనప్పటికి రెండూ వాస్తవమేనని తెలియాలి. సందర్భానుసారము చెప్పుటలో అలా చెప్పవలసి వచ్చినది. శరీరము నాశనమైనపుడు జీవుడు నాశనము కానిమాట నిజమే. ఎన్ని శరీరములు మారి పోయిన జీవుడు నాశనమగువాడు కాడు, ఇక్కడ నాశనము కానిమాట నిజమే అయినప్పటికి జీవుడు క్షరుడే, నాశనమగువాడే. అది ఎలా అనగా ! జీవాత్మ కర్మలనుండి బయటపడునపుడు తిరిగి పుట్టవలసినది లేదు. పరమాత్మగ మారినపుడు ఇక జీవాత్మ లేడు. అపుడు జీవాత్మ నాశనమైనాడనియే చెప్పవచ్చును. అంతవరకు శరీరమునకు తప్ప జీవాత్మకు నాశనములేదనిన మనమే, ఇపుడు జీవాత్మకు నాశనమున్నదని ఒప్పుకోక తప్పదు. అట్లే ఆత్మను అక్షరుడని గీతయందే చెప్పాము. అక్షరుడనగా నాశనము లేనివాడిని అర్థము. క్షరుడైన జీవున్ని అనగా నాశనము కలవానిని నాశనములేని ఆత్మను కూడ మరణము కలవాడని సందర్భానుసారముగ చెప్పవలసి వచ్చినది. హత్య, ఆత్మహత్య అనడములో ఆత్మహత్య యొక్క అర్థము ఆత్మ చంపబడుచున్నదని. ఆ విషయము అర్థము కావాలంటే అలా చెప్పక తప్పదు. దీనిని ఎవరు అపార్థము చేసుకోకూడదు. పై శ్లోకములో 'హన్తినహన్యతే' అను మాట వచ్చింది. కనుక హత్యను గురించి పూర్తి వివరము ఇచ్చట ఇవ్వవలసి వచ్చింది. హత్య, ఆత్మహత్యల యొక్క వివరము క్రింద చూస్తాము.
హత్య అంటే ఇతరులచేత చంపబడడమని, ఆత్మహత్య అంటే తన్నుతాను చంపుకోవడమని నేడు వాడుకగ అందరికి తెలిసిన విషయమే కదా! అని అనుకొనవద్దండి. ఇక్కడ ధర్మము అధర్మముగా మారిపోయినది. ధర్మము యొక్క స్థానములో అధర్మము, అధర్మము యొక్క స్థానములో ధర్మము నిలబడి ఉన్నాయి. కావున ఈ విషయములో ధర్మమేదో, అధర్మమేదో వివరముగా తెలుసుకొందాము.
జీవులకు మరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి కాలమరణము, రెండవది అకాలమరణము. హత్య, ఆత్మహత్యలు రెండు అకాలమరణమునకు చెందినవి. కాలమరణమును గురించి మా రచనలలోని 'జనన మరణ సిద్ధాంతము' అను పుస్తకములో వివరముగ తెలుపబడినది. జీవుడు కర్మరీత్యా శరీరములో నివాసముండి కష్టసుఖములను అనుభవిస్తున్నాడు. శరీరములో జీవుని యొక్క పని కష్టసుఖములను అనుభవించడము మాత్రమేనని తెలియాలి. జీవుడు కష్టసుఖములను అనుభవించుటకు తగిన కార్యములు చేయుటకు శరీరమును కదిలించుచున్నది ఆత్మయని తెలియాలి. ఆత్మ చైతన్యము చేత శరీరమును కదిలించుచుండగ ఏర్పడు సుఖదుఃఖములు జీవుడు లోపల నుండి అనుభవించుచున్నాడు. దీనిని బట్టి జీవునికి శరీరమును కదలించు శక్తి లేదు. కేవలము ఒక్క ఆత్మకే ఆ శక్తి ఉన్నదని తెలియుచున్నది. ఆత్మయొక్క చైతన్యశక్తి శరీరములోని సకల అవయవములను కర్మ ప్రకారము కదిలించుచు, జీవరాసులను ప్రపంచములో చరించునట్లు చేయుచుండగ , నాచేతనే శరీరము కదలుచున్నదని జీవుడు భ్రమించుచున్నాడు. అజ్ఞానముచేత ఆత్మంటే ఏమిటని, దాని పని ఏమిటని తెలియక జీవుడు తానే అన్ని పనులకు కారణమనుకొనుట సహజముగ నున్నది. వాస్తవమునకు జీవుడు వేరు, ఆత్మ వేరు. కర్మరీత్యా జరుగవలసిన పనులన్నిటిని ఆత్మయే శరీరముచేత చేయిస్తున్నది.
ఇపుడు అసలు విషయానికొస్తాము. సజీవమైన శరీరములో ఆత్మ జీవాత్మ అను రెండు ఆత్మలు ఉన్నాయి. ఇది అన్ని శరీరములకు వర్తించు విషయము. ఉదాహరణకు బల్లి శరీరము తీసుకొందాము. దానియందు రెండు ఆత్మలున్నవి, బల్లి శరీరము గోడమీద కదలుటకు దానిలోని ఆత్మే కారణము. అది కదులుచు పోవుచుండగ పట్టు తప్పి కాలుజారి క్రింద పడింది. అపుడు దాని కొనతోక తెగిపోయింది. బల్లి పూర్తి శరీరమంత ఒక భాగముగ, చివరి కొంత తోకమాత్రము వేరొక భాగముగ విడిపోయాయి. బల్లి పూర్తి శరీరమంతయు సహజముగానే ఉన్నది. కావున అది వెంటనే తిరిగి గోడమీద ప్రాకుచు పోయినది, కాని క్రింద తెగిపడిన తోక ఒక నిమిషము పాటు వంకరలు తిరుగుచు ఎగిరెగిరి పడుచుండును. ఈ సంఘటన చాలామంది చూచియే ఉందురు. తెగిపడిన తోక కదలుటకు ఆత్మచైతన్యమే కారణము. బల్లి శరీరములో తలనుండి తోక వరకు వ్యాపించిన ఆత్మచైతన్యము తోక తెగిపోగ అందులో కొంత మిగిలి పోయింది. ఆ కొంత శక్తి వలన తోక ఎగిరిపడుచు కదిలింది. ఆ శక్తి అయిపోయిన వెంటనే అది నిలిచిపోయి చలనములేనిదైనది. బల్లి శరీరములో మిగతా ముఖ్యమైన భాగములన్ని ఉన్నవి. కావున అందులో ఆత్మ నివాసయోగ్యమేయైనందున, బల్లి శరీరము కదులుచు బ్రతికే ఉన్నది. శరీరమంతా వ్యాపింపబడిన ఆత్మ కొద్దిగ ఖండింపబడినదని ఈ సంఘటన ద్వారా తెలియుచున్నది.(5 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(4 కంటిన్యూ 5 వ కామెంట్)
కోడి శరీరము నుండి దాని తలను వేరుచేసినపుడు ఆ కోడి శరీరము కొద్దిసేపు తనకాలాడుట కూడ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ శరీరములోని ముఖ్యమైన భాగములన్నింటిని తలనుండి వేరుచేయడములో తలలోని ఆత్మ ఒక భాగముగను, శరీరమంత వ్యాపించిన ఆత్మ ఒక భాగముగను ఖండింపబడ్డాయి. తలలోని కర్మకనెక్షన్ మరియు ఆత్మచైతన్య ప్రసారము తెగిపోయిన దానివలన ఆశరీరము మృత్యువును పొందినది. శరీరము లేదు కావున తల భాగములోని ఆత్మ జీవాత్మలు ఆ భాగమును కూడ వదలి వెళ్లిపోవుచున్నవి. ఈ సంఘటనలో ఆత్మ రెండు భాగములుగ ఖండింపబడినదని తెలియుచున్నది. ఆశ్చర్యముగ ఉన్నది కదా! ఆత్మ ఆయుధములచేత తెగదు, నీటికి నానదు, అగ్నికి కాలదు అని భగవద్గీతలో చెప్పగా " ఈయనకేమి పిచ్చి పట్టింది ఆత్మ ఖండింపబడుచున్నదంటున్నాడు" అని మీరనుకోవచ్చును దానికి మా సమాధానమేమనగా! భగవద్గీతలో చెప్పినది నిజమే, కాని మనము అవగాహన చేసుకోవడములో పొరపాటుపడ్డాము. అక్కడ ఖండింపబడదని చెప్పినది ఏ ఆత్మను గురించి? జీవాత్మనా? ఆత్మనా? పరమాత్మనా? ఈ మూడు ఆత్మల వివరము తెలియకపోతే మనము పప్పులో కాలువేసినట్లే. అంతెందుకు నేనొక ప్రశ్నవేస్తాను హత్య అంటే చంపబడడమని అర్థమున్నపుడు ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మ చంపబడడమనియేగా అర్థము. అవును ఆత్మ ఖండింపబడుచున్నది. ఖండింపబడిన శరీరములోని ఆత్మ కూడ ఖండింపబడుచున్నది. ఖండించబడి ముక్కలైన భాగమములలోని ఆత్మ కదలికలను మనము కళ్ళతో చూడగల్గి కూడ అర్థము చేసుకోలేకపోయాము. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నరికినపుడు, నరకబడిన శరీరములోని ఆత్మ శరీరముతో బాటు చిధ్రమై చలనములేనిదై పోవుచున్నది. అట్లే ఒక జంతువు ఇంకొక జంతువును వేటాడి చీల్చి వేసినపుడు కూడ ఆత్మ అదే స్థితి పొంది చలనములేనిదై పోవుచున్నది. యదార్థ సంఘటన అయిన ఒక ముఖ్య ఉదాహరణను కూడ ఇక్కడ పరిశీలిద్దాము.
రైల్వేవంతెన మీద ఒక విద్యార్ధి తనతోపాటు సైకిల్ ను త్రోసుకుంటు పోవుచు, ప్రమాదవశాత్తు కాలుజారి వంతెన మీద నుండి ముప్పై అడుగుల క్రిందికిపడ్డాడు. పడినపుడు అతనికి ఏమాత్రము రక్తగాయము కాలేదు. కాని క్రిందపడినపుడు వెన్నుముకలోని వెన్నుపాము మధ్యలోనికి తెగిపోయింది. మధ్యలోనికి తెగిపోవడము వలన అతను చూస్తున్నట్లే నడుము నుంచి క్రింది శరీరమైన కాళ్ళు తనకలాడుచుండడము కళ్ళారా చూచాడు. అవి ఎందుకు అలా ఎగిరిపడుచున్నవో అర్థముకాలేదు. గుండెక్రింది వరకు వెన్నుపాము తెగిపోవడము వలన గుండె ఊపిరితిత్తులు పనిచేయుచున్నవి. కానీ క్రింది భాగమును నడిపించు చైతన్యము వెన్నుపాము ద్వారా క్రిందికి ప్రాకలేదు. కావున అతనిలోని జీర్ణాశయము కూడ పనిచేయలేదు. శరీరము తెగకున్నను చైతన్యము ప్రసారమగు నాడి తెగిపోవడము వలన, క్రింది భాగములోని చైతన్యము రెండు నిమిషముల కాలము తనకలాడి నిలిచిపోయినది. సగము శరీరము చచ్చిపోయి, సగము శరీరము మాత్రము మిగిలివున్న అతను, రెండు దినములకు చనిపోవడము జరిగినది. ఈ సంఘటనలో కూడ ఆత్మ రెండు ముక్కలై సగము శరీరము మరణము పొంది, మిగతా సగము రెండు రోజులకు నిలిచిపోయినదని తెలియుచున్నది.
ఇన్ని సంఘటనల యొక్క ఆధారముతో శరీరములోని ఆత్మ ఖండింప బడుచున్నదని, జీవునితోపాటు మరణము పొంది వేరొక శరీరమును చేరుచున్నదని తెలియుచున్నది. దీని ప్రకారము ఒకడు ఇంకొకనిని కత్తితో నరికి చంపినపుడు, శరీర భాగములలో వ్యాపించిన ఆత్మ కూడ నరకబడుచున్నది. కావున దానిని 'ఆత్మహత్య' అనుట సమంజసము. ఒకరిచేత ఇంకొకరు చంపబడుట 'హత్య' అనుట అందరికి తెలిసినదే. కానీ అది హత్యకాదు ఆత్మహత్య అని తెలియాలి. శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను ఇంకొకరు బలవంతముగా నిలిపి వేయడమును హత్య అనకూడదు, ఆత్మహత్య అనాలి. ఒక మనిషి ఇంకొక మనిషినిగాని, జంతువు మనిషిని కాని, చంపినట్లయితే అది హత్యకాదు 'ఆత్మహత్య' అని తెలియాలి. ఇంత కాలము హత్య అని దేనిని అనుకుంటున్నామో, అది ఆత్మహత్య అని తెలిసింది కదా! అట్లే ఇంత కాలము ఆత్మహత్య అని దేనిని అనుకుంటున్నామో, అది 'హత్య' అని తెలియాలి . ఇక 'హత్య యొక్క వివరము తెలుసుకుందాము.
శరీరములో జీవాత్మ, ఆత్మ అను ఇద్దరు పురుషులున్నారని భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగములో 16వ శ్లోకమున చెప్పబడివున్నది. ఇందులో ఆత్మ చంపబడడము ఆత్మహత్యయని ఇందాక తెలుసుకొన్నాము. ఆత్మ జీవాత్మలు చావులోను పుట్టుకలోను ఒకదానివెంట ఒకటి పోక తప్పదు. శరీరమును ధరించునపుడుకాని, శరీరమును వదలునపుడుకాని, ఆత్మ జీవాత్మ ఇద్దరు ఒకేమారు రావడము పోవడము జరుగుచున్నది. ఆత్మ శరీరమును ముందుగా వదలాలనుకొన్నపుడు దానివెంటనే జీవాత్మ కూడ పోవును. అదే విధముగా జీవాత్మ శరీరమును వదులునపుడు దాని వెంట ఆత్మ పోవును.(6 వ కామెంట్లో కంటిన్యూ అయింది)
(6 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ)
వీటి భేదములోనే 'హత్య' 'ఆత్మహత్య' అనుట జరుగుచున్నది. ఆత్మతో పాటు జీవాత్మ పోతే ఆత్మహత్య అనియు,
జీవాత్మ వెంట ఆత్మ పోవడమును హత్య అనియు అంటున్నాము. ఇంకొక శరీరము చేత శరీరములోని ఆత్మ చనిపోవడమును ఆత్మహత్య అనుకొన్నాము. ఆ విధముగానే ఒక శరీరములోని ఆత్మచేత అదే శరీరములోని జీవాత్మ చంపబడడమును హత్య అనబడును. ఆత్మ చంపబడడము ఆత్మహత్య అయితే జీవాత్మ చంపబడడము హత్య అగుచున్నది. ఇక్కడ గమనించదగ్గ విషయమేమనగా! జీవాత్మ ఆత్మల తేడా తెలియనప్పుడు హత్య ఆత్మహత్యల తేడా కూడ తెలియదు.
ఒకడు తాడుతో గొంతును బిగించుకొని ఉరివేసుకొన్నాడనుకొందాము, అది ఆత్మహత్య కాదు హత్య అగును. ఆ శరీరములోని ఆత్మ తన చైతన్యము చేతనే జీవుడు ఆ శరీరములో నివసించుటకు వీలుకాకుండా చేయుచున్నది. కావున ఆత్మ జీవాత్మను చంపినట్లగుచున్నది. మరణించినపుడు ఇక్కడ జీవుని వెంట ఆత్మ పోవుచున్నది అందువలన అది హత్య అనబడును. అదే విధముగ మరణశిక్ష చెప్పబడిన ఖైదీని మరణశిక్ష అమలులో వేరొకడు గొంతుకు తాడు బిగించి చంపాడనుకొనుము. అది పై విధముగా హత్యకాదు ఆత్మహత్య అగును. ఇక్కడ ఆత్మతోపాటు జీవుడు పోవుచున్నాడు. ఇక్కడ శాస్త్రబద్ధంగా ధర్మసూక్ష్మమేమనగా! ఇతర శరీరములచేత ఒక శరీరము చనిపోయినపుడు ఆ 'చావు' నేరుగా ఆత్మకు చెందును. అట్లే ఒక శరీరము ఇంకొకరి జోక్యం లేకుండ ఆత్మచేత మరణించినపుడు ఆ 'మరణము' నేరుగా జీవునికి చెందును. అది ఏ విధమనగా! ఒక శరీరములోని జ్ఞానాగ్ని ఇంకొక శరీరములోని కర్మను కాల్చునపుడు అది ప్రారబ్దమునే కాల్చును. అట్లే ఒక శరీరములోని జ్ఞానాగ్ని అదే శరీరములోని కర్మను కాల్చాలంటే అది ప్రారబ్దము కాల్చదు. నేరుగా సంచిత కర్మను కాల్చును. ఒకే జ్ఞానాగ్ని తన శరీరములోనైతే సంచితకర్మ మీద, ఇతర శరీరములలోనైతే ప్రారబ్దము మీద ఎట్లు పనిచేయుచున్నదో, అదే విధముగానే ఒకే 'మరణము' తన శరీరము ద్వారా ఏర్పడితే జీవునికి, ఇతర శరీరము ద్వారా ఏర్పడితే ఆత్మకు చెందునని తెలియాలి. తన శరీర మరణమునకు తానె కారణమైనపుడు అది 'హత్య' అని, ఇంకొకరు కారణమైనపుడు 'ఆత్మహత్య' అని శాస్త్రబద్ధముగా ఉండగ అజ్ఞానము వలన దానికి వ్యతిరిక్తముగ హత్యను ఆత్మహత్య అని, ఆత్మహత్యను హత్య అని అందరు అనుకుంటున్నారు. ఆత్మహత్యగాని, హత్యగాని అకాలమరణములోనివని జ్ఞాపకముంచుకోవలెను.
ఆత్మ ప్రయత్నముతో జీవుడు చనిపోవడము సూత్రబద్దముగ హత్య అగును. దానివలన వచ్చు పాపము ఆత్మను అంటదు. జీవుడు చంపబడుటచేత వచ్చు పాపము ఆత్మకు అహములేదు కావున అది ఆత్మ నంటదు. ఒక శరీరము వేరొక శరీరము యొక్క చావుకు కారణమైనపుడు అది ఆత్మహత్యయగును. అందులో వచ్చు పాపము చాలా భయంకరమైనది. దైవమునే చంపినంత పాపము జీవునికి ఏర్పడుచున్నది. ఒక శరీరములోని ఆత్మ మరణమునకు ఇంకొక శరీరములోని ఆత్మచైతన్యమే కదా కారణము అటువంటప్పుడు ఆత్మహత్య పాపము జీవునికి ఎందుకు అంటును? అను ప్రశ్న రాగలదు. దానికి సమాధానము ఆత్మహత్యకు ఆత్మ కారణమనుట నిజమే, జీవుడు ఏమి చేయనివాడు అను సూత్రము ప్రకారము వానికి ఆత్మహత్యకు సంబంధములేదు. అయినప్పటికి శరీరములోని అహము జీవుని చేత తానే చేసినట్లు ఒప్పించుచున్నది. కనుక అక్కడ వచ్చు పాపము జీవుని కర్మకూడలిలో చేరుచున్నది. సంబంధములేని కర్మను జీవుడు అనవసరముగా తన మీద అహము చేత వేసుకొనుచున్నాడు.
మిగతా ప్రపంచపు పనులలో జీవునకు చిన్నచిన్న కర్మలు అహము చేత వచ్చుచుండును. వాటి ఫలితము అంతపెద్దగా లేకపోయినా మరణవిషయములో వచ్చు కర్మ చాల భయంకరమైనది. అది ఆత్మనే హత్యచేసినది, కావున జీవుడు ఎక్కడ అహము పొందినా చిన్న కర్మ వచ్చును కాని, చావు విషయములో అహము పొందడము వలన భయంకరమైన కర్మ వచ్చును. అందువలన ఆత్మ హత్య మహాపాపమని పెద్దలన్నారు. నేడు భూమిమీద కొంతమంది కిరాయికి చాలామందిని చంపుచున్నారు. హత్య ఆత్మహత్యల వివరము తెలియనివారు తాము హత్య చేశాము అనుకుంటున్నారు. వారు చేసినది ఆత్మహత్య అని వారికి తెలియదు. అందువలన వచ్చుపాపము భయానకరమైనదని కూడ వారికి తెలియదు. ఇప్పుడు ఈ విషయము తెలుసుకున్న పెద్దలు ప్రజలకు ఆత్మ జీవాత్మల భేదములు, హత్య ఆత్మహత్యల భేదములు తెలిపి వారిని అజ్ఞానము నుండి బయట పడునట్లు చేయుదురని కోరుచున్నాము.(7 వ కామెంట్ చూడండి)
(7 వ కామెంట్)ఒకశరీరములో జీవాత్మ ఒకడే ఐనపుడు దానికి కాపలాగా ఉన్న ఆత్మ కూడ ఒకటే. అన్ని శరీరములలో ఒకే నిబంధనతో, ఒకేమాదిరి వేరు వేరు ఆత్మలు ఉండుట వలన ఒక శరీరములోని ఆత్మకు వర్తించినది ఒకేమారు అన్ని శరీరములలో వర్తించదు. కావున ఒక శరీరములో హత్య కావింప బడినప్పటికి అన్ని శరీరములలో ఆత్మ హత్య కావింపబడలేదు. ఆత్మను విశాలముగా చూచినపుడు అది హత్య కావింప బడలేదు. ఆత్మను విశాలముగా కాక శరీరములో ఒక్క ఖండముగా చూస్తే ఆ మరణము ఆత్మహత్య అనబడును. ప్రతి శరీరములోని భిన్నముగా ఉన్న జీవాత్మ నాశనమగువాడైనను సందర్భానుసారముగ మరణములో శరీరమునకేనాశనము, జీవునకు లేదన్నట్లు, అన్ని శరీరములలో ఒకే అంశగ ఉన్న ఆత్మ నాశనమును లేనిదైనను కొన్ని మరణములలో మరణించునదిగా చెప్పబడుచున్నది. నాశనమగు జీవాత్మకు చావులేదన్నను, నాశనములేని ఆత్మకు చావు ఉన్నదన్నను చివరకు జీవాత్మకు నాశనము కలదు, ఆత్మకు నాశనము లేదని తెలియాలి. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా గలదని తెలియవలెను. ఒక్క శరీరములోని ఆత్మను తెలుసుకోగలిగితే అది వానికి ఆత్మ దర్శనమైనట్లే. సకల జీవరాసులలో ఆత్మ ఎట్లు ఉన్నదో తెలుసుకొన్నట్లే అగును. మూడవ ఆత్మయైన పరమాత్మను భూమి మీద బ్రతికివున్న ఏ జీవరాసి కానీ తెలుసుకోలేదు, ఇది శాసనము. రెండవ ఆత్మను తెలుసుకొన్న తర్వాత శరీరమును వదిలినపుడు మూడవ ఆత్మయైన పరమాత్మ అనునది ఏమిటో తెలియును. అటువంటివాడు తిరిగి పుట్టడు అదే విడుదల లేక మోక్షము అంటారు. ఆత్మను తెలిసినవాడు భూమి మీద ఉండవచ్చునుగాని పరమాత్మను తెలిసినవాడు భూమి మీద ఉండడని తెలియాలి.
Hare Krishna prabhuji
❤❤❤❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే