కర్పూరం ఎలా తయారవుతుందో తెలుసా .? | Camphor Types And Making Process | How to increase oxygen levels

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • కర్పూరం ఎలా తయారవుతుందో తెలుసా ..? Camphor Types And Making Process How to increase oxygen levels
    Camphor: కర్పూరం ఎలా తయారవుతుంది ఏయే దేశాల్లో ఈ మొక్కలుంటాయి.. ఎన్ని రకాలో తెలుసుకుందాం..
    Camphor: కర్పూరం ను హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికే కాదు.. కొన్ని ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది మైనంలా స్వచ్ఛమైన తెల్లదనంతో పారదర్శకంగా ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. అయితే ఇది రసాయనాలతో కృతిమంగా తయారైందని చాలా మంది భావిస్తారు.. కానీ కర్పూరం ప్రకృతి ప్రసాదం. కర్పూరం చెట్టును నుంచి లభిస్తుందనేది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుడి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు.
    కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. అయితే ఈ కర్పూరం చాలా రకాలున్నాయి. ఒకొక్కటి ఒక్కోరకంగా మనకి ఉపయోగపడతాయి.
    * పచ్చకర్పూరం:
    కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాల్లో కూడా వినియోగిస్తారు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
    * హారతి కర్పూరం
    టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
    * రస కర్పూరం
    చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
    * భీమసేని కర్పూరం
    సహజముగా మొక్క నించి లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
    * సితాభ్ర కర్పూరం
    ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
    * హిమవాలుక కర్పూరం
    ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
    * ఘనసార కర్పూరం
    ఇది మేఘంలాంటి సారం కలిగినది.
    * హిమ కర్పూరం
    ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
    ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

ความคิดเห็น • 1

  • @altimate1
    @altimate1 3 ปีที่แล้ว

    Thank you