చరిత్ర మరిచిన ఒక వీరుడి గాధ..|| పండుగ సాయన్న || PR Creations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ค. 2023
  • చరిత్ర మరిచిన ఒక వీరుడి గాధ..|| పండుగ సాయన్న || PR Creations
    (పండుగ సాయన్న నవలా రచయిత)
    బెక్కెం జనార్ధన్
    రూపకల్పన, కథాకథనం, దర్శకత్వం.
    టి.ఫణిరాజ్ గౌడ్
    పి.ఆర్.క్రియేషన్స్
    కథ.
    చక్రవర్తుల రమణాచార్యులు.
    జడ్చర్ల.
    ఎడిటింగ్, డి.ఐ
    కార్తికేయ గౌడ్
    డబ్బింగ్ థియేటర్
    R.C.M స్టూడియోస్
    యానిమేషన్ క్రియేటర్స్
    అన్వేష్ ప్యారసాని
    space in dream
    కెమెరా డిపోర్మెంట్స్
    P.R క్రియేషన్స్
    మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్
    SB ఆడియెన్స్
    రాజ్యం భ్రష్టమై అవినీతి, దోపిడీ అత్యాచారాలు పెరిగినప్పుడు ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు. అట్లా ప్రజలు రూపొందించుకున్న నాయకుడు తెలుగొల్ల పండుగ సాయన్న. భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి ఉండవచ్చు. 35-38 ఏళ్ల వయసులో చంపబడి ఉండవచ్చు.
    పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. ప్రజలను దోసుకుంటున్న దొరల, దేశముక్ ల, అధికారుల, సంపన్నుల ఆస్తులను తీసుకొని, ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్టుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు. కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను, అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. పండుగ సాయన్న కథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి బిక్షుక గాయకులు 12 మెట్ల కిన్నెరపై వీరోచితంగా గానం చేస్తారు.
    సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు. అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. అతను పేదవర్గాలను సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు[1]. అతను ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదా ములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకు న్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
    ఆనాడు గ్రామాల్లో పెత్తందార్లు స్వైరవిహారం చేసేవారు. దొరల ఆధిపత్యానికి అడ్డులేకుండా ఉండేది. అతని భూములను భూస్వాములు ఆక్రమించుకున్నారు. ఆ కుటుంబం చితికిపోయింది. సాయన్న చిన్నమ్మను భూస్వాములు చెరచటం జరిగింది. గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగివంగి నడవాల్సి వచ్చేది. వూర్లో పెత్తందార్లకు ఎదురుతిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్న ప్రజర్విల్లాడు. ఆయనలో విప్లవాగ్నులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించటానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు[2].
    ధనవంతులను, భూస్వాములను కొట్టి పేదలకు పెట్టటమన్న ఒక్క సూత్రం ద్వారానే ఆధిపత్య శక్తులపై యుద్ధం చేయటం అతని అభిమతం కాదు. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దాన్ని ఎదుర్కొనటానికి జ్ఞాన మనే చదువు కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చాడు.
    ఆ రోజుల్లో పేదల పెళ్ళిళ్లు జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. వారు భూమిలేక కరువుకాటకాలతో, పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. వారి ఆకలి తీర్చటానికి పండుగసాయన్న అన్న దానాలు చేసేవాడు. భూస్వాముల గుమ్ములు పగులగొట్టి పేదల కడుపు నింపాడు. అన్నార్తులకు అన్నం పెట్టటమే ఆనాటి విప్లవం.
    ప్రజల్లో సాయన్నకు పెరుగుతున్న ఆదరాభిమానాలను భూస్వాములు తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టించారు. వారు నిజాంపై ఒట్టిడి తెచ్చి అతనిని అరెస్టు చేయించారు. తరువాత సాయన్నను చంపడానికి పథకం వేసారు. జంగు జలాల్‌ఖాన్‌ మోహితి మిన్‌సాబ్‌ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చే కుట్రను ప్రజలు నిరసిస్తారు. కొందరు పెద్దమనుష్యులు సాయన్నను విడుదల చేయించాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు. ఆయన జైలునుంచి విడుదల కావాలని ప్రజల్నించి పెద్దఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలుకొడతారు. కానీ, సాయన్న అక్కడ ఉండడు. కనబడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడతారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెగుతుంది.
    వనపర్తి రాణి శంకరమ్మ రంగంలోకి దిగి ప్రజల పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్‌ మహుమూద్‌ అలీని కలిసింది. ‘‘పండుగ సాయన్నను ప్రజల కోరిక మేరకు విడుదల చేయాలని’’ విజ్ఞప్తి చేసింది. అతనిని వదిలివేయడానికి పదివేల రూపాయలు "జమానత్"గా కట్టింది. ప్రజల డిమాండ్ కు తలవంచి నిజాం సర్కార్ "మార్ మత్. చోడో" అని హుకుం జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో రాణి స్ంకరమ్మ నలుగురు పెద్దమనుషులతొ సహా పాలమూరుకు వచ్చింది. ఐతే సాయన్నను ఎలాగైనా హతమర్చాలని తలచిన భూస్వాములు మరల కుట్ర పన్నారు. "మార్ మత్. ఛోడో" అనే స్టే ఆర్డరును తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహితి మిన్‌ సాబ్‌, జంగన్‌లాల్‌, పట్వారి వెంకట్రావుల సలహాతో ఆర్డరులోని "మార్" తరువాత విరామ బిందువునుంచి, "మార్. మత్ చోడో" అని మార్చి వేసారు. దీని అర్థం ప్రకారం "చంపండి. వదలకండి" అని. ఈ ఉత్తర్వు ప్రకారం సాయన్నకు మరణశిక్ష విధిస్తారు..
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 186

  • @ravikumarmudirajryakala5127
    @ravikumarmudirajryakala5127 11 หลายเดือนก่อน +114

    పాలమూరు బహుజన వీరుడు కీ.శే. పండుగ సాయన్న గారి జయంతి సందర్బంగా షాద్ నగర్ మిత్రుల గణ నివాళులు.....ఆయన జీవిత చరిత్రను వీడియోగా ముందుకు తెచ్చే మా చిన్న ప్రయత్నం ...అందరూ ఆదరించగలరని కోరుకుంటున్నాము ...🙏

    • @Historycreator972
      @Historycreator972 9 หลายเดือนก่อน +1

    • @ismartkumar2511
      @ismartkumar2511 9 หลายเดือนก่อน +3

      👏👏👏🙏🙏🙏🙏🙏

    • @laxmaneditzs
      @laxmaneditzs 8 หลายเดือนก่อน +2

      సార్ ఇది చిన్న ప్రయత్నం కాదు
      చరిత్రమరిచిన వీరుడి గాధ 🙏🙏
      జోహార్ ✊

    • @ravikumarmudirajryakala5127
      @ravikumarmudirajryakala5127 8 หลายเดือนก่อน +2

      @laxmaneditzs8727 thnq so much brother 🙏

    • @durgaiahdara1305
      @durgaiahdara1305 8 หลายเดือนก่อน

      @@Historycreator972 bb##!ľ

  • @Bhavaniputrah
    @Bhavaniputrah 10 หลายเดือนก่อน +43

    జోహార్ పండుగ సాయన్న జోహార్ జోహార్ 🚩⚔️జై MUDHIRAJ

  • @ramanaacharya3694
    @ramanaacharya3694 11 หลายเดือนก่อน +47

    చాలా బావుంది. చరిత్ర మరచిన వీరుని గాథ అందరూ తెలుసుకోవాలి. స్ఫూర్తిని పొందాలి.

  • @srisailamuma4301
    @srisailamuma4301 11 หลายเดือนก่อน +53

    జై పండుగ సాయన్న విగ్రహాలు ప్రతి మండలంలో స్థాపించాలి

  • @hari__official.
    @hari__official. 11 หลายเดือนก่อน +31

    మన పాలమూరు గర్వపడే గొప్ప వీరుడు పండుగ సాయన్న.. ఈయన చరిత్రను మన బిత్తిరి సత్తి అన్న సినిమా రూపం లో తీద్దాం అని గత రెండు మూడేళ్ళ క్రితమే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎవరైనా పూర్తిగా చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే వారి దగ్గరికి వెళ్లి చరిత్ర తెలుసుకొని సినిమా తీస్తే బాగుంటుందని అని నా ఉద్దేశం.. like సైరా నరసింహారెడ్డి సినిమా లాగా...

  • @gurramsrinivas743
    @gurramsrinivas743 8 หลายเดือนก่อน +7

    మనల్ని చెరపట్టిన నిరంకుశులను హీరోలుగా..చూపించారు ఇన్నాళ్ళు.నిజం నిలకడ మీదనే తెలుస్తుంది ఎన్నాళ్ళు ఐనా..

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h หลายเดือนก่อน

      హీరోలు(బహుజనుల) విలన్లు అందరూ (దొరలే) నిజాం నవాబుల ఆగడాలు, దౌర్జన్యాల కంటే మన దొరలుగా చెలామణి అయిన రెడ్లు,వెలమల ఆగడాలు ఎక్కువ...
      కిందిస్థాయి దౌర్జన్యాలు అన్ని వీళ్లవల్లె జరిగాయి

  • @user-xd9xs2hc3b
    @user-xd9xs2hc3b 8 หลายเดือนก่อน +8

    పండుగ సాయన్న జీవిత చరిత్ర సినిమా గా రావాలి

  • @madhumudiraj9632
    @madhumudiraj9632 11 หลายเดือนก่อน +22

    జై పండగ సాయన్న జై ముదిరాజ్
    పండగ సాయన్న దమ్ము,దైర్యనికీ మరో వందనం

  • @koti9851
    @koti9851 11 หลายเดือนก่อน +26

    చాలా మంచి ప్రయత్నం చేశారు అన్న,
    బహుజన వీరుడు,రాచరిక వ్యవస్థ పై యుద్ధం చేసిన బహుజన వీరుడు,ముదిరాజ్ ముద్దుబిడ్డ పండగ సాయన్న ముదిరాజ్ పై మీరు తీసిన ఈ చిత్రం చాలా అభినందనీయం

    • @prcreations1541
      @prcreations1541  9 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు

  • @dairyfarmer1080
    @dairyfarmer1080 9 หลายเดือนก่อน +8

    మా ఊరు పక్కన మెరుగొని పల్లె గ్రామం navabubpet (mdl)మహబూబ్నగర్ మన వీరుడు పండుగల సాయన్న జన్మస్థలం మా గ్రామాలలో ప్రతి పీర్ల పండుగకు సాయన్న చరిత్ర పాటగా పాడుతారు. ఈ పాట ప్రతి ఒకరికి ఒక ఊపు తెపిస్తుంది.జై పండుగల సాయన్న 💪💪💪💪

  • @SaiKrishna-uy5ly
    @SaiKrishna-uy5ly 9 หลายเดือนก่อน +4

    స్కూల్ బుక్ లో పాఠం గా ఎక్కించాలి . సాయన్న జీవిత చరిత్ర 🙏🙏🙏🙏

  • @YadaiahutpallyYadaiahutp-eo8kl
    @YadaiahutpallyYadaiahutp-eo8kl 9 หลายเดือนก่อน +12

    జోహార్ పండుగ సాయన్న జై ముదిరజ్ జై జై ముదిరజ్

  • @kailasapu.venkateswarlu1430
    @kailasapu.venkateswarlu1430 9 หลายเดือนก่อน +7

    వ్యాఖ్యానం అద్భుతం. ఈ తరానికి సాయన్న స్ప్రూర్థి అందించిన మీకుజై

  • @nagarathnagoud1016
    @nagarathnagoud1016 11 หลายเดือนก่อน +14

    చాల బాగుంది ఇలాంటి కథలు ఇంకా బయటకి తీసుకురావాలి

    • @srinivask.4983
      @srinivask.4983 9 หลายเดือนก่อน +3

      ఇది కథ కాదు యదార్థ సంఘటన బ్రదర్

  • @knagulu3591
    @knagulu3591 11 หลายเดือนก่อน +5

    Anna super thankq for the srty❤

  • @srcreationssrcreations1060
    @srcreationssrcreations1060 11 หลายเดือนก่อน +18

    పండుగ సాయన్నని సజీవంగా చూపించినట్టు అనిపించింది....deniki effort pettina PR creations ki,karthikeya ki,ramana sir ki,team venaka undi idi intha adbhutam ga ravataniki krushi chesina andarike all the best...manchi vedios marinni me nundi ravalani,,,yendarooo charitra marachina veerula gaadhalanu next generation ki telisela cheyalani korukuntu....all the best

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 หลายเดือนก่อน +1

    పాలమూరు జిల్లా పండుగొళ్ళ సాయన్న గొప్ప చరిత్ర మాకు తెలిజేసిన మీకు ధన్యవాదాలు

  • @suramoniramchandraiah7052
    @suramoniramchandraiah7052 11 หลายเดือนก่อน +5

    Johar panduga Sayanna Mudiraj Johar Johar.
    From
    Suramoni Ramchandraiah Mudiraj
    Shadnagar.

  • @hari__official.
    @hari__official. 11 หลายเดือนก่อน +11

    Ee పాలమూరు లోనే కాపోల్ల వెంగల్రెడ్డి,బండ్లోల్ల కురుమయ్య వంటి వీరుల గాథలు కూడా ఉన్నాయి...

  • @saiduluchinthala1816
    @saiduluchinthala1816 11 หลายเดือนก่อน +10

    Jai పండుగ సాయన్న

  • @rajulovers1404
    @rajulovers1404 10 หลายเดือนก่อน +5

    నెను Fast time విన్నా ఈ పడగా సాయన్న అని ఈ Video చూసినక నాకు కూడ రక్తం సర్రుమని మరిగింది తెలంగాన ప్రజలరా రైతు లరా మనమంత కలిసి ఈ KCR గాని Famhouse ని మూటడించి తగుల బెట్టి మడిచి మసీ బోగు చేదం అపుడే మనకు నిజమయిన స్వాతంత్రం వచ్చినట్టు గురుతుపెట్టుకొండి ప్రజలరా మికు అర్థం అవుతలేదు కాని మనం KCR గానికి బనిసలుగా మారుతుంనం ప్రజలరా జై పండుగ సాయన్న నువు ఏపటికి ప్రజల గుండెలో ఉంటావు 💐💐💐🚩🚩🚩🚩

  • @nandikamadhav6205
    @nandikamadhav6205 8 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది వీడియో జై పండగ సాయన్న🙏🙏🙏

  • @TELUGUPATAMU
    @TELUGUPATAMU 11 หลายเดือนก่อน +9

    చాలా బాగుంది

  • @ravikonda5753
    @ravikonda5753 9 หลายเดือนก่อน +2

    Jai mudhiraj anna thankq Pandaga Sayanna story telipinadhuku❤

  • @Nagamanigoud1977
    @Nagamanigoud1977 11 หลายเดือนก่อน +8

  • @ChinnanollaAnji-kn7nu
    @ChinnanollaAnji-kn7nu 9 หลายเดือนก่อน +6

    అన్నా నీ జ్ఞానానికి నా ఒక వందనం

  • @srcreationssrcreations1060
    @srcreationssrcreations1060 11 หลายเดือนก่อน +3

    Special ga Phani raj ki abhinandanalu...nenundi marinni vedios kosam nenu yeduru chustunna...all the best phani

  • @maremonilavanya7011
    @maremonilavanya7011 11 หลายเดือนก่อน +8

    జోహార్ పండుగ సాయన్న 🔥🔥🔥🔥🔥

  • @prcreations1541
    @prcreations1541  9 หลายเดือนก่อน +2

    ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు చాలా కష్టపడి ఇష్టపడి ఈ వీడియోను రూపొందించాం ... దేనికి గాను మీరు మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి ఒక లైక్ ,కామెంట్ చేసి సపోర్ట్ చేస్తే మేము చాలా అందందిస్తాం....
    మీ.. పి. ఆర్ క్రియేషన్స్ టీం

  • @vrk1345
    @vrk1345 9 หลายเดือนก่อน +7

    జై పండుగ సాయన్న జై ముదిరాజ్ ✊💪

  • @manishkumar-ql5id
    @manishkumar-ql5id 11 หลายเดือนก่อน +4

    Elaanti informative videos inka kaavali.

  • @anupabalaswamy
    @anupabalaswamy 9 หลายเดือนก่อน +5

    చాలా మంచి ప్రయత్నం చేశారు అన్న, జై పండుగ సాయన్న 🙏🙏🙏

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ బ్రో 👌👌👌👏👏👏🚩🚩

  • @user-tm1ke5nw8q
    @user-tm1ke5nw8q 9 หลายเดือนก่อน +2

    Panduga sayyana varasudiga puttinanduku garvapaduthunna jai mudhiraj Jai jai mudhiraj

  • @swamysheelam2297
    @swamysheelam2297 21 วันที่ผ่านมา

    తెలంగాణ స్పార్టకస్ పండుగ సాయన్న

  • @user-ss5ir5uz3f
    @user-ss5ir5uz3f หลายเดือนก่อน +1

    Rrr సినిమా లో సాయన్న పాత్ర కూడా కొంచం చూపిస్తే బాగుండేది

  • @user-sz4fd1il8v
    @user-sz4fd1il8v 9 หลายเดือนก่อน +3

    జోహార్లు పండగ సాయన్న

  • @jkrushna6068
    @jkrushna6068 9 หลายเดือนก่อน +2

    చాలా బాగ చెప్పారు అన్న గారు 🎉 మీ గొంతు లో ఏదో పవర్ ఉంది

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h หลายเดือนก่อน +1

    జై భీమ్

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 8 หลายเดือนก่อน +1

    Thank you for your information about history forgotten heroes

  • @ArunKumar-zi2hr
    @ArunKumar-zi2hr 8 หลายเดือนก่อน +2

    Jai Sai Anna

  • @santhoshpatnam7110
    @santhoshpatnam7110 7 หลายเดือนก่อน +2

    Jai pandugha sai anaa Jai mudhiraj

  • @kavallikashinathmudiraj9551
    @kavallikashinathmudiraj9551 9 หลายเดือนก่อน +1

    జోహార్ పండుగ సాయన ముదిరాజ్ టైగర్ నీలాంటి మహవీరులు పుటలని ఆ భగవంతుని కోరుతున్నాను జై ముదిరాజ్

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 9 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 9 หลายเดือนก่อน +2

    Ji పండుగ సాయన్న జై muderaj🙏🙏🙏🙏

  • @user-nl4vt6gk4e
    @user-nl4vt6gk4e 7 หลายเดือนก่อน +1

    Hari Ome

  • @suresh1689
    @suresh1689 9 หลายเดือนก่อน +1

    Super infermeshan

  • @ravipilly1072
    @ravipilly1072 9 หลายเดือนก่อน +1

    Johar panduga sayanna

  • @kranthiranadevkumarpittala4764
    @kranthiranadevkumarpittala4764 หลายเดือนก่อน +1

    Jai mudiraj jai telangana

  • @DHanmanthu-wo4nf
    @DHanmanthu-wo4nf 8 หลายเดือนก่อน +1

    జై. పాడుగొల సాయన్న

  • @user-rv1iz8po6d
    @user-rv1iz8po6d 27 วันที่ผ่านมา

    జోహార్ పండుగ సాయన్న ముదిరాజ్ జోహార్ జోహార్ ✊🚩

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 หลายเดือนก่อน +1

    Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉

  • @bonanzajcl3815
    @bonanzajcl3815 11 หลายเดือนก่อน +3

    Excellent

  • @gummatithirumalesh2491
    @gummatithirumalesh2491 9 หลายเดือนก่อน +1

    Jai mudhiraj jai jai mudhiraj

  • @sachinchandra6301
    @sachinchandra6301 9 หลายเดือนก่อน +2

    Jai panduga sayanna😍😍🙏🏻

  • @srisailamrock5901
    @srisailamrock5901 8 หลายเดือนก่อน +1

    జోహర్ పండుగ సాయి అన్న

  • @srisai1698
    @srisai1698 11 หลายเดือนก่อน +4

    Jai panduga sayanna💪💪💪💪

  • @rameshbabunadapanamoni4210
    @rameshbabunadapanamoni4210 11 หลายเดือนก่อน +9

    రామాపురం కాదు.మెరుగోని పల్లి.

    • @ravikumarmudirajryakala5127
      @ravikumarmudirajryakala5127 11 หลายเดือนก่อน +1

      First రామాపురం ...తర్వాత merugonipally కి వలస వెళ్ళారు

    • @rameshbabunadapanamoni4210
      @rameshbabunadapanamoni4210 11 หลายเดือนก่อน

      @@ravikumarmudirajryakala5127 రామాపురం ఆ ప్రాంతంలో లేనేలేదు.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 หลายเดือนก่อน +1

    Verymostgreatvideo.telanghanalionpandughasayannacharithramaruvanimahonnathaviplavaveerudu.thegreatsacrificedgentlemen.

  • @kambuvenkatesh7933
    @kambuvenkatesh7933 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤bagundhi

  • @surendramudhiraj859
    @surendramudhiraj859 หลายเดือนก่อน +2

    Sai anna medha cinima tisthe bagundedhi

  • @thimmagarihareesh2696
    @thimmagarihareesh2696 9 หลายเดือนก่อน +1

    మా తాత నా చిన్నప్పుడు ఎప్పుడు ఈ కథ వినేవాడు

  • @soumyaanjaneyulu9552
    @soumyaanjaneyulu9552 9 หลายเดือนก่อน +1

    Super సాయన్న ✊✊✊🔥🔥

  • @saibaba.aroor123
    @saibaba.aroor123 7 หลายเดือนก่อน +2

    జోహార్ పండుగ సాయన్న జోహార్ జోహార్

  • @GopimudhirajjGopimudhira-sp8lx
    @GopimudhirajjGopimudhira-sp8lx 8 หลายเดือนก่อน +1

    Panduga varashathavalo putinaduku gavrapadutunna Jai mudhiraj

  • @vasudeveerla3179
    @vasudeveerla3179 9 หลายเดือนก่อน +1

    Jai Mudhiraju jai jai Mudhiraju

  • @shravandasaboina893
    @shravandasaboina893 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్

  • @krishnakoora4325
    @krishnakoora4325 หลายเดือนก่อน +1

    జై షయన్నా ముదిరాజ్

  • @sudhavikas9979
    @sudhavikas9979 8 หลายเดือนก่อน +1

    SUPERB

  • @krishnakrk5128
    @krishnakrk5128 8 หลายเดือนก่อน +1

    ఇవే నాయొక్కాశ్రునివాలి 🎉🎉🎉

  • @srinupasunoori3337
    @srinupasunoori3337 9 หลายเดือนก่อน +1

    Ee veeru di gadha chala bagundi story mana Telugu cenima lo mega star chiranjeevi ki Este super hit

  • @maskuribalraj7384
    @maskuribalraj7384 9 หลายเดือนก่อน +1

    Jai mudhiraj jai etala jai etala jai

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 9 หลายเดือนก่อน +2

    Jai.mudiraj

  • @saibaba.aroor123
    @saibaba.aroor123 7 หลายเดือนก่อน +1

    జై ముదిరాజ్ జై జై పండుగ సాయన్న

  • @EDLASATHISH
    @EDLASATHISH 21 ชั่วโมงที่ผ่านมา +1

    జై ముదిరాజ్ 💪💪

  • @pradeep8533.
    @pradeep8533. 7 หลายเดือนก่อน +1

    జై ముదిరాజ్

  • @user-nl4vt6gk4e
    @user-nl4vt6gk4e 7 หลายเดือนก่อน +1

    Jai hind

  • @dubasisrinivasrao4420
    @dubasisrinivasrao4420 9 หลายเดือนก่อน +1

    DUBASI neth❤

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 9 หลายเดือนก่อน +1

    Very great p saysnna

  • @srinuy2160
    @srinuy2160 9 หลายเดือนก่อน +1

    జోహార్ పండుగ సాయన్న

  • @kalumakuntasrinivas1437
    @kalumakuntasrinivas1437 9 หลายเดือนก่อน +1

    జై పండుగ సాయన్న జై ముదిరాజ్ జై జై పెద్దమ్మ తల్లి

  • @user-dh6yh1zb1q
    @user-dh6yh1zb1q 9 หลายเดือนก่อน +1

    🦁🦁🏹🏹🚩🏹

  • @kosgiravikumar4893
    @kosgiravikumar4893 24 วันที่ผ่านมา

    జోహార్ పండుగ సాయన

  • @satyasatya-mq7po
    @satyasatya-mq7po 9 หลายเดือนก่อน +1

    Jai mudiraj 🦁 jai sayanna

  • @pillivijaykumarrcl1129
    @pillivijaykumarrcl1129 9 หลายเดือนก่อน +1

    జై పండుగ సాయన్న జై ముదిరాజ్

  • @an92996
    @an92996 8 หลายเดือนก่อน +1

    Panduga sayanna audio casets kuda vachayi, janapada geethamla vuntundi adi kuda chala baguntundi

  • @user-eb3tk3ui6b
    @user-eb3tk3ui6b 9 หลายเดือนก่อน +1

    Johawaer🎉

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 9 หลายเดือนก่อน +1

    Jai panduga sayanna

  • @nagraj1557
    @nagraj1557 11 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤

  • @santoshega2695
    @santoshega2695 10 วันที่ผ่านมา

    Jai sai Anna 🙏

  • @SoppariBalu
    @SoppariBalu 9 หลายเดือนก่อน +1

    Jai mudhiraj ❤❤❤

  • @rajuakhila-mm5nt
    @rajuakhila-mm5nt 9 หลายเดือนก่อน +1

    Jai,Sai,anna,🙏🙏🙏🙏🙏🙏🙏⚔️🏇🔱💪🐎

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 9 หลายเดือนก่อน +1

    Share to all Mudiraj relatives

  • @Badboss46
    @Badboss46 8 หลายเดือนก่อน +1

    ⚔️Jai❤mudhiraj ⚔️ Jai panduga sai anna✊

  • @pashamraju2347
    @pashamraju2347 9 หลายเดือนก่อน +1

    Jai mudhiraj

  • @anilbandi4265
    @anilbandi4265 9 หลายเดือนก่อน +1

    jaiho..panduga sayyanna ....

  • @malleshkakam267
    @malleshkakam267 9 หลายเดือนก่อน

    Chevelle Ravi anna.. bahujana charitra ni veliki thise pani lo mundunna neeku dhanyavadhalu..

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 26 วันที่ผ่านมา

    ఇలాంటి మహనీయుల వీర ఘాతాను భవి తరాలకు తెలపాలి తప్పకుండా పాఠ్యంశంలో చేర్చాలి లేకుంటే వేటకుక్కలే చరిత్ర వ్రాసుకున్నట్లు

  • @dyamanmahesh9966
    @dyamanmahesh9966 9 หลายเดือนก่อน +1

    Jai pandaga sayanna

  • @godugusrikanthmudhiraj4416
    @godugusrikanthmudhiraj4416 11 หลายเดือนก่อน +1

    Joharrr panduga sayanna mudhiraj