పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించిన కలెక్టర్‌ | Section 144 Imposed In Palnadu District

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • పల్నాడు జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న వైకాపా అరాచకపర్వంతో కలెక్టర్ 144 సెక్షన్ విధించారు. మంగళవారం వైకాపా విధ్వంసం సృష్టించిన కారంపూడితోపాటు... గొడవలు జరిగిన కొత్తగణేషునిపాడులో భారీగా బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో 19 కంపెనీల పోలీసు బలగాల మోహరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. మాచర్లలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి... పట్టణంలోకి వచ్చేవారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డితోపాటు.... గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువగా గుమికూడవద్దని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టంచేశారు. సామాన్య ప్రజల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్న ఎస్పీ.... ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కు తోడు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి..... మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 5

  • @SS-bc4fk
    @SS-bc4fk 26 วันที่ผ่านมา

    పెద్దపెద్ద ఆఫీసర్లు కూడా బలే జోకులు వేస్తారు!

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 25 วันที่ผ่านมา

    ముందు చర్యలు లేకపోవడం వలనే ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి.శాంతి భద్రత లోపించిందేమో అనిపిస్తుంది

  • @vnrao511
    @vnrao511 25 วันที่ผ่านมา

    Security penchandi

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 25 วันที่ผ่านมา

    144 section tappa ycp vallamidha action thisukora spgaru