శ్రీనాథుని చమత్కారములు | Telugu Funny Poems | Srinadha Kavi | Srinatha Kavi | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • ఒకే పద్యంలో ఉన్న తిట్టు, పొగడ్త - అరవ స్త్రీపై చెప్పిన పద్యం - పల్నాటిసీమపై చెప్పిన పద్యాలు
    సిరిగలవానికి జెల్లును
    దరుణులు పదియాఱువేల దగ పెండ్లాడన్
    దిరిపెమున కిద్దరాండ్రా
    పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్
    అంటూ ఆ దేవతాసార్వభౌముడినే చమత్కరించిన కవిసార్వభౌముడు మన శ్రీనాథుడు.
    బాగా ధనవంతుడైన ఆ శ్రీకృష్ణుడు పదహారువేలమందిని పెళ్ళిచేసుకున్నాడంటే అర్థముందిగానీ, బిచ్చమెత్తుకుని జీవించే నీకెందుకయ్యా ఇద్దరు పెళ్ళాలు. నీకు పార్వతీదేవి ఒక్కతె చాలుగానీ, ఆ గంగను మాకు విడిచి పెట్టేసేయ్ అని గడుసుగా అన్నాడా కవిశ్రేష్ఠుడు.
    అప్పట్లో పల్నాటి సీమలో కరువు తాండవిస్తుండేది. తాగడానికి నీళ్ళు కూడా సరిగా దొరికేవి కాదు. పాపం, అక్కడ జనం అవస్థని చూసిన శ్రీనాథుని హృదయం ద్రవించింది. కానీ మహాకవులు తమ బాధని కూడా చమత్కారంగానే చెబుతారు. దేవదేవుళ్ళనయినా సరే “ఏమిటోయ్ నీ గొప్ప” అన్నట్టే మాట్లాడేస్తుంటారు. శ్రీనాథుడు ఇక్కడ అదే చేశాడు. పల్నాటి ప్రజల కష్టాలు తొలగించడానికి, నీళ్ళు అనుగ్రహించమని పరమేశ్వరుడిని ప్రార్థించాడు. కాకపోతే ఆ ప్రార్థనలో కొంచెం నిందాస్తుతి కలిపి పరిహాసమాడాడంతే. అసలే ఆ గౌరీపతి, శ్రీనాథునకు ఇష్టదైవమేమో.. సందర్భం చిక్కినప్పుడల్లా ఆయనను ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు. ఆ పల్నాటిసీమలో జొన్నకూడు తినలేక, చిర్రెత్తుకొచ్చినప్పుడు కూడా, శ్రీనాథునికి.. పాపం ఆ లోకేశ్వరేశ్వరుడే దొరికాడు. ఇక వింటూ ఆస్వాదించండి...
    Rajan PTSK
    #RajanPTSK #Srinathudu #Chatuvulu
  • บันเทิง

ความคิดเห็น • 73

  • @kotavaruntej5821
    @kotavaruntej5821 ปีที่แล้ว +3

    Sree nadhuni srungara padyalu kavaliandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +10

    శ్రీనాథుడానాడు గరళమన్న జొన్నకూడు
    నేడది మధుమేహులకాయెనే ఆమృతం
    ఓనాడు హీనుడన్ననోట
    ఘనుడని పొగడు గతియేర్పడె నేడు!!!!!.

    • @sangeethashowrya0318
      @sangeethashowrya0318 8 หลายเดือนก่อน

      చాలా బాగా చెప్పారండి 😅

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +11

    శ్రీ నాథుడు, మహానుభావుడు కాశీ ఖండము గురించి అద్భుతంగా వివరించిన మహా ఋషీ మహా తపస్వి 🙏🙏🙏😍

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి మీవీడియోలన్నీ అధ్బుతం గా వుంటున్నాయి

  • @srinivasrao8644
    @srinivasrao8644 3 ปีที่แล้ว +7

    ఇప్పుడు జొన్న కూడే పరమామృతం.
    మధుమేహ గ్రస్తులకు మధుపాన్నం.
    ఎవరి ఆహార నియమాలు వార్కి అమృత పాయం.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว

      బాగు బాగు బహు బాగుగానున్నది
      తమ సమయస్ఫూర్తి 🙏

  • @annapurnab3376
    @annapurnab3376 3 ปีที่แล้ว +1

    శ్రీ నాధుని చమ్మకులు చాలా బాగున్నాయి

  • @buchigarisomasekhar6431
    @buchigarisomasekhar6431 8 หลายเดือนก่อน +1

    గురువులకు నమస్సుమాంజలి..పద్యాల వివరణ చాలా బాగుంది..గురువుగారు... మాకు శ్రీనాథ చమత్కార పద్యాలు పుస్తకం కావాలి... ఏమైనా మీనుండి...లేదా మీ సహకారం నుండి పొందవచ్చు నా గురువుగారు..

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 2 ปีที่แล้ว +1

    Namasaram gurugaru kasi majeli khathalu pettanddi dhaya sesi 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankardalavai8015
    @shankardalavai8015 3 ปีที่แล้ว +4

    19 మజిలీ కథలు కోసం మా ఏదురు చూపులు గురువు గారు 🙏🙏🙏🙏

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 ปีที่แล้ว +1

    బాగున్నాయి

  • @narnedra
    @narnedra 3 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @vinay7933
    @vinay7933 3 ปีที่แล้ว +2

    Mi dwara srinadhudu garu poems vintunam sir tq so much andi

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 ปีที่แล้ว +1

    Namakaram 🙏gurvu gariki chinna manavi pravaruni swagatham ane 10the 2000 telugu patyabganni padhyalani medwara vinalani undi.

  • @janakipadhuka2514
    @janakipadhuka2514 ปีที่แล้ว +1

    👍👍👍

  • @SreevathsaHirehal
    @SreevathsaHirehal 3 ปีที่แล้ว +14

    ధూర్జటి కవి గారి కాళహస్తీశ్వర శతకము నుండి పద్యాలు చెప్పవలసినదిగా ప్రార్థన 🙏

  • @harshavision675
    @harshavision675 3 ปีที่แล้ว +2

    Excellent thank you sir

  • @darlaradhakumari7284
    @darlaradhakumari7284 2 ปีที่แล้ว +1

    It is very helpful sir.

  • @sristichem21
    @sristichem21 ปีที่แล้ว +1

    Good 👍
    #mokshitheffect

  • @prasadpsrl2211
    @prasadpsrl2211 3 ปีที่แล้ว +1

    ఆనందంగా ఉంది. రాజన్ గారు.
    పామర్తి ప్రసాద్, హైద్రాబాద్.

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 3 ปีที่แล้ว +1

    Very very very fine

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    ఓరి దురాత్మ! నీవార ముష్టింపచా -
    భాస యోజన గంధి ప్రథమ పుత్ర!
    దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర!
    బహు సంహితా వృథాభ్యాస పఠన!
    భారత గ్రంఠ గుంఫన పండితమ్మన్య!
    నీవా, మదీయ పత్నికి నశేష
    కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు
    కాశికాపురికి నిష్కారణంబ
    శాపమిచ్చెదనని యనాచార సరణి
    హుంకరించినవాడ వహంకరించి
    పొమ్ము నిర్భాగ్య! మాయూరి పొలము వదలి
    ఎచటికే శిష్యుల్న్ నీవు నీ క్షణంబ!
    వ్యాసుని పరీక్షించడానికి శివుడు సశిష్యుడైన వ్యాసునికి కాశిలో వారం దినాలు భిక్ష దొరక్కుండా చేశాడు. వ్యాసుడికి కోపం వచ్చింది. కాశిని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణా దేవి అతనిని భిక్షకి పిలిచింది. ఆయనకీ, ఆయన వేయిమంది శిష్యులకీ భోజనం పెట్టింది. భోజనానంతరం స్వామి అమ్మావారి భుజం మీద చెయ్యి వేసి, పావుకోళ్ళు తొడుక్కుని చావడిలోకి వచ్చి వ్యాసుని మీద కోపించి శపించాడు. ఇది ఆ కోపించిన పద్యం.
    ఒరీ దురాత్మా! యోజనగగంధి ప్రథమపుత్రా! (శంతనునితో వివాహం కాకపూర్వం యోజనగంధిగా పిలువబడిన సత్యవతి పరాశరునిద్వారా అక్రమ సంతానంగా వ్యాసుణ్ణి కన్నది). అదే దెప్పుతున్నాడు శివుడు.
    నీవారముష్టింపచా భాసా - నివ్వరి వడ్లు తెచ్చుకుని ఉడకపెట్టుకుని తినే వాడా. పొలాలలో రైతులు ధాన్యాన్ని బండలకేసి కొట్టగా అక్కడ రాలిన తృణ ధాన్య విశేషాలు, నివ్వరులు. వాటిని ఏరుకుని తెచ్చుకుని వండుకు తినే దౌర్భాగ్యుడా అని.
    దేవర న్యాయం అంటే సోదరులు సంతానం లేకుండా చనిపోతే వారి భార్యలాందు వంశం లిలబెట్టడానికి సంతానాన్ని కనవచ్చు అనే న్యాయం. వ్యాసుడు ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుల్ని అలాగే కనిపెట్టాడు.
    సంహిత అంటే వేదం. నీవు చేసిన బహు సంహితా అభ్యాస పఠనం వృధా, అని.
    గుంఫనము - గ్రంథము. పండితమ్మన్యుడు - పండితుడు కాకపోయినా పండితుణ్ణనుకునేవాడు. భారతం అనే గ్రంథాన్ని వ్రాసి ఏదో పెద్ద పండితుణ్ణనుకుంటున్న వాడా!
    కాశికాపురి పరమశివునికి పత్ని యట. ఆ పట్టణం కైవల్యానికి ఘంటా పథమట. అక్కడినుంచి ఎకాయెకి కైవల్యానికి పోవచ్చునన్నమాట.
    నీవా - అలాంటి కాశీపురికి నిష్కారణంగా శపిస్తానని అహంకరించి హుంకరించావు! అనాచార సరణి - ఆచారాన్ని, ధర్మాన్ని పాటించకుండా.
    తక్షణమే నువ్వూ నీ శిష్యులూ ఈ ఊరి పొలిమేరలు విడిచి (ఊరి పొలము వదలి) ఎక్కడికైనా పొండి !
    అని శివుడు వ్యాసుడికి కాశీపుర బహిష్కరణ శిక్ష విధించాడు.

  • @mastermaster5442
    @mastermaster5442 3 ปีที่แล้ว +2

    Tq guruji

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 3 ปีที่แล้ว +2

      గురువు గారూ కాశీ మజిలీ లు తొందర చేయ గలరు. విక్ర మా ర్క కథలు శాలివాహన కథలు కూడా చెప్ప గలరు

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +2

      మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏

    • @jyothibollam4389
      @jyothibollam4389 3 ปีที่แล้ว

      Kasi majili stories complete chayabndi

  • @raghavapandit3986
    @raghavapandit3986 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @leelanallagachu2916
    @leelanallagachu2916 3 ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    కాశీమజిలీ కథలు దరచేసి అప్లోడ్ చేయండి..........వీటి కోసం మేము వేయి కనులతో ఎదురు చూస్తూ ఉన్నాము.......

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +3

      మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏

    • @leelanallagachu2916
      @leelanallagachu2916 3 ปีที่แล้ว

      @@Ajagava చాలా థన్యవాదములు రాజన్ సార్🙏🙏🙏

  • @drbvrao2207
    @drbvrao2207 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు....

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 3 ปีที่แล้ว +2

    Gurujii namaskaram

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 3 ปีที่แล้ว +5

    Guruvugaru kashi majili kathalu pettandi vati kosam eduruchustunnamu

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +3

      మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏

    • @lakshmipmk1659
      @lakshmipmk1659 3 ปีที่แล้ว

      Chala santhosam guruvugaru

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 3 ปีที่แล้ว +2

    Good evening sir....

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    మరిచి ధూళీ పాళి పరిచితంబులు మాణి
    బంధాశ్మ లవణ పాణింధమములు
    బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు
    పటురామఠామోద భావితములు
    తింత్రిణీక రసోపదేశ దూర్థురములు
    జంబీర నీరాభి చుంబితములు
    హైయంగవీన ధారాభిషిక్తంబులు
    లలిత కస్తుంబరూల్లంఘితములు
    శాకపాక రసావళీ సౌష్టవములు
    భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు
    మున్నుగాఁ గల యోగిరంబులు సమృద్ధి
    వెలయగొని వచ్చె నొండొండ విధములను
    ఆ శివభక్తుడు తెచ్చిన నైవేద్యాలను వర్ణిస్తున్న పద్యమిది.
    మిరియాలపొడి (మరిచిధూళి) చల్లినవి కొన్నీ, సైంధవలవణం వేసి తయారు చేసినవి కొన్నీ, ఆవపెట్టి (సిద్ధార్ధ) వండినవి కొన్నీ, ఇంగువతో (రామఠము) ఘుమఘుమలాడుతున్నవి కొన్నీ, చింతపండుపులుసుతో (తింత్రిణీక రసం) చేసినవి కొన్నీ, నిమ్మరసంతో (జంబీర నీరం) చేసినవి కొన్నీ, తాజా నేతిలో (హైయంగవీనము = నిన్నటి పాలు తోడు పెట్టగా తయారయిన పెఱుగుని నేడు చిలికి తీసిన వెన్నకాచిన నెయ్యి - సద్యోఘృతం), మునిగితేలుతున్నవి కొన్నీ, లేత కొత్తిమీరతో పరిమళిస్తున్నవి కొన్నీ, శాకంగా ఉన్నపుడూ పాకంగా రసంగా మారినపుడూ సౌష్ఠవం కోల్పోని (వండకముందు ముడి పదార్థంగా ఉన్న దశలోనూ అవి సౌష్ఠవంగా ఉన్నాయి) భక్ష్యాలూ (నమిలి తినవలసినవి - కరకరలాడేవి), భోజ్యాలూ (అంతగా నమలనక్కరలేనివి), లేహ్యాలూ (నాల్కకు పని చెప్పేవి), పానకాలూ (త్రాగేవి) ఈ మొదలైన వివిధ ఆహారలను సమృద్ధిగా ఒక్కటొక్కటే ఇంటినుంచి ఆలయానికి తీసుకువచ్చాడు ఆ భక్తుడు.

  • @apparaoapparao8338
    @apparaoapparao8338 3 ปีที่แล้ว +3

    జై శ్రీరామ, మిత్రమా శుభ రాత్రి కాశీ మజిలీ కథలు చెప్పండి

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    జలధర మంతయై, కదటి చందము గైకొని, సూకరాకృతి
    న్నిలిచి, పికంబుతో దొరసి, నేరెడుపండును బోలె నుండయై
    కలశపయోధి మంథనముఖంబున బుట్టిన యమ్మహా హలా
    హలము క్రమంబున న్శివుని హస్తసరోరుహ మెక్కెఁ జుక్కగన్ !
    క్షీరసాగర మధనసమయములో లోకభయంకరమైన హాలాహలం పుట్టింది. జగత్కుటుంబియైన పరమేశ్వరుడు లోకకళ్యాణార్థం దానిని మ్రింగడనికి చేయి చాచినాడు. ఫణిధరుని ప్రభావం వల్ల హాలాహలం క్రమంగా కుంచించుకుపోయింది. జగద్వ్యాపి యైనది మొదట జలధరమంత అయింది. తర్వాత క్రమంగా ఏనుగంత - వరాహమంత - కోకిలాకారమంత - నేరేడుపండంత - చివరికి చుక్కంత అయ్యింది. అది ఆదిదేవుని అంగిటిలో నిలిచి ఆవగింజంత మచ్చగా మిగులుతుంది! ఈ పరిణామాలంకారం అద్భుతరసమును ఆవిర్భవింప చేస్తున్నది. "ఇంతితై, వటు డింతయై " అన్న పోతన పద్యం ఈ పద్యానికి తిరుగవేత.

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    దీనార టంకాల తీర్థమాడించితి
    దక్షిణాధీశు ముత్యాలశాల
    పల్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య
    నైషథగ్రంథ సందర్భమునను
    పగలగొట్టించితుద్భట వివాదప్రౌఢి
    గౌడ డిండిమభట్టు కంచుఢక్క
    చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద
    పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు
    నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
    రావు సింగన భూపాలు ధీవిశాలు
    నిండుకొలువున నెలకొనియుండి నీవు
    సరస సద్గుణ నికురంబ శారదాంబ !
    సర్వఙ్ఞ సింగభూపాలుని ఆశ్రయించడానికి వెళుతూ శ్రీనాథ మహాకవి శారదాదేవిని స్మరించిన పద్యం ఇది. శ్రీనాథుడు గౌడ డిండిమభట్టును ఓడించి, ముత్యాల శాలలో స్వర్ణస్నానం చేసి, సార్భౌమ బిరుదాన్ని పొందినా కూడా ఎంతో వినయంగా ఇకమీద సర్వజ్ఞడిగా పేరుపొందిన సింగభూపాలుని కొలువులో ఏవిధంగా నన్ను కరుణిస్తావో తల్లీ! అని వేడుకున్నాడు.

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 5 หลายเดือนก่อน

    సూపర్ 👏🏼👏🏼

  • @varunpaladugu
    @varunpaladugu 3 ปีที่แล้ว

    Waiting for it

  • @mothukurusankar2674
    @mothukurusankar2674 ปีที่แล้ว +1

    శాలివాహన సప్తశతి కావ్య రచనలోని విశేషము గురించి వివరించగలరు.

  • @jesatynarayana4797
    @jesatynarayana4797 3 ปีที่แล้ว +2

    దయచేసి పాల్కురి సోమనాధ పద్యాలను అప్‌లోడ్ చేయండి🙏🙏

  • @adityalohale
    @adityalohale 3 ปีที่แล้ว +2

    Nice

  • @rangareddy8718
    @rangareddy8718 ปีที่แล้ว +1

    భళా!
    ఆజగవ.
    భళారే!

  • @deepureddy8782
    @deepureddy8782 ปีที่แล้ว +1

    🎉 శ్రీ న్నాధుడు పోతన ఇద్దరి కలయిక గురించి ఒక సారి try చేయండి

  • @rajithabuttamraju7796
    @rajithabuttamraju7796 3 ปีที่แล้ว +3

    Sir please upload story sir we are eagerly waiting for your story

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 ปีที่แล้ว +2

    Arava pilla padyam was known to criticize a particular case named as kanakku pillsi, who were used to be village accountants mostly.

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    శ్రీనాథుని ఆదరించిన రాజులు అంతరించారు. రాజభోగాలు అనుభవించిన శ్రీనాథుడు అష్టకష్టాలు అనుభవించాడు. అవసానదశలో భూమిని నమ్ముకున్నాడు, కానీ ప్రయోజనం లేకపోవటంవల్ల తన దైన్యాన్ని శ్రీనాథుడు కింది కమనీయమైన విషాద మాధుర్యమైన సీసపద్యంలో వర్ణించాడు.
    కాశికా విశ్వేశు కలసె వీరా రెడ్డి
    రత్నాంబరంబులే రాయుడిచ్చు
    రంభగూడె తెలుగు రాయరాహత్తుండు
    కస్తూరికే రాజు ప్రస్తుతింతు
    స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
    పాత్రాన్న మెవ్వరి పంక్తి గలదు
    కైలాసగిరి పండె మైలార విభుడేగి
    దినవెచ్చ మే రాజు తీర్చగలడు
    భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె
    కలియుగంబున నికనుంట కష్టమనుచు
    దివిజ కవివరు గుండియల్దిగ్గురనగ
    అరుగు చున్నాడు శ్రీనాథు డమరపురికి
    ఈ పద్యంలో కూడా రాజసాన్ని, కవిసార్వభౌమత్వాన్ని వదలని వ్యక్తిత్వం శ్రీనాథుడిది. "ఇదిగో వస్తున్నాను స్వర్గానికి అక్కడుండే కవిశ్రేష్ఠుల గుండెలు గుభేలనేలాగ!" అనగలిగిన ఆత్మస్థైర్యం, ఆత్మ ప్రత్యయం కలవాడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు.

  • @andekarsai5228
    @andekarsai5228 3 ปีที่แล้ว +2

    How many of you written these poems in telugu project

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +2

    చిలుకలు కూయునో చెవులు చిల్లులు వోవగనంచు నెన్నడున్
    వెలలడు నందనోపవన వీథులకై యట మౌళిభాగ ని
    నిర్మల శశిరేఖ సేయు నపరాధమునన్ గజదైత్యశాసనున్
    గొలువడు పాకశాసనుడు కోమలి నీపయి కూర్మి యెట్టిదో!
    నలుడు దమయంతి అంతఃపురానికి వెళ్ళి ఇంద్రాగ్ని యమ వరుణులు దమయంతిని కోరుచున్నారని చెప్పిన సందర్భంలో ఇంద్రుని విరహాన్ని వర్ణిస్తున్న పద్యం.
    ఉద్యానవనాలు, వెన్నెల, చిలుక పలుకులు మొదలైనవి విరహాన్ని అధికం చేస్తాయి కదా. వాటిని ఉద్దీపపన విభావములంటారు. అందుకే వాటిని ఇంద్రుడు పరిహరిస్తున్నాడు అని.
    ఓ కోమలీ, నీపై అనురాగమెట్టిదో కానీ ఇంద్రుడు (పాకశాసనుడు), చిలుకలు చెవులు పగిలేలా కూస్తాయని (నిజానికి చిలుకపలుకులు మధురంగా ఉంటాయి. విరహంలో ఉన్నవారికి అవి కర్ణకఠోరంగా అనిపిస్తాయి), నందనోద్యాన వీథులకి వెళ్లడట. అక్కడ ఉన్న శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి (గజ దైత్య శాసనుడు - గజాసురుని చంపిన వాడు) కొలవడం మానేసాడు. ఎందుకంటే శివాలయానికి వెళితే, ఆలయంలో ఉన్న శివుని శిరస్సుమీద ఉండే చంద్రరేఖ ఇతని విరహాన్ని అధికం చేస్తుందని.
    వెడలడు అనడానికి వెలలడు అన్నాడు. డకారానికీ లకారానికీ ప్రాసవేయవచ్చునని అనుమతినిచ్చాడు శ్రీనాథుడు. తరువాతి కాలంలో పండితులు "రలయోరభేధః" అని చెప్పడం మొదలుపెట్టారు.
    ఇంద్రుడిది నగరం అమరావతి. ఊరిబయట ఉద్యానవనం ఉంది. అక్కడ శివాలయముంది. అని అర్థం. కాళిదాసు మేఘసందేశంలో "బాహ్యోద్యాన స్థిత హరశిరశ్చంద్రికా ధౌత హర్మ్యా” - అన్నాడు. ఈ పద్యం దానిని ఙ్ఞాపకం చేస్తోంది.

  • @parsharamulus9632
    @parsharamulus9632 10 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @padhimunni2667
    @padhimunni2667 3 ปีที่แล้ว

    Super

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 3 ปีที่แล้ว +2

    Kasi majeli khathalu pettanddi 🙏🙏🙏🙏

  • @padmaale
    @padmaale 3 ปีที่แล้ว +1

    Rajan garu kashimajili kadhalu video cheyatledhu. Waiting for other story.

  • @saiprathyushadth1577
    @saiprathyushadth1577 3 ปีที่แล้ว +1

    కాశీ మజిలీ కథలు అన్న మర్చిపోయారు సార్ ఏడవలేదు

  • @satyanarayanakandukoori9964
    @satyanarayanakandukoori9964 3 ปีที่แล้ว +1

    Maduram.

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 3 ปีที่แล้ว +1

    Athreya gari kavithwam gurinchi maroka vdo cheyandi... Alage seetharama sasthri gari gurinchi marosari gurthuchesukuntunnaa....

  • @bogilimuralikrishna6100
    @bogilimuralikrishna6100 3 ปีที่แล้ว +2

    Masara rajyam ekkada give explain please

  • @sarojanaadulla195
    @sarojanaadulla195 ปีที่แล้ว +1

    Meepdyaluchlabagunnayandi

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 ปีที่แล้ว

    తరుణుల ననఁ దగు.

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 3 ปีที่แล้ว +1

    Aha emi ee kavi sarva bhoumuni chamakruthi anduke kavi sarvabhoumudu 😆😆😆😎😎😎🙏🙏🙏

  • @subbaraokv4932
    @subbaraokv4932 3 ปีที่แล้ว +2

    👏Arava ante thamil vaallu kadhaa?

  • @rampradeep.k6953
    @rampradeep.k6953 3 ปีที่แล้ว +3

    రాజన్‌ గారు మీ పేరుకి అర్ధం మహారాజు ( సంస్కృతంలో )

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว +7

      అవునండి. సంస్కృతంలో సంబోధనా విభక్తిలో ఏకవచనానికి "హే రాజన్" అని వాడతారు. "ఓ రాజా!" అని సంబోధించడానికి "హే రాజన్!" అని అంటారు. ఈ మాటనే "జగదేకవీరుని కథ" సినిమాలో పింగళిగారు కూడా సరదాగా వాడారు. కాకపోతే ఈ సంబోధనను పేరుగా పెట్టుకుంటూ, మన పొరుగువాళ్ళైన అరవ వాళ్ళు ఈ రాజన్ అనే మాటను తమ సొంతం చేసుకున్నంత పనీ చేశారు. బహుశా ఆ పేరుని తెలుగుకు తీసుకురావడం కోసమే మా నాన్నగారు నాకీ పేరు పెట్టుంటారు. 😊

    • @rampradeep.k6953
      @rampradeep.k6953 3 ปีที่แล้ว +2

      @@Ajagava 😁😁😁😁😁😁😁

  • @ThammaneniVenkatareddy
    @ThammaneniVenkatareddy 8 หลายเดือนก่อน

    భావం పెటండి